Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Saturday, January 31, 2009

శ్రీ దత్తస్వామి భజనలు

శ్రీ దత్తస్వామి భజనలు
విజయపురిన్య'స్త పాదపద్మాయతే | వామహస్తాలోల వేద శాస్త్రాయతే |
ఙ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే | శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్ ||

సర్వ విశ్వన్య'స్త పాదపద్మాయతే | వామహస్తాలోల వేదశాస్త్రాయతే |
ఙ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే | శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్ ||

శ్రీ దత్త గణపతి
1. శ్రీ మూషికన్య'స్త పాద పద్మాయతే | వామహస్తాలోల ధౌత దంతాయతే |
చారునృత్యాయతే విఘ్నరాజాయతే | శ్రీ పార్వతీ ప్రాణ పుత్రాయ వందనమ్ |
సిద్ది బుద్ధి ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ వీరభద్రుడు
2. దక్షక్రతున్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల తీక్ష్ణ ఖడ్గాయతే |
శ్మశ్రువక్త్రాయతే వీరభద్రాయతే | శ్రీ కాళికా ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ షణ్ముఖుడు
3. క్రౌంచాచలన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల శక్తి భల్లాయతే |
షణ్ముఖాబ్జాయతే తారకాంతాయతే | వల్లీశ్వరీ ప్రాణ నాధాయ వందనమ్ ||

ఈశ్వరుడు
4. శ్రీ శైల విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల కాలశూలాయతే |
ఫాలనేత్రాయతే భస్మవక్త్రాయతే | భ్రమరాంబికా ప్రాణనాధాయ వందనమ్ ||

మణికంఠుడు
5. శబరి గిరిన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల మంత్ర మాలాయతే |
హరిహరాంశాయతే సుమణి కంఠాయతే | శ్రీ మోహినీ ప్రాణ పుత్రాయ వందనమ్ ||

శ్రీ వేంకటేశ్వరుడు
6. సపశైలన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల కేళి పద్మాయతే |
పద్మ నేత్రాయతే పద్మ వక్త్రాయతే | పద్మాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ సూర్యభగవానుడు
7. ప్రాచీదిశిన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల శుక్ల వేదాయతే |
అరుణబింబాయతే సూర్యదేవాయతే | ఛాయాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ కృష్ణుడు
8. గోవర్ధనన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల చక్ర వేగాయతే |
మకుట పింఛాయతే మధుర వంశాయతే | రాధా సతీ ప్రాణనాధాయ వందనమ్ ||

శ్రీ రాముడు
9. సాకేత విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల చారు చాపాయతే |
సత్యవాక్కాయతే ధర్మ రూపాయతే | సీతా సతీ ప్రాణనాధాయ వందనమ్ ||

శ్రీ హనుమంతుడు
10. ఆకాశ విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల భూరి శైలాయతే |
రామకార్యాయతే భీమ వీర్యాయతే | సువర్చలా ప్రాణ నాధాయ వందనమ్ ||

అగ్నిదేవుడు
11. యజ్ఞాంతరన్యస్త పాద పద్మాయతే | వామ హస్తాలోల హోమ పాత్రాయతే |
సప్త జిహ్వాయతే ద్రవ్య వాహాయతే | స్వాహా సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ దేవేంద్రులు
12. ఐరావతన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల హేతివజ్రాయతే |
స్వర్గ నాధాయతే దేవరాజాయతే | శచీ సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ ఆదిశేషుడు
13. క్షీరార్ణ వన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల నాగపాశాయతే |
విష్ణుతల్పాయతే శేష దేవాయతే | శ్రీ నాగినీ ప్రాణ నాధాయ వందనమ్ ||

గరుత్మంతుడు
14. వైకుంఠ విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల పూర్ణ కుంభాయతే |
విష్ణు వాహాయతే గరుడ రాజాయతే | వినతాంబికా ప్రాణపుత్రాయ వందనమ్ ||

శ్రీ కాలభైరవులు
15. బ్రహ్మాండ విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల కాల పాశాయతే |
దత్త దూతాయతే భైరవాఖ్యాయతే | మాయాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ దత్తాత్రేయస్వామి
16. సహ్య శైలన్యస్త పాదపద్మాయతే | వామహస్తాలోల బీజమాలాయతే |
అరుణవస్త్రాయతే యోగిరాజాయతే | అనఘా సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ షిరిడీ సాయి నాధుడు
17. శ్రీ షిరిడి విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల లోహ దండాయతే |
మౌళి వస్త్రాయతే సాయినాధాయతే | శ్రీ ద్వారకామాయి వాసాయ వందనమ్ ||

శ్రీ సత్యసాయి నాధుడు
18. శ్రీ పర్తి విన్యస్త పాదపద్మాయతే | వామహస్తాలోల భస్మదానాయతే |
కేశ బింబాయతే మధుర కంఠాయతే | శ్రీ సత్యసాయీశ దేవాయ వందనమ్ ||

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
19. మైసూరు విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల యోగ ముద్రాయతే |
భక్తి గీతాయతే దత్త తత్త్వాయతే | శ్రీ సచ్చిదానంద దేవాయ వందనమ్ ||

శ్రీ ఏసుక్రీస్తు ప్రభువు
20. శ్రీ రోము విన్యస్త పాదపద్మాయతే | వామహస్తాలోల తత్త్వ ముద్రాయతే |
ఙ్ఞాన వాక్యాయతే సత్య సూర్యాయతే | మరియాంబికా ప్రాణ పుత్రాయ వందనమ్ ||