Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Friday, April 18, 2008

కృష్ణ కీర్తన

శ్రీ దత్త భగవానుని షోడశ కళలతో అవతరించిన పరబ్రహ్మమే శ్రీ కృష్ణ పరబ్రహ్మము. అందులకే శ్రీ కృష్ణ భగవానుల అవతారమును పరిపూర్ణ తమావతారముగా వర్ణించుట జరిగినది.

1. ఋషివరాణాం మానసాలోలహంసాయ - మకుటాన్తమయూర పింఛావతంసాయ
ఏకప్రహారేణ విధ్వస్తకంసాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

2. వ్యత్యస్త విన్యస్త పాదారవిన్దాయ - మధురామృతాసార మురళీనినాదాయ
జాజ్వల్యమానాంశు పీతామ్బరాఙ్గాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

3. ఆకర్ణ తేజస్వి మీనాయతాక్షాయ - ప్రత్యూష పద్మాంశు నేత్రచ్ఛద యుగాయ
కమల లోచన కాంతి సమ్మోహనాస్త్రాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

4. ఆముక్త ముక్తావళీ జాల హారాయ - గోపీ దధి క్షీర నవనీతచోరాయ
బృందావనే వల్లవీ బృంద జారాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

5. సాయంతనే ధేను బృన్దాను గమనాయ - మార్గమధ్యే వల్లవీ కుంచితాక్షాయ
రాధాజగన్మోహినీ మోహనాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

6. కాళీయ ఫణి ఫణా సంక్షోభ నటనాయ - కాంచీక్వణ త్కింకిణీ నిస్వనాయ
గోవర్ధనోద్ధరణ లీలాస్మితాస్యాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

7. కస్తూరికాతిలక రేఖాలలాటాయ - తులసీ స్రగామోద వక్షః కవాటాయ
పార్ధాయ విశ్వరూపాలోలఖేటాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

8. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతాయ - గోపీ సహస్రేణ సంవేష్టితాఙ్గాయ
రాసే రసే సర్వదా సద్వినోదాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: