Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Sunday, May 4, 2008

అదిగో తిరుపతి - అదిగో తిరుమల

(స్వామి కొండపైకి చేరిన తరువాత జరిగిన సుప్రభాత సేవ)

అదిగో తిరుపతి - అదిగో తిరుమల
వెంకట దత్తుని మందిరమదిగో (పల్లవి)

1. సప్త మహర్షులు సంభ్రమ దృష్టులు కరముల మానస పద్మములొప్పగ
వేచియుండిరట పద్మామానసు డగు హరి విప్పడు పద్మ నేత్రముల

2. మహతీ వీణను మీటుచు పాడును నారదుడచ్చట నారాయణయని
కాని వనమాలి కర్ణమునీయడు పద్మాగళ మాధుర్యము తలచుచు

3. కిన్నర కృతములు మంగళ తూర్యము లవిగో మిన్నును ముట్టుచుండెనట
కలకల నవ్వెడి పద్మావతినే స్మరించు ఈశుడు మేల్కొనడాయెను

4. దేవతలిచ్చెడి కర్పూరగంధ మేఘములచ్చట ఘుమ ఘుమలాడును
అయినా హరిమది పద్మాప్రణయము దివ్యగంధముల మత్తున మునిగెను

5. అప్సరసలు సరసాంగ నృత్యముల ఆడుచుండిరట ఆలోకింపడు
కృష్ణదత్తుడదె అంతరంగమున పద్మ నడకలను కులుకుల చూచును

6. నిన్ను కట్టుటకు భక్తియె మార్గము కిటుకును తెలిసితి చిక్కితివిదిగో
గోవింద దత్త ! గోవిందా హరి ! గోవింద కృష్ణ ! గోవింద పద్మ !
(ఇదే భక్తి లేని పూజయని స్వామి చెప్పినారు.)

Download this bhajan sung by Shri Dattaswami here.

No comments: