Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Friday, May 2, 2008

గోవింద గోవింద నామమేచాలు

గోవింద గోవింద నామమేచాలు
అన్నపానములేల ? సంసారమేల ? (పల్లవి)

ఏడు కొండలనెక్కి ఈక్షించియుంటినే ఏడేడు లోకాల అందగాడే వాడు
బ్రహ్మర్షులైనట్టి పురుషులే మోహించి కౌగిలింతల వాని ముద్దాడ మనసాయె

ఆ కన్నులాకర్ణ సువిశాలములు జూడ మెరిసేటి మీనముల తలపింపచేసెనే
కనురెప్పలాతామ్ర పద్మముల మురిపించు పద్మలోచనుడన్న నిజముగా వాడేనే

ఆ ముద్దు పెదవులను చుంబించ పిచ్చెక్కె తియ్యమామిడి లేత చిగురులె కనిపించె
ఆ బుగ్గలరుణాలు కొరకంగ వెర్రెక్కె పన్నీర పుష్పాల తళుకులను చిందించు

ముత్యాల పలువరస సన్న నవ్వుల వెలుగు హిమబిందువుల చిందుసూర్యాంశువులబోలు
అందాలమెక్కినది ముచ్చటైనది ముక్కు సంపెంగ తలవంచె నూగుపూవును మించె

ఆజానుబాహువులు అరవింద చరణాలు సువిశాల వక్షమున వైజయంతీ మాల
శంఖచక్రములొప్ప వరదాభయకరాల వాసుదేవుడె వాడు శ్రీ వెంకటేశ్వరుడు

వజ్రవైడూర్యాది కనకాభరణములను అంగాంగముల కప్పి ముంచివేశారె
పెద్దపెద్దవి పట్టె నామాల నుదుటిపై అందాల దాచారె దిష్టి తగ్గించగా

ధీరుడె శృంగార సార్వభౌముడె వాడు లోకాల నేలేటి ఠీవితో నిలిచాడె
లావణ్య చందిరుడు తారుణ్య భాస్కరుడు కారుణ్య సాగరుడు వాడొక్కడేనే

పాదాల వేదాలు కుక్కలై పడియుండు పరమ పావనుడతడు పరమాత్మ దత్తుండు
విశ్వకర్తయు భర్త హర్తయును వాడేను అడుగడుగు దండాల మ్రొక్కేరు సురమునులె

Download this bhajan sung by Shri Dattaswami here.

No comments: