Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, July 2, 2009

Typing errors in bhaktigana-2 part

Dear all
Whoever downloaded bhaktiganga-part-2, please note that there are some typing errors. Hence this part is removed from the download list. Once all the corrections are made, it will be uploaded again.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, June 8, 2009

అవతీర్ణనరో బ్రహ్మ

శ్లో. అవతీర్ణనరో బ్రహ్మ మార్గః కర్మ కర్మ ఫలార్పణం
జీవః సృష్టి కణః సృష్టిః మిధ్యా తస్యైవ నాత్మనః

తా. అవతరించిన నరావతారమే బ్రహ్మము. ఆ బ్రహ్మమును ప్రసన్నము చేసుకొను మార్గము కర్మ మరియు కర్మ ఫలము యొక్క సమర్పణమే. జీవుడు సృష్టి లోని ఒక అత్యల్ప మైన కణము. ఈ సృష్టి బ్రహ్మమునకే మిధ్య కానీ, జీవునకు కాదు.

Sunday, April 12, 2009

Download

You can download Telugu lyrics of Bhajans Composed and Sung by H H Shri Dattaswami here.


Download Bhaktiganga Part-1

You can also download a Telugu message of Swamiji with meaning of Gayatri Mantra, meaning of Vedic hymns in hindu marriages and rituals and a message to Brahmin priests.
Download dattamessage.pdf

At Lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, February 6, 2009

భైరవాయతే - కాల భైరవాయతే

భైరవాయతే - కాల భైరవాయతే
ప్రదక్షిణానిమే - దేవ - మూఢ భక్తస్య || (పల్లవి)

1. కాశికాపురీ క్షేత్ర లోక పాలనం
పింగళేక్షణ - స్పురణ మాత్రమేవతే
భువన భాండక - ప్రళయ భస్మ కారకో
గర్జనోద్ధత - ధ్వని - కణస్తవ ప్రభో ||

2. అష్ట సిద్ధయో - ప్యష్ట - భూతిభిస్సహా
భూత నాధతే - కరుణ - వేశ సంభవా:
సారమేయవత్ - త్వయి సమర్పితార్ధినాం
బోధయత్యహో - శునక - వాహనం తవ ||

3. అరుణ వాసనం - భైక్ష్య - భస్త్రికాభుజం
సాగ్ని పాత్రకం - పృధుల - మార్జనీధరం
శ్మశ్రుభీకరం - కాల - దండ మండితం
కాళికా పతిం - కాల - కాలమాశ్రయే ||
!----------------------------------------------
2. కాలభైరవ స్వామీ - కదలి రావా ఏమీ

కాలభైరవ స్వామీ - కదలి రావా ఏమీ
కాశీపుర పాలక పాహి - కామితార్ధం మమదేహి

కాల జటాలంకృత చంద్రకళాధర
కాలాగ్ని కుండ ఫాల లోచనహర
కాళికా హృదయ కమలినీచర
కాలదండ వలయ భ్రామణ కర

Thursday, February 5, 2009

శ్రీ త్రిశూల మహా స్తోత్రం

1. కాలకాల కరాళ శూలం -కామితార్ధం కల్ప యేన్నః
ప్రళయకాల భయానకోగ్రం- విద్యుదగ్ని వివర్షణాగ్రం

2. రాక్షసాధమ భస్మశేషం - రావణస్ధవ వక్త్ర ఘోషం
మన్మధాకృతి దాహ రోషం - త్రివిధ కర్మ ఫలాగ్రవేషం

3. దత్తసేవక శత్రునాశం - ఖండితాత్మ ప్రతిఫలాశం
పాతితాంతక జగదధీశం - భూతభీకర కాల పాశం

4. విద్యుదుజ్జ్వల దగ్నిజాలం - కౌరవాణాం మరణ లోలం
పార్ధ ద్రుశ్యం గరళ నీలం - వ్యాసబోధాద్విదిత నీలం

శ్రీ మన్నారాయణ సుదర్శనాస్త్ర స్తోత్రము

1. వందనీయం విష్ణు చక్రం - వారణార్ధం ఛిన్న నక్రం
ఖండితాసుర వృత్తి వక్రం - రక్షితామర లోక శక్రం

2. ఆశ్రితామర భాగధేయం - విక్రమోజ్జ్వల మప్రమేయం
ఆగమాంతర మంత్ర గేయం - శ్రీ సుదర్శన నామ ధేయం

3. కార్తవీర్య మహావతారం - చోరదండన లోక చారం
ధారయాహృత భూమి భారం - విద్యుదుజ్జ్వల వల్లి హారం

4. మాధవాంగుళి నాభి సారం - దత్తభక్త విపత్తి పారం
అష్టసిద్ది మహాత్త్వ పూరం - శత్రు కర్తన కోటి హీరం

శ్రీ బ్రహ్మాస్త్ర స్తోత్రము

1. నమో నమో బ్రహ్మాస్త్రాయ - సర్వశోక వినాశకాయ
సాంధ్య ధీధితి భామయాయ - వేద మంత్ర ప్రజ్వలనాయ

2. ఇచ్ఛ యైవ వ్యక్త జగతే - సర్వసాధ్య విభూతి మహతే
అప్రతీప మేవ విశతే - బ్రహ్మతేజో రాశి లసతే

3. జప కమండలు తోయజాయ - బ్రహ్మ వాక్య విజృంభితాయ
సర్వ దేవత వందితాయ - సేవకాయిత సర్వాస్త్రాయ

4. అనఘా శక్తి ప్రచోదకాయ - దత్తాత్రేయ స్వరూపకాయ
ఆగమ విద్యుదుజ్జ్వలాయ- జ్ఞానమహాగ్నిజ్వాలికాయ

Saturday, January 31, 2009

శ్రీ దత్తస్వామి భజనలు

శ్రీ దత్తస్వామి భజనలు
విజయపురిన్య'స్త పాదపద్మాయతే | వామహస్తాలోల వేద శాస్త్రాయతే |
ఙ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే | శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్ ||

సర్వ విశ్వన్య'స్త పాదపద్మాయతే | వామహస్తాలోల వేదశాస్త్రాయతే |
ఙ్ఞాన సూర్యాయతే దత్తరూపాయతే | శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనమ్ ||

శ్రీ దత్త గణపతి
1. శ్రీ మూషికన్య'స్త పాద పద్మాయతే | వామహస్తాలోల ధౌత దంతాయతే |
చారునృత్యాయతే విఘ్నరాజాయతే | శ్రీ పార్వతీ ప్రాణ పుత్రాయ వందనమ్ |
సిద్ది బుద్ధి ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ వీరభద్రుడు
2. దక్షక్రతున్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల తీక్ష్ణ ఖడ్గాయతే |
శ్మశ్రువక్త్రాయతే వీరభద్రాయతే | శ్రీ కాళికా ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ షణ్ముఖుడు
3. క్రౌంచాచలన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల శక్తి భల్లాయతే |
షణ్ముఖాబ్జాయతే తారకాంతాయతే | వల్లీశ్వరీ ప్రాణ నాధాయ వందనమ్ ||

ఈశ్వరుడు
4. శ్రీ శైల విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల కాలశూలాయతే |
ఫాలనేత్రాయతే భస్మవక్త్రాయతే | భ్రమరాంబికా ప్రాణనాధాయ వందనమ్ ||

మణికంఠుడు
5. శబరి గిరిన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల మంత్ర మాలాయతే |
హరిహరాంశాయతే సుమణి కంఠాయతే | శ్రీ మోహినీ ప్రాణ పుత్రాయ వందనమ్ ||

శ్రీ వేంకటేశ్వరుడు
6. సపశైలన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల కేళి పద్మాయతే |
పద్మ నేత్రాయతే పద్మ వక్త్రాయతే | పద్మాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ సూర్యభగవానుడు
7. ప్రాచీదిశిన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల శుక్ల వేదాయతే |
అరుణబింబాయతే సూర్యదేవాయతే | ఛాయాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ కృష్ణుడు
8. గోవర్ధనన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల చక్ర వేగాయతే |
మకుట పింఛాయతే మధుర వంశాయతే | రాధా సతీ ప్రాణనాధాయ వందనమ్ ||

శ్రీ రాముడు
9. సాకేత విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల చారు చాపాయతే |
సత్యవాక్కాయతే ధర్మ రూపాయతే | సీతా సతీ ప్రాణనాధాయ వందనమ్ ||

శ్రీ హనుమంతుడు
10. ఆకాశ విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల భూరి శైలాయతే |
రామకార్యాయతే భీమ వీర్యాయతే | సువర్చలా ప్రాణ నాధాయ వందనమ్ ||

అగ్నిదేవుడు
11. యజ్ఞాంతరన్యస్త పాద పద్మాయతే | వామ హస్తాలోల హోమ పాత్రాయతే |
సప్త జిహ్వాయతే ద్రవ్య వాహాయతే | స్వాహా సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ దేవేంద్రులు
12. ఐరావతన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల హేతివజ్రాయతే |
స్వర్గ నాధాయతే దేవరాజాయతే | శచీ సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ ఆదిశేషుడు
13. క్షీరార్ణ వన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల నాగపాశాయతే |
విష్ణుతల్పాయతే శేష దేవాయతే | శ్రీ నాగినీ ప్రాణ నాధాయ వందనమ్ ||

గరుత్మంతుడు
14. వైకుంఠ విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల పూర్ణ కుంభాయతే |
విష్ణు వాహాయతే గరుడ రాజాయతే | వినతాంబికా ప్రాణపుత్రాయ వందనమ్ ||

శ్రీ కాలభైరవులు
15. బ్రహ్మాండ విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల కాల పాశాయతే |
దత్త దూతాయతే భైరవాఖ్యాయతే | మాయాసతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ దత్తాత్రేయస్వామి
16. సహ్య శైలన్యస్త పాదపద్మాయతే | వామహస్తాలోల బీజమాలాయతే |
అరుణవస్త్రాయతే యోగిరాజాయతే | అనఘా సతీ ప్రాణ నాధాయ వందనమ్ ||

శ్రీ షిరిడీ సాయి నాధుడు
17. శ్రీ షిరిడి విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల లోహ దండాయతే |
మౌళి వస్త్రాయతే సాయినాధాయతే | శ్రీ ద్వారకామాయి వాసాయ వందనమ్ ||

శ్రీ సత్యసాయి నాధుడు
18. శ్రీ పర్తి విన్యస్త పాదపద్మాయతే | వామహస్తాలోల భస్మదానాయతే |
కేశ బింబాయతే మధుర కంఠాయతే | శ్రీ సత్యసాయీశ దేవాయ వందనమ్ ||

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
19. మైసూరు విన్యస్త పాద పద్మాయతే | వామహస్తాలోల యోగ ముద్రాయతే |
భక్తి గీతాయతే దత్త తత్త్వాయతే | శ్రీ సచ్చిదానంద దేవాయ వందనమ్ ||

శ్రీ ఏసుక్రీస్తు ప్రభువు
20. శ్రీ రోము విన్యస్త పాదపద్మాయతే | వామహస్తాలోల తత్త్వ ముద్రాయతే |
ఙ్ఞాన వాక్యాయతే సత్య సూర్యాయతే | మరియాంబికా ప్రాణ పుత్రాయ వందనమ్ ||