Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, February 5, 2009

శ్రీ బ్రహ్మాస్త్ర స్తోత్రము

1. నమో నమో బ్రహ్మాస్త్రాయ - సర్వశోక వినాశకాయ
సాంధ్య ధీధితి భామయాయ - వేద మంత్ర ప్రజ్వలనాయ

2. ఇచ్ఛ యైవ వ్యక్త జగతే - సర్వసాధ్య విభూతి మహతే
అప్రతీప మేవ విశతే - బ్రహ్మతేజో రాశి లసతే

3. జప కమండలు తోయజాయ - బ్రహ్మ వాక్య విజృంభితాయ
సర్వ దేవత వందితాయ - సేవకాయిత సర్వాస్త్రాయ

4. అనఘా శక్తి ప్రచోదకాయ - దత్తాత్రేయ స్వరూపకాయ
ఆగమ విద్యుదుజ్జ్వలాయ- జ్ఞానమహాగ్నిజ్వాలికాయ

1 comment:

sahasra said...

chala bagundhi mee information