Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Sunday, April 27, 2008

బ్రహ్మోత్సవాల ఊరేగు పరబ్రహ్మమును చూడగ రారండి

బ్రహ్మోత్సవాల ఊరేగు పరబ్రహ్మమును చూడగ రారండి
చతుర్దశ భువన వాసులారా ! (పల్లవి)

1. ఏడు కొండలవె ఎంతో ఎత్తుగ - నీల గగనమును చుంబించునెపుడు
నీలమేఘరుచి సంభ్రమ మతులై - నీలవర్ణుడగు స్వామియనిఁ దలచి

2. కనక తోరణములుజ్జ్వల దీపము - లుత్తుంగ రధము భక్తార్ణవమదె
అడుగో రధమున గరుడుడు మూపున - అడుగో అడుగో అరవిందాక్షుడు

3. రాజాధిరాజ పదవులున్నను - కోట్ల కోట్లకును పడగ లెత్తినను
పగ్గముల బట్టి రధమును లాగుచు - స్వామి బండి పశు పదవికి పరుగులు

4. అదృశ్య రూపులు ఇంద్రాది సురలె - రధమును లాగుచు స్వామి సేవలకు
తోసుకతోసుక పరుగులెత్తుదురు - ఈ నర చీమలు స్వామి ముందెంత?

5. సప్తమహర్షులు కనక కమలముల - పదములనుంచుచు అర్చించుచుండ
అర్చకులారా ! ఓ నరులారా ! - మీరెంత తెలిసి వినయమునుండుడు

6. కసరబోకుడీ భక్తుల నెవరో - ప్రహ్లాదుడో మరి తిన్నడో ఉండును
స్వామి మనమునకు ఖేదము కలుగును - తనకన్న భక్తులెక్కువ స్వామికి

Download this bhajan sung by Shri Dattaswami here.

No comments: