Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, February 5, 2009

శ్రీ మన్నారాయణ సుదర్శనాస్త్ర స్తోత్రము

1. వందనీయం విష్ణు చక్రం - వారణార్ధం ఛిన్న నక్రం
ఖండితాసుర వృత్తి వక్రం - రక్షితామర లోక శక్రం

2. ఆశ్రితామర భాగధేయం - విక్రమోజ్జ్వల మప్రమేయం
ఆగమాంతర మంత్ర గేయం - శ్రీ సుదర్శన నామ ధేయం

3. కార్తవీర్య మహావతారం - చోరదండన లోక చారం
ధారయాహృత భూమి భారం - విద్యుదుజ్జ్వల వల్లి హారం

4. మాధవాంగుళి నాభి సారం - దత్తభక్త విపత్తి పారం
అష్టసిద్ది మహాత్త్వ పూరం - శత్రు కర్తన కోటి హీరం

No comments: