Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, March 6, 2008

అందరాని ఆ బ్రహ్మ మేలనో

అందరాని ఆ బ్రహ్మ మేలనో
పొందలేని ఆ ముక్తి యేలనో (పల్లవి)

మానవాకృతిన్ దాల్చు బ్రహ్మమే - వానిచేరుటే బ్రహ్మ యోగమౌ
వానిసేవలో నిత్య మోదమే - సత్య మోక్షమౌ ఇచట ఇప్పుడే
అంది వచ్చిన బ్రహ్మమిదిగదా - మూఢమానవా! వదలబోకుమా
సంశయంబుతో కాలమరుగగా - చిట్టచివరలో మొత్తుకొందువు
సద్వినోదియై జగముచేసెగా - సాక్షి మాత్రిడై చూచి తుష్టుడై
తృప్తిచెందకే వేషధారియై - పాత్రలీనుడై అవతరించెడిలన్
సూత్రధారియే పాత్రధారియై - మోజు తీరగా ఇలనటించెడిన్
అష్ట సిద్ధులున్ వాని సొమ్ములే - ఙ్ఞానప్రేమలె వాని తత్త్వమౌ
తత్త్వ వేత్తకే గుర్తు పట్టగా - సాధ్యమౌనుగా ఙ్ఞాని అతడే
సిద్ధి సొమ్ములన్ చూచి పామరుల్ - రాజు వేషినే రాజు అందురు
దీర్ఘ నిద్రనే - మరణమందురు - అచట ఏమియున్ లేదు లేదుగా
గుణము సృష్టియౌ బ్రహ్మద్రవ్యము - గుణమునైల్యమౌ కలువద్రవ్యము
ద్రవ్యరేణువే గుణముగానగున్ - రేణువున్నను లేనిరీతియే
ఊహమాత్రమే గుణము సృష్టిగా నిర్గుణుండనన్ సృష్ట్యతీతుడౌ
సృష్టి పూర్వుడౌ బ్రహ్మదత్తుడు - సృష్టి పోవగా రుద్ర దత్తుడున్
సృష్ట్యతీతులౌ నిర్గుణాత్మలౌ - బ్రహ్మ నిర్గుణం బన్నవారలే
సగుణమన్నచో సృష్టియుక్తిడౌ - విష్ణుదత్తుడే వర్తమానుడు
ఈ త్రిమూర్తులున్ కర్మ వేషముల్ - దత్తుడొక్కడే నటుడు సత్యము
సగుణనిర్గుణ బ్రహ్మ మొక్కటే - కిరణమాత్రమే గుణము విశ్వము
కోటి సూర్యులౌ దత్తదేవుని - చర్మ చక్షువుల్ చూడలేవుగా
యోగిరాజగు స్వస్వరూపమున్ - దివ్య నేత్రమే చూడగల్గును
స్పర్శ దర్శన భాషణంబులన్ - నరులకీయగా నరుని ముసుగులో
అవతరించుగా నతడే దత్తుడు - విద్యుదాత్మకంబైన తీగయే
తీగె తాకగా ‘షాకు’ కొట్టును - తీగె విద్యుదద్వైతమాతడే
జీవులందరున్ సృష్టి భాగముల్ - పరా ప్రకృతియే ఉత్త తీగెలే
అవతరించుచో ఆశ్రయించుగా - పురుష దత్తుడున్ ప్రకృతి రూపమున్
అవతరించిన నర శరీరమే - నరుల ముక్తికై ఏకమార్గము

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: