Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, February 8, 2010

శ్రీకాలభైరవ కాలదండ స్తోత్రమ్

1. కాలభైరవ కాలదండం - కంపతర్జిత బ్రహ్మాండం|
దత్తసేవక రక్షణార్ధం - ప్రార్ధయామో బద్ధ దీక్షం||

2. దత్తభక్త విరోధి మారం - నామ శేషిత దైత్యశూరం|
ఆయుధానా మేకవీరం - ధ్వస్తత్రి జగదహంకారం||

3. లోకభాండ విబేధ దక్షం - దుష్ఠశిక్షణ శిష్ఠ పక్షం|
సృష్టి చక్ర పరిభ్రమాక్షం - సర్వ రాక్షస జాతి రూక్షం||

4. వేద పూరుష పాణి నీతం- దత్తదేవ కటాక్ష పూతం|
జీవకర్మ విపాకపాకం - గర్వితాసుర హ్రుదయ ఖాతం||

తక్కువేమి మనకు - శ్రీ దత్తుండొక్కడుండు వరకు

తక్కువేమి మనకు - శ్రీ దత్తుండొక్కడుండు వరకు (పల్లవి)

1. చాకలినే నరపతిగ చేసిన
శ్రీ పాద వల్లభ శ్రీ కృప యుండగ

2. శూలపాణియై దొంగల చంపిన
శ్రీపాద శివుడు అండగనుండగ ||

3.. వట్టి గేదెను క్షీరదాయిగ చేసిన
శ్రీ నరహరి మనకుండగ ||

4. పిడికెడు బియ్యము వేలభోజనముగ
వండిన శ్రీ నరసింహుడుండగ ||

5. తన మలమునే హేమముగ మార్చిన
శ్రీ మాణిక్య ప్రభువు మనకుండగ ||

6. పాముల బంగారు కడ్డీలు చేసిన
శ్రీ స్వామి సమర్ధుల కరుణే వుండగ ||

7. సటకా కొట్టుచు యమునే తరిమిన
శ్రీ షిరిడి సాయి మన వెంట నుండగ ||

8. వేలాది మహిమలు చూపుచు
బోధక శ్రీ సత్యసాయి చెంతనుండగ ||

9. త్రిలోక దుర్లభ బ్రహ్మ ఙ్ఞానదుడు
శ్రీ దత్తస్వామి మనతోనుండగ ||

ఫలశ్రుతి : నిరాశ దూరమై, ఉత్సాహం కలుగుతుంది.

శరణు స్తుతి - దత్త దిగంబర తవ శరణం

గురుదత్త దిగంబర తవశరణం దత్త
దత్త దిగంబర తవ శరణం || (పల్లవి)

1. అత్రి సుతా అనసూయ నందన
యోగి రాజ గురుతవ శరణం
శ్రీ యోగిరాజ గురు తవ శరణం || గురుదత్త...

2. కార్తవీర్య భుక్తి ముక్తి ప్రద
పింగళ పూజిత తవశరణం
శ్రీ పింగళ పూజిత తవ శరణం || గురుదత్త ...

3. శ్రీ పాద శ్రీ వల్లభయతి వర
నృసింహ సరస్వతి తవ శరణం
శ్రీ నృసింహ సరస్వతి తవ శరణం || గురుదత్త...

4. నారాయణ భైరవ మాణిక్యప్రభు
అక్కల్ కోట గురు తవ శరణం
శ్రీ అక్కల్ కోట గురు తవ శరణం || గురుదత్త...

5. ఏక నాధ జనార్ధన స్వామి
వాసుదేవ గురు తవ శరణం
శ్రీ వాసుదేవ గురు తవ శరణం || గురుదత్త...

6. ఘోరక గర్వ వినాశక కర్త
అవధూత నిరంజన తవశరణం
శ్రీ అవధూత నిరంజన తవశరణం || గురుదత్త...

7. హీన దీన తారక పురుషోత్తమ
రంగ తార గురు తవ శరణం
శ్రీ రంగ తారగురు గురు తవ శరణం || గురుదత్త...

8. పూర్ణ పరాత్పర సగుణ గుణేశ్వర
సాయినాధ గురు తవ శరణం
శ్రీ షిరిడి సాయినాధ గురు తవ శరణం || గురుదత్త...

9. సద్గురు మూర్తి సాయి స్వరూప
సత్యసాయి గురు తవ శరణం
శ్రీ సత్యసాయి గురు తవ శరణం || గురుదత్త...

10. అవధూత పీఠపతి గణపతి
సచ్చిదానంద గురు తవ శరణం
శ్రీ సచ్చిదానంద గురు తవ శరణం || గురుదత్త...

11. ఙ్ఞాన సరస్వతి గాన ధ్యాన ప్రద
దత్త స్వామి గురు తవ శరణం
శ్రీ దత్త స్వామి గురు తవ శరణం || గురుదత్త...

వెంకటేశ్వర పాహిమాం

వెంకటేశ్వర వెంకటేశ్వర - వెంకటేశ్వర పాహిమాం |
వెంకటేశ్వర వెంకటేశ్వర - వెంకటేశ్వర రక్షమాం ||

1. సప్త శైల విభూషణం నవనీల మేఘ సమప్రభం |
ఊర్ద్వ పుండ్ర విలక్షణాంకిత ఫాలదేశ సముజ్జ్వలమ్ |
వామపార్శ్వ విలంబివ మౌక్తిక దామచారు కిరీటనం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

2. అంసయోరు పరిస్ఫురద్ద్యుతి శంఖచక్ర సులక్షితం |
చక్రవాక సమాకృతి స్ఫుట కర్ణభూషణ శోభితమ్ |
స్వర్ణ వర్ణ ధగద్ధగద్యుతి నూతనాంబర విభ్రమం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

3. చిత్రపుష్ప సరోల్లసత్తులసీ దళాత్మక మాలికం |
వజ్ర మౌక్తిక దామ సంభృత చిత్ర చిత్ర విభూషణమ్ |
శోణ పద్మవిశేష హార పరిష్కృతామల కంధరం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

4. చూతపల్లవ కోమలాధర నర్తిత స్మిత సుందరం |
చందనాంకసముల్ల సచ్చుబు కాంతకాంతి విలక్షణమ్ |
ఉల్లసత్తిల పుష్ప సమ్మిత చారునాస మనోహరం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

5. ధౌత దీధితి మీన యుగ్మకళా సత్తుల లోచనం
కామచాప యుగభ్రువోరతి సుందరాకృతి భాసురమ్ |
వామపాణి విలోల సౌరభ వర్షికోమల వారిజం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

6. దక్షిణాది గుణాలయం శుభ సర్వ సద్గుణ సాగరం |
పాపకూప నిమగ్న జీవ సముద్ధరం ధరణీధవమ్ |
అంగుళీయక వజ్రధీధితి పాణినాஉభయదాయకం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

7. సర్వ మంగళ దేవతారమయాల సద్గురు వక్షసం |
ఉజ్జ్వలాంగ సుదర్శ నాభిధచక్ర ఖండిత రాక్షసమ్ |
శంఖచక్ర గదాஉసిశార్ఙ్గ సమాఖ్య పంచ సమాయుధం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||

8. యఃపఠేదిద మద్భుతం స్తవముత్త మోత్తమ మాగమం |
సర్వ కష్ట విముక్తి మేతి సకృత్సుఖం లభతేనరః |
క్షీరసాగర శాయినం పర మాప్నుయాత్పర పూరుషం |
వెంకటేశ్వరమాశ్రయే మమ కింకరిష్యతి వైకలిః ||