Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Thursday, March 6, 2008

అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం

అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం
సర్వదేవాత్మకం దత్తదేవం గురుమ్ (పల్లవి)

1. ఇందిరా మందిరం పార్వతీనాయకం - భారతీ వల్లభం ధర్మధేన్వాశ్రయం
శంఖచక్రాన్వితం శూలఢక్కాధరం - పాత్రమాలాకరం ప్రాణనాధం భజే

2. పావనై రాగమై స్సారమేయాయితైః - పాదపద్మావృతై ర్మంత్ర మంద్రస్వరైః
సంచలధ్భిశ్చనైః సంచలతం ప్రభుం - త్ర్యాననం షట్కరం యోగిరాజం భజే

3. కేవలం నిర్గుణం మూర్తిభూతం జగత్ - సృష్టి రక్ష్యాలయా ధారహేతోస్త్రిధా
అత్రిణాప్రార్ధితం యుక్తమూర్తి త్రయం - ద్రుష్టమేకం పున స్తం త్రిమూర్త్యాననమ్

4. మాతృ భావానసూయాకృతే గర్భజం - దృష్ట బాల త్రయం యుక్త మేకం సకృత్
బ్రహ్మచర్య వ్రతం దండ పాణిం వటుం - తాపసైః ప్రస్ధితం వృద్ధ శిష్యైర్భజే

5. హంసవాహం క్వచిత్ పక్షిరాడ్వాహనం - నందినవా క్వచిత్ సంచరంతం విభుమ్
నాస్తికానాం మతం నాశయంతం సదా - పండితా ఖండలం స్తౌమి యోగీశ్వరమ్

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: