Download

తెలుగు భక్తిగంగ-1: (Download)

స్వామి గారిచే ఆశువుగా పాడబడిన భక్తి భజనలను మీరు పొందగలరు. ఈ భజనలను భక్తి గంగ అను పుస్తకము ద్వారా కూడా పొందగలరు.

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

తెలుగు సందేశములు-1: (Download)

Monday, February 8, 2010

శ్రీకాలభైరవ కాలదండ స్తోత్రమ్

1. కాలభైరవ కాలదండం - కంపతర్జిత బ్రహ్మాండం|
దత్తసేవక రక్షణార్ధం - ప్రార్ధయామో బద్ధ దీక్షం||

2. దత్తభక్త విరోధి మారం - నామ శేషిత దైత్యశూరం|
ఆయుధానా మేకవీరం - ధ్వస్తత్రి జగదహంకారం||

3. లోకభాండ విబేధ దక్షం - దుష్ఠశిక్షణ శిష్ఠ పక్షం|
సృష్టి చక్ర పరిభ్రమాక్షం - సర్వ రాక్షస జాతి రూక్షం||

4. వేద పూరుష పాణి నీతం- దత్తదేవ కటాక్ష పూతం|
జీవకర్మ విపాకపాకం - గర్వితాసుర హ్రుదయ ఖాతం||

1 comments:

Claudia Lawrence said...

Nice blog & good post. overall You have beautifully maintained it, you must try this website which really helps to increase your traffic instantly. hope u have a wonderful day & awaiting for more new post. Keep Blogging!