Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Tuesday, April 8, 2008

శివ కీర్తనలు - 1

(ఉపమన్యువను పసిబాలుని అనుగ్రహించి పాల సముద్రమును ఒసంగిన కీర్తన )
చంద్రశేఖరా దయాసాగరా
వామదేవా! నిను వర్ణించగలనా ? (పల్లవి)

1. ఉపమన్యువనెడి తాపసబాలుడు - పాలు లేక విలపించె నాశ్రమమున
దిక్కుతోచని తల్లి పలికెను - సర్వేశ్వరునే అడుగు పొమ్మని

2. అంతట బాలుడు బయలుదేరెను - దుర్గమారణ్య మార్గమందున
నాన్నా! శంకర! పాలనీయవా! - అన్న వాక్యమే మంత్రమాయెను

3. ప్రళయ భయంకరుడైనను నీవు - కరిగిపోతివి కరుణార్ణవమా
యుగయుగ తపముల కందనివాడవు - క్షణమున ఎదురుగ నిలిచినావు

4. ఫాలనేత్రము నుండియు కురిసెను - వేడి వేడి కన్నీటి ధారలు
పాలబుగ్గల పసివానిఁ జూసి - నాన్నా రమ్మని కౌగలించితివి

5. తొడను కూర్చుండ పెట్టుకొంటివి - చేతిలోనికే పరుగున వచ్చెను
పాలసముద్రమె బాలున కీయగ - నీ కరుణఁ జూచి అసురులె ఏడ్చిరి

Download this bhajan sung by Shri Dattaswami here
--------------------
(పార్ధునికి పాశు పతాస్త్రము అనుగ్రహించిన కీర్తన.)
బయలుదేరినాడే - బోయవేషముల
పార్ధునితోడ యుద్ధముచేయగా
పార్వతితో పరమేశ్వరుడు (పల్లవి)

1. కైలాసము వీడి కదలివచ్చినాడే - కలకలనవ్వెడి కలికి వెంటరాగ
మందాకిని తట మందగమనమున - మందహాసమున భక్త మందారుడు

2. అడుగులు వేయుచు గంభీరముగా - ఎర్రని జటలవె ఎగురుచుండగా
చేతుల నూపుచు వీరాధి వీరుడు - మృగములరాజగు సింహము రీతిగ

3. శిరసు చంద్రకళ పక్షి యీకెగను - ఫాలనయనమె కుంకుమ బొట్టుగ
ఉరగ భూషణములు పూసలదండలు - మారిపోవ శివ కోయరాజతడు

4. ఆదిదేవుని అడుగుల బాటను - హిమగిరి వనమదె అప్పటికప్పుడె
పుష్పములరాల్చి పూలబాటగా - అర్చించెనట అనఘా ప్రియుని

5. అతిధీరముగా అతి విలాసముగా - వామదేవుని నడకల సొగసులు
తనివితీరగా ఆలోకించిరి - ఆకాశమందు అప్సరసలట

6. అనవసరముగా రెచ్చగొట్టియు - ఓడించిమరల గెలిపించి నరుని
అనుగ్రహించెనదె పాశుపతమిచ్చి - అపార కరుణా సాగరుడతడే

Download this bhajan sung by Shri Dattaswami here

--------------------
కింకరోஉస్మి తవ శంకర ! నూనం
భక్తవ శంకర ! పాహి పాహి శివ ! (పల్లవి)

1. హిమాంశురేఖా ముక్తావళీవ - జాటజూట మకుటోపరి భాతి
ఉష్ణీవస్త్ర శేషవదేషా - ధవళా తరళా గంగాధారా

2. మణి దీధితి మత్కాల సర్పకుల - మిన్ద్ర నీలమణి హారచయఃకిమ్‌ ?
లలాటనయనం వహ్నిభిరరుణం - విభూతి రేఖా కుంకుమబింబమ్‌

3. పినాక పాణే! పాశుపతాస్త్రం - పార్ధాయ దిశసి పరమోదార !
మునిశిశవేత్వం క్షీరాబ్ధిమేవ - గౌరీమేవచ దశకణ్ఠాయ
Download this bhajan sung by Shri Dattaswami here

------------------
అన్నపూర్ణతో ఆసినుడైన - ఆదిదేవుడా! ఆలకించవా
నన్నేలుమింక నారాయణ ప్రియ! - నాకెవరు దిక్కు నాగేంద్ర హార! (పల్లవి)

1. వారణాసిలో విశాలాక్షితో - వేదపీఠమున వెలిగేటి దేవ!
జీవ భక్తులకు మాయలముడులను - తలి విప్పగా మోక్షమిచ్చేవు

2. గంగలో మునుగ ముక్తులయ్యేరు - బ్రహ్మ ఙ్ఞానమె గంగానది యన
జలములమునిగెడి పశువులఁజూచెడి - మందస్మితముఖ ! పశుపతినాధ !

3. ఙ్ఞానమె తేజము కాశి అర్ధమదె - ఙ్ఞానప్రాప్తియె కాశీగమనము
భక్త్యావేశమె గంగా స్నానము - పరమార్ధ దత్త ! పరమేశ వేష !

4. సర్వపాపహర ఈ భక్తి గంగ - నీ కరుణ హిమమై ప్రవహించెనదిగ
అంతరార్ధమున పశుపతిని పొందు - బాహ్యార్ధమైన పశుజన్మ పొందు

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: