Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, February 8, 2010

శరణు స్తుతి - దత్త దిగంబర తవ శరణం

గురుదత్త దిగంబర తవశరణం దత్త
దత్త దిగంబర తవ శరణం || (పల్లవి)

1. అత్రి సుతా అనసూయ నందన
యోగి రాజ గురుతవ శరణం
శ్రీ యోగిరాజ గురు తవ శరణం || గురుదత్త...

2. కార్తవీర్య భుక్తి ముక్తి ప్రద
పింగళ పూజిత తవశరణం
శ్రీ పింగళ పూజిత తవ శరణం || గురుదత్త ...

3. శ్రీ పాద శ్రీ వల్లభయతి వర
నృసింహ సరస్వతి తవ శరణం
శ్రీ నృసింహ సరస్వతి తవ శరణం || గురుదత్త...

4. నారాయణ భైరవ మాణిక్యప్రభు
అక్కల్ కోట గురు తవ శరణం
శ్రీ అక్కల్ కోట గురు తవ శరణం || గురుదత్త...

5. ఏక నాధ జనార్ధన స్వామి
వాసుదేవ గురు తవ శరణం
శ్రీ వాసుదేవ గురు తవ శరణం || గురుదత్త...

6. ఘోరక గర్వ వినాశక కర్త
అవధూత నిరంజన తవశరణం
శ్రీ అవధూత నిరంజన తవశరణం || గురుదత్త...

7. హీన దీన తారక పురుషోత్తమ
రంగ తార గురు తవ శరణం
శ్రీ రంగ తారగురు గురు తవ శరణం || గురుదత్త...

8. పూర్ణ పరాత్పర సగుణ గుణేశ్వర
సాయినాధ గురు తవ శరణం
శ్రీ షిరిడి సాయినాధ గురు తవ శరణం || గురుదత్త...

9. సద్గురు మూర్తి సాయి స్వరూప
సత్యసాయి గురు తవ శరణం
శ్రీ సత్యసాయి గురు తవ శరణం || గురుదత్త...

10. అవధూత పీఠపతి గణపతి
సచ్చిదానంద గురు తవ శరణం
శ్రీ సచ్చిదానంద గురు తవ శరణం || గురుదత్త...

11. ఙ్ఞాన సరస్వతి గాన ధ్యాన ప్రద
దత్త స్వామి గురు తవ శరణం
శ్రీ దత్త స్వామి గురు తవ శరణం || గురుదత్త...

No comments: