Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Saturday, April 26, 2008

సర్వ జీవులకు మొగుడైన మొనగాడా

సర్వ జీవులకు మొగుడైన మొనగాడా !
పదనారు వేల రాజ కన్యలకు ప్రియుడైన వాడా ! (పల్లవి)

శ్రీ వేంకటేశుడా ! నీ అందాలు ఎన్నెన్నో - చిందులేసెడి స్మరశత సుందరాంగుడా !
నీ కమలనయనాల సొగసులవె నర్తించు- పద్మావతీ హృదయ రంగమున యువతులవలె

బ్రహ్మోత్సవంబుల గరుడ వాహన ! నీవు - తిరుమల వీధులలో ఊరేగింపులలో
లలితంబుగా నూగుచు వయ్యారమొప్పుగ - అలరారు చుండేవు అరవిందలోచన !

నీ అందమె అందమురా నీ కులుకె కులుకురా -నీ పలుకె పలుకురా నీ తళుకె తళుకురా
మోహిని రూపధరుడ ! నవమోహనాకారా - నీ కమల కన్నులు చాలురా నాచూపు నిలుపంగ

అలివేలు మంగయును అలుక బెట్టును వీడి - అంతఃపురమున నిలిచి ఆలోకించునదిగో
గరుడ హనుమదాదుల నధిరోహించి నీవు - ఊరేగింపులలో వెడలు వయ్యారమును

బ్రహ్మరధము పైన బ్రహ్మోత్సవాలలో - బ్రహ్మాండవాసులగ బ్రహ్మాదులె నిరీక్షించ
నీ శయ్యయగు శేషుని నేరుగఁజూచేవు - వాలు చూపుల పద్మను కన్నుగీటేవుగా !

పట్టెనామాలతో పట్టు పీతాంబరమ్ముతో - మెరయు వజ్రాభరణాల జనసాగరమ్ములో
గాంభీర్యముగ నూరేగింపుచుండ - నిను జూచు భక్తులే నిత్యముక్తులు బ్రహ్మానందమదియె

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: