Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, May 19, 2008

దత్తస్వామి దివ్యవాణి

ఙ్ఞానమె దీపము, భక్తియె మార్గము నీ దయ నడవగ ఊపన్నా, దీపహీనుడును మార్గమునందున లక్ష్యము చేరును వెంకన్నా.

ఙ్ఞానము మూల కారణము. భక్తి ప్రాప్తి కారణము. సేవ (కర్మ) ఫల స్వరూపము. ఈ మూడింటిని క్రమముగా శంకర రామానుజ మధ్వ రూపాలలో దత్త భగవానుడు యీ లోకములో ఉపదేశించినారు. కృష్ణుని గుణములను విని, కృష్ణుని గురించిన ఙ్ఞానము వలన రుక్మిణి కృష్ణుని యందు ఆకర్షిత అయ్యెను. కావున బ్రహ్మ ఙ్ఞానము అనగా ఙ్ఞాన యోగము మూలకారణము. ఈ ఆకర్షణ రూపమైన, భగవంతుని పొందాలనే తపనయే భక్తి. ఇట్టి తపన ద్వారా కృష్ణుని రుక్మిణి పొందగలిగినది కావున భక్తియే ప్రాప్తి కారణము. " భక్త్యా త్వనన్యయా లభ్యః " అని గీత. "అనన్య భక్తికి నేను లభిస్తాను", అని దీని అర్ధము. శంకరులు సైతం "మోక్షసాధన సామగ్ర్యాం, భక్తి రేవ గరీయసీ" "భక్తిఃకింనకరోత్యహో!" అని భక్తియే అత్యుత్తమ సాధనమనియు, భక్తి దేనినైనా సాధించగలదనియు ప్రస్తుతించినారు. భక్తి ద్వారా పరమాత్మను పొందిన తరువాత, స్వామిని సేవించే భాగ్యమే (సేవా) కర్మ యోగము. సేవ భక్తికి నిరూపణము. ప్రాప్తి తరువాత రుక్మిణి పరమాత్మ యొక్క పాదసేవను చేసినది.

శబరి, తిన్నడు మొదలగు భక్తులు ఙ్ఞానము లేకపోయినా భక్తి ద్వారా పరమాత్మను పొందినారు. వారికి పూర్వ జన్మలలో యీ ఙ్ఞానయోగము లభ్యమైనదని అర్ధము. కావున భక్తి యున్నచో ఙ్ఞానమున్నట్లే. ఙ్ఞానమున్నచోట భక్తి జనింపక తప్పదు కావున భక్తి ఉన్నట్లే. ఙ్ఞాన పరాకాష్ఠయగు శంకరులను, భక్తి పరాకాష్ఠయగు మీరను పరమాత్మ సశరీరంగా ఐక్యము చేసుకున్నారని ప్రసిద్ధి.

"యానః ప్రీతిర్విరూపాక్ష" అను శ్లోకము లౌకిక విషయములందున్న ప్రేమయే భగవంతునియందున్న భక్తి యనబడునని చెప్పుచున్నది. ఈ భక్తియే పరాకాష్ఠకు చేరినచో పరాభక్తియనబడును. ఈ స్ధితిలో స్వామిపై పరిపూర్ణ ప్రేమయుండి, ఎట్టి విమర్శయు తర్కము స్వామియందు సహించజాలని విపరీత వ్యామోహము ఏర్పడును. ఈ దశలో స్వామి ఆగ్రహము కూడ మహాప్రసాదముగా భావించు పరిస్ధితి ఇది. ఇదే నవవిధ భక్తులలోని చివరిదియగు ఆత్మనివేదనము. మనోవాక్కాయములే ఆత్మ యనబడును. ఇదే త్రికరణార్పణము. ప్రతి వ్యక్తితోను ప్రతి వస్తువుతోనుగల బంధములన్నియు తెగిన పూర్ణముక్తి ఇదే. స్వామి బంధము ఒక్కటే మిగిలిన కైవల్యమిదే. ఇదే భక్తి యొక్క దశావస్థలలోని "ఉన్మాదము" అనగా బ్రహ్మ పిచ్చి. ఈ ఉన్మాదములో స్వామి తప్ప, లౌకిక వస్తువుగానీ, లౌకిక వ్యక్తిగానీ, ధర్మాధర్మ విచికిత్స గానీ, నరకాది భయములు కానీ ఉండవు. ఇదే అవధూతావస్థ. ఇది గోపికలకు కలిగెను.

ఙ్ఞానయోగమునకు సద్గ్రంధములు సత్సంగములు ఎట్లు సాధనములో, భక్తి యోగమునకు భజన పాటలు అట్టి సాధనములు. భక్తి సూత్రకర్త యగు నారదుడు వీటిని సదా కీర్తించుటచేత దేవాసురులకును పూజ్యుడయ్యెను. అసురులు అనగా దుష్టులు సైతము వీటి వలన ప్రభవితులగుదురని అర్ధము. నారదుడు భక్తి అనిర్వచనీయమన్నాడు. "జారవచ్చ" "యధావ్రజగోపికానాం" అను సూత్రములలో జారుని యొక్క లోలత్వము (నిష్ఠ) తో సమానమైనది భక్తి యని, భక్తులకు ఉదాహరణముగా గోపికలను పేర్కొన్నాడు. "తన్మయాహితే" అను సూత్రములో భక్తులలో భగవంతుడు ఆవేశించి కైవల్య భావము అనగా తానే వారు, వారే తాను అనునట్లు ఉండునని చెప్పినాడు.

సంసార బంధములను ఆరు కొండలను దాటి, కేవల భగవద్బంధమనే ఏడవ కొండనెక్కి అచటనున్న భక్తి యను కోనేరు గంగలో ఒక్కసారియైన మునక వేయని జీవుని జీవితము వ్యర్ధము. ఒకసారి మునకేతునా - నా ప్రాణనాధా అనే భజనతో భక్తి గంగలో ఒక్కసారి అయినా మునగండి.

దత్తస్వామి
జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి

You can find discourses of swami in english on universal spirituality at webstite:http://www.esnips.com/user/dattaswami
At the lotus feet of Shri Dattaswami
-Prasad

శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా

శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా - ప్రభు దత్తన్నా - నా దత్తన్నా (పల్లవి)

సృష్టిస్థితిలయ - కారకులుండగ - త్రిమూర్తులొక్కటే - బ్రహ్మమెట్లగును
అని తపముచేయు - అత్రి మహర్షికి - త్రిముర్తి ముఖముల - కనిపించినావు

సృష్టి,స్థితి,లయ - కారణమొక్కటే - వేదము చెప్పిన - పరమబ్రహ్మము
త్రిమూర్తి తత్త్వం  - దత్తాత్రేయమె - పరమ్రహ్మమన - వేదసిద్ధమిది.

వేషాలు వేరు - నామలు వేరు - పరబ్రహ్మమను - వ్యక్తి ఒక్కడగు
నానాపాత్రల - ధరించునటుడవు - రమించువాడవు - నీవేనన్నా

బ్రహ్మన్న నీవే - హరియన్న నీవే - రుద్రన్న నీవే - భైరవన్నవును
రామన్న నీవే - కృష్ణన్న నీవే - గణపన్న నీవే - వీరన్న నీవే

వెంకన్న నీవే - మల్లన్న నీవే - నరసన్న నీవే - అయ్యప్పన్నవు
హనుమన్న నీవే - గరుడన్న నీవే - శేషన్న నీవే - సుబ్బన్న నీవే

వాణమ్మ నీవే - లక్ష్మమ్మ నీవే - గౌరమ్మ నీవే - దుర్గమ్మ నీవే
అనఘమ్మ నీవే - లలితమ్మ నీవే - భ్రమరమ్మ నీవే - పద్మమ్మ నీవే

రుక్కమ్మ నీవే - సత్యమ్మ నీవే - రాధమ్మ నీవే - సీతమ్మ నీవే
అరుంధతమ్మ నీవే - అనసూయమ్మవు - కాళెమ్మ నీవే - సువర్చలమ్మవు

సర్వదేవతలు - సర్వగ్రహములు - సర్వావతార - సర్వసిధ్ధులును.
నీ రూపములగు - నీ వేషములే - నీ గుణములైన - నీ భావములే

ఏ దేవరూప - మైనను వేషమె - వేషధారియగు - దత్తుడొకడే
ఏ వేషమైన - మాలలు వేసిన - వేషధారికే - ప్రీతిని చేయును.

నదీనదములెటు - కదలిని చేరునో - నానాదేవత - భజనలన్నియును
నిన్నే చేరగ - ఆనందితువు - ప్రత్యుత్తరమును – ఇత్తువు నీవే

సకల చరాచరా - జగత్తు భార్యయే - సర్వజీవులును - స్త్రీ రూపములే
పురుషడ నీవే - వేదము పల్కును - సర్వ భర్తవై - ఆడుచున్నావు.

Download this bhajan sung by Shri Dattaswami here.

శ్రీ దత్త గణపతి భజన

శ్రీ దత్తగణపతిం భజే - ఉన్మత్త నటన తాండవమ్
మత్తేభవదన భాసురం - చిత్తాబ్జ బోధ భాస్కరమ్

ఆయత్త యోగరజితం - విత్తేశ నిత్యపూజితమ్
ఉత్తనపాణి ముద్రితం - శ్రీకృత్తి వాసస స్సుతమ్

కైలాస దృషది నర్తనం - భక్తాంతరంగ వర్తనమ్
పాపౌఘ పాశకర్తనం - శ్రీ పార్వతీసుతం భజే

లంబోదరాంగ తాండవం - ముద్రాకరాబ్జ పండితమ్
సర్వాంగ నాగమండనం - వందే వినాయకం పతిమ్

దింధిమ్మి తకిట మర్దలం - భంభం నినాద శంఖకమ్
ఆనంద నృత్యతత్పరం - ధ్యాయామి ప్రమధనాయకమ్

ఆమోదకరమోదకం - వేదాంతమతి మాదకమ్
దుష్కర్మ ఫల సాదకం - విఘ్నేశ్వరం గురుం భజే

సృష్టి స్థితి లయ కారణం - మూషాఖ్య దైత్య మారణమ్
సంసర జలధి తారణం - స్తౌమి ప్రభు నరవారణమ్

పంచాస్య మాది దైవతం - దేవర్షిభి స్సమర్చితమ్
ఆలోక గళిత సంచితం - విఘ్నాధి నాధ మాశ్రయే

లోకైక పరమ వైభవం - లోకేశ్వరాది సంభవమ్
ఆలోక పరిహృతోద్భవమ్ - ఆలోకయే పరంభవమ్

శ్రీకృష్ణ కవి నివేదితైః - శ్లోకాఖ్య మోదకై రిమైః
ఆనంద గణపతిం పతిం - ఆరాధయంతు సాధకాః
------------
Download this bhajan sung by Shri Dattaswami here.

Saturday, May 17, 2008

శ్రీ వాణీ కీర్తన

భజరే వీణా పాణిం - వాణీమలికుల వేణీమ్
ఏణీక్షణ సుమ బాణాం - శోణాధర కర కోణామ్ (పల్లవి)

కమలాసన ఘన కామాం - విధిరామా మభి రామామ్
శమదమ సుగుణ స్తోమాం - ఘుమ ఘుమ సౌరభ భామామ్

శరదమలా మజ లోలాం - సత్కవికుల నిజ బాలామ్
గలకలిత కమల మాలాం - సువిలసిత తిలక ఫాలామ్

హంసయాన చల దంసాం - హంస వాహనోత్తంసామ్
హంసీంద్యుతిజిత హంసాం - హంసక కలపిక హింసామ్

గద్యపద్య రసవిద్యాం - మద్య హృద్య మధు వాద్యామ్
ఆద్యాముద్యత్సద్యో - విద్యుద్ద్యుతి మనవద్యామ్

క్వణీత కచ్ఛపీం హస్తే - న్యస్త సుపుస్తక మాలామ్
ప్రశస్త మస్తాభ్యస్తాం - స్తుతిభిస్తతా మనస్తామ్

సంగీత మంగళాంగీం - శృంగార శృంగరంగామ్
భృంగాలక నవభంగీం - బ్రహ్మసంగ రసగంగామ్

ఇందిందిర చందనరుచి - కుందేందు మందహాసామ్
ఆనంద మరందాబ్ధిం - ఇందిరాస్నుషాం వందే

Download this bhajan sung by Shri Dattaswami here.

బ్రహ్మ గాయత్రీ (స్వామి వాణి): గాయత్రి అర్ధము

బ్రహ్మ దత్త కీర్తనలు.
బ్రహ్మ గాయత్రీ (స్వామి వాణి).
గాయత్రి అనగా గానాత్మకమైనది. మంత్రము అనగా మననమునకు అప్రయత్నముగా ఆకర్షించి పదే పదే ఉచ్చరింపచేయునది. "గాయత్రీ ఛన్దః " అన్నాము. అనగా గాయత్రి అను పేరు ఛందస్సులో పాడబడిన దేవత ఎవరు? సవితా దేవతా అన్నాము. సవితయే దేవత. సవిత అనగా చరాచర జగత్తును ప్రసవించు (సృష్టించు) వాడని అర్ధము.అనగా బ్రహ్మదేవుడని అర్ధము. గాయత్రి, సావిత్రి, సరస్వతి అను మూడు సంధ్యాకాల దేవతలే బ్రహ్మదేవుని భార్యలని బ్రహ్మ పురాణము. బ్రహ్మగాయత్రి అనగా-దేవతయగు బ్రహ్మదేవుడు గాయత్రి ఛందస్సులో గానము చేయబడిన వాడని అర్ధము. చంపకమాల ఛందస్సులో కృష్ణుడు కీర్తింప బడినచో ఆ పద్యార్ధము కృష్ణుడా? లేక చంపకమాలయగు దేవతయా? అట్లే గాయత్రి ఛందస్సులో కీర్తింపబడిన బ్రహ్మదత్తుడే దేవతకాని, గాయత్రి యను దేవత కాదు. దేవతను విస్మరించిన మంత్రము వ్యర్ధము కావున బ్రహ్మతేజస్సు అంతరించినది. మనస్సు-బుద్ధి-వాక్కులకు, పూజలకు బ్రహ్మము అందదు. అనగా పూజ లేనిది అని కాదు. జగత్తు యొక్క సృష్టి, స్ధితి, లయములను చేయు దత్తుడే బ్రహ్మము. ఆదత్త బ్రహ్మమే త్రిమూర్తి వేషములలోనున్నది.

పరబ్రహ్మపరమై, గానాత్మకమై, మనస్సును ఎట్టి ప్రయత్నము లేక ఆకర్షించి పదే పదే ఉచ్చరింపచేయునది ఏదియైనను గాయత్రీ మంత్రమేనని శ్రీదత్త మతము.

భజ భజ దత్తం - భజ భజ దత్తం (పార్ట్-2)

14. త్రిమతాచార్యైః పఠ్యమానాన్ - తత్తన్మతమయ భాష్యవాదాన్
శ్రుత్వా సిద్ధాన్తార్ధ మన్త్యం - సమన్వయమతం వాచయన్తమ్

(త్రిమతాచార్యులగు శంకర-రామానుజ-మధ్వులు తమతమ మతానుసారములగు తమ తమ భాష్యవాదములను వినిపించు చుండగా వినుచు చివరకు త్రిమత సమన్వయమగు మతమును తన చరమ సిద్ధాంతముగా పలుకుచున్న దత్తుని భజింపుము).

15. వేదాన్తానా మన్తి మార్థం - వేదాన్తార్థం బోధయన్తమ్
ఋషిభిః పరితో భాషమాణం - శాస్త్రార్ధేషు వ్యఞ్జితేషు

(ఉపనిషత్తులుయొక్క అంతిమసారమైన వాడును, ఉపనిషత్తుల అర్ధమును బోధించుచున్నవాడును, నిగూఢమైన వ్యంగ్యములగు శాస్త్ర విషయములను చుట్టు చేరిన ఋషులు అడుగుచుండగ చెప్పుచున్న వాడును అగు దత్తుని భజింపుము).

16. ఆయుధవర్జిత పాణిపద్మం - వాచైవారిం మారయన్తమ్‌
కర్మఫలాని లలాటపత్రే - లిఖన్త మాయు ర్దాయ దానమ్

(తన కరకమలమున ఎట్టి ఆయుధములేనివాడును, వాక్కు చేతనే శత్రువులను చంపగలవాడును, లలాట పత్రమునందు కర్మఫలములను లిఖించువాడును, ఆయుర్దాయమును ప్రసాదించువాడును అగు దత్తుని భజింపుము).

17. ఆచార్యేన్ద్రం వాక్ప్రచారం - భువిసంచారం నిర్విచారమ్
ఖలాభిచారం సదాచారం - సురపరిచారం చిత్తచోరమ్

(ఆచార్యేంద్రుడును, వాక్కుతో జ్ఞానప్రచారమును చేయుచున్న వాడును, భూమినంతయును సంచరించుచున్నవాడును, విచార రహితుడును, దుష్టులను సంహరించువాడును, వైదిక సదాచార వంతుడును, దేవతలే పరిచారకులుగ కలవాడును, చిత్తచోరుడును అగు దత్తుని భజింపుము).

18. పద్మ సంభవం పద్మపీఠం - పద్మ సుగన్ధం పద్మవర్ణమ్
పద్మాపుత్రం పద్మ నేత్రం - పద్మ సుపాణిం పద్మ పాదమ్

(కమల సంభవుడును, కమలాసనుడును, కమల సుగంధములను వెదజల్లువాడును, కమలకాంతిగలవాడును, కమలయొక్క పుత్రుడును, కమలనేత్రుడును, కమలపాణియును, కమలచరణుడునగు దత్తుని భజింపుము).

19. వీణాపాణిః యస్య శిష్యా - వాణీగాయతి జ్ఞానదేవీ
తం వాగీశం సామవాచా - చర శోణాధర మన్త్రపాఠమ్

(ఏ దేవుని యొక్క శిష్యురాలును, వీణాపాణియును, జ్ఞాన దేవియునగు వాణీదేవత కదలుచున్న ఎర్రని పెదవులతో మంత్రములను పఠించుచున్న ఏ వాగీశ్వరుని సామగానములతో స్తుతించుచున్నదో, అట్టి దత్తుని భజింపుము).

20. యత్సఙ్కల్పః కేవలం హి - సర్వ విశ్వం రచితమేవమ్
ఆద్యం దేవం ప్రథమ మూర్తిం ఆరాధనీయ మజమనాదిమ్

(ఏ దేవునియొక్క కేవల సంకల్పమే ఈ రచితమైన సర్వ ప్రపంచమో, అట్టి ఆదిదేవుని ప్రధమ రూపమును, ఆరాధనీయుడును, అజుడును, అనాదియనగు దత్తుని భజింపుము).

21. లలాటరేఖాం కర్మబద్ధాం - పరిమార్ష్టుం యః కేవలోహి
సర్వసమర్ధో లేఖకోஉయం - ధాతారంతం మూల మూలమ్

(కర్మబద్ధమైన లలాట రేఖలను తుడిచివేయుటకు వ్రాసిన వాడగు ఏ దేవుడు ఒక్కడే సర్వ సమర్ధుడో అట్టి ధాతయు, మూలమునకే మూలమైనవాడగు దత్తుని భజింపుము).

22. చతురామ్నాయాం శ్చతురవాచా - చతురాస్యాబ్జై రుద్గిరన్తమ్
కవిం కవీనా మాదికావ్యం - సర్వజగదిదం విరచయన్తమ్

(ఏ దేవుడు తన నాలుగు ముఖ కమలముల ద్వారా నాలుగు వేదములను చతురవాక్కులతో రచించెనో, కవులకే కవియును, ఆది కావ్యమైన ఈ సర్వజగత్తును రచించినవాడగు దత్తుని భజింపుము).

23. పరమ బ్రహ్మ బ్రహ్మ శబ్దో - యస్మిన్నేవ ప్రకృతి హేతౌ
పూజాతీతం పరమపూజ్యం - దివసారంభే పూజనీయమ్

(ఈ సృష్టికి ముందున్న సృష్టి కారకుడగు పరబ్రహ్మమైన ఏ దేవునియందే బ్రహ్మ శబ్దము వాడబడినదో ఏ దేవుడు వాఙ్మనోబుద్ధ్యతీతుడగుట వలన పూజలకు అందడో (బ్రహ్మపూజ లేకపోవుటకు ఇదే కారణము), నిజముగా ఉదయ పూజకు అర్హుడగు దత్తుని భజింపుము).

24. గాయత్రాద్యా యస్యభార్యాః - త్రిశక్త యస్తా స్త్రిముఖ పద్మమ్
దేవపితౄణాం పితరమేవ - పితామహాఖ్యం బ్రహ్మరూపమ్

(గాయత్రీ, సావిత్రీ, సరస్వతియను పేర్లతో త్రికాల సంధ్యాశక్తులే ఏ దేవుని భార్యలో, మూడు ముఖపద్మములతోనున్న వాడును, ఏ దేవుడినైననూ తండ్రియని పిలిచినచో ఆ తండ్రికే తండ్రియై పితా మహుడని ప్రసిద్ధుడైన దేవదేవుండగు బ్రహ్మరూపుడగు దత్తుని భజింపుము).

25. శ్లో శ్రీ దత్తబ్రహ్మ గాయత్రీం -యో గాయే ద్బ్రహ్మకాలికీమ్
స బ్రహ్మతేజసా దీప్తో - జ్ఞానీ బ్రహ్మత్వ మశ్నుతే

(ఈ శ్రీదత్తబ్రహ్మగాయత్రిని ఎవరు ప్రాతః కాలమున బ్రహ్మీ ముహూర్తములో గానము చేయుదురో, అట్టి జీవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచూ జ్ఞానియై బ్రహ్మత్వమును పొందును).

26. శ్లో శతాయుర్దాయ మాప్నోతి - సర్వవిద్యాః ప్రపద్యతే
సత్పుత్రం లభతే హోమా - దైశ్వర్యం బ్రహ్మ వీక్షితః

(ఈ గాయత్రీ గానముచేత శతాయుర్దాయము లభించును. సర్వ విద్యలు లభించును. సత్పుత్రుడు కలుగును. ఈ గాయత్రితో హోమము చేసినచో ఐశ్వర్యము లభించును. బ్రహ్మదేవుని కృపాకటాక్షము వానిపై సదా ప్రసరించును).

Download this bhajan sung by Shri Dattaswami here.

Monday, May 12, 2008

భజ భజ దత్తం - భజ భజ దత్తం (పార్ట్ -1)

భజ భజ దత్తం - భజ భజ దత్తమ్
భజ భజ దత్తం - భజ భజ దత్తమ్ (పల్లవి)

1. తత్సవితుస్త ద్దేవతాయాః - వరేణ్య భర్గో ధీమహీహః
ప్రచోదయేద్వై ధియో యో నః - తంబ్రహ్మాణం జ్ఞానసూర్యమ్‌

(దేవుడైన ఆ సవితయొక్క శ్రేష్టమైన ఆ తేజస్సును ధ్యానించు చున్నాము. ఏ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునో, అట్టి జ్ఞాన సూర్యుడైన ఆ బ్రహ్మదేవుడగు దత్తుని భజించుము).

2. ప్రాణిప్రసవా ద్యః ప్రసిద్ధః - సవితే త్యస్య బ్రహ్మతేజః
శిష్యధియశ్చ ప్రేరయేన్నః - తంగాయత్రీ మన్త్రసారమ్‌.

(ప్రాణులను ప్రసవించుట అనగా సృష్టించుటచేత ఏ దేవుడు సవితయని ప్రసిద్ధుడయ్యెనో, ఏ దేవుని బ్రహ్మతేజస్సు మా శిష్య బుద్ధులను ప్రేరేపించుచున్నదో, అట్టి గాయత్రీ మంత్రసారమైన దత్తుని భజింపుము).

3. గాయత్రీయం ఛన్దఏవ - సవితాదేవః స్మర్యతేచ
శిష్యాన్ధకార ముకుళితాబ్జ - ధీవికాసదం గురువరేణ్యమ్‌.

(గాయత్రి అనగా ఛందస్సు పేరే గదా! ఆ మంత్రదేవత సవితయని ముందే చెప్పబడినది గదా. శిష్యులయొక్క అజ్ఞానాంధ కారము చేత ముకుళించిన బుద్ధి పద్మములకు వికాసమునిచ్చు గురువరేణ్యుడగు దత్తుని భజింపుము).

4. కర్తాభర్తా హ్యేషహర్తా - సర్వస్యాస్య శ్రూయతేహి
త్రిమూర్తిరూపం బ్రహ్మచైకం - బ్రహ్మాకారం బ్రహ్మవాచమ్‌.

(ఈ జగత్తును సృష్టించువాడే పాలించి దీనిని హరించు వాడని శ్రుతి “యతోవా” అని చెప్పుచున్నది గదా. ఒకే పరబ్రహ్మము త్రిమూర్తి స్వరూపముతో నున్నది అనియే ఈ శ్రుతికి అర్ధము. బ్రహ్మదేవుని ఆకారముననున్న వేదములను చెప్పు బ్రహ్మదత్తుడగు ఆ సవితను భజింపుము).

5. త్రిపదం ఛన్దః త్రిస్వరోక్తం - త్రికాల వన్ద్యం త్రిగుణ సూత్రమ్‌
త్రివాహినీనాం సఙ్గమం వా - త్రిమూర్తి తత్త్వం యం వ్యనక్తి

( త్రిపాదములతో నున్నది గాయత్రీ ఛందస్సు. అది ఉదాత్త అనుదాత్తస్వరితములను త్రిస్వరములతోనున్నది. త్రిగుణములతో (మూడు పోగులు) నున్నది యజ్ఞోపవీతము. త్రివాహినుల సంగమమైన ప్రయాగవంటి పవిత్రమైన త్రికాల సంధ్యలయందు వందనీయమైన ఏ త్రిమూర్తి తత్త్వమును ఈ గాయత్రీ మంత్రము స్ఫురింపచేయునో అట్టి దత్తుని భజింపుము).

6. ఓఙ్కారశ్చ త్రివిధవర్ణః - త్రిస్రోవ్యాహృత యోஉపి యంహి
సంబోధయన్తి సర్వమన్త్రో - యమేవ వక్తి త్రిగుణమేకమ్‌.

(అకార, ఉకార, మకారములతోనున్న త్రివర్ణాత్మకమగు ఓంకారము, భూః భువః సువః అను మూడు వ్యాహృతులును, ఏ దేవునే సూచించునో, సర్వగాయత్రీ మంత్రము, సత్త్వ-రజః-తమః గుణములను కలిగిన ఏ ఒకే దేవుని చెప్పుచున్నదో అట్టి దత్తుని భజింపుము).

7. చత్వారోయం వేదశునకాః - గౌరనుసరతిచ వేదధర్మః
వీణాశ్రవణం వాణీపతిం - షోడశవర్షం బ్రహ్మదేవమ్

(నాల్గు వేదములు కుక్కలుగను, వేదధర్మమే గోవుగ వెంట నడుచు చుండగ వీణాశ్రవణమును చేయువాడును, వాణీపతియు, పదునారు సంవత్సరముల ప్రాయము కలవాడును బ్రహ్మదేవుడగు దత్తుని భజింపుము).

8. జగదారంభం హంసవాహం - తేజోవదనం మన్త్రమూలమ్
గాయత్రీశం సామగానం - విద్యానిలయం వేదపాఠమ్

(జగత్తును సృష్టించుటకు ఆరంభించుచున్నవాడును, హంస వాహనుడును, తేజస్సుతోనున్న ముఖము గలవాడును, మంత్రములకు మూలమును, గాయత్రికి అధీశ్వరుడును, సామగానము చేయుచున్నవాడును, విద్యలకు నిలయుడును, వేదపాఠము చేయుచున్నవాడునగు దత్తుని భజింపుము).

9. యజ్ఞాచరణం హోమనిష్టం - కమణ్డలుధరం దర్భపాణిమ్
అగ్నిజ్వాలా భాసమానం - ప్రాతస్సన్ధ్యా బాలభానుమ్

(యజ్ఞములను చేయుచున్నవాడును, హోమములందు నిష్ఠతోనున్నవాడును, కమండలమును ధరించి దర్భలను చేతపట్టిన వాడును, అగ్నిజ్వాలవలె ప్రకాశించుచున్నవాడును, ప్రాతస్సంధ్యాకాలమున వెలుగు బాలభానుడివలె ఎర్రగా భాసించుచున్న దత్తుని భజింపుము).
10. చందన తిలకే కుఙ్కుమాఙ్కం - బ్రహ్మతేజసా దీప్యమానమ్
త్రిజగన్మోహన సున్దరాఙ్గం - కాషాయధరం పణ్డితేశమ్

(ముఖమున చందన బింబ తిలకము, మధ్య కుంకుమ తిలకమును ధరించిన వాడును, బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్న వాడును, త్రిలోకములను మోహింపచేయు సుందరాంగుడును, కాషాయ వస్త్రధారియు, పండితసార్వభౌముడునగు దత్తుని భజించుము).

11. అత్రేః పుత్రం బ్రహ్మదత్తం - అనసూయాంబా ప్రేమరాశిమ్
అజిన మేఖలం బ్రహ్మదణ్డం - యజ్ఞోపవీత మక్షమాలమ్

(అత్రిపుత్రుడగు బ్రహ్మదత్తుడును, అనసూయాంబయొక్క ప్రేమరాశియును, కృష్ణచర్మమును మేఖలగా కలవాడును, బ్రహ్మదండమును యజ్ఞోపవీతమును జపమాలను ధరించినట్టి దత్తుని భజింపుము).

12. స్వతనోరుద్య త్కమల గన్దైః - త్రిభువనాని హ్లాదయన్తమ్
బ్రహ్మముహూర్తే సాధాకానాం - ప్రచోదయేత్తా యో ధియో నః

(తన తనువునుండి ప్రసరించు పద్మగంధములచేత త్రిభువనములను ఆహ్లాదపరచువాడును, బ్రహ్మముహూర్తమున సాధకులగు మాయొక్క బుద్ధులను ఏ దేవుడు ప్రేరేపించునో అట్టి దత్తుని భజింపుము).

13. సృష్టిక్రమ వద పురుషసూక్తం - త్రిస్వరబద్ధం పావనార్ధమ్
ఋషిభిః పఠితం బ్రహ్మకాలే - శ్రుత్వాశ్రుత్వా ప్రీయమాణమ్

(జగత్తుయొక్క సృష్టిక్రమమును వివరించునదియు, మూడు స్వరములతో నున్నదియును, పవిత్రమైన అర్ధము కలదియగు, పురుష సూక్తమును తనివితీర విని విని సంతోషించుచున్న దత్తుని భజింపుము).

(ఈ భజన ఆడియో కొరకు భజ భజ దత్తం - పార్ట్ -2 చూడండి)

Wednesday, May 7, 2008

బ్రహ్మ దత్తులను చూడండీ - కొలువైయున్నారిపుడండీ

బ్రహ్మ దత్తులను చూడండీ - కొలువైయున్నారిపుడండీ. (పల్లవి)

1. ఆ దేవ సవిత గొప్ప తేజమును ధ్యానింతుమెవరు మాదగు బుద్ధుల
ప్రేరేపించగ సమర్ధులగుదురొ ఆ బ్రహ్మయైన జ్ఞాన సూర్యులగు

2. ప్రాణి ప్రసవము చేయు సవితయును సృష్టికర్తయగు బ్రహ్మతేజమే
శిష్య బుద్ధులను ప్రేరేపించును ఆ గాయత్రీ మంత్రసారమగు

3. గాయత్రియనగ ఛందోనామము సవితయె దేవుడు చెప్పుచుంటిమట
శిష్యాంధకార ముకుళితాబ్జ ధీవికాసదులు గురువరేణ్యులగు

4. కర్తయుభర్తయు హర్తయు వారే సర్వ జగత్తుకు శ్రుతివాక్యమదే
త్రిమూర్తిరూపులు ఏకమెబ్రహ్మము బ్రహ్మాకారులు బ్రహ్మవాక్కులగు

5. త్రిపాది ఛందము త్రిస్వరమంత్రము త్రికాలవంద్యులు త్రిగుణసూత్రమది
గంగాయమునా సరస్వతీ సమ త్రిమూర్తిసంగమ ముద్దేశించును

6.ఓంకారంబది త్రివర్ణమిళితము త్రివ్యాహృతులును సంబోధించును
సర్వమంత్రమును త్రిగుణములేగద త్రిమూర్తులనుగుణి వ్యక్తి ఒక్కరగు

7. నాల్గు వేదములు శునకములగుచును వేదధర్మమే గోవుగ నడవగ
వీణాశ్రవణులు వాణీ రమణులు షోడశ వర్షులు బ్రహ్మదేవులగు

8. జగదారంభులు హంసవాహనులు తేజోవదనులు మంత్రమూలమును
గాయత్రీశులు సామగాయకులు విద్యా నిలయులు వేదపాఠులగు

9. యజ్ఞాచరణులు హోమనిష్ఠితులు కమండలుకుశలు జపమాల బట్టి
ప్రాతస్సంధ్యా బాలభానులును అగ్నిజ్వాలగ భాసించుచుండు

10. చందనతిలకము కుంకుమాంకితము బ్రహ్మతేజస్సు దీపించుచుండ
త్రిజగన్మోహన సుందరాకృతులు కాషాయధారి పండితేశ్వరులు

11. అత్రిపుత్రులును బ్రహ్మదత్తులును అనసూయాంబా ప్రేమరాశులును
అజినమేఖలురు బ్రహ్మదండులును యజ్ఞోపవీత మక్షమాలగల

12. తన తనువునగల కమలగంధముల త్రిభువనములు ఆహ్లాదమునొందగ
బ్రహ్మముహూర్తము నందు సాధకుల మమ్ముల బుద్ధుల ప్రేరేపించెడి

13. త్రిస్వరబద్ధము పావనార్ధమగు సృష్టినిజెప్పెడి పురుష సూక్తమును
ఋషులు పఠించగ బ్రహ్మకాలమున విని విని యెంతో ప్రీతిని పొందెడి

14. త్రిమతాచార్యులు పఠించుచుండగ తమతమ మతముల భాష్య వాదముల
అవి విని చివరకు సిద్ధాంతమును సమన్వయ మతము నొప్పుగచెప్పెడి

15. వేదాంతములకు అంతిమార్ధమై వేదాంతార్ధము బోధించునెపుడు
శాస్త్రరహస్యము లందున నడిగెది ఋషులకు చెప్పుచు వారి మధ్యగల

16. ఆయుధవర్జిత పాణిపద్ములును వాగాయుధమున శత్రుమారకులు
కర్మఫలంబుల నుదుటి పత్రమున లిఖించునాయుర్దాయ దాతలగు

17. ఆచార్యేంద్రులు వాక్ప్రచారకులు భువి సంచారులు నిర్విచారులును
ఖలాభిచారులు సదాచారులును సురపరిచారులు చిత్తచోరులగు

18. పద్మసంభవులు పద్మాసనులును పద్మసుగంధులు పద్మవర్ణులును
పద్మాపుత్రులు పద్మనేత్రులును పద్మసుపాణులు పద్మపాదులగు

19. వీణాపాణియు శిష్యురాలగుచు వాణిపాడునట జ్ఞానదేవతయె
ఆ వాగీశుని సామగీతముల శోణాధరచర మంత్రపాఠులగు

20. ఒక సంకల్పమె ఎవరు చేయగా సర్వము విశ్వము రచిత మీ విధిగ
ఆద్యదేవులును ప్రధమమూర్తియగు ఆరాధనీయు లజులనాదియగు

21. నుదుటివ్రాతలను తుడిచివేయగా వ్రాసినవారే సర్వసమర్ధులు
విధాతయనగా కర్మఫలములను విధించువారలు మూలమూలమగు

22. చతురవాక్కులగు చతుర్వేదముల చతురాననములు చెప్పుచునుండగ
ఆదికావ్యమగు సర్వజగత్తును రచించువారలు కవులకు కవులగు

23. పరబ్రహ్మమను బ్రహ్మశబ్దమది ఏ ఒక్కరికే పేరుగ గలదో
బుద్ధికి చిక్కరు పూజలకందరు దినారంభమున పరమపూజ్యులగు

24. గాయత్రి మొదలు ముగ్గురు భార్యలు త్రిశక్తులుండగ త్రిముఖపద్ములై
దేవులు తండ్రులు వారికె తండ్రియు పితామహులనగ బ్రహ్మరూపులగు

25. సత్యలోకమున పద్మపీఠమున బ్రహ్మసదస్సున అధ్యక్షులగుచు
సరస్వతీ సతి నారదసుతుడును తమతమ వీణల మీటుచునుండగ

26. బ్రహ్మర్షులచట శాస్త్రవాదముల చర్చల సేయగ నాకర్ణించుచు
చివరకు నిజమత సిద్ధాంతములను సమన్వయములను ప్రతిపాదించెడి

27. బ్రహ్మముహూర్తము సంధ్యాసమయము బాలభానురుచి కుంకుమరాశుల
పాదపద్మముల నర్చన సేయగ పద్మాసనమున ఆసీనులైన

28.. వేదపురుషులట నలుగురు తనయులు జటామండలము లొప్పుచునుండగ
మధురకంఠముల శ్రవణరమ్యముల త్రిస్వరపావన మంత్రముల చెప్ప

29. శరదంబోధర శరీర కాంతులు జ్ఞానతేజములు ప్రసరించుచుండ
వాణీదేవత సామగానముల కచ్ఛపివీణను వాయించుచుండ

30. సిధ్ధాంతార్ధము నటనటపలుకగ ఆహో! యని ముని ఘోషలు చెలగగ
తన్మయుడై తన తండ్రిని పొగడుచు వీణాకలముల దేవర్షి పాడ

31. బ్రహ్మ దత్తులను ఈ గాయత్రిని బ్రహ్మకాలమున గానము చేసిన
బ్రహ్మ తేజమున ఉద్దీప్తులగుచు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మమె అగుదురు

32. శతవర్షంబులు ఆయుర్దాయము సర్వవిద్యలును సంప్రాప్తించును
హోమము చేసిన మహదైశ్వర్యము సత్పుత్రసిద్ధి బ్రహ్మదృష్టి పడు

Download this bhajan sung by Shri Dattaswami here.

Monday, May 5, 2008

శ్రీ మహాలక్ష్మి స్తుతి

(భృగుమహర్షి నారాయణుని హృదయంపై పాదఘాతము చేయుటతో కోపగించిన, దుఃఖితురాలైన శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వీడి భూలోకంలోకి దిగివచ్చి కొల్హాపురం చేరుట.)

దిగివచ్చినదే మంగళ దేవత - వైకుంఠము వీడి వసుధకు రుసరుస
తన తండ్రి భృగువు తన్నగ నల్లుని - ఉరమున, ఉడికిన ఉద్రేకముతో (పల్లవి)

1. చెంపల చారెడు కన్నులు నిండిన - అశ్రువులొలకగ పెద్ద ముత్తెములు
పద్మా పద్మా యను పద్మాక్షుడు - వెంటబడి వెనుక ఆహ్వానించిన

2. ఘల్లు ఘల్లుమని కాలి అందెలును - మధురధ్వనులను పలుకుచుండగా
హంసయానమున దిగిదిగి వచ్చెను - మేఘ మార్గమున తారలు చెదరగ

3. విడివడిన కురుల విదలింపులతో - వడి వడి నడకల వేడి వేడిగను
నిశ్వాసములకు వాడిపోవగా - అధర పల్లవము పన్నుల నొక్కుచు

4. ముఖమున ఎర్రని తళతళకాంతుల - స్వేద బిందువులు జాలువారగా
బాల భాస్కరుని కిరణములొప్పగ - సంధ్య కాంతివలె శోభిల్లె పద్మ

5. బంగారుగాజులెగురగ గలగల - చేతుల నూపుచు బంగారుబొమ్మ
ఆ పద్మ నడవ అరవిందాక్షుడు - అల్లాడె వెనుక పరుగుల నెత్తుచు

6. కనక హారములు కులుకుల నడకల - గలగలలాడుచు గంతులేయగా
కమలా దేవత కదలి వచ్చెగా - కమలలోచనుడు కమిలి పోయెనే

7. ఆగు ఆగు మని అర్ధించుచున్న - అంతకంతకును వేగము హెచ్చగ
పద్మ నడచెనే పురుషోత్తముడదె - పరుగునవచ్చును వనమాల యెగుర

8. సాత్త్విక గుణవతి శాంతరూపిణివి - ఇంత ఆగ్రహము నీకేల దేవి !
నీ తండ్రి భృగువు నా తండ్రి సముడె - చరణ స్పర్శయు ఆశీర్వచనమె

9. ఇట్లు మాధవుడు వచించుచున్నను - పద్మకు దుఃఖము పొంగుచు పొరలెను
భర్తమాత్రమే కాదు హరితనకు - భగవంతుండును పాద దాసిగా

10. మణిపూర చక్ర మతిక్రమించిన - శ్రీ మహాలక్ష్మి తండ్రి బంధమును
లెక్కసేయకే పరమాత్ముడినే - సర్వాధికునిగ తలచిన ధన్యయె

11. వినదాయె పద్మ వేయి చెప్పినను - పరమాత్మ పరాభవమును సహింప
ఓర్వగ లేకయె ఏడుపు కోపము - మిశ్రమమై మది కల్లోలమయ్యె

12. అదిగోవచ్చును అరవిందాసన - అందాల రాశి ఆవేశముతో
అంబర వీధిని సప్త మహర్షులు - ప్రణమిల్లుచున్న అవలోకించదు

13. హరిపద సంభవ ఆకాశగంగ - హరి పదముల బడి సవ్వడి పొందుచు
అలలతో జెప్పు ఆగుమమ్మయని - అలివేణి పద్మ ఆగదు క్షణమును

14. తెల్లని గంగా జలముల నడచెడి - ఎర్రని పద్మా సతి ఖేచరులకు
ముత్యాలసరము మధ్యమాణిక్య - మొకటి చలించెడి రీతి జూపట్టె

15. వడివడి హరిపద వేగముతనలో - నవనవ వీచికలుప్పతిలఁజేయ
పద్మాపదముల తాకుచు పలికెను - హరి అభ్యర్ధన నందించు గంగ

16. కానీ పద్మా పదముల వేగము - తాకిడితో తన అలలు వెనుదిరిగి
పద్మ నిశ్చయము నందించ హరికి - మధ్యదూతివలె మందాకినియగు

17. భూలోక జనుల దరిద్రమంతము - చేయగ సమయము ఆసన్నమయ్యె
పద్మా చరణము లవనిని తగిలెను - సకల సౌభాగ్య సంపత్కరములు

18. భూదేవి సవితియైనను పదముల - సవితి తాకినను ఆనందించెను
అష్టైశ్వర్యములవనిని పొందగ - పద్మను నమస్కరించె భక్తితో

19. నడుచుచున్నదే నారాయణియదె - కొల్హాపురమున తపమును చేయగ
దైవావమాన తాపముతనలో - కోపకారణము అరుణ రూపమై

20. మంగళ దేవత చరణమార్గమున - పూలను రాల్చెను వనములతరువులు
తల్లి పాదములు కందిపోవునని - ముందుగ పవనుడు ఊడ్చి వేయగా

21. బంగారురంగు తామ్రాంచలమగు - హరికిష్టమైన చీరను కట్టిన
మంగళ దేవత పసుపు కుంకుమము - మేళవించినటు తోచుచున్నదే

22. మధుసూదనసతి మానవతీమణి - ఆత్మావమాన హేతువు కాదది
తండ్రిపాదమును బిడ్డ ఒప్పదా - స్వామి పరాభవమోర్వలేదాయె

23. ఎంతటి భక్తియొ ఆలోచింపుము - తండ్రికి తనకును మించి దైవమట
పరమ భాగవత భక్తాగ్రేసర - స్వామి పదసేవ నెప్పుడు విడువదు

24. ఆభక్తిమెచ్చి సర్వసృష్టికే - తన సంపదకే అధిదేవతగా
హరియుచేసెనే ఆ సతీమణిని - హృదయ దేవతగ ధరించె పద్మను

25. పద్మ పోవగా నారాయణుడదె - నళిన నేత్రముల భాష్పధారలను
కురియుచు పరుగిడు పద్మనామమును - ఎలుగెత్తి పిలుచు ఏడ్చుచు పెద్దగ

26. తండ్రి కన్నను స్వామియె ఎక్కువ - భక్తులకన్నది దక్షయాగమున
నిరూపించెనే ఆ సతీదేవి - సతియన పద్మయె శివుడన హరియె

27. కొల్హాపురమున పద్మాసనమున - యోగనిష్ఠలో కుర్చుండె పద్మ
అగ్నిగఁదోచును క్రోధ కాంతియదె - యోగాగ్ని మధ్య సతివలె పద్మయు

28. అశ్రుధారలను ఆపగ లేనివి - కన్నుల మూసెను ధ్యానించు హరిని
పద్మను పోలిన భక్తులెవ్వరే - భువనములందున సర్వోత్తమయే

29. మంగళ దేవత ! వందనమమ్మా - నారాయణి ! యివె నమస్కారములు
స్వార్ధ దరిద్రము పోగొట్టుమమ్మా - భక్తి సంపదను మాకిమ్ముతల్లీ !

Download this bhajan sung by Shri Dattaswami here.

Sunday, May 4, 2008

అడుగో | అల్లడుగో | వేంకట దత్తుడు

(నారాయణుడు వైకుంఠమును వీడి శ్రీ లక్ష్మి కొరకు భూలోకానికి పరుగిడుట)
అడుగో అల్లడుగో వేంకట దత్తుడు (పల్లవి)

1. తియ్య మామిడి చిగురు లేత పెదవులందు - చిందెడి సన్న నవ్వు వాడు
ఉదయాన సరసులో విచ్చుచున్న - కమలాలబోలు నయనములవాడు

2. నీటుగానున్న సంపెంగ సుమము - బోలు నాసంబుతో వెలుగువాడు
పన్నీర పుష్పాల తళుకు లొలుకు - లేత బుగ్గల నెర్రతనము వాడు

3. ఊర్ధ్వ త్రిపుండ్రంబులుజ్జ్వలముగా - భాసించుచుండు నిటలంబువాడు
తప్త కాంచన దీప్తి మెరుపులొప్ప - పీతాంబరోజ్జ్వ లాంచలమువాడు

4. కొండ బండల మీద నర్ధరాత్రి - పద్మ కొరకై పరుగుతోడ
దిగుచున్న వాడతడు పలుగురాళ్ళ - కాలి గాయముల లెక్కింపడెపుడు

5. నిస్వార్ధ భక్తికై ప్రాణమైనను - తృణముగా త్యాగంబు సేయువాడు
కోటి యఙ్ఞములైన జపతపములు - పూజలైనను వాని కట్టలేవు

Download this bhajan sung by Shri Dattaswami here.

ఎర్రని కన్నుల పద్మాల పద్మా

(ప్రతిదినము శ్రీ వెంకటేశ్వరుడు పవళింపు సేవ అనంతరము కొండదిగి వచ్చి పద్మావతీ దేవి వద్ద చేరటం - ఇంతలోనే తెల్లవారక ముందే సుప్రభాత సేవకు కొండ మీదికి వెళ్ళవలసి రావటం- అప్పుడు పద్మావతీ దేవి శ్రీ వెంకటేశ్వరుని ఎడబాటి సహించలేక ఎలా తపించింది అనే కీర్తన ఇది. ఇది పూజలేని భక్తి యని స్వామి చెప్పినారు.)

ఎర్రని కన్నుల పద్మాల పద్మా
వెంకట రమణుని వీడ్కోలు చెప్పె (పల్లవి)

1. రాలు రక్తరుచి బాష్ప పగడముల చెదరి చలించెడి అలకనీలముల
ఏడ్వగ కనబడు దంత ముత్తెముల వణకెడి పెదవుల పల్లవ కాంతుల

2. కంపించెడి కుచభర హృదయముతో వడగాలి వేడి నిట్టూర్పులతో
పోవలసినదేనా ? పరమాత్మా గోవిందా ! నా గోవిందా ! యనె

3. ఒకసారి లేచు ఒకసారి తూలు ఒకసారి శయ్యపై బడి పొరలును
అర్ధరాత్రి వరకా ? వేచియుంట ! అని విలపించును గుండెబాదుకొను

4. ముందుకు వెనుకకు అడుగులు వేయుచు వెడలుచు తడబడి కన్నీరొలుకుచు
పద్మా పద్మా అని రోదించెడి గోవిందుని తానవలోకించెను

5. పది అడుగులు గిరినెక్కియు నిలబడె వెనుకకు చూచెను విలపించెను హరి
క్రింద పద్మ నిలబడి పైకి విసరు బాష్ప తోరణములాకర్షింపగ

6. హనుమయు గరుడుడు ప్రక్కల చేరిరి భుజములనెత్తుక బలవంతముగా
కొండపైకి ఎగిరిరి బ్రహ్మర్షులు నిరీక్షణములను చేయుచుండిరని

Download this bhajan sung by Shri Dattaswami here.

అదిగో తిరుపతి - అదిగో తిరుమల

(స్వామి కొండపైకి చేరిన తరువాత జరిగిన సుప్రభాత సేవ)

అదిగో తిరుపతి - అదిగో తిరుమల
వెంకట దత్తుని మందిరమదిగో (పల్లవి)

1. సప్త మహర్షులు సంభ్రమ దృష్టులు కరముల మానస పద్మములొప్పగ
వేచియుండిరట పద్మామానసు డగు హరి విప్పడు పద్మ నేత్రముల

2. మహతీ వీణను మీటుచు పాడును నారదుడచ్చట నారాయణయని
కాని వనమాలి కర్ణమునీయడు పద్మాగళ మాధుర్యము తలచుచు

3. కిన్నర కృతములు మంగళ తూర్యము లవిగో మిన్నును ముట్టుచుండెనట
కలకల నవ్వెడి పద్మావతినే స్మరించు ఈశుడు మేల్కొనడాయెను

4. దేవతలిచ్చెడి కర్పూరగంధ మేఘములచ్చట ఘుమ ఘుమలాడును
అయినా హరిమది పద్మాప్రణయము దివ్యగంధముల మత్తున మునిగెను

5. అప్సరసలు సరసాంగ నృత్యముల ఆడుచుండిరట ఆలోకింపడు
కృష్ణదత్తుడదె అంతరంగమున పద్మ నడకలను కులుకుల చూచును

6. నిన్ను కట్టుటకు భక్తియె మార్గము కిటుకును తెలిసితి చిక్కితివిదిగో
గోవింద దత్త ! గోవిందా హరి ! గోవింద కృష్ణ ! గోవింద పద్మ !
(ఇదే భక్తి లేని పూజయని స్వామి చెప్పినారు.)

Download this bhajan sung by Shri Dattaswami here.

కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !

(ఇది స్వామి వారి అత్యద్భుత కీర్తన.)

కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !
నా ప్రాణదీపం - కొండెక్కముందె
కొండలరాయ! నీ - కోనేటి లోన
ఒకసారి మునకేతునా ?
నా ప్రాణనాథా ! శ్రీ వెంకటేశా ! (పల్లవి)

జీవించినా లేక మరణించినా స్వామి !
మరల జన్మించినా లేక - ఏ లోకమందున్నను
చింతాకు చింతయును నా మదిని లేదెపుడు
నీ నామగానమ్ము నాకిమ్ము అదిచాలు.

నీ ప్రేమ కోసమే - నా జీవితంబంత
కర్పూర నీరాజనంబుగా కాలనీ
గోవింద గోవింద పిలుపుతో తపనతో
నా చిట్టచివరి నిశ్వాస మాగిపోనీ!

నిన్నెంత తలచినా - సంతృప్తి రాదయ్యె
తీరమన్నది లేని - ప్రణయసాగరమీవు
నా జీవితేశ్వరా ! నీ తరంగాలలో
తేలియాడుచు తుదకు నను మునిగిపోనీ

నవకోటి మన్మధా ! - నీ పొందు లేకున్న
ఈ జగముతో పొందు - ఇపుడె ఆగిపోనీ
నీ కౌగిలింతయే - లేకున్న గోపాల !
విరహాగ్నిలో నన్నిక - భస్మమైపోనీ

నీ పెదవి ముద్దాడలేకున్న నా పెదవి
నీ విరహ శిఖలలో - కమిలి మాడిపోనీ
నీ దర్శనంబింక నాకు లేకున్నచో
నీకొండ నుండి దూకి ముక్కలై పోనీ

సప్త శైలన్యస్త - పాద పద్మాయతే
వామహస్తాలోల - కేళి పద్మాయతే
పద్మ నేత్రాయ తే పద్మవక్త్రాయ తే
పద్మావతీ ప్రాణనాధాయ వందనమ్

Saturday, May 3, 2008

భవతి భిక్షాందేహి పద్మే

(నారాయణుడు తన భర్తయే గాక తనకు సాక్షాత్తు భగవంతుడనియూ, భృగువు తాడనము చేయుట అపచారమనియు, భగవంతునికి జరిగిన అపచారమును భరించలేని శ్రీ లక్ష్మి కొల్హాపురం చేరగా శ్రీ వెంకట దత్తుడు ఆమె కొరకు కొల్హాపురం చేరి శ్రీ లక్ష్మి దేవిని భిక్షనర్ధించుట ఆనాడు జరిగిన ప్రత్యక్ష వాగ్వాదము.)

భవతి భిక్షాందేహి పద్మే - అని పిలచెను యతి దత్తాత్రేయుడు (పల్లవి)

1. కొల్హాపురిని మధ్యాహ్న భిక్షకు - పద్మ ముంగిట నిలచెను దత్తుడు
పద్మా పద్మా అని మొత్తుకున్న - తలుపులు తెరవదు మంగళ దేవత

2. పద్మాయనగా పద్మావతియే - మంగాపురికే పొమ్మని పలికె
పద్మాయనగా నీదేనామము - మొదట నుండియు ననెను దత్తుడు

3. మొదటినుండియు పత్నిగనున్నను - వెడలి పోతిగద నాపేరుకూడ
వెడలి పోయెనిది సత్యము నాధా ! - అనె గద్గదగళ పలికె శ్రీ లక్ష్మి

4. భిక్షుకునిటు పొమ్మనగన్యాయమె - అని వెంకటపతి పలికెను దత్తుడు
నీప్రేమ భిక్షువు నేను నీకెమి - దానము చేయదు ననె మహాలక్ష్మి

5. సాగరతనయా ఎంత విశాలము - నీహృదయప్రేమ సాగరమనెపతి
ఆకాశరాజు కూతురి హృదయము - ఆకాశమంత విశాలమనె సతి

6. అర్ధరాత్రియట మధ్యాహ్నమిట - ఒక పూటనుందు సమకాలముగా
ఉదయాననచట సాయమునిచట - వెడలుచుంటిననె వెంకట దత్తుడు

7. మిగిలిన సమయము లందుననెందరో - గోపికలుందురు నీ ప్రేమ భిక్షులు
నేను చూతునా పద్మ చూచునా - పద్మకు చెప్పితి నిదియనె భార్గవి

8. ఈ రీతి నైన ఇరువురు కలిసిరి - సంతోషమదియే నాకనె శ్రీ హరి
అర్ధరాత్రి యిది పద్మ చెప్పునట - నా చెల్లెలనెను నారాయణసతి

9. ఇరువురు పొమ్మన్న నాకేదిదిక్కు - అని వాపోయెను మధుసూదనుడు
గోదయు మీరయు నాంచారియును - కులమతములైన లేవనె కమలయు

10. చేసెడి దేమియు లేకింక విభుడు - వెనుదిరిగెను పాదుకల శబ్దముల
తటాలున తలుపు తెరిచి పద్మ చూచె - అశ్రుధారా ప్రేక్షణములతో

11. ఆగెను వెనుకకు తిరిగెను దత్తుడు - నిలబడె పరుగున వచ్చెను పద్మయు
కౌగిలించె ముఖమంతయు ముద్దాడె - మన్నించు మనుచు పదముల బడెను

12. మంగళదేవత నెత్తెను కరముల - కౌగలించె హరి గృహమునకేగిరి
విందొనరించెను శ్రీ మహాలక్ష్మి - కమలావయవములను భోజ్యముల

13. కులమత రహిత జీవులందరును - గోపికలేగద అందరివాడవు
నీఅందమందరి సొత్తు సొంతమె - అని నుతించెను లక్ష్మి మురారిని

Download this bhajan sung by Shri Dattaswami here.

Friday, May 2, 2008

గోవింద గోవింద నామమేచాలు

గోవింద గోవింద నామమేచాలు
అన్నపానములేల ? సంసారమేల ? (పల్లవి)

ఏడు కొండలనెక్కి ఈక్షించియుంటినే ఏడేడు లోకాల అందగాడే వాడు
బ్రహ్మర్షులైనట్టి పురుషులే మోహించి కౌగిలింతల వాని ముద్దాడ మనసాయె

ఆ కన్నులాకర్ణ సువిశాలములు జూడ మెరిసేటి మీనముల తలపింపచేసెనే
కనురెప్పలాతామ్ర పద్మముల మురిపించు పద్మలోచనుడన్న నిజముగా వాడేనే

ఆ ముద్దు పెదవులను చుంబించ పిచ్చెక్కె తియ్యమామిడి లేత చిగురులె కనిపించె
ఆ బుగ్గలరుణాలు కొరకంగ వెర్రెక్కె పన్నీర పుష్పాల తళుకులను చిందించు

ముత్యాల పలువరస సన్న నవ్వుల వెలుగు హిమబిందువుల చిందుసూర్యాంశువులబోలు
అందాలమెక్కినది ముచ్చటైనది ముక్కు సంపెంగ తలవంచె నూగుపూవును మించె

ఆజానుబాహువులు అరవింద చరణాలు సువిశాల వక్షమున వైజయంతీ మాల
శంఖచక్రములొప్ప వరదాభయకరాల వాసుదేవుడె వాడు శ్రీ వెంకటేశ్వరుడు

వజ్రవైడూర్యాది కనకాభరణములను అంగాంగముల కప్పి ముంచివేశారె
పెద్దపెద్దవి పట్టె నామాల నుదుటిపై అందాల దాచారె దిష్టి తగ్గించగా

ధీరుడె శృంగార సార్వభౌముడె వాడు లోకాల నేలేటి ఠీవితో నిలిచాడె
లావణ్య చందిరుడు తారుణ్య భాస్కరుడు కారుణ్య సాగరుడు వాడొక్కడేనే

పాదాల వేదాలు కుక్కలై పడియుండు పరమ పావనుడతడు పరమాత్మ దత్తుండు
విశ్వకర్తయు భర్త హర్తయును వాడేను అడుగడుగు దండాల మ్రొక్కేరు సురమునులె

Download this bhajan sung by Shri Dattaswami here.

Thursday, May 1, 2008

అదిగో శేషాద్రి ! మందిరమదిగో చూడండీ

అదిగో శేషాద్రి ! మందిరమదిగో చూడండీ
అరవిందాక్షుడు పద్మా లోలుడు అతడే నండీ (పల్లవి)

1. మానవ జన్మము నెత్తినందులకు సార్ధకమయ్యెను వెంకన్నా
నీ పై పాటల వ్రాసితినందురు - వ్రాసిన వాడవు నీ వన్నా
పద్మగ నీవె పుట్టితివిచ్చట తియ్యగ పాడితి ఓరన్నా
పద్మారమణా ! ఆనందముతో కీర్తినిచ్చితివి నాకన్నా

2. మేడలు రూకలు బంధము లేవియు నా వెంట రావు వెంకన్నా
ఈ పాటలనెడి దివ్య సంపదయె మము రక్షించును కొండన్నా
నర జన్మమునిటు నీ గానమునిటు దయసేయుమెపుడు దత్తన్నా
ఇంతకన్న వరమేమియు అడుగను కాదన బోకుము హరియన్నా

3. స్వర్గాధిపతియు వీటిని వినగా పరుగెత్తు చుండు నోరన్నా
వీటిని పాడెడి నారదుడయ్యెను త్రిభువన పూజ్యుడు ఓ కన్నా
గీతామృతమును త్రాగెడివానికి బ్రహ్మానందము చాలన్నా
యమకింకరులను పొమ్మని వత్తురు విష్ణుదూతలు చివరోయన్నా

4. నీ పాట పాడ బాష్పలోచనము లొప్పగ విందురు వారన్నా
భక్తి లేక వృధ పూజలు జపములు ప్రేమయె మార్గము ఓరన్నా
అహంకారమున పాపాత్ముడనై పతితుడనైతిని వెంకన్నా
పండిత వేషము పామరాధముడ ఉద్ధరించుమిక దత్తన్నా

5. వేద శాస్త్రముల చదివితి నేనని గర్వమెక్కెనిల నాకన్నా
పద్మను గురువుగ చూపితి విచ్చట భక్తి మార్గమున హరియన్నా
ఙ్ఞానమె దీపము భక్తియె మార్గము నీ దయ నడవగ ఊపన్నా
దీప హీనుడును మార్గమునందున లక్ష్యము చేరును వెంకన్నా

6. నీ అందాలను పొందు పరచినవి పాటల విందులు చాలన్నా
ఆకలి దప్పిక నిద్రయు లేవిట అమరుడ నైతిని వెంకన్నా
అన్నమయ్య ఇటు పద్మయు అన్నా చెల్లెళ్ళ కివియె నతులన్నా
నీ కర ఖడ్గము నీ కర పద్మము వారిరివురు గద వెంకన్నా

Download this bhajan sung by Shri Dattaswami here.