Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Sunday, May 4, 2008

కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !

(ఇది స్వామి వారి అత్యద్భుత కీర్తన.)

కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !
నా ప్రాణదీపం - కొండెక్కముందె
కొండలరాయ! నీ - కోనేటి లోన
ఒకసారి మునకేతునా ?
నా ప్రాణనాథా ! శ్రీ వెంకటేశా ! (పల్లవి)

జీవించినా లేక మరణించినా స్వామి !
మరల జన్మించినా లేక - ఏ లోకమందున్నను
చింతాకు చింతయును నా మదిని లేదెపుడు
నీ నామగానమ్ము నాకిమ్ము అదిచాలు.

నీ ప్రేమ కోసమే - నా జీవితంబంత
కర్పూర నీరాజనంబుగా కాలనీ
గోవింద గోవింద పిలుపుతో తపనతో
నా చిట్టచివరి నిశ్వాస మాగిపోనీ!

నిన్నెంత తలచినా - సంతృప్తి రాదయ్యె
తీరమన్నది లేని - ప్రణయసాగరమీవు
నా జీవితేశ్వరా ! నీ తరంగాలలో
తేలియాడుచు తుదకు నను మునిగిపోనీ

నవకోటి మన్మధా ! - నీ పొందు లేకున్న
ఈ జగముతో పొందు - ఇపుడె ఆగిపోనీ
నీ కౌగిలింతయే - లేకున్న గోపాల !
విరహాగ్నిలో నన్నిక - భస్మమైపోనీ

నీ పెదవి ముద్దాడలేకున్న నా పెదవి
నీ విరహ శిఖలలో - కమిలి మాడిపోనీ
నీ దర్శనంబింక నాకు లేకున్నచో
నీకొండ నుండి దూకి ముక్కలై పోనీ

సప్త శైలన్యస్త - పాద పద్మాయతే
వామహస్తాలోల - కేళి పద్మాయతే
పద్మ నేత్రాయ తే పద్మవక్త్రాయ తే
పద్మావతీ ప్రాణనాధాయ వందనమ్

No comments: