Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, April 3, 2008

ఓం నమః శివాయ ఓం నమః శివాయ

(శివ పంచాక్షరీ మహిమ వర్ణనము.)
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
పంచాక్షరి యిది పరమ పావనము (పల్లవి)

1. పంచభూతములపై ఆధిపత్యమును - ప్రసాదించగల మహామంత్రము
సుందర కవితా చాతుర్యరీతి - ననుగ్రహించెడి మహా మంత్రము

2. వేదాంత జలధి మధనామృతమగు - ఙ్ఞానమునిచ్చెడి మహామంత్రము
సర్వ విక్షోభ ప్రశమన కరమై - మనశ్శాంతినిడు మహామంత్రము

3. అష్టసిద్ధులను అవలీలగాజేయు - శక్తినిచ్చెడి మహామంత్రము
చక్రాలదాటి సహస్రారమున - శివునిఁ జేర్చెడి మహామంత్రము

4. ఆదిదేవుని అంఘ్రి పద్మముల - భక్తి నొసగెడి మహామంత్రము
నిష్టానిశ్చల యమనియమాసన - ధ్యానయోగకర మహామంత్రము

5. సంసారవాసనా విషయధ్వంసక - కామదహనమీ మహామంత్రము
అనన్యమద్భుత వైరాగ్యమిచ్చు - సర్వ పాపహర మహామంత్రము

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: