Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Sunday, May 4, 2008

అడుగో | అల్లడుగో | వేంకట దత్తుడు

(నారాయణుడు వైకుంఠమును వీడి శ్రీ లక్ష్మి కొరకు భూలోకానికి పరుగిడుట)
అడుగో అల్లడుగో వేంకట దత్తుడు (పల్లవి)

1. తియ్య మామిడి చిగురు లేత పెదవులందు - చిందెడి సన్న నవ్వు వాడు
ఉదయాన సరసులో విచ్చుచున్న - కమలాలబోలు నయనములవాడు

2. నీటుగానున్న సంపెంగ సుమము - బోలు నాసంబుతో వెలుగువాడు
పన్నీర పుష్పాల తళుకు లొలుకు - లేత బుగ్గల నెర్రతనము వాడు

3. ఊర్ధ్వ త్రిపుండ్రంబులుజ్జ్వలముగా - భాసించుచుండు నిటలంబువాడు
తప్త కాంచన దీప్తి మెరుపులొప్ప - పీతాంబరోజ్జ్వ లాంచలమువాడు

4. కొండ బండల మీద నర్ధరాత్రి - పద్మ కొరకై పరుగుతోడ
దిగుచున్న వాడతడు పలుగురాళ్ళ - కాలి గాయముల లెక్కింపడెపుడు

5. నిస్వార్ధ భక్తికై ప్రాణమైనను - తృణముగా త్యాగంబు సేయువాడు
కోటి యఙ్ఞములైన జపతపములు - పూజలైనను వాని కట్టలేవు

Download this bhajan sung by Shri Dattaswami here.

No comments: