Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, March 31, 2008

కాలకంధరా ! ఇదె కార్తీక దీపం

కాలకంధరా! ఇదె కార్తీక దీపం
నాగాభరణా ! ఇది నా ప్రాణదీపం
భక్తి తైలమై ఙ్ఞానమె వత్తిగ
వెలిగింది దేవ ! నీ కోసమేను (పల్లవి)

నా బాష్పధార - గంగా జలమై గద్గద గళమే - డమరు నాదమై
తనువున కంపమె - శివతాండవమై (నను) నీ పాదధూళి - కణమై పోనీ !

అహంకారినై - పాపాత్ముడినై పతితుడనైతిని - పరమేశా
నీవె కాదన్న - నేనేమి చేతు నీ పదముల పడి ఏడ్చెదను

నాధ! నీవుండ - అనాధుడనైతి కరుణార్ణవమా - కదలి రావేల ?
(నీ) ఙ్ఞానాగ్ని నేత్ర - శిఖలో కాలెద (నను) నీ దయా గంగలో-కలిసిపోనీ !

ఏనాటికైన - నీవాడ నేను నిను వీడి బ్రతుక - లేనీ కలిని
నా ప్రాణనాధ - నీ చరణమందు నా ప్రాణదీపం - ఆరిపోనీ

Download this bhajan sung by Shri Dattaswami here
---------------------
కాశీవాసా ! కాలభైరవా !
కరుణించవేల? కాలకంధరా (పల్లవి)

విషయవాసనలు విషసర్పములై - కాటువేయగా నేనేమి చేతు
హాలాహలమునె మధురామృతముగ - త్రాగిన దేవా ! కాపాడరావా?

కామాది గుణములు కలి రాక్షసులు - క్రమ్ముకొనిరి నను నేనేమి చేతు
కాముని త్రిపురుల చూచి బూడిదగ - చేసిన దేవా ! చేదుకొనరావా

చింతల పలుగుల పోటుల చిత్తము - చూర్ణమయ్యెనుగ నేనేమి చేతు
అట్టహాసమున జగముల చూర్ణము - కావించుదేవా ! కరుణించలేవా

ఏకాగ్రతతో ఏక దృష్టితో - నినుఁ జూడలేను నేనేమి సేతు
ఏకాద్వితీయ హేదత్త దేవ ! - మదన దాహక! మాంపాహి పాహి

Download this bhajan sung by Shri Dattaswami here

శివ తాండవ కీర్తన

కైలాస మందు - కలవరమాయెను చూడవె పద్మా నా కొండనెక్కి
శివ దత్తుని సుందర నృత్యమదే మధ్య మధ్య నదె రుద్ర తాండవము

విష్ణుదత్తుడగు నాతో నృత్యము - చూడ వచ్చెనదె బ్రహ్మ దత్తుడును
ప్రళయ కాలమున ఇరువురమగుదుము - శివదత్తునిలో ఐక్యము చివరకు

ఒకడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన త్రిగుణ వేషములు
ఊహవిశ్వ రచనా వ్యూహమీవు - ఊహసుందరివి అనఘవు పద్మా !

మధుమతి ! లలితవు ! దుర్గవు ! కాళివి - రాజరాజేశ్వరివి ప్రధమోహవు
వాణియు లక్ష్మియు గౌరియు నీదగు - ముచ్చట గొలిపెడి ముద్దువేషములు

అనసూయాత్రులు ఆనందముతో - ఆలోకింపగ ఆసినులైరి
ఋక్ష పర్వతము నందున వారికి - దత్తపుత్రునిగ దత్తుడు నిలచెను

తకధిమి తకధిమి నంది మృదంగము - ప్రమధ గణంబుల వాద్యనాదములు
నర్తనలోలుడు నటరాజు శివిడు - తాండవమాడెను దత్తాత్రేయుడు

పదములకదనము వడివడిగాబడ - బహువిధ భంగిమ లంగములొప్పగ
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున

గంతులువేయగ కాలికి చుట్టిన - కాల సర్పమదె కస్సుబుస్సుమన
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున

శ్రీశైలరాయుని శివతాండవమున - చిందుల అందము లేమందునె చెలి
అప్సరసలె తమ నాట్యమేలయని - సిగ్గుతో తలల వంచిరి చూచుచు

కాశీపురపతి కాలిగంతులవె - కంపించె శేషుడల్లాడెను ధర
అదిరి దిక్కరులు కుంభస్థలముల - తొండములెత్తుచు ఘీంకరించినవి

కాలభైరవుని కరాళ వక్త్రము - ఫాలాక్షి వహ్ని దీధితి మెరుపుల
అట్టహాసముల చేయగ ప్రాణులు - గడగడ వణుకుచు పరుగులెత్తిరే

శివశివ భవ భవ శంభో ! హరహర ! - అనుచు మహర్షుల ఆర్తనాదములు
మిన్నుముట్టినవి శరణాగతితో - శాంతింప జేయ ఆ తాండవమును

కాలకంఠుడదె రుద్రతాండవము - చేసెను త్రిప్పుచు ఢమఢమ ఢక్కను
కైలాసాచల శిలా స్ఫటికములు - విస్ఫోటనముల బీటలు వారెను

విశ్వేశ్వరతను విభూతి చిందెను - వెచ్చ వెచ్చనిది పరమపావనము
నుదుట ధరింపగ ఇంద్రాదులంత - నక్కి నక్కి అట సంగ్రహించిరే

నందీశ్వరుడదె రంకెలు వేయును - గర్జింతురగో ! ప్రమధగణంబులు
చిందులు తొక్కెను చిరుత గణేశుడు - మయూర వాహనుడాడె మైమరిచి

ద్వాదశ లింగము లుజ్జ్వలమయ్యెను - గంగ పరవళ్ళు తొక్కుచు పారెను
నాగాభరణములాడె నాట్యమును - కంపించె చంద్ర కళయును సొగసుగ

గంగాధారల చినుకుల జల్లుల - చంద్ర రేఖ హిమ బిందువులెగురగ
రెండు కన్నులను చల్లని చూపుల - ఆనంద మొకసారి వెలయు

ఫాలాగ్ని చక్షు రుగ్రాగ్ని శిఖలు - ఎర్రని కాంతులు చిమ్ముచుండగను
అహి భూషల పుత్కారములందున - రుద్ర తాండవము చెలగునొకసారి

ఎర్రని జటలెగురగ పంచాస్యుడు - అట్టహాసముల తాండవమందున
ఎర్రజూలు ఎగురగ పంచాస్యుడు - దూకి గర్జించు రీతిగఁ దోచెను

శేషుని సహస్ర ఫణములదొర్లుచు - భూగోళమాడె బంతిని పోలుచు
దానిని నిలుప వేయి పడగలను - రొప్పుచు తిరిగెను పాదఘాతముల

భంభం నాదము లంబరమంటగ - శంఖ ధ్వనులను ప్రమధులు చేసిరి
అప్సరసలాడిరీక్షించి నాట్య - నవ్య భంగిమల నేర్చుకొనగ దివి

చుక్కల రాలెను ముక్కంటి చూపు - వర్షించు విస్ఫులింగములంటగ
సూర్యదేవుడును చిటపట లాడెను- ఏడు గుర్రములు సకిలించి నిలచె

శాంత నృత్యముల వీణలు మీటుచు - నారదతుంబురు లెగురుచు పాడిరి
రుద్రతాండవము లందున భయపడి - కల్ప వృక్షముల చాటున దాగిరి

అదురుచు బెదురుచు పరుగులెత్తుచును - ఆక్రందించిరి అసురేశ్వరులే
హరహర శంభో పాహి పాహియని - ప్రణతులఁ జేయుచు సాష్టాంగముగా

నటనములందున పదముల మృదుమృదు-నూపుర ఝలఝల రవములు చిందగ
సుందరేశ్వరుని శిరసున గంగా - లహరీ ధ్వనులవె తాళములాయెను

ఎగురుచు దూకుచు వంగుచు లేచుచు - మెలికలు దిరుగుచు వక్రభంగిమల
చంద్రశేఖరుడు తాండవమాడెను - తళతళ మెరిసెడి తెల్ల నాగువలె

హిమాలయాచల మందున దూకెడి - తెల్ల మంచుపులి విద్యుద్రయముగ
వామదేవుడదె తాండవ ధాటిని - అంగ భంగిమల చకచక మార్చెను

ఒకసారి మంద మధుర స్మితుడగు - ఒకసారి అట్టహాస గర్జనుదు
మాధుర్యమొకచో రౌద్రంబొకచో - అమృత హాలహల పారవారముగ

గౌరిముఖ పూర్ణేందు బింబమును - చూచిన వెంటనె హరుడుప్పొంగెను
అంగములాడగ నృత్యము చేసెను - పున్నమి రాతిరి పొంగిన జలధిగ
గౌరమ్మ కూడ నృత్యము చేసెను - కొంతకాలమట శివునితో గూడి
తాండవధాటికి అలసి కూర్చుండె - స్విన్నావయవము లదురుచు నుండగ

నీలలోహితుని నిరుపమ తాండవ - మానందార్ణవ మవధులు లేనిది
నా విశ్వరూప దర్శన సమమది - చూడువారలకు జన్మ ధన్యమగు

రుద్రాక్ష హార వలయము లురమున - గలగల రవములు చేయుచునుండగ
వాసుకి గళమున నర్తించె పడగ - మణిదీధితులవె నృత్యము చేయును

ఒకచో ఢక్కను కొట్టును తిప్పుచు - ఒకచో శూలము తిప్పుచు తిరుగును
ఒకచో చూపును రిక్త హస్తముల - నాట్య ముద్రలను నటరాజు శివుడు

నారాయణ ప్రియుడతడె పద్మా ! నంది వాహనము గంతులు వేయగ
మెడలో పదముల గల గజ్జెలతో - గల గలశబ్దము కర్ణ ప్రియమదె

నటన మనోహరుడెంత సుందరుడు - దిష్టి తగులునని పుర్రెల మాలల
సర్ప భూషలను ధరించునీశుడు - కామున కీర్ష్యను పరిహరింపగా

కాముని దగ్ధము చేసెనందురిల - వట్టి మాటయది సుందరేశ్వరుని
అందము చూసిన స్మరుడె చేసుకొనె -ఆత్మ హత్యనే తగుల బెట్టుకొని

అతడే కనకా భరణములఁ దాల్చు - పురుష మోహనుడ నేనె మోహినిగ
మారిమోహమును పొందితి కలిసితి - మణికంఠునికే జన్మ నిచ్చితిని

నన్నుజూచి మునులెత్తిరి జన్మల - గోపికలుగ పురుషులకె మోహము
నా అందము కలిగించె నాకె అది - శివునిఁ జూడగా కలిగెను పద్మా

ఋషుల హృదయముల వికార హేతువు - నేనైతిని గద నా పాపమునకు
శిక్షగ నాకే ఆ వికారమే - కలిగెను కర్మ ఫలంబులు తప్పవు

ఆది దేవునిది అద్భుత తాండవ - మవలోకించిన భరత మహర్షియు
నాట్య శాస్త్రమును వ్రాసె శంకరుడు - నాట్యాధి దేవుడనగ దత్తుడే

హావ భావముల నభినయించుచును - ఆడుచున్నాడు ఆది దేవుడదె
చూడుము పద్మా! ఎంతో పుణ్యము - చేసిన వారికె లభ్య మీ ఫలము

నీలకంఠుడదె నిర్మల హృదయుడు - నిష్ఠానియతుదు నిశ్చల చిత్తుడు
కరుణా సాగరు డత్యుదారమతి - ఆత్మ సౌందర్య మపారమతడిది

రావణుడడిగిన పార్వతి నిచ్చెను - ఉపమన్యువడుగ క్షీరాబ్ధినిచ్చె
భస్మాసురునకు తననే భస్మము - చేయు వరమిచ్చె ప్రేమ సముద్రుడు

శివుని కళ్యాణ గుణ రూపములను - ఆదిశేషుడును వర్ణించలేడు
అతడి పొందుకై ఎంత తపించెను - పార్వతి దానిని బట్టియె తెలియును

నీ మొగుడు నేను నిజమే పద్మా - నా మొగుడు శివుడు మోహిని నైతిని
శివుడు తండ్రిగా నేను తల్లిగా - నా సుతుడు బ్రహ్మ గురువుగ నగుదుము

ఒక్కడె దత్తుడు వాని భావములె - గుణత్రయముగా త్రిమూర్తులైతిరి
భావమె రూపము దాల్చె నూహయది - గుణమన భావమె గుణమే రూపము

ఒక్కడె మనుజుడు మూడు భావముల - నున్న రీతిగా ముగ్గుర ముందుము
సృష్టి స్ధితి లయ కర్మ భావముల - త్రిమూర్తులనగా త్రిగుణ భావములె

ఊహించునపుడు బ్రహ్మ దేవుడన - ఊహను నిల్పగ విష్ణుదేవుడన
ఊహనాపగ రుద్ర దేవుడన - ఒక్కడె దత్తుడు మూడు నామముల

ఒకచో నొక్కొక మూర్తి గొప్పయగు - మిగిలిన యిరువురు తగ్గియుందురిట
ఈ భేదమంత క్రీడా వినోదము - పరమార్ధములో ముగ్గురు ఒక్కడె

ఆడేదినేను చూచేది నేను - నా ఆట నేనే ఆనందింతును
ఆనందిచుట కొరకై భేదము - మాయా బలమున కల్పించెదనిట

మూడు భావముల త్రిమూర్తులైతిని - నానా భావము లయ్యెను జగతిగ
దత్తైక్యముతో త్రిమూర్తులుందురు - దత్త భిన్నముగ జగములు వెలుగును

దత్తాధారము జగత్తు భిన్నము - నేతి నేతియని శ్రుతియిదె చెప్పును
పీటపైన ఘటమున్నది కానీ - ఘటమందు పీట లేదని తెలియుము

త్రిమూర్తులందున వ్యాపించియుండు - దత్తుడు తేగెలో విద్యుత్తు బోలి
విద్యుత్తు తీగె తీగె విద్యుత్తు - మేమే దత్తుడు దత్తుడే మేము

తాదాత్మ్యమున్న భావమె త్రిమూర్తి - తాదాత్మ్య హీన భావమె జగత్తు
భావరహితుడె నిర్గుణ దత్తుడు - భావము చీమగ నున్నను లేనిదే

జగత్తులున్నను లేకున్న నొకటె - అద్వితీయుడే దత్తుడు బ్రహ్మము
గుణమన చీమయె నిర్గుణుడెప్పుడు - నిర్గుణ సగుణము లద్వితీయములె

ఆహా ! తాండవమెంత రమ్యమది - బాహ్యాత్మలలో సుందరుడు శివుడు
సుందరేశ్వరుడు వాని తాండవము - కాకుండనెట్లు సుందర మయముగ

పంచ చామరము ఛందస్సు నందు - ఏవిధి పదముల గంతులు వినబడు
ఆ విధి పదముల గంతులు వినబడు - నూపుర రవములు కర్ణ సేయములు

కాళీయ మర్ధన మందున నేనును - శివ తాండవమును చేసి చూపితిని
శివతాండవమును చూసిన పిమ్మట - అట్లు చేయమది కోరిక కల్గెను

లలితా దేవి కీర్తన

అమ్మా అమ్మా ఓ లలితమ్మా ! అమ్మా అమ్మా ఓ లలితమ్మా
శక్తివయ్యు నిరహంకారిణివే ! వాణివి లక్ష్మివి గౌరివి అనగఘవు
దత్తాంకపీఠా విరాజమానా ! (పల్లవి)

దత్తాంకపీఠా విరాజమానా !
నీ కనుబొమలవి కదలగచేయును సృష్టి స్ధితిలయములనే దత్తుడు
పరబ్రహ్మమను సింహాసనమున ఓ అధిష్టాన దేవతా ! ప్రణతి

కాపాడు తల్లి! కరుణించవమ్మ నీ ఆజ్ఞ లేక దత్త మౌనమే
శివుడు దాగుకొనె తరంగ రూపిణి ! లింగాకృతి నిను నర్చించమనుచు

లలిత నాడులను ఆవేశించిన చైతన్య శక్తి లలితయందురిల
ఆదిజీవుడవు ప్రధమోహవుగా తపించు ఊహకు దాసుదు దత్తుడు

Download this bhajan sung by Shri Dattaswami here

Saturday, March 29, 2008

మహిషుని చంపిన కనకదుర్గా కీర్తన

విజయపురాచల కాంచన దుర్గా
తాండవ మందలి చిందులవే (పల్లవి)

మహిషునిఁ జంపిన రోషము శాంతించని కారణమున గంతులతో
కరముల శూలముఁ దిప్పుచు చుట్టును విద్యుద్దీధితులుప్పతిలన్‌
కనకాభరణములెగురగ, గాజులు గలగల మోతల వెల్లువలో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

గిరగిరఁ దిరుగుచు, ముందుకు దూకుచు, పక్కలకెగురుచు నృత్యములో
భగభగ మండెడి నిప్పుల కణికెలు రాలగ త్రిణయన దృష్టులతో
వైశాఖ దివస మధ్యాహ్నపు వడగాలులవడి ఉచ్ఛ్వాసములన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

క్రోధ విలఙ్ఘన తాడిత నాగ కులంబుల మెలికల దూకులతో
అవయవ వీచికలాడగ రక్తము పొంగగ ఎర్రని వెలుగులతో
కుంకుమ తిలకము స్వేదజలంబుల రేఖలుగానగు ఫాలముతో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

ముడి విదిలింపులు సడలగ, విరబోసిన కేశములవె పాయలుగా
ఎగిరెడి నల్లని త్రాచులు, మహిషుని అసు పవనంబుల మ్రింగెడిగా
ముఖమున రొప్పులు శ్వాసలు కస్సుమటంచును బుసబుసలైచెలగన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

పదములనందెలు వెండివి మెండుగ ఘల్లు ఘల్లుమని శబ్ధములన్‌
పదపదమందున చేయగ నసురుల బండల గుండెలు ఖండములై
దితిసుత రక్తము ఎగురుచు చిందుచు బిందువులై ముఖమందు పడన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

కులుకుచు శూలము నాడించుచు, కుచపర్వత కంపము లింపులుగా
పరవశమొందిన దత్తుడు చూదగ ప్రణయము పొంగగ సన్నిధిలో
నిలువగ చూచెను మధురస్మితయై శాంతించెను శాంతించెనుగా
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

Download this bhajan sung by Shri Dattaswami here

మణికంఠ భజన

భజ భజరే భగవంతం - హరిహర పుత్రమనంతమ్‌ (పల్లవి)
మణికంఠహారం కేరళకుమారం శార్దూల వాహం వర్జిత వివాహమ్‌
శబరీ గిరీశం మహిషీ వినాశం - శాస్తార మేవం ధ్యాయమి దేవమ్‌

శివ విష్ణు తేజ స్సంయోగ భాజం - సంసారపారం శ్రుతి వాక్య సారమ్‌
సోపానమాలా మధిరుహ్యలీలా - సంకల్ప లోకం కలయంతమేకమ్‌

ఏకైక వీరం సౌందర్య మారం - యోగీంద్ర ధీరం హృత భూమి భారమ్‌
పంపా విహారం హృదయైక చోరం - దత్తావతారం మునిచిత్త చారమ్‌

ఆలీఢ కాంతం నిశ్రేణి కాంతం - వేదాంత శాంతం చిన్ముద్రయాంతమ్‌
అనాద్యనంతం మకరాంశుమంతం - జోతి స్స్ఫురంతం శిఖివజ్జ్వలంతమ్‌

Download this bhajan sung by Shri Dattaswami here

స్వామి భజనలు

ఈ భజనలు స్వామి భక్తుల కన్నులకు మహా మాయను కప్పుచు దత్త పరీక్షలను చేయుచు పాడిన భజనలు. తనను నరాధమునిగా, షిరిడీ సాయి పాదాల వద్ద నున్న కుక్కగా వర్ణించు కొనుచు, కొన్ని సిద్ధులు లభించగనే తాను భగవంతుడనని అహంకరించరాదని, సదా వినయమే దత్త ప్రీతికరమని బోధించు భజనలు.

ముంచ ముంచ కృష్ణం - వంచకం తమేకమ్‌ (పల్లవి)

1. దత్తాత్రేయం దయావిహీనం - కాశీ స్నానం కామవికారమ్‌
వేదాధ్యయనం వేశ్యా వశ్యం - బ్రహ్మధ్యానం మదిరాలోలమ్‌

2. గీతాచార్యం గోపీ జారం - మోహాతీతం రాధా మోహమ్‌
ధర్మాధారం పరదధి చోరం - యతితతిసేవ్యం రాసక్రీడమ్‌

3. దిగంబరాఖ్యం పీతదుకూలం - లక్ష్మీనాధం భిక్షుకవృత్తిమ్‌
వేదాన్తానా ముపదేష్టారం - వేశ్యావాటీ పధి సంచారమ్‌

Download this bhajan sung by shri Dattaswami here
-------------------
కిమస్తి దత్తే ? కమలే ! విముక్త శీలే, విమలే ! (పల్లవి)

వర్ష సహస్రం మహర్షిలోకే - సరసీకూలే నిరీక్షమాణే
ఆలింగితోஉయం దిగంబరాంగ్యా - సాక్షాద్దదృశే దిగంబరాంగః

(వేయి సంవత్సరములు మహర్షులు సరస్సు తీరమున వేచియుండగా దిగంబరిచే ఆలింగితుడై దిగంబరుడుగ కనిపించెను !)

యస్మిన్‌ దృష్టే విచ్ఛిద్యన్తే - సర్వే బంధా స్సుతపతిరూపాః
తదేకబంధా త్సర్వ విముక్తిః - స్వార్ధం పశ్య ప్రభుతాహ్యేవమ్‌

(ఆయనపైనే బంధమునుంచి, పతిపుత్రాదుల బంధములను తెంచుకొన్ననే సర్వ విముక్తి!. ఆయనకు ఎంత స్వార్ధము! అధికారము కలవారిట్లే ఉందురు)

ఏకాంతం న స్సాధక యోగ్యం - సముపదిశన్యో వేదాంతార్ధైః
నృత్యతి సహి నవరాస విలాసీ - బృందావన భువి గోపీ బృందైః

(మన సాధనకు ఏకాంతమును తత్త్వము ద్వారా బోధించి, తాను మాత్రము బృందావనములో రాసలోలుడై గోపీ బృందములతో కూడి గంతులు వేయుచున్నాడు!)

Download this bhajan sung by shri Dattaswami here
---------------------------------------
ఎంత దయ ! ఎంత దయ ! ఓ సాయీ !
ఇంత దయ చూపితివె ! గోసాయీ ! (పల్లవి)

కాలికుక్కనే గురువుగఁ జేసి - వేద గీతలను చెప్పించితివి !
ఉచ్ఛిష్టముఁదిని బ్రతుకు జీవిని - నివేదనార్హుని చేసితివిచట !

అంటగరానిది పిచ్చికుక్కయె - తలపై నుంచియు ఆడించితివి !
ఈ పిచ్చికుక్క కరచిన క్షణమె - బ్రహ్మఙ్ఞానము పిచ్చిపుట్టెనె?

కుక్క వచ్చునెడ శుద్ధి మంత్రములు ! కుక్కయె నాలుగు వేదములఁజెప్పె
శీలుని గృహమున భోక్తగ వచ్చియు - నల్ల కుక్కనట వెంటఁదెచ్చితివి!

బ్రాహ్మణులందరు నిను వెలివేయగ - కృష్ణ శ్వానము వేదముఁబలికెను
శ్వానము నేను కృష్ణుడు నేను - కృష్ణ శ్వానము నేనే దత్త !

Download this bhajan sung by shri Dattaswami here
-------------------
షిరిడీ కుక్కను చూడండీ ! సద్గురువుగ వచ్చాడండీ ! (పల్లవి)

దూరదూరముగ నుండండీ - పిచ్చికుక్క ఇది పోపొండీ !
కరచిన వెంటనె మీకండీ - బ్రహ్మపిచ్చి కలిగేనండీ

ఆపిచ్చి నయము కాదండీ - శాశ్వత మోక్షమె గతియండీ
జీవికి యాతన నిస్తాను - అంత్య కాలమున వస్తాను

కాశీపురమున ఉంటాను - కాలభైరవుడు అంటారు
అట్టహాసమును చేసేను - బ్రహ్మాండములే పగిలేను

కసాయి కఠినుడనేనండీ - దాక్షిణ్యమనుట లేదండీ
కర్మ ఫలములనే ఇస్తాను - ధర్మ రక్షణను చేస్తాను

నాలుగు దిక్కుల నేనుంటా - ధర్మధేనువును రక్షిస్తా
వీరభద్రునిగ ఆనాడు - దక్ష శీర్షమును తుంచాను

పాశుపతాస్త్రము నేనేను - పార్ధుని రక్షణ చేశాను
శూలము చక్రము నేనేను - దత్తుని కరముల వెలిగేను

శంఖము డమరువు నేనేను - నాధ్వని వేదము వింటేను
కుండీ మాలలు జపములు నేను - సాధన మార్గము సూచిస్తాను

బ్రాహ్మణోஉహమపి చండాలోஉహం - సాధుధేనురపి క్రూరశ్వాஉహమ్‌
శ్రీదత్తోஉహం గురుదత్తోஉహం - ప్రభు దత్తోஉహం తవ దత్తోஉహమ్‌

Wednesday, March 26, 2008

దీపావళీ జ్ఞాన దీపావళీ

దీపావళీ ఙ్ఞాన దీపావళీ - దీపావళీ భక్తి దీపావళీ
నేడే కృష్ణుని స్మరణం - రేపటి నుండియె కార్తీకం చంద్రశేఖరునికి అభిషేకం (పల్లవి)

1. హృదయమనే మట్టి పాత్రలో - ఙ్ఞానమను వత్తినుంచుమా
భక్తియను తైలము పోయుము - గురుదత్త బోధ జ్వాలతో
వెలిగించుమా స్వామికై - నీ జీవితమె ఈ దీపం

2. సంసారమె నరకాసురుడు - స్వామిపై ప్రేమయె సత్యభామ
సంసారరతియె అమావాస్య - అఙ్ఞానమె గాఢాంధకారము
భక్తి పాటలె మతాబులు - కాల్చుటయన భజన యోగము

3. రేరే జీవా ! మూఢమానవా ! - అంతరార్ధము నాలకించుమా
విషయతృణములనె భక్షించి - నిత్యము పశువైనావు
పశుపతినే మరచినావు - పశువుగ జన్మించేవు

4. అభిషేకమన ప్రేమించుట - గంగాజలమన శుద్ధ ప్రణయము
లింగమనగా సగుణరూపము - త్రిదళ బిల్వమన త్రిమూర్తి భావము
విభూతియన బ్రహ్మ ఙ్ఞానము - విశ్వేశ్వరుడన గురుదత్తుడే

5. సాత్విక భావమె క్షీరాభిషేకం - సత్సంగమె దధ్యభిషేకం
తపించు తనువే ఘృతాభిషేకం - ప్రేమయె మధువుల అభిషేకం
స్వామి పలుకులె చక్కెరల అభిషేకం

6. కొబ్బరికాయె నీ తలకాయ - పగులకొట్టుటయె వేదాంత చర్చ
కొబ్బరి నీళ్ళే నీ తియ్యని తలపులు - అభిషేకంబన అర్పణము
ద్రవ్య యఙ్ఞమున సారాంశమే - ఙ్ఞాన యఙ్ఞమని తెలియుమురా

7. నానా ఫలరస అభిషేకంబన - సర్వ ఫల సంగత్యాగము
కర్పూర నీరాజనమే - నీ మనసును స్వామికిచ్చుట
శివరతియే అగరువత్తి గంధం - నైవేద్యమే నీ ఆత్మార్పణము

8. దేవ దేవునికె నీ దేహం - వామ దేవునికె నీ వాక్కు
ఆదిదేవునికె నీ అంతరంగం - అర్పించుటయె ఆరాధన
ప్రతి క్షణము కార్తీకమాసం - ఆనందమె అమృతాభిషేకం

Download this bhajan sung by Shri Dattaswami here

Tuesday, March 25, 2008

వారిజాతమా! నా గీతమును ఆలకించుమా సావధానవై

(శంకరాచార్యునకు శ్రీ దత్త గురువు చేసిన బోధ)
వారిజాతమా! నా గీతమును
ఆలకించుమా సావధానవై ! (పల్లవి)

1. కాశీ పధిని చండాలునిగ - నాలుగు కుక్కలు వెంబడి పడగ
నన్ను జూచెను శంకర గురువు - తొలగమని నన్నాదేశించె
అపుడు పలికితి "ఆచార్యేంద్రా! - పంచభూతములన్ని తనువులు
చిదాత్మ ఒకటే పలికితి వీవె - ఏది పక్కకు పోవలె? " ననుచు
బిత్తర పోయెను శంకరుడపుడు - సాష్టాంగముగ పదముల బడియె
నీవె గురువని నన్ను నుతించె - గురువులకు గురుని నన్ను తెలియుము
జగద్గురువుకే - ఙ్ఞాన నేత్రము - తెరిపించితిని - తెరఁదీసితిని
శంకరునికే - మాయఁ గప్పితి - నన్నెవ్వరిల - తెలియగలేరు

2. జీవుడైనా దేవుడైనా కనుల గంతలు కట్టవలెను
విశ్వనాటక వేదికాస్థలి నియమమిదియే ప్రధమ సూత్రము
అవతరించును దేవుడెపుడు ప్రతి తరంబున అన్ని చోటుల
బీదవారలు ఒక్క చోటికి తన్ను చూడగ రాలేరనుచు
అన్ని గృహముల ఒక్క రూపమె కృష్ణుడుండెను వేరు వేరుగ
భిన్న రూపములుండ కష్టమే ? ఏక కాలమునందు స్వామికి
-----------------------
మహా సిద్ధిని స్తుతించు కీర్తన

ఏమున్నదే చెలీ! ఏమున్నదే
అష్ట సిద్ధులనిల దర్శించగా
ప్రభు సృష్టియే యీ విశ్వమంతా
మహా సిద్ధియె ఇది చూడవేలా (పల్లవి)

1. అదిగో చూడు సూర్యగోళము - తేజోమయము చాలా పెద్దది
దాని ముందర చిన్న వస్తువు - సృష్టిచుటయు ఆశ్చర్యమా

2. ఆద్యంతమును లేని విశ్వము - చూచిన చాలు స్వామి గొప్పను
ఊహించుటకు మహాసిద్ధియె - దాని ముందర సిద్ధులు ఎంత

3. పామరులకే అష్టసిద్ధుల - ప్రదర్శనంబు చేయుచుందును
అస్తిత్వమున విశ్వాసమును - కలిగించుటకె నీకేలనవి?

4. బ్రహ్మతేజమును విష్ణు చక్రమును - శివలింగమును చూపి యుంటిని
పసి పాపలకె ఆ వింతలుగ - నీ కేలనే? పాలబొప్పివె?

5. ఙ్ఞానమార్గము నందున నడచి - అందుకోవె అందని ఫలము
భక్తి రస సుధ మధురంబదియే - నా తత్త్వమని తెలియుము అనఘా

Download this bhajan sung by Shri Dattaswami here

Sunday, March 23, 2008

శ్రీహరి శయ్యా ! శివుని హారమా

(సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీ దత్త భగవానుని శిష్యులే కాదు సాక్షాత్తు దత్త స్వామి యొక్క బాహ్య వేషధారియే. నాగుల చవితి నాడు స్వామి ‘పున్నాగవరాళి’ రాగంలో ‘ఉరగేశ వందనం’ అని కీర్తించారు.)

శ్రీహరి శయ్యా ! శివుని హారమా ! - వాసుకి నామా ! ఓ ఆదిశేషా !
పుట్టలో నున్నట్టి పుణ్యాల మూర్తీ! - నాట్యమాడుమా నాగేంద్ర స్వామి!

ఉరగేశ వందనం - భుజగేశ వందనం
ఫణిరాజ వందనం - నాగేంద్ర వందనం (పల్లవి)

1. తరనాననాననం తరనాననాననం - అనురాగనాదమే నిను లేపునయ్యరో !
బుసకొట్టి దూకగా పరుగెత్తు పాపమే - ఇక పాలు త్రాగుమా శ్రిత రక్ష సేయుమా

2. బహువక్ర యానమా! మెరిసేటి నాగమా! - శిరమందు రత్నమే వెలిగేను దైవమా !
ననుబ్రోవలేవవా తలవిప్పి ఆడవా - అభయమ్ము నీయవా అహిరాజ ! వందనమ్

3. మహినెపుడు మోతువే శ్రమనంతసైతువే - హరిశయ్య వైతివే శివకంఠ హారమా
నిను పూజ సేయుచో స్ధిరయోగ లబ్ధియౌ-ఫణినాధ! పాహిమాంఅహిదేవ! రక్షమాం

4. కరుణా సముద్రమా! వినుమయ్య నామొరన్-బహుపాప రూపినై ఇలనుంటినాదొరా!
బుసచిమ్ము జ్వాలతో అఘమెల్ల భస్మమౌ- నను పావనాత్మగా నాగేశ! మార్చుమా!

5. బలరామ దేవుడా! బలమంత నీదెగా - హరి నీకు తమ్ముడై పదమందు మ్రొక్కెనే
రఘురామ సేవలో - నినుమించి లేరుగా - నిదురించలేదుగా నిలుచుండి లక్ష్మణా !

6. భువిలో పతంజలీ ! నవయోగ శాస్త్రమే - నీ ముఖమునుండియె వెలువడెను దేవరా !
వ్యాకరణ భాష్యమే పలికితివి పండితా! - గురుదత్త దేవుడా! ఫణి బాహ్య వేషుడా !

7. గురులక్ష్మణాకృతీ! రచియించినావుగా-హరిభక్తి భాష్యముల్ కలిలోన నాయనా!
కరుణించవేలరా కమనీయ రూపుడా - కలమైతి పాటకున్ కవి నీవె దైవమా !

8. నీవాడు నేనెరా నావాడు నీవెరా - గతి నీవు మాత్రమే గతి వేరు లేదురా !
దయఁజూపరానిచో దయ చేసి నాకికన్ - విషమైన నిమ్మురా నా తండ్రి శేషుడా

9. హరిదేహమంతయున్ నీ మీదనుండగా -ఆనందవార్ధిలో మనమందు తేలుచున్
వేవేల పడగలే కంపించుచుండగా - క్షీరాబ్ధినుంటివే క్షీర ప్రియుండవై

10. జగమంత స్వామి! నీ బుసమాత్రమే కదా - తలనుంచి మోయుచున్ పాలించుచుంటివే
బుసలోని జ్వాలతో జగదంత మనుగా - ఫణిరాజ ! నీవెగా శ్రీ దత్త బ్రహ్మమే

11. ఒకసారి దూకుతో ఒకసారి మెలికతో - ఒకసారి వంపుతో ఆడేవు సొంపుగా
నీ నాట్యమందునె అందాలు చిందునే - తల మీది రత్నమే కిరణాలు చిమ్మునే

12. పాతాళ నాయకా! నే తాళ జాలరా - రక్షింప రమ్మురా నిను విశ్వసింతురా
నేవె కాదన్నచో నేనేమి చేతురా - నా భాష్పవృష్టిలో నీ పుట్ట కరుగురా !

13. పాలారగించరా పాపాల కాల్చరా - పరమేశ్వరా! హరా ! ఫణిలోక నాయకా!
రోగమ్ముఁబాపరా యోగమ్ము నీయరా - నారాయణాశ్రయా నాగేశ్వరా దొరా !

14. చైతన్య శక్తియౌ కుండలిని నీవెగా - అనఘయను పేరుతో పరమాత్మ దేవిగా
చక్రాల దాటెదవు వంకరగా పోవుచున్ - గెలిచెదవు మాయతో మాయలను సర్పమా!

15. చంపెదవు కచ్ఛతో పగబట్టి దుష్టులన్ - కాచెదవు దీక్షతో శ్రితులైన శిష్టులన్
ఓ నాగ నాయకా! ఒకసారి చూడుమా - శరణార్ధి నేలుమా మణిదీప భోగమా !

16. అలవోలె దొర్లుమా తల విప్పి పొర్లుమ - తళ తళ మెరుపులా నాట్యమాడేవుగా
హిమశైల గంగలా దూకేవు నాగమా - అలలయ్యె మెలికలే ముత్యాల సరముగా

17. జగదాది సృష్టికై ప్రధమోహ నీవెగా - శివలింగ రూపివై చైతన్య శక్తివై
ప్రచలత్తరంగమై జగదాద్యరంగమై - ఙ్ఞానులకు బుద్ధిలో భాసింతు వెప్పుడున్

18. నిను నాగ దేవతా బిగి కౌగిలింతలో - పెనవేసి ఆడెనే సొరబూరనూదగా
నటరాజ పార్వతీ నవనాట్యమాయెనే - రససాగరంబులో అలలయ్యె మీరలే

19. మెలివేసి కొంటిరె అనురాగ పాశముల్ - వలపంత చూపుచున్ పలుమార్లు ఆడిరే
తలలందు రత్నముల్ తళతళా వెలుగులన్-విరజిమ్ము చుండగా నవకాంతి చక్రముల్

20. బహునాట్య రీతులన్ శ్రమఁజెందినావుగా - ముకుళించిచుట్టగా నిదురించు పుట్టలో
కనురెప్ప వేయకే కాపాడుచుందువే - లోకాలఁ జూచుచున్ నవయోగ నిద్రలో

21. అగజాకుమారకా! కరశక్తి భల్లకా! - శుభ షణ్ముఖాబ్జకా ! గురుదత్త శిష్యకా !
శిఖివాహ సంచరా ! హతతారకాసురా ! - హిమశైలమందిరా ! లఘుకోప సుందరా !

Saturday, March 22, 2008

సహ్యాద్రి వాసిని నేను

సహ్యాద్రి వాసిని నేను
సాక్షాత్తు దత్తుడు నేను
సాధన మార్గము గురువుగ చెప్పెద
స్వామిగ నమ్మిన నడిపిస్తాను (పల్లవి)

1. ఙ్ఞానమె నా సహజ సత్య స్వరూపం - ప్రేమయే నా సహజ సత్య సౌందర్యం
ఈ రెండె నను బట్టగా గుర్తులిచ్చట - నా అలంకారాలె ఈ అష్ట సిద్ధులు

2. దైత్యపుత్రులు గూడ మొండి తపములుఁజేసి - నానుండి పొందుదురు అష్టసిద్ధుల నిచట
అవె గుర్తులని తల్చు వారలఙ్ఞానులే - వాటిచే కోర్కెలను తీర్చుకొను లుబ్ధులే

3. నను నాస్తి యనువాడు నరకేమేగేను - నిరాకారమర్చింప దుఃఖమును పొందు
సాకారమర్చించి సంతృప్తి చెందు - నరాకారు నర్చింప ఆనంద సిద్ధి

4. పెనుమాయ నన్నెపుడు ఆవరిచియెయుండు-పెను పరీక్షల బెట్టు నెట్టు జీవులనెపుడు
కోటానుకోట్లలో ఏ ఒక్క జీవియో - మొండిగా ననుబట్టి బ్రహ్మత్వమును బొందు

5. వాక్కాయమనములను పరువు ధర్మముల - నా కొరకు త్యాగంబు చేయ సంన్యాసి
కాషాయ వస్త్రములు చందాలు కీర్తి - పెద్ద సంసారములు హేమ పాశములు

6. ఆధ్యాత్మ మార్గమును బోధించలేరెవరు - యోగి రాజును నేను బోధించినట్లుగా
సర్వార్పణ త్యాగ కర్మ సేవయు లేక - ఙ్ఞాన భావము భక్తి వాక్కులును వంచనలె

వినరా ఓ జీవా ! దత్తుని కనరా ఓ జీవా !

దత్త గురు తత్త్వ బోధ కీర్తనలు

వినరా ఓ జీవా ! దత్తుని కనరా ఓ జీవా !
నరాకారుడు నరుల కోసమె పాడుచున్నాడు (పల్లవి)

చింతల బురదల మునుగుచునుందురు జీవవరాహము లోయన్నా
నీ ప్రేమసుధల తెలియగలేరిల వీరలగతి ఇంతేనన్నా
దారాతనయుల, ధనముల తపనలు చిట్టచివరివరకోయన్నా
కాలకింకరులు ఎదురుగ నిలువగ మొత్తుకొందురపుడోయన్నా
ప్రయాణమగునెడ ధనములు సుతులును రక్షించలేరు రామన్నా
నీప్రేమామృత నామగానమే రక్షించగలదు రంగన్నా
ఆశాపాశము మొదలును చివరను లేనిది చుట్టును కృష్ణన్నా
కంఠమునందున కాలుడులాగగ ఉచ్చుబిగియునో దత్తన్నా
చెప్పలేదనుచు చెప్పకుండుటకు చెప్పితినిప్పుడు కొండన్నా
చెప్పిన చెప్పక యున్నను ఒక్కటె బాధ్యత తీరెను హరియన్నా

నేనను భావమె బ్రహ్మరాక్షసుడు మూలబీజమదె బ్రహ్మన్నా
నాకనుకోరిక బ్రహ్మరాక్షసియె వానిభార్యయగు విధి అన్నా
నావారు నావి అనుభావంబులు వారల సంతతి వెంకన్నా
ఈ కుటుంబమే నరులను గృహముల నివసించుచుండు హరియన్నా
భగవద్గానమె వారల నెపుడు పారద్రోలునిల మల్లన్నా
గానమునాపిన మరల చేరుదురు వారలయిళ్ళను రుద్రన్నా

కర్తవ్యంబుల మానుకొమ్మనవు వేదాంతంబులు వెంకన్నా
విశ్రాంతి విడిచి భజన బోధించవవియు హరియన్నా
కర్తవ్యంబులు విశ్రాంతి పోను మిగిలిన సమయమె బ్రహ్మన్నా
చాలు చాలు నీ కరుణను పొందగ నరుడు తరించగ మల్లన్నా
వ్యసనము లందున కాలశక్తులవి వ్యర్ధము లయ్యెడి రామన్నా
ఆ కాలశక్తి నీ కర్పించిన చాలు చాలు గద కృష్ణన్నా
వ్యర్ధ భాషణము చలనచిత్రములు నవలల చదువుట దత్తన్నా
వ్యసనము లివియే ఇహపర దూరము లివె పిశాచములు మూడన్నా
రంభయు మేనక ఊర్వశి యనగా అప్సరసలివియె కొండన్నా
నిను చేరు తపము నంతము జేసెడి మారు రూపములు ఇవెయన్నా
పాఠము చెప్పుచునుండగ గురువిట సాయము చేయును వెంకన్నా
పరీక్ష వ్రాయగ సాయము చేయడు కఠినతనుండును హరియన్నా
మర్త్యలోకమున అవతారమెత్తి బోధించు నెపుడు మల్లన్నా
పరలోకములో విచారణ సేయ పరుషుడు పలకడు రుద్రన్నా
ఇచ్చట ఇప్పుడె వాని వాడుకొన యుక్తము నరులకు కొండన్నా
కాలము దేశము మారిపోవునెడ తారుమారగును దత్తన్నా

హంస లేవగనె అచటకు వత్తువు పదిదినములుండ ఓరన్నా
సింహాసనమున ఆసీనుడైన నన్ను చూచెదవు ఓరన్నా
మనస్వామి యనుచు సంతోషింతువు పరిస్ధితి వేరు ఓరన్నా
కాలభైరవుని నొప్పించలేను పక్షపాతమున ఓరన్నా
నిష్పక్షపాతముగనే తీర్పును జీవులకిచ్చెద ఓరన్నా
న్యాయాధిపతిగ నన్ను చూచెదరు నిర్నిమేషులే ఓరన్నా
నేను చెప్పినది ఇచ్చట చేయక అచ్చట నిలచిన ఓరన్నా
నేనేమి సేతు నానియమునకు నేనె బద్ధుడను ఓరన్నా
సేవల నందిన కృతఘ్నుడనుచు నన్ను దూరకుము ఓరన్నా
నీ సేవ ఫలమె బోధించుచుంటి నీవెంటబడుచు ఓరన్నా
ఇంత విపులముగ చెప్పలేదు ఏ అవతారమునను ఓరన్నా
తెలిసియు తెలియనివానిగ నీవిట నటించబోకుము ఓరన్నా
సృష్టి స్ధితి లయ కారణ మొక్కటె బ్రహ్మమని చెప్పు బ్రహ్మన్నా
వేదములన్నియు, వేరు వేరుగనె త్రిమూర్తులుండగ హరియన్నా
సృష్టికి బ్రహ్మము స్ధితికిని విష్ణువు లయమునకు హరుడు వెంకన్నా
వేరువేరుగనె కనపడుచుందగ బ్రహ్మము ఒకటె ఎట్లన్నా

అని ఆలోచించిరి తపముల చేసిరి ఋక్షశైలమున రుద్రన్నా
ఋషులు మహర్షియు అత్రియు తపించ త్రిమూర్తులు వచ్చిరోయన్నా
బ్రహ్మము ఒక్కటి మీరు కాదనుచు వాదించెనత్రి దత్తన్నా
త్రిమూర్తి ముఖముల దత్తుడు బ్రహ్మమె గోచెరించెనట హనుమన్నా
ఒక్కవ్యక్తియగు దత్తుడు ఒక్కటె బ్రహ్మమె శ్రుతి సరియేనన్నా
మూడు ముఖములవి మూడుపనులిట చేయును ఒక్కడె గరుడన్నా
వేద సమన్వయమయ్యెను దత్తము దత్తమనె అత్రి శేషన్నా
దత్తము బ్రహ్మము చిక్కెననియెగద దత్తపదార్ధము గణపన్నా
వేదప్రమాణ సిద్ధ బ్రహ్మము దత్తుడొకడే లలితమ్మా
అన్యరూపముల వేద సమన్వయ మెట్లు కుదురునో దుర్గమ్మా

దారా పుత్రుల సహజముగ నెట్లుప్రేమించెదవో ఓరన్నా
అట్లే నాపై సహజ సత్య ప్రేమనుంచుమిల ఓరన్నా
కాల దేశములు విధానములేదు సత్యప్రేమల ఓరన్నా
ఎప్పుడు ఎచ్చట ఏవిధినైనను ప్రేమవ్యక్తమగు ఓరన్నా
తమ సుఖసాధనమగు నిను తమకై ప్రేమింతురిలను ఓరన్నా
దారా పుత్రులు సైతము స్వార్ధమె లోక బంధములు ఓరన్నా
నీ నుండి పొందవలసిన దేమియు స్వామికి లేదిల ఓరన్నా
నీకొరకై నిను ప్రేమించు స్వామి నిస్వార్ధుడతడు ఓరన్నా
చలన చిత్రనటు డంతమునొందగ వీరాభిమాని ఓరన్నా
ఆత్మదహనమును చేసుకొనెనొకడు భక్తిమార్గమదె ఓరన్నా
నటుని నుండి నొక పైసయు పొందక స్వధనమె వ్యయించె ఓరన్నా
నటుని ఆర్జితము నంతయు మ్రింగిరి వాని భార్య సుతులోరన్నా
నటునే దహనము చేసిరి చావగ సిద్ధము కారిల ఓరన్నా
వీరలె స్వామికి వేశ్యాభక్తులు స్వార్ధపూజలివి ఓరన్నా
వీరాభిమాని మార్గమె గ్రాహ్యము లక్ష్యము తప్పక ఓరన్నా
లక్ష్యము స్వామిని చేయుము మార్గమువానిదె ఉత్తమ మోరన్నా

Friday, March 21, 2008

ఎంతోదూరం బ్రహ్మపదం - ఓ జీవా !

ఎంతోదూరం బ్రహ్మపదం - ఓ జీవా !
ఇంకా ఎంతో దూరం బ్రహ్మపదం (పల్లవి)

కన్నుల చంపుము - చంపుము చెవులను జిహ్వను చంపుము .. వారే శత్రులు-
విషయాకర్షిత మింద్రియసంతతి నాపై మనమును నిలువగ నీయదు ఎంతోదూరం

నన్ను చేరిడి లక్ష్యము నీకూ, చేసే సాధన దాని విరుద్దము, మంట జేసెడి
లక్ష్య సాధనకు, నిప్పుల జలము పోసిన రీతిగా ఎంతోదూరం

ఏది విందువో, ఏది చూతువో ఏది పల్కుదువో, అదియే నీలో
జీర్ణమగును, నీదగు తత్త్వము ఆలోచింపుము, దీనిని చాలును ఎంతోదూరం

మొహమాటంబను మాటను వదలుము కఠిన మనముతో దీక్షను బట్టుము
చూడకు దేనిని, వినకుము నెవ్వరి పలుకకుమందరి పరిహరించుము ఎంతోదూరం

పిచ్చివాడవని పలికెడు వారల పిచ్చివారలని తెలియుము మదిలో
వారలె యమపురి కేకలు పెట్టగ, ఇంద్రియనిగ్రహ నిశ్చలబుద్ధిని
నాపైనుంచుము నిమిషనిమిషమును నన్నే చూడుము నన్నే వినుమూ
నన్నే పలుకుము ఇదియే మార్గము ఎంతోదూరం

జగతిని వదలుట మోక్షము సుమ్మీ నన్నే తలచుట సాధన సుమ్మీ
నన్నే చేరుట కైవల్యంబని పండితులందురు, సత్యంబిదియే ఎంతోదూరం

----------------------------
ఏమి సేతురా జీవా ! నేనేమి సేతుర?

ముక్తినొసగమని కాళ్ళపడేరు బంధము తెంచిన ఏడ్చేరు ! ఏమి
మహిమల చూపిన గారడియందురు చూపకున్న నామాట వినరు. ఏమి
ఇహమూ కావలె మోక్షము కావలె భోగము కావలె యోగము కావలె ఏమి
మనిషిగ వచ్చిన పొమ్మంటారు సొమ్ములు పెట్టిన నవ్వెదరు ! ఏమి
-----------------------------
ఎక్కడినుండి వచ్చావో !

మరల ఎక్కడికి పోతావో నీకేమి తెలియదురా. జీవా !
ఈ మధ్య క్షణకాలము లోపల మిడిసిపడి ఎగిరెదవేలా? ఎక్కడి
మిద్దెలు మేడలు పుత్రులు బంధులు క్షణమున పటపట తెగిపోతారు. ఎక్కడి
జన్మము నరకము! మరణము నరకము తదుపరి నరకము చెప్పగనేలా? ఎక్కడి
నీ సంగరి తలచిన నాకే జలదరించును మొద్దువలె వుంటావేల ? ఎక్కడి
కరుణాసాగర దత్తుని పాదము గట్టిగ పట్టిన భయపడనేలా ? ఎక్కడి

Thursday, March 20, 2008

ఇంద్రాది దేవతలకైన నా మాయ దాటంగ తరమె

ఇంద్రాది దేవతలకైన నా మాయ దాటంగ తరమె ? (పల్లవి)

1. అవతరించెద ధరణి నెపుడు - భిన్న పాత్రల రసము కొరకు
మీ తోడ దొంగాట లోన - క్రీడించుచున్నాను నేను

2. పాత్రలో దాగినను నన్ను - నా రూపమును చూచి పట్టు
మీ తోడ క్రీడించుచున్న - దొంగాట ఇదె పట్టుకొనుడు

3. పాత్ర వేషములోన జగతి - నా సత్య రూపంబు దాగు
నా రూపమే ఙ్ఞాన ప్రేమ - నా సొమ్ము లష్ట సిద్ధులిల

4. నను పట్టగలవాడు లేడు - నను గట్టు పాశమ్ము ప్రేమ
ప్రతిఫలాపేక్ష లేకున్న - వానికే దాసుండ నగుదు

5. మోక్ష కామము గూడలేక - నన్నెపుడు సేవించు వాడు
అద్వైత కైవల్యమునకు - మిన్నయౌ నా స్వామి యతడు

6. మహా మాయచే తిరుగు - ఏడేడు లోకాలు ఎపుడు
ఓ జీవ! నీవెంత తెలిసి - వినయమ్ముతో బ్రతుకు మిలను

Download this bhajan sung by Shri Dattaswami here
----------------------
వందేஉతి రమ్యం విశ్వైకగమ్యం
ఉన్మత్త దత్తం గురు దేవమ్ (పల్లవి)

వేదాంత సారం నానావతారం - భక్తోపకారం భజ దత్తమ్
సంసార పారం రుద్రాక్షహారం - నీహార గౌరం భజ దత్తమ్
కాషాయ చేలం పాత్రాక్షమాలం - ఆమ్నాయ మూలం భజ దత్తమ్
జ్వాలక్షి ఫాలం ఢక్కా త్రిశూలం - కంఠాహి నీలం భజ దత్తమ్
పాదాంత శక్రం విచ్ఛిన్న నక్రం - శ్రీ శంఖ చక్రం భజ దత్తమ్
కందర్ప రూపం సౌందర్య దీపం యోగీంద్ర భూపం భజ దత్తమ్
మంత్రాత్మ బీజం తంత్రార్ధ భాజం - శ్రీ యంత్రరాజం భజ దత్తమ్

Download this bhajan sung by Shri Dattaswami here
--------------------
ఉన్నాడయా దత్తుడున్నాడయా
అవతారముల నెత్తుచున్నాడయా
కన్నులకు కనిపించుచున్నాడయా
మనతోడ మట్లాడు చున్నాడయా (పల్లవి)

1. వాణియు లక్ష్మియు గౌరియు అనఘయే అనఘా పతిగ వెలుగుచున్నాడయా
కీర్తించి సేవించి ధ్యానించు భార్యలను వేరు పేరుల పిలుచుచున్నాడయా

2. బాహ్య స్వరూపాన కనిపించుచున్నను అంతః స్వరూపాన దాగేనయా
అంతః స్వరూపంబు ప్రకటితము చేసిన ఆనందమున నరులు రాలేరయా

3. ఙ్ఞాన ప్రచారంబు సేయంగ స్వయముగ దత్త గురుడే వచ్చుచున్నాడయా
జీవ రూపాంతరుండు జీవ దేహములందు వ్యాపించ ఆ రెండు తానేనయా

4. మాయతో గట్టిగ కళ్ళ గంతలు గట్టి మన మధ్యనే మసలుచున్నాడయా
మాయ మాటలు జెప్పి భ్రాంతిని కలిగించి మన తోడ మాట్లాడు చున్నాడయా

5. అనుమాన విశ్వాస డోలికల నెక్కించి నిజ భక్తులను ఊపుచున్నాడయా
అష్ట సిద్ధుల జూపి విశ్వాసమేర్పరిచి ఙ్ఞాన బోధలు చేయుచున్నాడయా

Download this bhajan sung by Shri Dattaswami here

దత్తస్వామిని నేనేరా - నాకే దాసోஉహమ్మనరా

దత్తస్వామిని నేనేరా - నాకే దాసోஉహమ్మనరా (పల్లవి)

1. ఉద్ధరించెదను నిన్నుపుడే - కండ్ల గంతలను విప్పెదను
ఙ్ఞాన యోగమను దీపముతో - భక్తి మార్గమున కదులుమురా

2. ఏ జీవునికై మురిసితివో - వర్జించి నాడు నిను వాడు
గుడ్డి మోహమును వదులుమురా - ఇప్పటి కైనా తెలుయుమురా

3. నిత్యము నిను కని పెట్టెదను - నీ శ్రేయస్సునె కోరెదను
జన్మ జమలను తోడగుచున్ - నీ వెంట నుంటి నీడవలెన్

4. చేతి నూపి నైవేద్యములన్ - నా కర్పింతువు మాయావీ
నా నుండి వరము కోరెదవు - సత్యమైన సిరి సంపదలన్

5. దొంగాటలాడ మనసాయె - నర రూపములో దాగితిని
గుర్తించినారు, నిమిషములో - అరటి తొక్కపై కాలిడిరి

Download this bhajan sung by Shri Dattaswami here
----------------
దత్తాత్రేయ మునీంద్రులము - అనసూయాత్రి సుపుత్రులము (పల్లవి)

1. నిర్వికారులము! నిత్యులము - నిరంజనులమై నిలచితిమి
మానావమానములు రెండు - సంతోషదములె మాకెపుడు
భక్త రక్షణమె మా వ్రతము

2. నిరంతరము సంచారులము - ఙ్ఞాన భిక్షలను పంచెదము
యోగులము మరియు భోగులము - భక్త కర్మ ఫల రోగులము
అపార దయా సాగరులము

3. విశ్వ కర్తలు, భర్తలును - విశ్వ హర్తలు త్రిమూర్తులము
అద్వితీయ - అవధూతలము - ఆద్యంత మధ్య రహితులము
ఆనందార్ణవ రూపులము

4. గుర్తించలేరు మమ్మెవరు - మాయలె చేష్టలు వేషములన్
మా దయ గలిగిన చిక్కుదుము - భక్తి సన్నగిల జారుదుము
జారిన చిక్కము ఎన్నటికిన్

Download this bhajan sung by Shri Dattaswami here
----------------
దత్తులోరమండీ - భిక్షాదానము చేయండీ (పల్లవి)

1. బాలునిలో వికలాంగునిలో - వృద్ధునిలో రోగగ్రస్తునిలో
ఆవేశించి అడిగెదమండీ - మీ త్యాగ పరీక్షను చేస్తామండీ

2. సోమరి పోతులు కొందరు - మా పేరు చెప్పి అడిగెదరండీ
వారికి భిక్షలు వద్దండీ - పని చేసే పధమును చూపండీ

3. ఙ్ఞాన విచక్షణతో - పాత్ర దానమును చేయండీ
యోగ్యునకు ఇచ్చుట పుణ్యంబండీ - అయోగ్య దానము పాపంబండీ

Download this bhajan sung by Shri Dattaswami here

సాక్షాద్దత్తాత్రేయులము

సాక్షాద్దత్తాత్రేయులము - గురువులదిద్దగ వచ్చితిమి (పల్లవి)

1. సత్యం ఙ్ఞాన మనంతం బ్రహ్మ - రసోవైస ఇతి శ్రుతి వాక్యాత్
ఙ్ఞానమె బ్రహ్మము ప్రేమయె బ్రహ్మము - అష్ట సిద్ధులివి మా సొమ్ములేను

2. ఙ్ఞాన భాస్కరుడు దత్తాత్రేయుడు - తత్త్వాంబరమున గోచరించగా
మాయగురువులిల అంధకారములు - పటాపంచలై పారిపోవగా

3. క్షుద్ర మాంత్రికులు దానవాధములు - మొండి బిడ్డలిల మొండి తపస్సుల
తండ్రి సొమ్ములను పొంది ధరించిన - ఙ్ఞాన ప్రేమల పొందగ సాధ్యమె

4. సొమ్ముల చూపిన బ్రహ్మమగుదురె - ఙ్ఞాన ప్రేమలు మా స్వరూపములిల
స్వరూపము చేత గుర్తించు రాణి - రాజును కిరీటము చేత కాదుగ

5. ఇంద్ర పదవిలో నహుషుడు నిలచిన - వానిని శచి పతిగా నొప్పుకొనెనె
పద్మ నాళమున దాగిన ఇంద్రుని - స్వరూపము చేత గుర్తించె సతియు

6. స్వార్ధముల దీర్చు సిద్ధులఁ జూపియు - జీవులనాకర్షించిన మాత్రము
సొమ్ముల కోసమె వేశ్యలు వత్తురు - భగవద్గుణాభిమానము నటనయె

7. సత్య భక్తుడిల సీతమ్మ బోలి - సొమ్ములు లేకున్నను పతిరూపమె
హృదయాకర్షణమై వని కేగెను - ఙ్ఞాన ప్రేమలె బ్రహ్మ రూపమగు

8. స్వార్ధముఁదీర్చెడి సిద్ధుల జూపిన - వచ్చెడి భక్తులు నాకేల కోట్లు?
స్వార్ధరహితుడై నా కొరకె వచ్చు - ఒక్క భక్తుడిల దొరికిన చాలును

9. లారీలు ఏల? గులకరాళ్ళు ఇవి - కోహినూరు వజ్రమొక్కటి చాలును
ఎండమావులీ భక్తుల ప్రేమలు - గంగా జల కణమే సద్భక్తుడు

----------------------------
మూడు తలలోణ్ణిరా నేను - మూడు లోకాల ఏలికనురా
చూచి చూడలేని జనులారా - చూచి పోదామని వచ్చానురా (పల్లవి)
1. మీ బుద్ధులన్నిటిని చూశానురా - ఆనందమానందమాయెనురా
ఒకరి నొకరు దోచుకుంటూనే - ఎంత ముచ్చటగ ఉన్నారురా

2. కాల కర్మలను చక్రముల - క్రిందపడి నలిగేటి చీమలారా !
దేవుడెచ్చటయనుచు అడిగేరు - మాతెలివి చూడమని మురిసేరు

3. మా ప్రతిభ చూడమని పలికేరు - యంత్రముల కనిపెట్టినారు
అవి జీవ నాశమై నిలువ - నా సృష్టియే మంచిదనిరి !

Download this bhajan sung by Shri Dattaswami here

Tuesday, March 18, 2008

దత్తాత్రేయా ! త్రిమూర్తి రూపా !

దత్తాత్రేయా ! దత్తాత్రేయా !
దత్తాత్రేయా ! త్రిమూర్తి రూపా (పల్లవి)

నీవే బ్రహ్మవు - నీవే విష్ణువు - నీవే శివుడవు - దత్తాత్రేయా
వాణీ లక్ష్మీ గౌరీ నాధా ! దత్తాత్రేయా త్రిలోక పూజ్యా !
శంఖీ చక్రీ ఢక్కా శూలీ ! కుండీ మాలీ దత్తాత్రేయా !
కాశీ స్నానము - మాహురి భిక్షయు - సహ్యము శయ్యా - దత్తాత్రేయా !

ఒకచో యోగిగ - ఒకచో భోగిగ దర్శనమిచ్చే దత్తాత్రేయా !
ధర్మమె ధేనువు - శ్రుతులే కుక్కలు వెంటబడిన ఓ దత్తాత్రేయా !
దేవదేవతలు - ఋషులును సిద్ధులు గ్రహములు నీవే దత్తాత్రేయా !
యోగ భ్రష్టుని - నను కాపాడుము దయతో దేవా దత్తాత్రేయా !
--------------------

శ్రీ నృసింహ సరస్వతిస్వామి స్తోత్రం
-------------------
శ్రీ నరసింహ సరస్వతీ యోగిరాజం భజేహమ్

కర్ణాంత కమల నయనం కనకవర్ణ చ్ఛాయం
వటవృక్షాధః శిలాతలోపరి పద్మాసనాసీనమ్ శ్రీ నరసింహ సరస్వతి

నిజ తను ధృత కాషాయాంబర సంవృతోత్తమాంగం
కంఠ మాలాయిత పావన రుద్రాక్షహారమ్ శ్రీ నరసింహ సరస్వతి

అనేక లీలా మహిమ ప్రదర్శన సద్గురు మూర్తిం
హరిహర బ్రహ్మాత్మక శ్రీ దత్తాత్రేయ పూర్ణావతారమ్ శ్రీ నరసింహ సరస్వతి
-----------------------
దత్తాత్రేయం దత్తాత్రేయం - దత్తాత్రేయం కోజానాతి ?
బ్రహ్మర్షిర్వా దేవో వాస్యాత్ - దత్తాత్రేయం కోజానాతి ? (పల్లవి)

1. పూర్ణ వినోదం మాయాలోలం - మూలస్య మూల మనూహ్య తత్త్వం
సద్గుణ దుర్గుణ లీలా కేళిం - బ్రాహ్మణోత్తమం చండాలంచ

2. పరమ కఠోరం బాహ్యాకారం - కరుణా సాగర మంతస్సారం
నిందా స్తోత్రై రలిప్త మేకం - క్రీడయంత మిహ కృతావతారమ్

3. దత్తం ఛిన్నం దత్తం ఛిన్నం - మూఢా ఏవం వదంతి లోకే
మాయా బంధా స్సర్వే ఛిన్నాః తదీయ దృష్ట్యా కైవల్యాయ

4. ధర్మ బద్ధ మపి ధర్మాతీతం - ఙ్ఞానానందం రస స్వరూపం
కర్మణిమగ్నం నకర్మ బద్ధం - కర్మ ఫలానాం ధాతారంతమ్
--------------------

Sunday, March 16, 2008

అంతర్యామీ ! దత్తాత్రేయా

అంతర్యామీ ! దత్తాత్రేయా ! అరచితినీ ! మొరిగితినీ !
ఎప్పటికప్పుడే నీ పలుకులను
అరచి అరచి మొరిగి మొరిగి - నీ పద కమలములనిదే
వ్రాలితినీ అంతర్యామీ దత్తాత్రేయా (పల్లవి)

1. మారరు జీవులు మారరు జీవులు - నా వాలము వలె వంకరలు
క్షణికపు మార్పులు మరల పాతవె పద్ధతులు - అంతర్యామీ ! దత్తాత్రేయా

2. పాపక్షయ సులభ మార్గమును వినరు ఎంత చెప్పిననూ
వ్యర్ధములగు కష్ట మార్గములనే శ్రమపడి చచ్చెదరు - అంతర్యామీ ! దత్తాత్రేయా

3. కృతయుగమంతయు అత్రి తపించిన క్షణ దర్శన మిచ్చితివి
పిలువకయె వచ్చి నాతోనెప్పుడు ముచ్చటింతువు నా ప్ర్రాణ సఖా
అంతర్యామీ ! దత్తాత్రేయా

4. నా తోడ నడచి నాతో నిత్యము ఐక్యము చెందితివి !
దేవతలకును ఋషులకును అబ్బని భాగ్యము నా కిచ్చితివి
అంతర్యామీ ! దత్తాత్రేయా

5. హంసను పంపుము గరుడుని పంపుము నందిని పంపుము ఈ లోకమునకు
నారద గణపతి హనుమదాదులు పరమ పావనులు కలరు గదా నీ సేవలకు
అంతర్యామీ ! దత్తాత్రేయా

6. చాలు చాలునిక కొంత విశ్రాంతి నొసగుము స్వామీ
నీ రూపములో ఇక ఐక్యముగానీ నా రూపము ! అంతర్యామీ ! దత్తాత్రేయా

Download this bhajan sung by Shri Dattaswami here

కంటి - సత్యమును గంటి

కంటి - సత్యమును గంటి ! నే పరమ సత్యమును గంటి !
ఎల్ల దేవతల వేషాల నటుడగు ! శ్రీ దత్త బ్రహ్మమును గంటి ! (పల్లవి)

1. మూడు ముఖముల నారు చేతుల వెలయు దేవుని
ముద్దులొలికెడి మూడు మూర్తుల వేషధారిని కంటి
పాత్రమాలలను గంటి ! ఢమరు శూలముల గంటి !
శంఖ చక్రముల గంటి ! కాల జటలను గంటి !
కమల లోచనుని గంటి ! కాషాయ ధారిని గంటి !
ఙ్ఞాన బోధకును గంటి ! జీవ తారకుని గంటి !
విధి గంటి ! హరి గంటి ! హరు గంటి ! గురు గంటి !
కామధేనువును గంటి ! కాల భైరవుల గంటి !

2. నాల్గు వేదములైన కుక్కలు మొరిగి తెలుపగ వింటి !
సత్యమును వింటి - నే పరమ సత్యమును వింటి !
సృష్టి పాలన విలయ కారకుడొక్కడేయని వింటి !
నా కన్నులను నలుపు కొంటి !
మాయ గాదిది మరల మరలను కంటి !
శ్రీ దత్త గురు పాదముల నంటి , శ్రీ దత్త గురుదేవులను గంటి !
కంటి, సత్యమును గంటి ! నే పరమ సత్యమును గంటి !

Download this bhajan sung by Shri Dattaswami here

Saturday, March 15, 2008

దత్తుడు దిగి దిగి వస్తున్నాడు

దిగి దిగి వస్తున్నాడు !
దత్తుడు దిగి దిగి వస్తున్నాడు (పల్లవి)

1. మునులను వదలి గొల్లల వద్దకు - ఆశ్రమము వీడి రేపల్లె లోకి
కాషాయము వీడి జిలుగు గుడ్డలతో - దండము విడచి వేణువు బట్టి

2. వేదము వదలి పాటల పాడుచు - రుద్రాక్షల వీడి ముత్యాల సరముల
త్యాగము విడచి భోగముతోడ - యోగి రాజయిన ప్రణయలోలుడిగా

3. పామరులనైన ఉద్ధరించుటకు - పామర వేషము పామర భాషతో
శాస్త్రాల వదలి శ్రుతి పండితుడు - కొంటె వాడగు గొల్ల వానిగ

4. బ్రహ్మర్షులకును అందనట్టిది - బ్రహ్మానందము నీయ పామరులకి
ఙ్ఞాన సారమే భక్తి యోగమని - తెలియ చెప్పుటకు గోప వేషమున

Download this bhajan sung by Shri Dattaswami here
------------------
కొండల రాజా! ఈ బండ మనసుల
భక్తి ఝరులిక పుట్టవు పుట్టవు
కుందేటి తలపై కొమ్ము పుట్టినను
ఎండ మావుల నీరు చిక్కినను (పల్లవి)

1. రాధ ఎచ్చట ! మీర ఎచ్చట ! - గోదా ఎచ్చట ! నాంచారి ఎట !
శంకరుడెచట ! రామానుజుడెట ! - రామకృష్ణ పరమహంస ఎచ్చట !

2. పతులను సతులను ధనముల గృహముల - కాలదన్నిరే నీ కొరకై
ఒక్క గంటయును నీ ముచ్చటలో - స్థిరముగ నుండరు చంచల చిత్తులు

3. చలన చిత్రముల వ్యర్ధ భాషణముల - గంటలు గంటలు ఆసీనులగుచు
పిడుగులు బడ్డను విన ప డవవియె - బురద గుంటయే వీరికి బ్రహ్మము

Download this bhajan sung by Shri Dattaswami here

దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ

దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ (పల్లవి)

సాధన పూర్తిగ చేయకయే! కొన్ని సిద్ధులను పొందగనే
అవతారములుగ గురువులుగా! బ్రహ్మాஉహమని కొందరిలన్
అష్ట సిద్ధులకు అధిపతియౌ ! సృష్టి స్ధితి లయకరుడతడె
ఆంజనేయుడే వినయముతో ! దాసోஉహమ్మను మాకుగదా

సృష్టి స్ధితి లయ కర పదమే ! - మా కిరీటమిది ఇచ్చితిమి
అతడికె బాధ్యత లేదు యికన్! అవతారముల రమించెదము
మా సొమ్ములేను సిద్ధులిలన్ ! బహుమానముగా ఇచ్చెదము
ఙ్ఞానమె ప్రేమయే మా గుర్తు! అవె మా రూపము, మా కళయౌ

మా ఊహలేను జగమంతా! అష్ట సిద్ధులను ఊహలుగా
ఊహలె జీవులు వినోదమే!ఊహించు వ్యక్తి మేమేగా
సృష్టి, స్ధితి లయ కారణమౌ! ఒక్క బ్రహ్మమే చిద్ఘనమై
దత్త కృతిగా వెలిగెదము! బ్రహ్మ విష్ణు శివ వేషములన్

Download this bhajan sung by Shri Dattaswami here

శ్రీ దత్తోஉహం గురుదత్తోஉహమ్

శ్రీ దత్తోஉహం గురుదత్తోஉహమ్
ప్రభు దత్తోஉహం శృణురే జీవ! (పల్లవి)

నానా మార్గా న్గురూన్విలోక్య భ్రమవికటధియ శ్శిష్య భ్రమరాన్
అవతీర్ణోஉహం వేణోర్గానం - శ్రుతి సిద్ధాంతం రచయామీహ

గోపరిపాలో గోపాలోஉహం - ధర్మో గౌరియ మునుసరతీహ
సర్వే గురువో ప్యాకృష్టాస్స్యు - రితి కృష్ణోஉహం మూర్తిర్దత్తః

చత్వారోమే వేదాశ్శిష్యాః - సామవేద ఇహ పద్మాఖ్యాతా
ఋగ్వేదోஉయం బాలఃకృష్ణో - యజురజయోஉయం భీమస్తుర్యః

శఙ్కరోஉహమపి రామానుజ ఇతి - మధ్వాచార్య స్త్రిగురుః పూర్వమ్
శఙ్కర విష్ణు బ్రహ్మత్రిమూర్తి - రవతీర్ణోஉహం మూఢః కలహః

శ్రీ అనఘా నామావళి

1.అనఘా జనని- దత్తప్రియసతి - నమోஉనఘాయై - నమోஉనఘాయై 
2. మధుమతి దేవి 88. మదగజగామిని
3. వాణీ రూపిణి 89. బ్రహ్మాండ మోహిని
4. లక్ష్మీ రూపిణి 90. జంఘాంత కేశే  
5. గౌరీ రూపిణి 91. శ్రీ దత్త కామిని
6. సాక్షాల్లలితే 92. సౌందర్య గర్వే
7. దుర్గామాతః 93. యువతి లలామే
8. మహష మర్ధిని 94. కాంచనఅ వసనే
9. శ్రీ భద్రకాళి 95. దత్త ప్రేయసి
10. శ్రీ మహాకాళి 96. చిత్స్వ రూపిణి
11. రాజరాజేశ్వరి 97. శ్రీ దత్త లోలే
12. శ్యామలాంబికే 98. గీర్వాణవాణి
13. అన్నపూర్ణాంబ 99. అలికులవేణి
14. వారాహిదేవి 100. వర్తులాలకే
15. హే నారసింహి 101. పాయసస సక్తే
16. విశ్వకారిణి 102. ముద్గాన్న రసికే
17. విశ్వధారిణి 103. దధ్యన్నలోలే
18. విశ్వ హారి్ణి 104. మందారమాలే
19. శ్రీ ఆది లక్ష్మి 105.చందన గంధిని
20. శ్రీ ధాన్య లక్ష్మి 106. స్వర్ణ కిరీటే
21. శ్రీ ధనలక్ష్మి 107. కజ్జల నయనే
22. శ్రీ గజ లక్ష్మి 108. వింధ్య నివాసిని
23. శ్రీ విజయలక్ష్మి 109. భ్రామరి శక్తే
24. శ్రీ ధైర్య లక్ష్మి 110. శ్రీశైల నిలయే
25. సంతాన లక్ష్మి 111. కాంచీ పీఠే
26. శ్రీ శాంతి లక్ష్మి 112. శృంగ గిరీశే
27. శ్రీ మహా లక్ష్మి 113. విశ్వభ్రమకరి
28. హే అష్ట లక్ష్మి 114. త్రిశక్తి రూపిణి
29. మాయా శక్తే 115. భార్గవ జనని
30. బ్రహ్మానన్యే 116. వైదేహి మాతః
31. అష్ట సిద్ధికరి 117. అంబ రుక్మిణి
32. వాత్సల్య వాహిని 118. శ్రీ సత్య భామే
33. కరుణా మూర్తే 119. ఆనందరూపిణి
34. ఐహిక దాయిని 120. పంచకోశమయి 
35. పూర్ణాయుష్కరి 121. సుర్యేందునయనే
36. ఆరోగ్య వరదే 122. ఫాలలోచనే
37. ఐశ్వర్య దాయిని 123. వామంసకీరే
38. సంతాన వరదే 124. ఓంకార గమ్యే
39. ఉద్యోగ దాయిని 125. దత్తంకపీఠే
40. కల్యాణ కారిణి 126. శ్రీ సూక్త పఠితే
41. వీణాపాణే 127. హే చండీశ్వరి
42. కమలాసీనే 128. శ్రీ యంత్ర నిలయే
43. సింహవాహనే 129. సౌందర్య లహరి
44. శార్దూల వాహే 130. శ్రీ కనకధారే
45. హంసారూఢె 131. శుంభనిషూదిని
46. గరుడవాహనే 132. నిశుంభనిధనే
47. నందివాహనే 133. చాపేక్షుఖండే
48. పుస్తక ధారిణి 134. హ్రీంకారేశ్వరి
49. స్ఫాటిక మాలే 135. స్త్రీ వేష దత్తే
50. విద్యాదాయిని 136. స్త్రీ ధ్యాన సులభే
51. ముక్తా ధవళే 137.దత్త సుమంగళి
52. బ్రహ్మాణి మాతః 138. హే యోగేశ్వరి
53. కనకవర్షిణి 139. తాంబూల లోలే
54. పద్మవర్ణిని 140. ప్రకృతి ఖ్యాతే 
55. వైష్ణవి జనని 141. అపరాప్రకృతే
56. కరశంఖ చక్రే 142. పరాஉఖ్య ప్రకృతే
57. త్రిశూల ధారిణి 143. ఆకాశ రూపిణి
58. తుషార గౌరే 144. వాయురూపిణి
59. సర్వ సిద్ధికరి 145. అగ్ని రూపిణి
60. హిమగిరి దుహితే 146. రసస్వరూపిణి
61. పల్లవాధరే 147. పృధ్వీరూపిణి
62. కమలలోచనే 148. నవరసనటనే
63. కనక భుషణే 149. మనస్స్వరూపిణి
64. పూర్ణ చంద్రముఖి 150. బుద్ధిరూపిణి
65. మీనాక్షి దేవి 151. సాహంకారే
66. కామాక్షి జనని 152. చిత్త రూపిణి
67. మీనలోచనే 153. జీవాకారే
68. తిలసుమనాసే 154. విశ్వనాయకి
69. ముకుర కపోలే 155. విశ్వరూపిణి
70. త్రిలోక సుందరి 156. వినోదదాయిని
71. మోహనరూపే 157. బ్రహ్మ నర్తకి
72. నటన మోహిని 158. జగదేకసుందరి
73. అమృతదాయిని 159. సర్వకళామయి
74. శ్రీ కంబుకరి 160. సర్వవేదమయి
75. ముక్తారదనే 161. సర్వశాస్త్రమయి
76. కుంకుమ తిలకే 162. సర్వవాదమయి
77. ఆయత సుభ్రు 163. సర్వబోధమయి
78. బాహుమృణాళిని 164. సర్వ నాదమయి
79. కరికుంభస్తని 165. సర్వ రాగమయి
80. కవితాస్తన్యే 166. సర్వ సిద్ధిమయి
81. త్రివళీ జఠరే 167. సర్వ శక్తిమయి
82. ఆవర్త నాభే 168. సర్వ భక్తిమయి
83. కదళీ పృష్ఠే 169. జ్ఞాన యోగమయి
84. శ్రీకరభోరు 170. సర్వయంత్రమయి
85. నిషంగ జంఘే 171. సర్వ తంత్రమయి
86. స్ధలకమలాంఘ్రే 172. సర్వ మంత్రమయి
87. మరాళగమనే 173. హే బ్రహ్మ శక్తే
174. హే విష్ణు శక్తే
175. హే రుద్ర శక్తే

గోపి గీతలు - 2

స్వామి రచించిన గోపి గీతలు గ్రంధము నిండి కొన్ని భజనలు.
----------------------------------
గొల్లభామా ! గొల్లభామా ! - ఏమి యిచ్చి ఋణముఁ దీర్తు (పల్లవి)

పతిని సుతుల కాలఁదన్ని - పరుగు తోడ దూకినావె
అత్త మామలెదురు నిలువ -త్రోసిపుచ్చి వచ్చినావె
సత్యలోక మిత్తునన్న - కాలిగోటి సాటిరాదు
నీదుపాద పద్మయుగము - హృదయమందు నుంచుకొందు

యమున వద్ద వలువలన్ని - దొంగిలిచ చేతులెత్తి
అణువు అణువు నేవె అనుచు - మ్రొక్కినట్టి ముద్దులాడి
మనముఁ గొట్టు మన్మధుండు - బ్రతుకఁ జాల ధరణి నింక
కాలిఁ గొట్టు బోయవాడు - వాలిసుతుడు రాడదేల

రుక్మిణమ్మ వట్టి బొమ్మ - చుప్పనాతి సత్యభామ
రాధ ఎపుడు ఏడ్చు గంగ - వలపు నీదె గొల్లభామ
రాకు రాకు గొల్లభామ ! - వత్తువేని పోకు పోకు
రాని యెడల విరహ బాధ - వచ్చిపోవ ప్రాణమెగురు

గొల్లభామ గొల్లభామ - నామ జపమె ధ్యానమయ్యె
కనుల నీరు జలధులయ్యె - విషము నైన నిచ్చి పొమ్ము
ద్వారనగర జలధి చేరు - బృంద యమున గిరుల దాటి
అటుల నీవు అడ్డులన్ని - దూకిరమ్ము నన్ను చేర

-----------------------------
(దేవతలు ఋషులు గోపికను స్తుతించు భజన)

చదువురాని చందమామ ! వేద ఋషివి నీవె గోపి ! (పల్లవి)

1. చదువులన్ని చదివి చదివి - చదువు లోని సారమెరిగి
చదువులేని జన్మ నెత్తి - మార్గమైన గొల్లభామ
హరినిఁ బట్ట విద్యలెన్నొ - నేర్చి విర్రవీగినాము
ప్రేమ విద్యతోడ హరిని - పాదదాసుఁ జేసినావు

2. తపములెన్నో చేసినాము - స్వామి చూపుకూడ లేదు
తపమనంగ ప్రేమయనుచు - తెలిపినావు ప్రణతులివియే
యుగతపములఁ జేసినాము - స్వామి చూపుకూడ లేదు
ఎంతదానివమ్మ నీవు - నీదు విరహ మందు వేగు

3. నెమలికన్ను వాడిపోయె - మురళి నూద మాడిపోయె
చందనంబు రాలిపోయె - కనులు రెండు వాలిపోయె
వేడి హెచ్చె నాడితగ్గె - దేహమంత కాలుచుండ
తిలకమంత కారిపోయె - తులసిమాల తుంపులయ్యె
శ్రావణమున కృష్ణ మేఘ - కరుణ వృష్టి రయముతోడ
ఎన్ని అడ్డులున్న దాటి - జలధి శయనుఁ జేరవమ్మ

------------------------
(బృందలో నున్న గోపి, ద్వారకలో నున్న స్వామికి పంపిన సందేశము)

శ్రావణాభ్ర మేఘమాల ! చెప్పిరావె నీవయినా (పల్లవి)

1. మదిని కొల్ల గొట్టి పోయె - మనోహరుడు ఏడివాడు ?
కానరాక మురళినూది - పులబాణ మేయువాడు
ఏల ఉండు నమ్మరేడు? - మత్తులోన ముంచినాడు
ప్రాణములివె పోవుచుండె - దోచుకొనెనె దొంగవాడు

2. మాయతోడ మాయగెలుపు - మంటు మాయ చేసినాడు
మనసుదోచు కొనుట తెలుసు - మనసు తెలుసు కొనగలేడు
విశ్వమంత నిండియున్న - విష్ణుదత్త కృష్ణుడతడు
నిలువనీడు నీలమేఘ - శ్యాముడైన కొంటెవాడు

Thursday, March 13, 2008

గోపి గీతలు -1

స్వామి రచించిన గోపి గీతలు గ్రంధము నిండి కొన్ని భజనలు.
---------------------------------
భాగవతము రంకు కాదు - ఙ్ఞానమదియె ఓరి శుంఠ !
గోపి వేశ్య యనిన మూఢ - దత్తుడెపుడు వేశ్య రతుడె (పల్లవి)

వేదశాస్త్రమర్ధమైన - మాత్రమిచట పండితుండె
కృష్ణకేళి దత్తలీల - భాగవతము నెరుగకున్న
స్వామి కొరకు సర్వధర్మ - త్యాగమాచరింపవలయు
సర్వధర్మత్యాగి సర్వ - పాపముక్తు డనును గీత (“సర్వ ధర్మాన్” .. గీత)

త్రికరణార్పణంబు సంధ్య - చివరి శ్లోక సారమదియె
కృష్ణ దత్త గోపిమునియె - ఆచరించి చూపెనిచట (“కాయేన వాచా” ..)

హరికి ప్రియమె పుణ్యమన్న - హరికి కోపకరమె అఘము
ప్రకృతి రూప జీవులెల్ల - స్త్రీలె పురుషుడొకడె అతడు
---------------------------------
(మమ్ములను మరచినావని గోపికలు అన్న మాటను ఉద్ధవుడు వచ్చి చెప్పగా విని వేదనతో)
మరచి పోతివనుచు గోపి! - ఎంత మాట పలికినావు ! (పల్లవి)

ఉద్ధవుండు చెప్పె నాకు - అట్లు పలుకు సమయమందు
కమలనయన కెంపులందు - జలము ధారలయ్యె ననుచు
నన్ను నేనె మరతునేమొ - నిన్ను ఎట్లు మరువగలను
బృందలోని యమున సాక్షి - అ తమాల తరులు సాక్షి
------------------------

ఎందరున్న నేమి గోపి? - నాకు ప్రాణ ప్రాణ మీవె (పల్లవి)

ఎన్ని తారలున్న నేమి? - గగనతలము బిక్కుమనును
పూర్ణ చంద్ర బింబ మనెడి - దీప మొకటి లేకయున్న
ఎన్ని నదులు ఉన్న నేమి? - భిన్న వర్ణ రుచుల తోడ
నీల జలధి నందు కలియు - నీల యమున లేకయున్న

ఎన్ని పూవులున్న నేమి? -కృష్ణ భ్రమర మెపుడు తిరుగు
ఆ సుగంధ పద్మ మొకటి - సరసు నందు లేకయున్న
ఎన్ని గ్రంధ శతములున్న - వాటి వలన నేమి ఫలము
గోపి కృష్ణ ప్రణయ బంధ - భాగవతమె లేకయున్న
రుక్కు గాని భామ గాని - అష్ట సతులు ఆపలేరు
బృంద లోని నిన్నుఁ జూడ - జీవుడెగుర సిద్ధమయ్యె
--------------------------------

Wednesday, March 12, 2008

శ్రీ దత్త సత్యశాయి శరణాష్టకమ్

శ్రీ దత్త సత్యశాయి శరణాష్టకమ్

శ్లో శ్రీ దత్తదేవ భగవత్ కరుణావతార శ్రేణిస్ఫురన్మణిగణోజ్జ్వల మధ్య రత్నమ్
మాయాంధకార పటలీపటపాటనాంశుం శ్రీ సత్యశాయి తరణిం శరణమొ ప్రపద్యే

తా శ్రీ దత్తాత్రేయ భగవానుని కరుణావతారములను ప్రకాశించు మణుల మాలలోని ముఖ్యమైన రత్నమును, మాయాంధకార సమూహ మను వస్త్రము చీల్చు కిరణములు కల శ్రీ సత్యశాయి సూర్యుని శరణము పొందుచున్నాను.

శ్లో ఛాయాగ్రహవ్యసనపుత్ర కళత్రబంధ వ్యామోహనక్రఘన మృత్యు తిమింగిలోగ్రం
సంసార సాగర మిమం సహసైవతర్తుం శ్రీ సత్యశాయి తరణం శరణం ప్రపద్యే

తా వ్యనములను ఛాయాగ్రహములతోను భార్యాపుత్రుల బంధములందు గల మోహములను మొసళ్ళతోను, మహామృత్యువను తిమింగలములతోను, భయంకరమైన ఈ సంసార సాగరమును వెంటనే దాటుటకు శ్రీ సత్యశాయి పడవను శరణము పొందుచున్నాను.

శ్లో వ్యర్ధ ప్రసంగమతి దుర్వినియోగశక్తి నిస్సార జీవ నివహోద్ధరణాయ జాతం
సృష్టి స్ధితి ప్రళయ హేతు కృత త్రిమూర్తిం శ్రీ సత్యశాయి తరుణం శరణం ప్రపద్యే

తా వ్యర్ధములైన వాక్కులు, ఆలోచనలు క్రియలతో శక్తి దుర్వినియోగము కాగా, సారమును కోల్పోయిన ఈ జీవులను ఉద్ధరించుటకు అవతరించిన వాడును, సృష్టి స్ధితి ప్రళయముల కొరకు త్రిమూర్తులైన వాడును అగు శ్రీ సత్యశాయిని తరుణ వయస్కుని, శరణము పొందుచున్నాను.

శ్లో బ్రహ్మర్షిశేఖరసముల్లస రంతరంగ కేదారపాక కరశీకర కారణాభ్రమ్
భక్తప్రమోద నవశీతల వాతహేతుం శ్రీ సత్యశాయి వరుణం శరణం ప్రపద్యే

తా బ్రహ్మర్షులలో శ్రేష్ఠులైన వారి యొక్క ఉల్లాసముతో గూడిన మనస్సులను మాగాణి భూముల పంటలను పండించు చినుకులను వెదజల్లుచున్న ఆకాశమును, భక్తులకు ఆనందమును కలుగజేయు చల్లని వాయువులనొసగుచున్న శ్రీ సత్యశాయి వరుణుని శరణము పొందుచున్నాను.

శ్లో శ్రీ శంఖ చక్ర జలజాది పవిత్ర రేఖా సంలక్షితం శ్రితజనావనబద్ధ దీక్షమ్
అజ్ఞాన రాత్రి గమనోదయ పుల్లపద్మం శ్రీ సత్యశాయి చరణం శరణం ప్రపద్యే

తా శుభమైన శంఖ, చక్ర, పద్మ, పావన రేఖలతో కూడినదియు, ఆశ్రయించిన వారిని రక్షించుటకు దీక్షను వహించి నట్టిదియు, అజ్ఞానమును రాత్రి పోయిన తర్వాత వచ్చిన ఉషః కాలమునందు ఉదయించిన పద్మమువంటిదియు అగు శ్రీ సత్యశాయి చరణమును శరణము పొందుచున్నాను.

శ్లో మాయా కలి ప్రబల కాల ఘనాఘనాభ్ర చ్చేదాగతస్ఫుట తటిత్తతి హేతి తీక్ష్ణమ్
కైవల్య మార్గకలనా సహకారి దివ్యం శ్రీ సత్యశాయి కిరణం శరణం ప్రపద్యే

తా మాయతో కూడిన ఈ కలియుగమను నల్లని మేఘములతో కప్పబడిన ఆకాశమును చీల్చుకొని వచ్చినట్టిదియు, బాగుగా మెరయు మెరపుల తీక్ష్ణ ధారయు, మోక్ష మార్గమును చూపుటలో సహాయమును చేయునట్టిదియు అగు దివ్యమైన శ్రీ సత్యశాయి కిరణమును శరణము పొందుచున్నాను.

శ్లో నానా వ్యధావికలిత శ్రిత కర్మపాక-పీడాఫలగ్రహణ దుఃఖ సుఖానుభూతిమ్
ప్రేమ ప్రసన్న జలధిం రస సార్వభౌమం శ్రీ సత్యశాయి కరుణం శరణం ప్రపద్యే

తా అనేక బాధలతో వికలితులైన భక్తుల ప్రారబ్ధ కర్మ పీడా ఫలములను తాను గ్రహించి వారి ధుఃఖమును సుఖముగా తాను అనుభవించువాడును, ప్రసన్నమైన ప్రేమసముద్రమును, నవరసములలో ఉత్తమమును, అగు శ్రీ సత్యశాయి కరుణను, శరణము పొందుచున్నాను.

శ్లోప్రేమావతార సముపాశ్రయ సాధనాంత సాయుజ్య తత్పర మహోన్నత భక్త బృందైః
ఆత్మీయ భావవిమలైః కృతమేక భాగ్యం శ్రీ సత్యశాయి వరణం శరణం ప్రపద్యే

తా ప్రేమావతారమగు తనను ఆశ్రయించి సాధనచే సాయుజ్యమును పొందగోరు ఆత్మీయ భావ విశుద్ధులగు భక్తులచే చేయబడిన అదృష్టఫలమగు శ్రీ సత్యశాయిని వరించుటను శరణము పొందుచున్నాను.
ఫలశృతి
శ్లో శ్రీ దత్తాత్రేయ భగవత్-వర్తమాన శరీరిణమ్ సత్యశాయిన మాలంబ్య కైవల్యపదవీం వ్రజేత్ శ్రీ దత్తాత్రేయ భగవత్-అష్టకం దుఃఖ నాశకమ్ సప్తర్షివాంఛయా కృష్ణ-కృతం సాధక సాధనమ్

తా శ్రీ దత్తాత్రేయ భగవానుని వర్తమానావతారమగు శ్రీ సత్యశాయిని శరణము పొందినవాడు కైవల్యమును పొందును. సప్తమహర్షుల కోరికచే కృష్ణునిచే రచింపబడినదియు, సాధకులకు సాధనమగు ఈ సత్యశాయి భగవానుని అష్టకము సర్వ దుఃఖములను నశింప జేయును.

Tuesday, March 11, 2008

దత్త కీర్తనలు

ఇతడే దత్త గురుడు - పరాత్పరుడు - నరవరుడు
మన దేహముల-ఘన మోహముల - సందేహములెపుడు (పల్లవి)

చిలికె వేదమును - పలికె గీతలను - ఒలికె భజనలును
చూపె మహిమల - చేసె బోధల - బ్రోచె భక్తుల

మాయగంతల - త్రోసి కంతల - కనుడు వింతల
సూత్రధారియౌ అత్రి పుత్రుడే పాత్రధారియగు

అవతరించును - భువిచరించును మదిహరించును
పాత్ర్రోచితపు జీవవాక్కుల పలుకుచుండును

మాయమాటల మాయ చేష్టల నటనలోలుడు
భక్తులకైన కనులఁ గప్పును మహా మాయను

ఈ చరాచర సృష్టి అంతయు వాని ఆటకే
ఆడుచిందురు జీవులెప్పుడు ఆట బొమ్మలే

వేద తైలపు ఙ్ఞాన దీపము చూపునెప్పుడు
భక్తి పధమున ఊతమిచ్చుచు నడక నేర్పును

Download this bhajan sung by Shri Dattaswami here
----------------------------

రమించు వాడెవరురా ! నిను వినా ! గురువరా ! దత్తా !
(పల్లవి)

అనేక వేషములలో - నరావతారములలో
రమింపఁ జేసి పరులన్ - రమించు చుందువెపుడున్
సహస్ర శీర్ష పురుషా - సహస్ర నేత్ర చరణా
విభిన్న పాత్ర రమణా - వినోద మోద రసికా

ఒకండవై రమణమున్ - వరించి చేసి జగమున్
రమించి సాక్షి వగుచున్ - నటింప కోర్కె కలుగన్
జగత్తు దూరితివిగా - రమించుచు న్నటుడవై
రమించు రాముడనగా - వినోదమే జగములే

స్వభక్త కర్షకుడవై - రమింప చేసి పరులన్
జగాన కృష్ణుడనగా - ప్రసిద్ధి చెందితివిగా
నిరంతరంబు జగమున్ - చరించు చుండునిటులన్
వినోదమాగదుగదా - రహస్య సత్య మిదియే

Download this bhajan sung by Shri Dattaswami here

త్యజరే టీవీం త్యజరే టీవీం

టీవీ వ్యసనాలలో అగ్రగణ్య. దానిని సన్యసించమని సాధకులకు స్వామి బోధ.
త్యజరే టీవీం త్యజరే టీవీం - టీవీం త్యజరే మూఢమతే (పల్లవి)

ఎదురుగ కాలుడు కాలపాశమును - గిరగిర త్రిప్పుచు నిలచి యుండగా
టీవీ దృశ్యములేవియు నవి నిను - రక్షింపనేర వని తెలియుమురా

కాలము శక్తియు పరిమితములుగద - వ్యర్ధముచేతువు వాటిని మూఢా
పన్నీరములను బూడిదఁ బోసిన - చివరి క్షణమున విలపింతువురా

ఎంతో శ్రద్ధగ శ్వాసను బిగించి - టీవీ దృశ్యము చూతువు జీవా !
ఆ శ్రద్ధలోన సహస్ర భాగము - దత్తుని పై నిలపిన చాలునురా

నిన్నుద్ధరించ శ్రీ గురు దత్తుడు - నరావతారమునెత్తియు భువిలో
సంచరించునిదె పదముల పట్టుము - టీవీని బద్దలు చేయుము జీవా

నీ తపమును భంగము చేయగనిదె - అప్సరసలందరును గుమికూడియె
టీవీ రూపము తాల్చిరి వలయై - నిను పట్టిరిట బయటకు రారా

కలి పురుర్షుని ధర్మ పత్ని టీవీయె - నీ శక్తి పీల్చి పిప్పిని చేయును
కాలము చంపును నిన్ను చంపునది - మానవ జీవిత మత్యల్పమురా

Monday, March 10, 2008

శ్రీ దత్త శివ పంచాక్షర మాల

1. అభిషేకప్రియ - భవాని శంకర - నమశ్శివాయ - నమశ్శివాయ
2. బిల్వార్చనరత 49. ఉపమన్యుప్రియ 96. హరినయనార్చిత 
3. భస్మాంగరాగ 50. పరమోదార 97. క్షీరాభిషిక్త
4. గంగాజలధర 51. సర్వశాసక 98. దధిఘృత సేక
5. శశాంక శేఖర 52. వేదైక వేద్య 99. మధుధారోక్షిత
6. చంద్రకళాధర 53. వేదాంత బోధక 100. సికతాభిషేక
7. కపర్ధమకుట 54.ప్రళయ భయంకర 101. ఫలరససిక్త
8. తామ్ర జటాధర 55. శ్మశాన వాసిన్ 102. గంగాభిషేక
9. ఫాల విలోచన 56. భిక్షుక వేష 103. కపాలమాల
10. విభూతి ఫాల 57. పిశాచరూప 104.ఫాలాగ్ని కుంకుమ
11. రుద్రాక్షహార 58. బాలోన్మత్త 105. పంచాక్షర హర
12. వాసుకి హార 59. మంగళరూప 106. అనన్య విక్రమ
13. పన్నగ భూషణ 60. త్రిలోక సుందర 107. ఆది గురూత్తమ
14. నీల కంధర 61. కాశీ వాస 108. తత్పురుషాస్య
15. కాలకూటగళ 62. కాల భైరవ 109. అఘోర వక్త్ర
16. తుషార ధవళ 63. పాశుపతాస్త్ర 110. సద్యోజాత
17. శూలాయుధ ధర 64. భూత నాయక 111. వామదేవ ముఖ
18.మృత్యుంజయహర 65. పినాక చాప 112. ఈశాన వదన
19. కరి చర్మాంబర 66. త్రిపురాసురహర  113. నీల లోహిత
20. వ్యాఘ్రాజిన ధర 67. రామేశ్వర గత 114. పురాణ పురుష
21. నారాయణ ప్రియ 68. అనాద్యనన్త 115. పింగళ కేశ
22. నంది వాహన 69. శ్రీశైల నిలయ 116. ప్రసాద సులభ
23. చండీప్రియతమ 70. స్వయంభులింగ 117. ద్రాక్షారామ
24. గౌరీ మోహన 71. హే వీరభద్ర 118. భీమేశ్వరహర
25. నటన మనోహర 72. ఏకాదశవిధ 119. సోమనాధ శివ
26. ఢమరుక నాధ 73. నమకానందిత 120. ఘృష్ణీశ్వర గత
27. తాండవలోల 74. స్తోత్రోత్సాహ 121. వైద్యనాధ శివ
28. కైలాసాచల 75. హనుమద్రూప 122. అమరేశ్వర హర
29. హే పరమేశ్వర 76. శంకర దేశిక 123. నాగేశ్వర హర
30. జ్ఞాన దాయక 77. ముండిత కేశ 124. శ్రీ మహాకాళ
31. ఐశ్వర్య ప్రద 78. కాషాయాంబర 125. కేదారేశ్వర
32. భక్త చిత్తహర 79. మన్మధ దహన 126. కాళీ వల్లభ
33. కిరాత వేష 80. జ్వాలా నేత్ర 127. కరుణా సాగర
34. ధ్యాన ముద్రిత 81. ఉమార్ధ దేహ 128. త్రియంబకేశ్వర
35. పంచాననధర 82. భంభం నాద 129. క్షీరపాత్ర భవ
36. మహాట్టహాస 83. సింహ గర్జన 130. విధిహరి వదన
37. అకాల మృతిహర 84. శరభావతార 131. మధ్యేశివ ముఖ
38. దక్షాధ్వర హర 85. సాయంతాండవ 132.శ్వచతుష్టయవృత
39. లింగాకృతిధర 86. రజత గిరీశ 133. ధర్మధేనుయుత
40. దేవాసురనత 87. హిమగిరి సదన 134. అనసూయాత్మజ
41. మదవృషవ్హధ్వజ 88. పాదాహతయమ 135. అత్రికుమార
42. సంగీత నిపుణ 89. మృకండుజనత 136. దత్తాత్రేయ
43. నాట్యాధి దేవ 90. పూర్ణాయుః ప్రద 137.హరహర హరహర
44. ప్రమధ గణేశ 91. ఘోరామయహర 138. భవభవ భవభవ
45. గణపతి జనక 92. దారిద్ర్య దహన 139. శివశివ శివశివ
46. కుమార తాత 93. దుఖః నాశక భవాని శంకర - నమః
47. హే కాలాంతక 94. శ్రీ యోగిరాజ శివాయ నమః శివాయ
48. ఇంద్రస్తంభక 95. తీవ్ర తపస్స్ధిర

Sunday, March 9, 2008

శ్రీ దత్త చరణ మాల

శ్రీ దత్త దేవం శిరసా నమామి (పల్లవి)

శ్రీ దత్తదేవం శిరసా నమామి - గురుదత్తదేవం వచసాభజామి
ప్రభుదత్తదేవం మనసా స్మరామి - శ్రీ దత్త దేవం శిరసా నమామి

ఓంకార మంత్రార్ధ పరమాత్మ తత్త్వం - నిర్గుణ బ్రహ్మైవ గుణరూప మాద్యమ్
అత్రి తపః ఫల దత్త మాత్రేయం - అనసూయా గర్భ వరవత్స రూపమ్
బ్రహ్మ విష్ణు శివ వదనత్రయాబ్జం - వాణీశ లక్ష్మీశ గౌరీశ మేకమ్
కోటిత్రయ సుర వట తరుమూలం - శంఖ చక్ర యుగ వైష్ణవ హస్తమ్
ఢమరు త్రిశూలక శంకరపాణిం - మాలా కమండలు బ్రహ్మకరాబ్జమ్
కాషాయ కౌశేయ కమనీయ చేలం - కటి తట పాదాంత పీతాంబరంతమ్
మేఖలార్ధోరుక శార్ధూలకృత్తిం - శునకాయిత చతురామ్నాయ పాదమ్
రక్షార్ధ మాశ్రిత గోరూప ధర్మం - కార్త వీర్యార్జున సామ్రాజ్యమూలమ్
పరశురామ శిష్య పరమాచార్యం - శంకరాచార్య చండాలవేషమ్
యోగీశ్వర యొగిరాజైక వాచ్యం - కరతలామలకాణి మాద్యష్ట సిద్ధిం
విష్ణుదత్త స్త్రోత్ర పరమానందం - సృష్ట్యాది సృష్ట్యంత నిత్యావతారం
గణపతిపరూపం స్కంద స్వరూపం - మణికంఠ రూపం మారుతి రూపం
రామకృష్ణ వీరభద్ర స్వరూపం - కాళికా రాజేశ్వరీ శక్తి రూపం
శ్రీ విద్య యంత్ర మంత్రాది బోధం - ఆదిత్యాది నవగ్రహాకారం
ఓంకార హృదయస్ధ గ్రహపతి భానుం - ఐం బీజ శంఖస్ధ పూర్ణేందు బింబం
క్రోం బీజచక్రస్ధ కుజగ్రహంతం - క్లీం బీజ ఢమరుక స్ధిత బుధకేటం
క్లూం బీజ జలపాత్ర గురుగ్రహంతం - హ్రాం బీజపదామ శుక్రగ్రహంతం
హ్రీం బీజ శూలస్థ శనైశ్చరంతం - హ్రూం బీజవామాంఘ్రి కేతుగ్రహంతం
సౌరితి దక్షిణ పాదస్థ రాహుం - దత్తాత్రేయాయ నమ ఇతి పూర్ణం
శ్రీ పాద నృసింహ సమర్ధ గురు రూపం - మాణిక్య ప్రభు సాయిస్వరూపం
సర్వ మత దేవతా సాధు జన రూపం - కలియుగే చిత్రాణి ప్రదర్శయంతం
విశ్వరూపే మధ్య వదనత్రయేక్ష్యం - స్మార్త వైష్ణవ శైవ సర్వైక దేవం
గురుశబ్ద తాత్పర్య పర్యవసానం - వేదశాస్త్ర ఙ్ఞాన పండిత రాజం
గురుశిష్య సంప్రదా యాదాచార్యం - ధీ ప్రచోదక గురు గాయత్ర్యర్ధం
మతత్రయాచార్య సిద్ధాంత మూలం - గురు చతుర్వింశతి తత్త్వయదుబోధం
వేదాంత శాస్త్ర ప్రధమాచార్యం - మునిసురాణామపి పరీక్షకంతమ్
సృష్టి స్ధితి ప్రళయ కారి త్రివక్త్రం - అష్ట సిద్ధికర మష్టై శ్వర్య దానం

ఆయురారోగ్య సంతాన వరదనం - దివ్య మంగళశోభి వరదాన మూర్తిం
జిహ్వాగ్రవక్ష శ్శరీరార్ధ శక్తిం - విద్యా మహైశ్వర్య మహిమ ప్రదానం
అష్ట సిద్ధి ప్రదానైకాధికారం - పరుశురామ చిత్త శాంతి ప్రదానం
జన్మ రహితమత ఏవదత్తాఖ్యం - దత్త పుత్ర్రాయిత నిజ భక్తవత్సం
దేవతానామేవ దావతా స్థానం - కోటీ త్రయస్త్రింశ దేవత్రిమూర్తిం
పరమహంసారాధ్య దిగంబరాంగం - సన్యాసి మోక్షార్ధ మవధూతరూపం
వాంఛిత వరదాన షడ్భుజమూర్తిం - ధనసుతాది వరద త్రిముఖస్వరూపం
భక్తి మార్గేణైవ కేవలసాధ్యం - నిర్గుణం సర్వగుణ భూతావతారం
ఙ్ఞానినం యోగినం వేద కర్మిష్టం - భక్త పరీక్షార్ధ మాయావిరూపం
చిత్ర విచిత్ర కలియుగ లీలం - సాక్షాత్పరబ్రహ్మ శబ్దార్ధమేకం
బ్రహ్మతేజో దివ్య సౌందర్య రూపం - నవకోటి మన్మధ లావణ్యాంగం
త్రితిలక కుంకుమ భస్మోర్ధ్వ పుండ్రం - బ్రహ్మచారిణమాది బ్రహ్మర్షి విప్రం
ఆచార హీనం సదాచార వంతం - కర్తుమకర్తుం వికర్తుం సమర్ధం
పరశురామాయైవ కర్మాచార్యం - మధుపాన మత్తం నమూఢైర్దృష్టం
సర్వ మంత్ర సిద్ధి ప్రదవామముష్టిం - విష్ణు దత్త శ్రాద్ధ నిమంత్రిత విప్రం
కాశీపురస్నాన కరవీరసాంధ్యం - మాహురీపురభైక్ష్య సహ్యాద్రినిద్రం
గోరక్షనాధాయ దత్తగురుగీతం - ప్రహ్లాదభక్తాయ ముక్తి ప్రదానం
మేరుదక్షిణ పీఠ ఖేచరీముద్రం - వక్షస్స్థలోద్భసి యఙ్ఞోపవీతం
కాలజటాబంధ కేశకిరీటం - స్ఫటికదామ తులసీ రుద్రాక్షహారం
మందారకుందాతసీపుష్ప మాలం - వేదశునకాఘ్రాత పాదుకాపాదం
చరణాంచిత కమల శంఖచక్రాంకం - బ్రహ్మ ముఖ రసనాగ్ర భారతీనృత్యం
వక్షస్థలస్థిత లక్ష్మీవిలాసం - రుద్రముఖవామార్ధ పార్వతీహాసం
యదుయాచనా యదు వంశావతీర్ణం - పింగళనాగాయ శంకర రూపం
ఇంద్రాయజంభాంతకరలక్ష్మీశం - బదరికావనసిద్ధ బ్రహ్మ స్వరూపం
అలర్క శిష్యాయ మాయావధూతం - శీలాఖ్య విప్రాయ సశునకవిప్రం
శ్యామారుణధవల మిశ్రమ వర్ణం - భక్తి వాత్సల్యేన దత్తసాయుజ్యం
ఆదిశేషేణాపి వక్తుమశక్యం - బృహస్పతినాపి బోద్ధుమశక్యం
శ్రీ దత్తదేవం శిరసా నమామి - గురుదత్తదేవం వచసా భజామి
ప్రభుదత్తదేవం మనసా స్మరామి - శ్రీ దత్త దేవం శిరసా నమామి

శ్రీ సుబ్రహ్మణ్య నామావళి

1. సుబ్రహ్మణ్య - నమః ఫణీశ్వర - షడాననాయ షడాననాయ
2. శ్రీ దత్త శిష్య 30. మాయూర వాహన
3. దత్తైక వేష 31. నందినమస్కృత
4. కుమార నామక 32. గణనాధానుజ
5. గౌరీ ప్రియసుత 33. రుద్రాక్షహార
6. శంకరనందన 34. సులభకోపన
7. తారకమర్ధన 35. ఆవేశపూరిత
8. జ్ఞానామృతఫల 36. అమిత పరాక్రమ
9. పళని నివాస 37. రణైక వీర
10. కైలాస సదన 38. క్రౌంచదారణ
11. వల్మీక నిలయ 39. భార్గవ విజయ
12. గోక్షీర మాన 40. ప్రణవ బోధక
13. సర్పాకార 41. రాహుశాంతి కర
14. వల్లీవల్లభ 42. కేతుగ్రహశమ
15. క్షీరాభిషేక 43. షణ్మత షణ్ముఖ
16. భస్మాభిషేక 44. కాకపక్షధర
17. చందన రసధర 45. సృత్తి దత్తసుత
18. భస్మలలాట 46. పన్నగ నాయక
19. భ్రూమధ్య కుంకుమ 47. ఆదిశక్తిసుత
20. హేశక్తి హస్త 48. కుజగ్రహాధిప
21. సద్బ్రహ్మ చారిన్ 49. భానువాసర
22. కౌపీన మాత్ర 50. మత్త శిఖిధ్వజ
23. కృత్తికోడుభవ 51. ఆశ్రిత రక్షక
24. షష్ఠీతిధిభవ 52. సర్వరోగహర
25. బాలాకార 53. శరవణ భవ
26. ఆత్యంత సుందర 54. అరుణవర్చస
27. శేషసుతాధవ 55. అష్టసర్వవృత
28. ఇంద్రాత్మజాధవ 56. శ్రీ స్వామినాధ
29. సురసేనాగ్రగ

Saturday, March 8, 2008

కనుగొంటినయా నిను గురు దైవమా

కనుగొంటినయా నిను గురు దైవమా
వేద వాక్య నిశ్చితార్ధమైన మంత్రమా
సృష్టి భరణ ప్రళయ కారణ పరబ్రహ్మమా (పల్లవి)

ధర్మ ధేనువును నడిపించు దివ్య పాశమా
మూడు ముఖముల నారు చేతుల దత్త రూపమా
బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తి మూల వేషమా

---------------

ఉద్ధర ప్రభో ! ఉద్ధర ప్రభో ! ఉద్ధర ప్రభో ! మా ముద్ధర ప్రభో !

ఉద్ధర ప్రభో ! ఉద్ధర ప్రభో ! ఉద్ధర ప్రభో ! మా ముద్ధర ప్రభో !
దత్త సద్గురో ! దత్త సద్గురో ! దత్త సద్గురో ! హే దత్త సద్గురో !
శ్రీ దత్త గురో ! శ్రీ దత్త గురో ! శ్రీ దత్త గురో !
మా ముద్ధర, మా ముద్ధర, మా ముద్ధర, పతితమ్ శ్రీ దత్త గురో !

----------------

దత్త రాజా ! ఓ దత్త రాజా !
నీ కుక్కనయ్యా నే దత్త రాజా ! (పల్లవి)

నీ పాదాంబుజ మధువులనే గ్రోలెదనయ్యా !
దత్త రాజా ! ఓ దత్త రాజా
నీ ఉచ్ఛిష్టములనే సదా భుజింతునయ్యా ! దత్త రాజా ! ఓ దత్త రాజా
నీ వెంత కొట్టినా నిను విడజాలనయ్యా దత్త రాజా ...
నీ పగ వారిని పీకెద కరచెదనయ్య దత్త రాజా ...
నీ కొరకై నా ప్రాణములనే అర్పింతునయ్యా


శ్రీ దత్త దేవం - యోగాధినాధం

శ్రీ దత్త దేవం - యోగాధినాధం - కోటి సుగుణ సుందరాయ సుందరాయ
మాయా లోలం - విశ్వపాలం - భువన సంచారి సుందరాయ

-------------------

కనిపించు దత్తా ! కనిపించు దత్తా ! కనిపించు దత్తా ! నా కండ్లకు
నీ కొరకె దత్తా ! నీ కొరకె దత్తా ! నీ కొరకె దత్తా ! నా బ్రతుకు (పల్లవి)

నీ యెడబాటు నేనోర్వలేను - ఎన్నాళ్ళు స్వామీ ! ఈ ద్వైత భావం?
నా గుండె చీల్చితి నీ కోసమేను - నీ కింక ఈ లోక సంచారమేలా?

-------------------

సదా చిత్త చోరా ! సహ్యాచల సంచారా! శ్రీ దత్త - శ్రీ దత్త - హే దత్త శ్రీ దత్త !
హే భార్గవోద్ధార ! ప్రభుదత్త దత్తా ! శ్రీ షణ్ముకాచార్య ! గురు దత్త దత్తా !

--------------------

దత్తం భావయామి ! శ్రీ దత్తం భావయామి
గురు దత్తం భావయామి ! ప్రభు దత్తం భావయామి
ధర్మోధేను రాగా - దామ్నాయా స్సారమేయాః
శంఖీ చక్ర శులీ ! ఢక్కావాన్ దామ కుండీ

--------------------

దత్తుని తలచెదము - దత్తుని పిలచెదము
దత్తుని కొలిచెదము - దత్తుని వలచెదము (పల్లవి)

కోరిక ఏమియు లేకయె - దత్తుని తలచెదము - దత్తుని పిలచెదము
దత్తుని కొలిచెదము - దత్తుని వలచెదము
ఏమీ కోరిక లేని మా తలపుకు పిలుపుకు కొలుపుకు వలపుకు కారణం?
దత్తుని పై గల - మా అనురాగం దత్తుని పై గల మా మమకారం
--------------------

దత్తం భజే గురు దత్తం భజే

దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయా ముని పుత్రం భజే ||
వాణీపతే బ్రహ్మవాణీపతే ! అత్రి అనసూయా ముని పుత్రం భజే
లక్ష్మీపతే విష్ణులక్ష్మీపతే ! అత్రి అనసూయా ముని పుత్రం భజే
గౌరీపతే శంభుగౌరీపతే ! అత్రి అనసూయా ముని పుత్రం భజే ||
---------------------------------
అనసూయ పుత్ర గురుదత్తా !
అభయంబు నిమ్ము ప్రభుదత్తా ! (పల్లవి)
కమలాయతాక్ష ! శ్రీదత్తా ! కరుణాంతరంగ ! హేదత్తా!
కమనీయ రూప! శ్రీ దత్తా ! కలివాద భంగ! హేదత్తా!
హృదయాంతరాన ధ్యానిస్తే - వెనువెంట దత్త విభుడొస్తే -
నను బ్రోవమంచు ఏడిస్తే - గురు సేవ చేయమంటాడు ||
------------------------------------
అడుగో అల్లడుగో శ్రీ గురుదత్తుడు - మూడు ముఖముల నారు కరముల |
వెలుగుచున్నాడు వేదవిదితుడు - ధర్మ దేవతయె ధేను రూపమున
కుక్కలై వేదాలు కూడి నడువగ - అడుగో పరమ పావనుడు
విచ్చేయుచున్నాడు - అడుగో అల్లడుగో ||
------------------------------------

దత్తగురువుకు దండాలు

దత్తగురువుకు దండాలు
దత్త ప్రభువుకు జేజేలు (పల్లవి)

1. సృష్టి కర్తకు - సృష్టి భర్తకు - సృష్టి హర్తకు - పరబ్రహ్మకు
2. వాణి భర్తయు - లక్ష్మీధవుడును - గౌరీ పతియగు - మూలవిరాట్టుకు
3. ఆ త్రిమూర్తులే - తన వేషములై - విశ్వమంతయును - తానొకడేయగు
4. శంఖ చక్రముల ఢమరు శూలముల కుండీ మాలల పట్టిన వటువుకు
5. అత్రిపుత్రునకు - అనసూయ పట్టికి - అనఘా ప్రియునకు - ఆనందాత్మకు
6. వేదపురుషులే - శునకాకృతులతో - పదముల, వ్రాలిన - పావన మూర్తికి
7. దర్మదేవతయే - పాహిపాహియని - గోవుగ చేరిన - విశ్వపాలునకు
8. అష్ట సిద్ధులను - వేయి చేతులను - కార్త వీర్యునకు - ఇచ్చిన స్వామికి
9. విష్ణు దత్త పితృ శ్రార్ధము నందున - భోక్తగ వచ్చిన - మంత్ర బ్రాహ్మణునకు
10. వేదశాస్త్రముల - సారము నంతయు - పిండియిచ్చిన ఙ్ఞానసాగరునకు
11. కనుసైగలతో - భోగ మోక్షముల - భక్తులకిచ్చెడి - భగవంతునకు
12. షోడశ కళలతో - పూర్ణిమ వెలుగుల - పదునారేడుల - ముగ్ధ బాలునకు
13. చిలిపి చేష్టలతో - విశ్వనాటకమును - రక్తికి చేర్చెడి - జగన్మోహనునకు
14. పరశు రామునకె - పరమాచార్యుడు - స్కంద గురువుకె-ఆధ్యాత్మిక గురువగు
15. సృష్టి స్ధితి లయ - కారణ బ్రహ్మము - మూడు ముఖముల - తానని తెల్పిన
16. వేదము చెప్పిన - నిర్వచనమునకు - పూర్ణసమన్వయ - మగు బ్రహ్మమునకు

Download this bhajan sung by Shri Dattaswami here

అంతా దత్త మయం - ఈ జగమంతా దత్త మయం

అంతా దత్త మయం - ఈ జగమంతా దత్త మయం
దత్త మయం - శ్రీ దత్త మయం
గురు దత్త మయం - ప్రభు దత్త మయం (పల్లవి)

1. పంచభూతము లంతటనుండు - బ్రహ్మమంతట దత్తుడె కలడు
నేను లేనిది నేను కానిది - ఏమున్నదిచట ఎచ్చటనైన
విశ్వ కర్తను విశ్వ భర్తను - విశ్వ హర్తను దత్తుడు నేను
సృష్టి నాటక సూత్రధారిని - పాత్ర ధారిగా అవతరించును

2. నీకై నీవుగ నను గుర్తించవు - నేను తలచిననె నను గుర్తింతువు
నా క్రీడ ఇదె నవరస భరితము - నను సేవించుము నా దాసుడవై
ప్రతిఫలమేమియు కోరక నన్నే - ప్రేమించుమిదే ముక్తికి మార్గము
నా సద్గుణముల నభిమానించుము - కారణమిదియే కావలె పూజకు

3. అష్ట సిద్ధుల అవసరమేల - సుందరాకృతికి సొమ్ములు ఏల
ఙ్ఞాన యోగమే నా సౌందర్యము - ఙ్ఞానులు వ్యక్తిని గుర్తించెదరు
ఎన్నో పాత్రల ఏక కాలమున - అభినయింతునీ చలనచిత్రమున
ఏ వేషమైన పతిని పతివ్రత - దత్తుని భక్తులు తెలుసుకొందురు

దత్తుడు నేనే - భక్తుడు నేనే - ఒక్కడే మీమీ భావ సిద్ధుడు
సత్యం నేనే - సర్వం నేనే - నిత్యం నేనే - నీవూ నేనే

Download this bhajan sung by Shri Dattaswami here

బ్రహ్మన్న నేనె, వెంకన్న నేనె, రుద్రన్న నేనె

బ్రహ్మన్న నేనె, వెంకన్న నేనె, రుద్రన్న నేనె ఓరన్నా (పల్లవి)

హనుమన్న నేనె గరుడన్న నేనె - శేషన్న నేనె ఓరన్నా
రామన్న నేనె కృష్ణన్న నేనె - రంగన్న నేనె ఓరన్నా
గణపన్న నేనె లలితమ్మ నేనె - నావేషములివి ఓరన్నా
సర్వ వేషముల దత్తుడొకడె - పరబ్రహ్మమన ఓరన్నా
మత కలహమేల? వేషధారియగు - దత్తన్న ఒకడె ఓరన్నా

భిన్న మార్గములు భిన్న దేవతలు - భిన్న జీవులకు ఓరన్నా
నానానదులును నానా పధముల - నాలుగు జలధుల పడునన్నా
నాలుగు జలధులు పేరుకు వేరగు - జలధి ఒక్కటే ఓరన్నా
సర్వమతస్ధులు విశ్వజీవులిల - నన్నె చేరుదురు ఓరన్నా
సర్వ శక్తులును కలవాడనుచు - సర్వ సమ్మతము ఓరన్నా

నిరాకారముగ సాకారముగను - ఉండగలడతడు ఓరన్నా
నిరాకారమును ధ్యానించ కష్ట - మాకారమె సులభంబన్నా
ఆకారములందున పూర్ణంబగు - నరాకారమె ఓరన్నా
దర్శన స్పర్శ సంభాషణ - సహవాస లాభమది ఓరన్నా
నరగుణములుండు బాహ్యరూపమున - లోపల తత్త్వము వేరన్నా

విద్యుత్తీగెనుచూడగ బయటకు - మామూలుతీగెయేనన్నా
మనుష్యతనువున పరమాత్మ వచ్చు - గుర్తించలేరు ఓరన్నా
శరీరగుణముల నాలోకించుచు - నరుడని భ్రమింతురోరన్నా

బ్రహ్మము నేనేరా !

బ్రహ్మము నేనేరా
పరబ్రహ్మము నేనేరా ఓ జీవా
పరాత్పర బ్రహ్మమూ నేనేరా.

నన్ను చేరిన - చేరవలసిన - గమ్యము లేదిక
లేదిక - లేదిక - లేదిక - లేదిక -బ్రహ్మము

సృష్టి కర్తను - సృష్టి భర్తను - సృష్టి హర్తను
సృష్టి అంటని - బుద్ధికి చిక్కని - భక్తి గమ్యుడ -బ్రహ్మము

ఎవ్వడు యముడు - ఎవ్వడింద్రుడు - నా భావరూపులే
నన్ను మించిన - ధర్మాధర్మము - లెచ్చట నున్నవి .. -బ్రహ్మము

నీ ఇంటిలోనే - నే కొలువుదీరి - ఉండియుంటిని
పిచ్చివాడా! నీ కాళ్ళతిప్పట - ఎందుకు ఎందుకు ? .. -బ్రహ్మము

నేను తలచిన - చిటిక లోపల - అందుకుందువు
యుగయుగ తపములు - చేసిన అందని బ్రహ్మపదవిని .. -బ్రహ్మము

నాపై దృష్టిని స్ధిరముగ నిల్పుము - తిప్పకు పక్కకు
నాదు నామము - నీదు ఊపిరి - శబ్దము చేయును .. -బ్రహ్మము

నా ఆజ్ఞలేకయే - ఎవ్వడేమియు - నీకీయలేడు
నన్నర్ధించియే - వరముల నిత్తురు - దేవదేవతలు .. -బ్రహ్మము

నన్ను తెలిసిన - వాడు ఎవ్వడు - అన్యుల చూడడు
అన్ని చివరల - చిట్టచివరి - వాడను నేనే .. -బ్రహ్మము

నీపై దయతో - స్వయముగ వచ్చితి - నీవు తరించగ
కంటిమాయ - తెరలను త్రోసి - గుర్తు పట్టుము .. -బ్రహ్మము

ఋషులును దేవులు - గుర్తు తెలియక - వెతుకుచుండగ
నీదు ఇంట - నీదు వెంట - నీదు జంట - ఉంటినే .. -బ్రహ్మము

నందనా ! ఓ నందనా !

నందనా ! ఓ నందనా! నందనా ! నా నందనా !
నందినీ ! ఓ నందినీ ! నందినీ ! నా నందినీ ! (పల్లవి)

1. చందన మేలా? పుష్పములేలా? దీపములేలా?
ధూపములేలా? నాకు నీ నైవేద్యములేలా?

2. చందనమందలి గంధము నేను - పుష్పములో పరిమళమును నేను
దీపములో ఘన తేజము నేను - ధూపములో గల సురభియు నేను
నీ నైవేద్య సారము నేను

3. అష్ట సిద్ధులను భ్రములను వీడుము - పాపలకేగద మహిమలు వింతలు
ఙ్ఞాన యోగమున గమ్యము చేరుము - ఙ్ఞాన యోగమన తెలియుట చెప్పుట

4. సర్వజీవులును నీ సోదరులేగద - మునుగుచున్నారు కాలార్ణవమున
ఉద్ధరించుము ఏ స్వార్ధము తలచక - నా మార్గ ప్రచారమె నా నిజమగు సేవ

5. ఏనాడో నిను ముక్తుని చేసితి - బంధమున్నదని భ్రమలో నుంటివి
నీవే నేనని నేనే నీవని - తెలియ చెప్పుటకు ఏతెంచితిని

6. ఒక సమయముననె నానా రూపముల - అవతరించి భువి సంచరించెదను
కనుగొన తరమె బ్రహ్మర్షులకును - గురువుగ వచ్చిన భగవానుడను

7. సామాన్యునివలె కనపడుచుందును - ఙ్ఞానులు చూచిన గుర్తింతురునను
సంశయాత్మకులు సందేహింతురు - మాయా మకరము కోరల గ్రుచ్చగ

8. నా కాలి కుక్కయె నిన్నింద్రుని చేయును - కాలభైరవుడె శ్రీ లక్ష్మీ దేవత
నా పాద సేవయె తన ఉచ్ఛ్వాసముగా - నా ప్రాణేశ్వరియె జీవించుచున్నది

9. నామ రూపముల రసమేమున్నది - నా సద్గుణముల రసమాస్వాదించుము
సద్గుణివై నా సేవకు రమ్ము - ముక్తి యనగ నిక వేరేమున్నది?

Download this bhajan sung by Shri Dattaswami here.

శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా !

శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా !
ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా ! (పల్లవి)

1. దత్త ముత్తెము చూచితివా ? బ్రహ్మానందము పొందితివా?
దత్త దీపము వెలిగినదా? మాయ చీకటి తొలగినదా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

2. దత్త నామము వింటివా? దత్త పాదము కంటివా?
దత్త దర్శనమైనదా? దత్త బోధలు ఎక్కెనా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

3. దత్త పూజను సల్పితివా? దత్తావేశము వచ్చినదా?
దత్త గానము చేసితివా? దత్తోద్రేకము కల్గినదా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

4. దత్త గద్దెను చేరితివా? దత్త ప్రభువుల మ్రొక్కితివా?
దత్త సేవలు చేసితివా? దత్త కరుణను పొందితివా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

5. బ్రహ్మ విష్ణు శివ రూపం బండీ ! ముగ్గురమ్మల తత్త్వంబండీ !
ముక్కోటి సురల మూలంబండీ ! అదియే దత్తాత్రేయం బండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

6. గణపతి షణ్ముఖ వీరుండండీ ! రామకృష్ణ హనుమానేనండీ !
సర్వ దేవతా సారం బండీ ! సర్వ సిద్ధ అవతారం బండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

7. శ్రీ పాద శ్రీ వల్లభుడండీ ! నరసింహ సరస్వతి యేనండీ !
నారాయణ మాణిక్య ప్రభువండీ ! అక్కల్ కోట మహరాజేనండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

8. సద్గురు షిరిడీ బాబా యండీ ! పుట్టపర్తి గల సాయే నండీ !
మూలవిరాట్టును గుర్తించండీ ! అందరి పూజలు అదియేనండీ !
అందరి శక్తులు అందరి మహిమలు అందరి సిద్ధులు అతడే నండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

9. ఋషులకు సురలకె జారేడండీ ! మనుజుల కెట్టుల దొరికేనండీ !
నిర్మల భక్తికి మెచ్చేనండీ ! భోగ మోక్షముల నిచ్చేనండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

10. దత్తయ్య కెదురే లేదండీ ! దత్తయ్య ఇస్తే నిలిచేనండీ !
సర్వ తపస్సుల ఫలమతడండీ ! చివరి జన్మలో చిక్కేనండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

----------------------------------------------

గురుదేవా! గురుదేవా ! శ్రీ దత్త దేవా ! గురు దేవా !

గురుదేవా! గురుదేవా ! శ్రీ దత్త దేవా ! గురు దేవా !
నీట ముంచినా గురుదేవా ! పాలముంచినా గురు దేవా !
నిన్నే నమ్మితి గురుదేవా ! నీవే నా గతి గురు దేవా !
తాళజాలనో గురుదేవా !వేగమె రమ్మో గురు దేవా !

శ్రీ దత్త సాయీ ! గురు దేవా ! శ్రీ దత్త హనుమా గురుదేవా !
శ్రీ దత్త రామా ! గురు దేవా ! శ్రీ దత్త కృష్ణ ! గురు దేవా !
శ్రీ దత్త బ్రహ్మా ! గురు దేవా ! శ్రీ దత్త విష్ణూ ! గురు దేవా !
శ్రీ దత్త రుద్రా ! గురు దేవా ! గురు దేవ గురు దేవ గురు దేవా !
దత్తాత్రేయా ! గురు దేవా !

శ్రీ హనుమన్నామావళి

1. అంజనీ తనయ - నమో హనూమాన్ - కపీశ్వరాయ - కపీశ్వరాయ
2. పవన కుమార 29. రామవాహన
3. బ్రహ్మ భవిష్య 30. వాలివధ ప్రియ
4. విష్ణు స్వరూప 31. సాగర లంఘన
5. రుద్రావతార 32. మైనాక పూజిత
6. శ్రీ దత్త రూప 33. సింహికాదళన
7. దత్తైక వేష 34. లంకిణీ దమన
8. రాక్షస మర్దన 35. సీతాన్వేషక
9. పిశాచ భంజన 36. అశోకవనగత
10. పింగళ లోచన 37. సీతాదర్శన
11. కాంచనవర్ణ 38. జ్వాలాగ్నివాల
12. మేరు శైల సమ 39. లంకాదహన
13. హేమదుకూల 40. రామభాషణ
14. యజ్ఞోపవీతిన్ 41. శ్రీ రామదూత
15. బాహుస్తంభ 42. రామపాదనత
16. అంసగదాధర 43. లక్ష్మణ వాహన
17. స్వర్ణకుండల 44. ఇంద్రజిత్సమర
18. మాణిక్య మకుట 45. సంజీవి గమన
19. కుంచిత కేశ 46. సంజీవి గిరిధర
20. ఊర్ధ్వ త్రిపుండ్ర 47. సౌమిత్రి బోధక
21. వ్యాకరణజ్ఞ 48. రావణ వధరత
22. భాస్కర శిష్య 49. పుష్పక గోచర
23. గిరియుగ పదయుగ 50. రామరాజ్యప్రియ
24. మేఘ గర్జన 51. రామరాజ్యచర
25. ఉగ్రపరాక్రమ 52. శ్రీరామ భక్త
26. సుగ్రీవ సచివ 53. హే జ్ఞాన శేఖర
27. సుగ్రీవ రక్షక 54. భక్తాగ్రగణ్య
28. రామానయన 55. హేయోగిరాజ

Friday, March 7, 2008

కొండక్కవె అనఘ కొండెక్కవె

కొండక్కవె అనఘ కొండెక్కవె
నీ పక్కనే ఉండి ఎక్కింతునే (పల్లవి)

1. ఏడవ కొండను ఎక్కినచో - నీవూ నేనే మిగులుదుము
సర్వ బంధములు తెగిపోవగ - భగవద్భంధమె మిగులునుగా

2. మొదటి కొండయదె తల్లి పాశము - మూలాధారం పృధివీ తత్త్వం
జననీ స్థానం మాయా గర్భం - చక్రం బంధం - పరిభ్రమన్తం
అతిక్రమించుము వక్ర గమనా !

3. రెండవ కొండయె తండ్రిపాశము - మణిపూరాఖ్యం చాంభస్తత్త్వం
జనక స్థానం మాయా స్నేహం - చక్రం బంధం - పరిభ్రమన్తం
అతిక్రమించుము వక్ర గమనా !

4. మూడవ కొండయె వైవాహికంబు - స్వాధిష్టానం వహ్నేస్తత్త్వం
కామస్థానం పరిభ్రమన్తం - చక్రం బంధం మాయా చేష్టం
అతిక్రమించుము వక్ర గమనా !

5. నాల్గవ కొండయె సంతాన ప్రేమ - అనాహతాఖ్యం వాయోస్తత్త్వం
పుత్ర స్థానం పరిభ్రమన్తం - చక్రం బంధం మాయాలీలం
అతిక్రమించుము వక్ర గమనా !

6. ఐదవ కొండయె నరగురు సేవలు - విశుద్ధముక్తం గగనం తత్త్వం
నరగురు భూమిం పరిభ్రమన్తం - చక్రం బంధం మాయా బోధం
అతిక్రమించుము వక్ర గమనా !

7. ఆరవ కొండయె సురలు వేషములు - ఆఙ్ఞాఖ్యాతం మానస తత్త్వం
చక్రం బంధం మాయారూపం - దేవస్ధానం పరిభ్రమన్తం
అతిక్రమించుము వక్ర గమనా !

8. మాయాబంధముల మాయచేతనే - దాట కుండలిని వంకరగతియదె
కుండలినియన్న చైతన్య శక్తి - జీవతత్త్వమె నడకయె సర్పము

9. సహస్రారమె బుద్ధి స్ధానము - సహస్ర దళములె ఙ్ఞాన జ్యోతులు
ఏడవ కొండన అదియె అనఘా - పూర్ణ పద్మమదె నీ పూర్ణ పదము

10. నీనా బంధము ఒక్కటియె మిగులు - చక్రాల దాట అఘమే కాదది
అనఘా ! కొండల నారింటినెక్క - ఆరు చక్రముల దాటుట సారము

11. మధుర భక్తిచే మధుమతియగుదువు - తీవ్రాకర్షణ జలపాతమదే
నా అనుగ్రహము కల్గిన గానీ - మధుమతి భావము పుట్టదు జీవికి

12. యోగ శాస్త్రమున చక్రములనగా - ఆరుకొండలన అంతరార్ధమిదె
యోగి రాజుకే తెలియును యోగము - పిచ్చి గురువులే బొమ్మలనమ్మిరి

13. మాయ ప్రేమలివి స్వార్ధ లక్ష్యములు - తమ సుఖములకే నిను ప్రేమింతురు
సంసార వార్ధి సుడిగుండములివి - ఈదువానినే ఆకర్షించును

14. పరిభ్రమింపగ చేయును చిక్కగ - వినోద సుఖమును కలిగించు కొంత
ముంచి వేయునే తుదకు దుఃఖమే - మృత్యువుపాలై పోదురు జీవులు

15. సారము తెలియని పండిత మూఢులు - చక్రములనగా పద్మములందురు
దళముల బీజాక్షరముల వ్రాయుచు - పిచ్చి బొమ్మలను ఊహించుతురచట

16. పంచభూతములు మనస్సు కలిసి - ఈయారు సృష్టి చక్రములివియే
పాంచభౌతికము మానసబంధము - భ్రమ కారణమగు భ్రమించు చక్రము

17. పంచభూతముల జగత్తునందే - మనో బంధమే ఆరు చక్రములు
మాయ ప్రేమతో సంతృప్తి పరచి - మనస్సునంటక ప్రవర్తించుటే
కుండలిని వక్ర గమనమందురే

18. కన్నులు మూయుచు చక్రాలలోన ఉన్న రీతిగా ఊహించి శిశివు
వాటిని దాటగ యత్నించునహహ! ఏమందునే ఈ వెర్రి చేష్టలను - పిచ్చి
గురువులే ! పిచ్చి శిష్యులే !

19. యోగిరాజునే దత్తాత్రేయుని - శరణము జొచ్చుము వివరించునతడు
నరగురువు వేరు నారాయణుడగు - సద్గురువు వేరు వదలక పట్టుము

20. చిక్కడు దొరకడు టక్కరి దొంగయు - దత్తాత్రేయుడు మాయావేషుడు
గుర్తించి పట్ట విదిలించు నతడు - జారిపోవునే బ్రహ్మర్షులకును

21. సామన్యునువలె నుండును చిక్కడు - చిక్కించుకున్న అధముని వలెనగు
అధమాధముడై నటించు చేష్టల - పట్టు సడలగా పరుగెత్తి పోవు

22. స్ధిర విశ్వాసము చెదరని భక్తికి - లొంగి పోవునె శ్రీ దత్త గురువు
బోధించునతడు సర్వ రహస్యము - యోగ్యతనుండిన పరీక్షించియే

23. యోగ శాస్త్రమన భగవద్యోగము - సంసారబంధ విచ్ఛేదంబే
చక్రాలదాటి పోవుటయనగా - సహస్రారమె భగవత్సన్నిధి

24. ఈ రహస్యమును నీకు చెప్పితిని - నా ప్రియసతియగు అనఘవు కావున
సురలును మునులును ఈ సారమునిటు - తెలియక నుంటిరి అనఘ ధన్యవే

Download this bhajan sung by Shri Dattaswami here

షట్చక్రములు

(షట్చక్రములను గురించి స్వామి ఎంత విపులముగా వివరించారో విని తరింతుము గాక.)
ఏడవ కొండనె నీవుండినావు
మొదటి కొండనె ఎక్కగ లేదు
ఏదు కొండలను ఎప్పుడెక్కెదను ?
నా వల్ల కాదింక నారాయణా
నీ కరుణ లేక నేనెక్కలేను (పల్లవి)

1. మొదటి కొండయె మూలాధారము - భూమి తత్త్వమిది మాతృస్ధానము
రెండవ కొండయె మణిపూరమగు - జల తత్త్వంబది జనక స్ధానము

2. పృధివీ జలములు కలసిన పుట్టును - సర్వ వృక్ష తతి జీవోద్భవమది
ఆకాశ మేఘ సంభవ జలమగు - భూమ్యాకాశము లంబయు తండ్రియు

3. మూడవ కొండయె భర్తృ స్ధానము - భార్యా స్ధానము స్త్రీ పురుషులకిల
అగ్ని తత్త్వమది స్వాధిష్టానము - కామ క్రీడలు వేడి వల్లనగు

4. నాల్గవ కొండయె సంతానమగును - వాయు తత్త్వమది అనాహతము
హృదయమునందున ప్రేమావేశము - సంతాన బంధ మచ్ఛేద్యమగుట

5. ఐదవ కొండయె నర గురు బంధము - ఆకాశపధము విశుద్ధ చక్రము
కంఠ స్ధానము గురువు పల్కునిల - గళమున మాటల గారడి చేయును

6. ఆరవ కొండయె నానా దేవులు - మనో రూపులుగ ఆఙ్ఞాచక్రము
దత్త వేషములు వరములనిత్తురు - వేషి దత్తుడు జారిపోవును

7. ఏడవ కొండయె సహస్రారమగు - బుద్ధి ఙ్ఞానము శీర్షమునందున
దిగంబరుండగు దత్తుడుండునట - దిగంబరుండన నిజ వేషధారి

8. కుండలినిని నేను జీవతత్త్వమగు - చిజ్జడమిశ్రమ శక్తి తరంగము
అనఘయు మధుమతి దత్త ప్రేయసి - సర్వ జీవులును కుండలిని లేను

9. ఆరు కొండలను వంకర గతితో - దాటి పోవవలె మాయా చేష్టల
మాయా బంధము లివియె చక్రములుగ - ముల్లు తీయవలె ముల్లు సాధనము

10. మాయాకర్షణ బంధచక్రముల - దాటి మాయతో నిన్ను చేరవలె
యోగశాస్త్రమన ఇదె తాత్పర్యము - బొమ్మ చక్రములఁ దలతురు మూఢులు

శ్రీ దత్త నామావళి

పరమబ్రహ్మన్ - దత్తనమోగురు - గురూత్తమాయ - గురూత్తమాయ |
1) వేదప్రమాణిత - దత్తనమోగురు
2) సృష్టి, స్థితి, లయ 27) కుంకుమ తిలక 52) సహ్యాద్రిశయన
3) ఏకాద్వితీయ 28) ఊర్ధ్వ త్రిపుండ్ర 53) ధరణి సంచార
4) ఓంకారవాచ్య 29) విభూతిపాల 54) భార్గవ సేవిత
5) అకార విధిముఖ 30) స్ఫటికాక్షమాల 55) అలర్క వందిత
6) ఉకార హరిముఖ 31) తులసీ మాల 56) పింగళ పూజిత
7) మకార శివముఖ 32) రుద్రాక్షమాల 57) మాయావధూత
8) అనఘా వల్లభ 33) శ్రీపాద వల్లభ 58) విశ్వంభరాఖ్య
9) హే యోగీశ్వర 34) నృసింహ సరస్వతి 59) శ్యామకామలాక్ష
10) హే యోగిరాజ 35) మాణిక్య ప్రభువర 60) త్రివదన షడ్భుజ
11) యోగోపదేశిక 36) స్వామి సమర్ధ 61) అత్రివరద
12) యోగాధిదేవ 37) శిరిడీ శాయిన్ 62) అణిమ సిద్ధికర
13) అనసూయత్మజ 38) శ్రీ పర్తి శాయిన్ 63) మహిమ సిద్ధికర
14) అత్రి కుమార 39) హే ప్రేమ శాయిన్ 64) లఘిమ సిద్ధికర
15) ఆనంద రూప 40) శ్రీ శేష శాయిన్ 65) గరిమ సిద్ధికర
16) ఆద్యంత రహిత 41) క్షీరాబ్ధి శయన 66) ప్రాప్తి సిద్ధికర
17) శృతి శునకాంఘ్రే 42) హిమాలయశ్రయ 67) కామ్య సిద్ధికర
18) గోధర్మ సంగత 43) హే పద్మ పీఠ 68) వశిత్వ సిద్ధికర
19) మధ్యే విధిముఖ 44) రాజీవలోచన 69) ఈశిత్వ సిద్ధికర
20) మధ్యే హరిముఖ 45) లలాట నేత్ర 70) అష్టసిద్ధి సుత
21) మధ్యే శివముఖ 46) తేజస్వి నయన 71) త్రేతాయుగేక్షిత
22) శంఖ చక్రధర 47) బ్రహ్మ వర్చస 72) మార్గశీర్షగత
23) ఢమరు త్రిశూల 48) మహర్షి నాయక 73) పూర్ణిమాకలిత
24) కుండ్యక్షమాల 49) కాశీస్నాత 74) ఉషనిషదుక్త
25) త్రిమూర్తి వదన 50) కరవీరసాంధ్య 75) విశ్వరూపాంతర
26) షట్కర శోభిత 51) మాహురిభిక్షుక 76) గీతాబోధక
77) యోగీశ్వరోక్త
78) బ్రహ్మ సూత్రార్ధ
79) జ్ఞాన సముద్ర
80) గురుకుల తిలక

శ్రీ విష్ణు నామావళి

లక్ష్మీ వల్లభ - నమో రమాపతి - నారాయణాయ - నారాయణాయ
తులసీదళరత - నమో రమాపతి - నారాయణాయ - నారాయణాయ
1) క్షీరాబ్ది శయన 27) నవనీత ప్రియ   53) ఖగపతి కేతన
2) గరుడ వాహన
28) వ్యాసావతార
54) హనుమదర్చిత
3) శంఖచక్ర ధర 29) కపిలావతార 55) తుంబురు గీత
4) పీతాంబరధర 30) విశ్వపాలక 56) సప్తగిరీశ్వర
5) కౌస్తుభ హార 31) హే మధుసూధన     57) ధర్మ రక్షణ
6) కమల లోచన 32) సౌందర్యార్ణవ 58) అధర్మ ఖణ్డన
7) మేఘశ్యామల 33) కమలా రమణ 59) శఙ్కర ప్రియతమ
8) ఊర్ధ్వత్రిపుండ్ర 34) రాధామోహన 60) రామానుజభవ
9) స్మరశత సుందర   35) గోవర్ధన ధర 61) బలరామానుజ
10) మీనాంశు నయన     36) మురళీలోల 62) లక్ష్మణ పూర్వజ
11) విలాస గమన 37) పింఛావతార 63) శార్ఙ్గ ధనుర్ధర
12) శేషతల్పశయ 38) గోపీలోల 64) కౌమోదకీకర
13) మత్స్యావతార 39) కాళీయ దమన 65) నన్దకాసికర
14) కూర్మావతార 40) విశ్వరూపధర 66) ప్రహ్లాదావన
15) వరాహరూప 41) ముక్తాహార 67) రావణ నాశక
16) హే నారసింహ 42) కాళీయ తాణ్డవ 68) శిశుపాలాన్తక
17) వామనరూప 43) వైకుణ్ఠవాస 69) వనమాలాగళ
18) భార్గవరామ 44) శ్యామమురారే 70) హే కంసాన్తక
19) శ్రీ రామ దేవ 45) మధురానాయక 71) దశరధ తనయ
20) శ్రీ కృష్ణ భగవన్ 46) ద్వారవరీశ్వర 72) కౌసల్యాత్మజ
21) బుద్ధాకృతి ధర 47) కాఞ్చన కుణ్డల 73) హే దేవకీ సుత
22) కల్కిరూప ధర 48) కనక కి్రీట 74) నవనీత చోర
23) దశావతార 49) హే సత్య దేవ 75) వకుళానన్దన
24) శేషాద్రివాస 50) నారద కీరిత 76) యశోదయోర్జిత
25) గోవిన్దాహ్వయ 51) పరమ పురుష 77) నిగమైక వేద్య
26) హేగోపాలక 52) పక్షిరాజరధ 78) శ్రీ వాసుదేవ