Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Friday, October 24, 2008

శ్రీ దత్త దేవునిపై పిచ్చి ప్రేమ

దత్తదేవుని పిచ్చి ప్రేమతో
నీ నిత్య సాధన తపము సాగించు
భక్తా! నీ నిత్య సాధన తపము సాగించు (పల్లవి)

1. ప్రేమతోడ తన కృష్ణుని తలచుచు
నిత్య ధర్మముల సన్యసించిన
అట్టి రాధకే భక్తి యోగమున
అందరాని గోలోక మందెనే!

2. తల్లిదండ్రులును పతులును సతులును
తనయులు తనయలు సర్వ బంధువులు
తెగితెగి పోవగ బంధములన్నియు
భగవద్భంధము ఒక్కటియె మిగుల

3. దిక్కులలో ఎటు చూచిన గానీ
పరమాత్ముండే కనిపించుచుండు
అన్నపానములు నిద్రయు నుండవు
ప్రతి నిమిషంబును దత్తదేవుడే

4. పరువు మర్యాద ధర్మము నరకము
సంప్రదాయములు పాపభీతియును
ఉల్లంఘించిన ఉన్మాదముతో
బ్రజవనితల వలె జీవించుచుండు

5. నిత్య ధర్మముల చేయనందులకు
లోకులు కాకులు పలురీతులుగా
కూయుచుండినను లెక్కింపకయే
లోక సంగమును పూర్తిగ వదలిన

6. గజములు త్రొక్కిన పాములు కరచిన
సాగరమందున ముంచి వేసినను
శ్రీ మన్నారాయణ యను యను మంత్రము
విడవని ప్రహ్లాదుని వలె నుండుచు

7. పరమాత్మ కనుల రక్త ధారలను
చూడగ ఏడ్చుచు రెండు కన్నులను
బాణము కొసతో పెకిలించి నట్టి
తిన్నని ప్రేమయె ఆదర్శముగా

8. బృందావనమున మండు టెండలో
ఇసుక రేణువుల నిప్పుల కణముల
నడుచుచు మాధవ మాధవ యనుచును
విలపించి రాధ ప్రాణము విడచెను

9. స్వామి కోసమై ఏకైక సుతుని
శిరియాళుని తమ చేతుల చంపియు
వండినట్టి ఆ తల్లి దండ్రులే
భక్తియోగమున పరాకాష్టగా!

10. తల్ల్లిని విడచిన బాలశంకరుడు
తండ్రిని విడచిన ప్రహ్లాద శిశువు
భార్యాపుత్రుల రాజ్యము విడచిన
బుద్ధదేవుడే నీ ధ్యేయముగా

11. ముత్యాల హార మిచ్చిన గానీ
రాముడు లేడని కొరకుచు విసరెను
నఖముల హృదయము చీల్చి చూపెగా
శ్రీ రాముని హనుమంతుడటులనే

12. ముళ్ళ కిరీటము రక్తము కారగా
కొరడా దెబ్బల వాతలు పడుచును
దేవుని కొరకై - శిలువ మోయుచును
నడచు చున్నట్టి క్రీస్తును తలచుచు
Download the audio of this bhajan sung by a devotee here

No comments: