Download
బ్రాహ్మణ
పురోహితులకు పందేశము: (Download)
పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.
!doctype>Monday, December 29, 2008
SRI DATTAVEDAM BLOG
At lotus feet of Shri Dattaswami
-Durgaprasad
Friday, October 24, 2008
శ్రీ దత్త దేవునిపై పిచ్చి ప్రేమ
నీ నిత్య సాధన తపము సాగించు
భక్తా! నీ నిత్య సాధన తపము సాగించు (పల్లవి)
1. ప్రేమతోడ తన కృష్ణుని తలచుచు
నిత్య ధర్మముల సన్యసించిన
అట్టి రాధకే భక్తి యోగమున
అందరాని గోలోక మందెనే!
2. తల్లిదండ్రులును పతులును సతులును
తనయులు తనయలు సర్వ బంధువులు
తెగితెగి పోవగ బంధములన్నియు
భగవద్భంధము ఒక్కటియె మిగుల
3. దిక్కులలో ఎటు చూచిన గానీ
పరమాత్ముండే కనిపించుచుండు
అన్నపానములు నిద్రయు నుండవు
ప్రతి నిమిషంబును దత్తదేవుడే
4. పరువు మర్యాద ధర్మము నరకము
సంప్రదాయములు పాపభీతియును
ఉల్లంఘించిన ఉన్మాదముతో
బ్రజవనితల వలె జీవించుచుండు
5. నిత్య ధర్మముల చేయనందులకు
లోకులు కాకులు పలురీతులుగా
కూయుచుండినను లెక్కింపకయే
లోక సంగమును పూర్తిగ వదలిన
6. గజములు త్రొక్కిన పాములు కరచిన
సాగరమందున ముంచి వేసినను
శ్రీ మన్నారాయణ యను యను మంత్రము
విడవని ప్రహ్లాదుని వలె నుండుచు
7. పరమాత్మ కనుల రక్త ధారలను
చూడగ ఏడ్చుచు రెండు కన్నులను
బాణము కొసతో పెకిలించి నట్టి
తిన్నని ప్రేమయె ఆదర్శముగా
8. బృందావనమున మండు టెండలో
ఇసుక రేణువుల నిప్పుల కణముల
నడుచుచు మాధవ మాధవ యనుచును
విలపించి రాధ ప్రాణము విడచెను
9. స్వామి కోసమై ఏకైక సుతుని
శిరియాళుని తమ చేతుల చంపియు
వండినట్టి ఆ తల్లి దండ్రులే
భక్తియోగమున పరాకాష్టగా!
10. తల్ల్లిని విడచిన బాలశంకరుడు
తండ్రిని విడచిన ప్రహ్లాద శిశువు
భార్యాపుత్రుల రాజ్యము విడచిన
బుద్ధదేవుడే నీ ధ్యేయముగా
11. ముత్యాల హార మిచ్చిన గానీ
రాముడు లేడని కొరకుచు విసరెను
నఖముల హృదయము చీల్చి చూపెగా
శ్రీ రాముని హనుమంతుడటులనే
12. ముళ్ళ కిరీటము రక్తము కారగా
కొరడా దెబ్బల వాతలు పడుచును
దేవుని కొరకై - శిలువ మోయుచును
నడచు చున్నట్టి క్రీస్తును తలచుచు
Download the audio of this bhajan sung by a devotee here
Thursday, August 21, 2008
Typing mistakes in bhaktiganga
Many typing mistakes have been found in Telugu Bhakti Ganga. In few days all the mistakes will be corrected.
Anyone who wishes to have pdf version of Full Telugu bhaktiganga can write to me at: prasad@universal-spirituality.org
At Lotus feet of Shri Dattaswami
-Prasad
Monday, May 19, 2008
దత్తస్వామి దివ్యవాణి
“ఙ్ఞానమె దీపము, భక్తియె మార్గము నీ దయ నడవగ ఊపన్నా, దీపహీనుడును మార్గమునందున లక్ష్యము చేరును వెంకన్నా.”
ఙ్ఞానము మూల కారణము. భక్తి ప్రాప్తి కారణము. సేవ (కర్మ) ఫల స్వరూపము. ఈ మూడింటిని క్రమముగా శంకర – రామానుజ – మధ్వ రూపాలలో దత్త భగవానుడు యీ లోకములో ఉపదేశించినారు. కృష్ణుని గుణములను విని, కృష్ణుని గురించిన ఙ్ఞానము వలన రుక్మిణి కృష్ణుని యందు ఆకర్షిత అయ్యెను. కావున బ్రహ్మ ఙ్ఞానము అనగా ఙ్ఞాన యోగము మూలకారణము. ఈ ఆకర్షణ రూపమైన, భగవంతుని పొందాలనే తపనయే భక్తి. ఇట్టి తపన ద్వారా కృష్ణుని రుక్మిణి పొందగలిగినది కావున భక్తియే ప్రాప్తి కారణము. " భక్త్యా త్వనన్యయా లభ్యః " అని గీత. "అనన్య భక్తికి నేను లభిస్తాను", అని దీని అర్ధము. శంకరులు సైతం "మోక్షసాధన సామగ్ర్యాం, భక్తి రేవ గరీయసీ" "భక్తిఃకింనకరోత్యహో!" అని భక్తియే అత్యుత్తమ సాధనమనియు, భక్తి దేనినైనా సాధించగలదనియు ప్రస్తుతించినారు. భక్తి ద్వారా పరమాత్మను పొందిన తరువాత, స్వామిని సేవించే భాగ్యమే (సేవా) కర్మ యోగము. సేవ భక్తికి నిరూపణము. ప్రాప్తి తరువాత రుక్మిణి పరమాత్మ యొక్క పాదసేవను చేసినది.
శబరి, తిన్నడు మొదలగు భక్తులు ఙ్ఞానము లేకపోయినా భక్తి ద్వారా పరమాత్మను పొందినారు. వారికి పూర్వ జన్మలలో యీ ఙ్ఞానయోగము లభ్యమైనదని అర్ధము. కావున భక్తి యున్నచో ఙ్ఞానమున్నట్లే. ఙ్ఞానమున్నచోట భక్తి జనింపక తప్పదు కావున భక్తి ఉన్నట్లే. ఙ్ఞాన పరాకాష్ఠయగు శంకరులను, భక్తి పరాకాష్ఠయగు మీరను పరమాత్మ సశరీరంగా ఐక్యము చేసుకున్నారని ప్రసిద్ధి.
"యానః ప్రీతిర్విరూపాక్ష" అను శ్లోకము లౌకిక విషయములందున్న ప్రేమయే భగవంతునియందున్న భక్తి యనబడునని చెప్పుచున్నది. ఈ భక్తియే పరాకాష్ఠకు చేరినచో పరాభక్తియనబడును. ఈ స్ధితిలో స్వామిపై పరిపూర్ణ ప్రేమయుండి, ఎట్టి విమర్శయు తర్కము స్వామియందు సహించజాలని విపరీత వ్యామోహము ఏర్పడును. ఈ దశలో స్వామి ఆగ్రహము కూడ మహాప్రసాదముగా భావించు పరిస్ధితి ఇది. ఇదే నవవిధ భక్తులలోని చివరిదియగు ఆత్మనివేదనము. మనోవాక్కాయములే ఆత్మ యనబడును. ఇదే త్రికరణార్పణము. ప్రతి వ్యక్తితోను ప్రతి వస్తువుతోనుగల బంధములన్నియు తెగిన పూర్ణముక్తి ఇదే. స్వామి బంధము ఒక్కటే మిగిలిన కైవల్యమిదే. ఇదే భక్తి యొక్క దశావస్థలలోని "ఉన్మాదము" అనగా బ్రహ్మ పిచ్చి. ఈ ఉన్మాదములో స్వామి తప్ప, లౌకిక వస్తువుగానీ, లౌకిక వ్యక్తిగానీ, ధర్మాధర్మ విచికిత్స గానీ, నరకాది భయములు కానీ ఉండవు. ఇదే అవధూతావస్థ. ఇది గోపికలకు కలిగెను.
ఙ్ఞానయోగమునకు సద్గ్రంధములు సత్సంగములు ఎట్లు సాధనములో, భక్తి యోగమునకు భజన పాటలు అట్టి సాధనములు. భక్తి సూత్రకర్త యగు నారదుడు వీటిని సదా కీర్తించుటచేత దేవాసురులకును పూజ్యుడయ్యెను. అసురులు అనగా దుష్టులు సైతము వీటి వలన ప్రభవితులగుదురని అర్ధము. నారదుడు భక్తి అనిర్వచనీయమన్నాడు. "జారవచ్చ" "యధావ్రజగోపికానాం" అను సూత్రములలో జారుని యొక్క లోలత్వము (నిష్ఠ) తో సమానమైనది భక్తి యని, భక్తులకు ఉదాహరణముగా గోపికలను పేర్కొన్నాడు. "తన్మయాహితే" అను సూత్రములో భక్తులలో భగవంతుడు ఆవేశించి కైవల్య భావము అనగా తానే వారు, వారే తాను అనునట్లు ఉండునని చెప్పినాడు.
సంసార బంధములను ఆరు కొండలను దాటి, కేవల భగవద్బంధమనే ఏడవ కొండనెక్కి అచటనున్న భక్తి యను కోనేరు గంగలో ఒక్కసారియైన మునక వేయని జీవుని జీవితము వ్యర్ధము. “ఒకసారి మునకేతునా - నా ప్రాణనాధా” అనే భజనతో భక్తి గంగలో ఒక్కసారి అయినా మునగండి.
దత్తస్వామి
జన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి
శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా
సృష్టిస్థితిలయ - కారకులుండగ - త్రిమూర్తులొక్కటే - బ్రహ్మమెట్లగును
అని తపముచేయు - అత్రి మహర్షికి - త్రిముర్తి ముఖముల - కనిపించినావు
సృష్టి,స్థితి,లయ - కారణమొక్కటే - వేదము చెప్పిన - పరమబ్రహ్మము
త్రిమూర్తి తత్త్వం - దత్తాత్రేయమె - పరమ్రహ్మమన - వేదసిద్ధమిది.
వేషాలు వేరు - నామలు వేరు - పరబ్రహ్మమను - వ్యక్తి ఒక్కడగు
నానాపాత్రల - ధరించునటుడవు - రమించువాడవు - నీవేనన్నా
బ్రహ్మన్న నీవే - హరియన్న నీవే - రుద్రన్న నీవే - భైరవన్నవును
రామన్న నీవే - కృష్ణన్న నీవే - గణపన్న నీవే - వీరన్న నీవే
వెంకన్న నీవే - మల్లన్న నీవే - నరసన్న నీవే - అయ్యప్పన్నవు
హనుమన్న నీవే - గరుడన్న నీవే - శేషన్న నీవే - సుబ్బన్న నీవే
వాణమ్మ నీవే - లక్ష్మమ్మ నీవే - గౌరమ్మ నీవే - దుర్గమ్మ నీవే
అనఘమ్మ నీవే - లలితమ్మ నీవే - భ్రమరమ్మ నీవే - పద్మమ్మ నీవే
రుక్కమ్మ నీవే - సత్యమ్మ నీవే - రాధమ్మ నీవే - సీతమ్మ నీవే
అరుంధతమ్మ నీవే - అనసూయమ్మవు - కాళెమ్మ నీవే - సువర్చలమ్మవు
సర్వదేవతలు - సర్వగ్రహములు - సర్వావతార - సర్వసిధ్ధులును.
నీ రూపములగు - నీ వేషములే - నీ గుణములైన - నీ భావములే
ఏ దేవరూప - మైనను వేషమె - వేషధారియగు - దత్తుడొకడే
ఏ వేషమైన - మాలలు వేసిన - వేషధారికే - ప్రీతిని చేయును.
నదీనదములెటు - కదలిని చేరునో - నానాదేవత - భజనలన్నియును
నిన్నే చేరగ - ఆనందితువు - ప్రత్యుత్తరమును – ఇత్తువు నీవే
సకల చరాచరా - జగత్తు భార్యయే - సర్వజీవులును - స్త్రీ రూపములే
పురుషడ నీవే - వేదము పల్కును - సర్వ భర్తవై - ఆడుచున్నావు.
Download this bhajan sung by Shri Dattaswami here.
శ్రీ దత్త గణపతి భజన
మత్తేభవదన భాసురం - చిత్తాబ్జ బోధ భాస్కరమ్
ఆయత్త యోగరజితం - విత్తేశ నిత్యపూజితమ్
ఉత్తనపాణి ముద్రితం - శ్రీకృత్తి వాసస స్సుతమ్
కైలాస దృషది నర్తనం - భక్తాంతరంగ వర్తనమ్
పాపౌఘ పాశకర్తనం - శ్రీ పార్వతీసుతం భజే
లంబోదరాంగ తాండవం - ముద్రాకరాబ్జ పండితమ్
సర్వాంగ నాగమండనం - వందే వినాయకం పతిమ్
దింధిమ్మి తకిట మర్దలం - భంభం నినాద శంఖకమ్
ఆనంద నృత్యతత్పరం - ధ్యాయామి ప్రమధనాయకమ్
ఆమోదకరమోదకం - వేదాంతమతి మాదకమ్
దుష్కర్మ ఫల సాదకం - విఘ్నేశ్వరం గురుం భజే
సృష్టి స్థితి లయ కారణం - మూషాఖ్య దైత్య మారణమ్
సంసర జలధి తారణం - స్తౌమి ప్రభు నరవారణమ్
పంచాస్య మాది దైవతం - దేవర్షిభి స్సమర్చితమ్
ఆలోక గళిత సంచితం - విఘ్నాధి నాధ మాశ్రయే
లోకైక పరమ వైభవం - లోకేశ్వరాది సంభవమ్
ఆలోక పరిహృతోద్భవమ్ - ఆలోకయే పరంభవమ్
శ్రీకృష్ణ కవి నివేదితైః - శ్లోకాఖ్య మోదకై రిమైః
ఆనంద గణపతిం పతిం - ఆరాధయంతు సాధకాః
------------
Download this bhajan sung by Shri Dattaswami here.
Saturday, May 17, 2008
శ్రీ వాణీ కీర్తన
ఏణీక్షణ సుమ బాణాం - శోణాధర కర కోణామ్ (పల్లవి)
కమలాసన ఘన కామాం - విధిరామా మభి రామామ్
శమదమ సుగుణ స్తోమాం - ఘుమ ఘుమ సౌరభ భామామ్
శరదమలా మజ లోలాం - సత్కవికుల నిజ బాలామ్
గలకలిత కమల మాలాం - సువిలసిత తిలక ఫాలామ్
హంసయాన చల దంసాం - హంస వాహనోత్తంసామ్
హంసీంద్యుతిజిత హంసాం - హంసక కలపిక హింసామ్
గద్యపద్య రసవిద్యాం - మద్య హృద్య మధు వాద్యామ్
ఆద్యాముద్యత్సద్యో - విద్యుద్ద్యుతి మనవద్యామ్
క్వణీత కచ్ఛపీం హస్తే - న్యస్త సుపుస్తక మాలామ్
ప్రశస్త మస్తాభ్యస్తాం - స్తుతిభిస్తతా మనస్తామ్
సంగీత మంగళాంగీం - శృంగార శృంగరంగామ్
భృంగాలక నవభంగీం - బ్రహ్మసంగ రసగంగామ్
ఇందిందిర చందనరుచి - కుందేందు మందహాసామ్
ఆనంద మరందాబ్ధిం - ఇందిరాస్నుషాం వందే
Download this bhajan sung by Shri Dattaswami here.
బ్రహ్మ గాయత్రీ (స్వామి వాణి): గాయత్రి అర్ధము
బ్రహ్మ గాయత్రీ (స్వామి వాణి).
గాయత్రి అనగా గానాత్మకమైనది. మంత్రము అనగా మననమునకు అప్రయత్నముగా ఆకర్షించి పదే పదే ఉచ్చరింపచేయునది. "గాయత్రీ ఛన్దః " అన్నాము. అనగా గాయత్రి అను పేరు ఛందస్సులో పాడబడిన దేవత ఎవరు? సవితా దేవతా అన్నాము. సవితయే దేవత. సవిత అనగా చరాచర జగత్తును ప్రసవించు (సృష్టించు) వాడని అర్ధము.అనగా బ్రహ్మదేవుడని అర్ధము. గాయత్రి, సావిత్రి, సరస్వతి అను మూడు సంధ్యాకాల దేవతలే బ్రహ్మదేవుని భార్యలని బ్రహ్మ పురాణము. బ్రహ్మగాయత్రి అనగా-దేవతయగు బ్రహ్మదేవుడు గాయత్రి ఛందస్సులో గానము చేయబడిన వాడని అర్ధము. చంపకమాల ఛందస్సులో కృష్ణుడు కీర్తింప బడినచో ఆ పద్యార్ధము కృష్ణుడా? లేక చంపకమాలయగు దేవతయా? అట్లే గాయత్రి ఛందస్సులో కీర్తింపబడిన బ్రహ్మదత్తుడే దేవతకాని, గాయత్రి యను దేవత కాదు. దేవతను విస్మరించిన మంత్రము వ్యర్ధము కావున బ్రహ్మతేజస్సు అంతరించినది. మనస్సు-బుద్ధి-వాక్కులకు, పూజలకు బ్రహ్మము అందదు. అనగా పూజ లేనిది అని కాదు. జగత్తు యొక్క సృష్టి, స్ధితి, లయములను చేయు దత్తుడే బ్రహ్మము. ఆదత్త బ్రహ్మమే త్రిమూర్తి వేషములలోనున్నది.
పరబ్రహ్మపరమై, గానాత్మకమై, మనస్సును ఎట్టి ప్రయత్నము లేక ఆకర్షించి పదే పదే ఉచ్చరింపచేయునది ఏదియైనను గాయత్రీ మంత్రమేనని శ్రీదత్త మతము.
భజ భజ దత్తం - భజ భజ దత్తం (పార్ట్-2)
శ్రుత్వా సిద్ధాన్తార్ధ మన్త్యం - సమన్వయమతం వాచయన్తమ్
(త్రిమతాచార్యులగు శంకర-రామానుజ-మధ్వులు తమతమ మతానుసారములగు తమ తమ భాష్యవాదములను వినిపించు చుండగా వినుచు చివరకు త్రిమత సమన్వయమగు మతమును తన చరమ సిద్ధాంతముగా పలుకుచున్న దత్తుని భజింపుము).
15. వేదాన్తానా మన్తి మార్థం - వేదాన్తార్థం బోధయన్తమ్
ఋషిభిః పరితో భాషమాణం - శాస్త్రార్ధేషు వ్యఞ్జితేషు
(ఉపనిషత్తులుయొక్క అంతిమసారమైన వాడును, ఉపనిషత్తుల అర్ధమును బోధించుచున్నవాడును, నిగూఢమైన వ్యంగ్యములగు శాస్త్ర విషయములను చుట్టు చేరిన ఋషులు అడుగుచుండగ చెప్పుచున్న వాడును అగు దత్తుని భజింపుము).
16. ఆయుధవర్జిత పాణిపద్మం - వాచైవారిం మారయన్తమ్
కర్మఫలాని లలాటపత్రే - లిఖన్త మాయు ర్దాయ దానమ్
(తన కరకమలమున ఎట్టి ఆయుధములేనివాడును, వాక్కు చేతనే శత్రువులను చంపగలవాడును, లలాట పత్రమునందు కర్మఫలములను లిఖించువాడును, ఆయుర్దాయమును ప్రసాదించువాడును అగు దత్తుని భజింపుము).
17. ఆచార్యేన్ద్రం వాక్ప్రచారం - భువిసంచారం నిర్విచారమ్
ఖలాభిచారం సదాచారం - సురపరిచారం చిత్తచోరమ్
(ఆచార్యేంద్రుడును, వాక్కుతో జ్ఞానప్రచారమును చేయుచున్న వాడును, భూమినంతయును సంచరించుచున్నవాడును, విచార రహితుడును, దుష్టులను సంహరించువాడును, వైదిక సదాచార వంతుడును, దేవతలే పరిచారకులుగ కలవాడును, చిత్తచోరుడును అగు దత్తుని భజింపుము).
18. పద్మ సంభవం పద్మపీఠం - పద్మ సుగన్ధం పద్మవర్ణమ్
పద్మాపుత్రం పద్మ నేత్రం - పద్మ సుపాణిం పద్మ పాదమ్
(కమల సంభవుడును, కమలాసనుడును, కమల సుగంధములను వెదజల్లువాడును, కమలకాంతిగలవాడును, కమలయొక్క పుత్రుడును, కమలనేత్రుడును, కమలపాణియును, కమలచరణుడునగు దత్తుని భజింపుము).
19. వీణాపాణిః యస్య శిష్యా - వాణీగాయతి జ్ఞానదేవీ
తం వాగీశం సామవాచా - చర శోణాధర మన్త్రపాఠమ్
(ఏ దేవుని యొక్క శిష్యురాలును, వీణాపాణియును, జ్ఞాన దేవియునగు వాణీదేవత కదలుచున్న ఎర్రని పెదవులతో మంత్రములను పఠించుచున్న ఏ వాగీశ్వరుని సామగానములతో స్తుతించుచున్నదో, అట్టి దత్తుని భజింపుము).
20. యత్సఙ్కల్పః కేవలం హి - సర్వ విశ్వం రచితమేవమ్
ఆద్యం దేవం ప్రథమ మూర్తిం ఆరాధనీయ మజమనాదిమ్
(ఏ దేవునియొక్క కేవల సంకల్పమే ఈ రచితమైన సర్వ ప్రపంచమో, అట్టి ఆదిదేవుని ప్రధమ రూపమును, ఆరాధనీయుడును, అజుడును, అనాదియనగు దత్తుని భజింపుము).
21. లలాటరేఖాం కర్మబద్ధాం - పరిమార్ష్టుం యః కేవలోహి
సర్వసమర్ధో లేఖకోஉయం - ధాతారంతం మూల మూలమ్
(కర్మబద్ధమైన లలాట రేఖలను తుడిచివేయుటకు వ్రాసిన వాడగు ఏ దేవుడు ఒక్కడే సర్వ సమర్ధుడో అట్టి ధాతయు, మూలమునకే మూలమైనవాడగు దత్తుని భజింపుము).
22. చతురామ్నాయాం శ్చతురవాచా - చతురాస్యాబ్జై రుద్గిరన్తమ్
కవిం కవీనా మాదికావ్యం - సర్వజగదిదం విరచయన్తమ్
(ఏ దేవుడు తన నాలుగు ముఖ కమలముల ద్వారా నాలుగు వేదములను చతురవాక్కులతో రచించెనో, కవులకే కవియును, ఆది కావ్యమైన ఈ సర్వజగత్తును రచించినవాడగు దత్తుని భజింపుము).
23. పరమ బ్రహ్మ బ్రహ్మ శబ్దో - యస్మిన్నేవ ప్రకృతి హేతౌ
పూజాతీతం పరమపూజ్యం - దివసారంభే పూజనీయమ్
(ఈ సృష్టికి ముందున్న సృష్టి కారకుడగు పరబ్రహ్మమైన ఏ దేవునియందే బ్రహ్మ శబ్దము వాడబడినదో ఏ దేవుడు వాఙ్మనోబుద్ధ్యతీతుడగుట వలన పూజలకు అందడో (బ్రహ్మపూజ లేకపోవుటకు ఇదే కారణము), నిజముగా ఉదయ పూజకు అర్హుడగు దత్తుని భజింపుము).
24. గాయత్రాద్యా యస్యభార్యాః - త్రిశక్త యస్తా స్త్రిముఖ పద్మమ్
దేవపితౄణాం పితరమేవ - పితామహాఖ్యం బ్రహ్మరూపమ్
(గాయత్రీ, సావిత్రీ, సరస్వతియను పేర్లతో త్రికాల సంధ్యాశక్తులే ఏ దేవుని భార్యలో, మూడు ముఖపద్మములతోనున్న వాడును, ఏ దేవుడినైననూ తండ్రియని పిలిచినచో ఆ తండ్రికే తండ్రియై పితా మహుడని ప్రసిద్ధుడైన దేవదేవుండగు బ్రహ్మరూపుడగు దత్తుని భజింపుము).
25. శ్లో శ్రీ దత్తబ్రహ్మ గాయత్రీం -యో గాయే ద్బ్రహ్మకాలికీమ్
స బ్రహ్మతేజసా దీప్తో - జ్ఞానీ బ్రహ్మత్వ మశ్నుతే
(ఈ శ్రీదత్తబ్రహ్మగాయత్రిని ఎవరు ప్రాతః కాలమున బ్రహ్మీ ముహూర్తములో గానము చేయుదురో, అట్టి జీవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచూ జ్ఞానియై బ్రహ్మత్వమును పొందును).
26. శ్లో శతాయుర్దాయ మాప్నోతి - సర్వవిద్యాః ప్రపద్యతే
సత్పుత్రం లభతే హోమా - దైశ్వర్యం బ్రహ్మ వీక్షితః
(ఈ గాయత్రీ గానముచేత శతాయుర్దాయము లభించును. సర్వ విద్యలు లభించును. సత్పుత్రుడు కలుగును. ఈ గాయత్రితో హోమము చేసినచో ఐశ్వర్యము లభించును. బ్రహ్మదేవుని కృపాకటాక్షము వానిపై సదా ప్రసరించును).
Download this bhajan sung by Shri Dattaswami here.
Monday, May 12, 2008
భజ భజ దత్తం - భజ భజ దత్తం (పార్ట్ -1)
భజ భజ దత్తం - భజ భజ దత్తమ్ (పల్లవి)
1. తత్సవితుస్త ద్దేవతాయాః - వరేణ్య భర్గో ధీమహీహః
ప్రచోదయేద్వై ధియో యో నః - తంబ్రహ్మాణం జ్ఞానసూర్యమ్
(దేవుడైన ఆ సవితయొక్క శ్రేష్టమైన ఆ తేజస్సును ధ్యానించు చున్నాము. ఏ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునో, అట్టి జ్ఞాన సూర్యుడైన ఆ బ్రహ్మదేవుడగు దత్తుని భజించుము).
2. ప్రాణిప్రసవా ద్యః ప్రసిద్ధః - సవితే త్యస్య బ్రహ్మతేజః
శిష్యధియశ్చ ప్రేరయేన్నః - తంగాయత్రీ మన్త్రసారమ్.
(ప్రాణులను ప్రసవించుట అనగా సృష్టించుటచేత ఏ దేవుడు సవితయని ప్రసిద్ధుడయ్యెనో, ఏ దేవుని బ్రహ్మతేజస్సు మా శిష్య బుద్ధులను ప్రేరేపించుచున్నదో, అట్టి గాయత్రీ మంత్రసారమైన దత్తుని భజింపుము).
3. గాయత్రీయం ఛన్దఏవ - సవితాదేవః స్మర్యతేచ
శిష్యాన్ధకార ముకుళితాబ్జ - ధీవికాసదం గురువరేణ్యమ్.
(గాయత్రి అనగా ఛందస్సు పేరే గదా! ఆ మంత్రదేవత సవితయని ముందే చెప్పబడినది గదా. శిష్యులయొక్క అజ్ఞానాంధ కారము చేత ముకుళించిన బుద్ధి పద్మములకు వికాసమునిచ్చు గురువరేణ్యుడగు దత్తుని భజింపుము).
4. కర్తాభర్తా హ్యేషహర్తా - సర్వస్యాస్య శ్రూయతేహి
త్రిమూర్తిరూపం బ్రహ్మచైకం - బ్రహ్మాకారం బ్రహ్మవాచమ్.
(ఈ జగత్తును సృష్టించువాడే పాలించి దీనిని హరించు వాడని శ్రుతి “యతోవా” అని చెప్పుచున్నది గదా. ఒకే పరబ్రహ్మము త్రిమూర్తి స్వరూపముతో నున్నది అనియే ఈ శ్రుతికి అర్ధము. బ్రహ్మదేవుని ఆకారముననున్న వేదములను చెప్పు బ్రహ్మదత్తుడగు ఆ సవితను భజింపుము).
5. త్రిపదం ఛన్దః త్రిస్వరోక్తం - త్రికాల వన్ద్యం త్రిగుణ సూత్రమ్
త్రివాహినీనాం సఙ్గమం వా - త్రిమూర్తి తత్త్వం యం వ్యనక్తి
( త్రిపాదములతో నున్నది గాయత్రీ ఛందస్సు. అది ఉదాత్త అనుదాత్తస్వరితములను త్రిస్వరములతోనున్నది. త్రిగుణములతో (మూడు పోగులు) నున్నది యజ్ఞోపవీతము. త్రివాహినుల సంగమమైన ప్రయాగవంటి పవిత్రమైన త్రికాల సంధ్యలయందు వందనీయమైన ఏ త్రిమూర్తి తత్త్వమును ఈ గాయత్రీ మంత్రము స్ఫురింపచేయునో అట్టి దత్తుని భజింపుము).
6. ఓఙ్కారశ్చ త్రివిధవర్ణః - త్రిస్రోవ్యాహృత యోஉపి యంహి
సంబోధయన్తి సర్వమన్త్రో - యమేవ వక్తి త్రిగుణమేకమ్.
(అకార, ఉకార, మకారములతోనున్న త్రివర్ణాత్మకమగు ఓంకారము, భూః భువః సువః అను మూడు వ్యాహృతులును, ఏ దేవునే సూచించునో, సర్వగాయత్రీ మంత్రము, సత్త్వ-రజః-తమః గుణములను కలిగిన ఏ ఒకే దేవుని చెప్పుచున్నదో అట్టి దత్తుని భజింపుము).
7. చత్వారోయం వేదశునకాః - గౌరనుసరతిచ వేదధర్మః
వీణాశ్రవణం వాణీపతిం - షోడశవర్షం బ్రహ్మదేవమ్
(నాల్గు వేదములు కుక్కలుగను, వేదధర్మమే గోవుగ వెంట నడుచు చుండగ వీణాశ్రవణమును చేయువాడును, వాణీపతియు, పదునారు సంవత్సరముల ప్రాయము కలవాడును బ్రహ్మదేవుడగు దత్తుని భజింపుము).
8. జగదారంభం హంసవాహం - తేజోవదనం మన్త్రమూలమ్
గాయత్రీశం సామగానం - విద్యానిలయం వేదపాఠమ్
(జగత్తును సృష్టించుటకు ఆరంభించుచున్నవాడును, హంస వాహనుడును, తేజస్సుతోనున్న ముఖము గలవాడును, మంత్రములకు మూలమును, గాయత్రికి అధీశ్వరుడును, సామగానము చేయుచున్నవాడును, విద్యలకు నిలయుడును, వేదపాఠము చేయుచున్నవాడునగు దత్తుని భజింపుము).
9. యజ్ఞాచరణం హోమనిష్టం - కమణ్డలుధరం దర్భపాణిమ్
అగ్నిజ్వాలా భాసమానం - ప్రాతస్సన్ధ్యా బాలభానుమ్
(యజ్ఞములను చేయుచున్నవాడును, హోమములందు నిష్ఠతోనున్నవాడును, కమండలమును ధరించి దర్భలను చేతపట్టిన వాడును, అగ్నిజ్వాలవలె ప్రకాశించుచున్నవాడును, ప్రాతస్సంధ్యాకాలమున వెలుగు బాలభానుడివలె ఎర్రగా భాసించుచున్న దత్తుని భజింపుము).
10. చందన తిలకే కుఙ్కుమాఙ్కం - బ్రహ్మతేజసా దీప్యమానమ్
త్రిజగన్మోహన సున్దరాఙ్గం - కాషాయధరం పణ్డితేశమ్
(ముఖమున చందన బింబ తిలకము, మధ్య కుంకుమ తిలకమును ధరించిన వాడును, బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్న వాడును, త్రిలోకములను మోహింపచేయు సుందరాంగుడును, కాషాయ వస్త్రధారియు, పండితసార్వభౌముడునగు దత్తుని భజించుము).
11. అత్రేః పుత్రం బ్రహ్మదత్తం - అనసూయాంబా ప్రేమరాశిమ్
అజిన మేఖలం బ్రహ్మదణ్డం - యజ్ఞోపవీత మక్షమాలమ్
(అత్రిపుత్రుడగు బ్రహ్మదత్తుడును, అనసూయాంబయొక్క ప్రేమరాశియును, కృష్ణచర్మమును మేఖలగా కలవాడును, బ్రహ్మదండమును యజ్ఞోపవీతమును జపమాలను ధరించినట్టి దత్తుని భజింపుము).
12. స్వతనోరుద్య త్కమల గన్దైః - త్రిభువనాని హ్లాదయన్తమ్
బ్రహ్మముహూర్తే సాధాకానాం - ప్రచోదయేత్తా యో ధియో నః
(తన తనువునుండి ప్రసరించు పద్మగంధములచేత త్రిభువనములను ఆహ్లాదపరచువాడును, బ్రహ్మముహూర్తమున సాధకులగు మాయొక్క బుద్ధులను ఏ దేవుడు ప్రేరేపించునో అట్టి దత్తుని భజింపుము).
13. సృష్టిక్రమ వద పురుషసూక్తం - త్రిస్వరబద్ధం పావనార్ధమ్
ఋషిభిః పఠితం బ్రహ్మకాలే - శ్రుత్వాశ్రుత్వా ప్రీయమాణమ్
(జగత్తుయొక్క సృష్టిక్రమమును వివరించునదియు, మూడు స్వరములతో నున్నదియును, పవిత్రమైన అర్ధము కలదియగు, పురుష సూక్తమును తనివితీర విని విని సంతోషించుచున్న దత్తుని భజింపుము).
(ఈ భజన ఆడియో కొరకు భజ భజ దత్తం - పార్ట్ -2 చూడండి)
Wednesday, May 7, 2008
బ్రహ్మ దత్తులను చూడండీ - కొలువైయున్నారిపుడండీ
1. ఆ దేవ సవిత గొప్ప తేజమును ధ్యానింతుమెవరు మాదగు బుద్ధుల
ప్రేరేపించగ సమర్ధులగుదురొ ఆ బ్రహ్మయైన జ్ఞాన సూర్యులగు
2. ప్రాణి ప్రసవము చేయు సవితయును సృష్టికర్తయగు బ్రహ్మతేజమే
శిష్య బుద్ధులను ప్రేరేపించును ఆ గాయత్రీ మంత్రసారమగు
3. గాయత్రియనగ ఛందోనామము సవితయె దేవుడు చెప్పుచుంటిమట
శిష్యాంధకార ముకుళితాబ్జ ధీవికాసదులు గురువరేణ్యులగు
4. కర్తయుభర్తయు హర్తయు వారే సర్వ జగత్తుకు శ్రుతివాక్యమదే
త్రిమూర్తిరూపులు ఏకమెబ్రహ్మము బ్రహ్మాకారులు బ్రహ్మవాక్కులగు
5. త్రిపాది ఛందము త్రిస్వరమంత్రము త్రికాలవంద్యులు త్రిగుణసూత్రమది
గంగాయమునా సరస్వతీ సమ త్రిమూర్తిసంగమ ముద్దేశించును
6.ఓంకారంబది త్రివర్ణమిళితము త్రివ్యాహృతులును సంబోధించును
సర్వమంత్రమును త్రిగుణములేగద త్రిమూర్తులనుగుణి వ్యక్తి ఒక్కరగు
7. నాల్గు వేదములు శునకములగుచును వేదధర్మమే గోవుగ నడవగ
వీణాశ్రవణులు వాణీ రమణులు షోడశ వర్షులు బ్రహ్మదేవులగు
8. జగదారంభులు హంసవాహనులు తేజోవదనులు మంత్రమూలమును
గాయత్రీశులు సామగాయకులు విద్యా నిలయులు వేదపాఠులగు
9. యజ్ఞాచరణులు హోమనిష్ఠితులు కమండలుకుశలు జపమాల బట్టి
ప్రాతస్సంధ్యా బాలభానులును అగ్నిజ్వాలగ భాసించుచుండు
10. చందనతిలకము కుంకుమాంకితము బ్రహ్మతేజస్సు దీపించుచుండ
త్రిజగన్మోహన సుందరాకృతులు కాషాయధారి పండితేశ్వరులు
11. అత్రిపుత్రులును బ్రహ్మదత్తులును అనసూయాంబా ప్రేమరాశులును
అజినమేఖలురు బ్రహ్మదండులును యజ్ఞోపవీత మక్షమాలగల
12. తన తనువునగల కమలగంధముల త్రిభువనములు ఆహ్లాదమునొందగ
బ్రహ్మముహూర్తము నందు సాధకుల మమ్ముల బుద్ధుల ప్రేరేపించెడి
13. త్రిస్వరబద్ధము పావనార్ధమగు సృష్టినిజెప్పెడి పురుష సూక్తమును
ఋషులు పఠించగ బ్రహ్మకాలమున విని విని యెంతో ప్రీతిని పొందెడి
14. త్రిమతాచార్యులు పఠించుచుండగ తమతమ మతముల భాష్య వాదముల
అవి విని చివరకు సిద్ధాంతమును సమన్వయ మతము నొప్పుగచెప్పెడి
15. వేదాంతములకు అంతిమార్ధమై వేదాంతార్ధము బోధించునెపుడు
శాస్త్రరహస్యము లందున నడిగెది ఋషులకు చెప్పుచు వారి మధ్యగల
16. ఆయుధవర్జిత పాణిపద్ములును వాగాయుధమున శత్రుమారకులు
కర్మఫలంబుల నుదుటి పత్రమున లిఖించునాయుర్దాయ దాతలగు
17. ఆచార్యేంద్రులు వాక్ప్రచారకులు భువి సంచారులు నిర్విచారులును
ఖలాభిచారులు సదాచారులును సురపరిచారులు చిత్తచోరులగు
18. పద్మసంభవులు పద్మాసనులును పద్మసుగంధులు పద్మవర్ణులును
పద్మాపుత్రులు పద్మనేత్రులును పద్మసుపాణులు పద్మపాదులగు
19. వీణాపాణియు శిష్యురాలగుచు వాణిపాడునట జ్ఞానదేవతయె
ఆ వాగీశుని సామగీతముల శోణాధరచర మంత్రపాఠులగు
20. ఒక సంకల్పమె ఎవరు చేయగా సర్వము విశ్వము రచిత మీ విధిగ
ఆద్యదేవులును ప్రధమమూర్తియగు ఆరాధనీయు లజులనాదియగు
21. నుదుటివ్రాతలను తుడిచివేయగా వ్రాసినవారే సర్వసమర్ధులు
విధాతయనగా కర్మఫలములను విధించువారలు మూలమూలమగు
22. చతురవాక్కులగు చతుర్వేదముల చతురాననములు చెప్పుచునుండగ
ఆదికావ్యమగు సర్వజగత్తును రచించువారలు కవులకు కవులగు
23. పరబ్రహ్మమను బ్రహ్మశబ్దమది ఏ ఒక్కరికే పేరుగ గలదో
బుద్ధికి చిక్కరు పూజలకందరు దినారంభమున పరమపూజ్యులగు
24. గాయత్రి మొదలు ముగ్గురు భార్యలు త్రిశక్తులుండగ త్రిముఖపద్ములై
దేవులు తండ్రులు వారికె తండ్రియు పితామహులనగ బ్రహ్మరూపులగు
25. సత్యలోకమున పద్మపీఠమున బ్రహ్మసదస్సున అధ్యక్షులగుచు
సరస్వతీ సతి నారదసుతుడును తమతమ వీణల మీటుచునుండగ
26. బ్రహ్మర్షులచట శాస్త్రవాదముల చర్చల సేయగ నాకర్ణించుచు
చివరకు నిజమత సిద్ధాంతములను సమన్వయములను ప్రతిపాదించెడి
27. బ్రహ్మముహూర్తము సంధ్యాసమయము బాలభానురుచి కుంకుమరాశుల
పాదపద్మముల నర్చన సేయగ పద్మాసనమున ఆసీనులైన
28.. వేదపురుషులట నలుగురు తనయులు జటామండలము లొప్పుచునుండగ
మధురకంఠముల శ్రవణరమ్యముల త్రిస్వరపావన మంత్రముల చెప్ప
29. శరదంబోధర శరీర కాంతులు జ్ఞానతేజములు ప్రసరించుచుండ
వాణీదేవత సామగానముల కచ్ఛపివీణను వాయించుచుండ
30. సిధ్ధాంతార్ధము నటనటపలుకగ ఆహో! యని ముని ఘోషలు చెలగగ
తన్మయుడై తన తండ్రిని పొగడుచు వీణాకలముల దేవర్షి పాడ
31. బ్రహ్మ దత్తులను ఈ గాయత్రిని బ్రహ్మకాలమున గానము చేసిన
బ్రహ్మ తేజమున ఉద్దీప్తులగుచు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మమె అగుదురు
32. శతవర్షంబులు ఆయుర్దాయము సర్వవిద్యలును సంప్రాప్తించును
హోమము చేసిన మహదైశ్వర్యము సత్పుత్రసిద్ధి బ్రహ్మదృష్టి పడు
Download this bhajan sung by Shri Dattaswami here.
Monday, May 5, 2008
శ్రీ మహాలక్ష్మి స్తుతి
దిగివచ్చినదే మంగళ దేవత - వైకుంఠము వీడి వసుధకు రుసరుస
తన తండ్రి భృగువు తన్నగ నల్లుని - ఉరమున, ఉడికిన ఉద్రేకముతో (పల్లవి)
1. చెంపల చారెడు కన్నులు నిండిన - అశ్రువులొలకగ పెద్ద ముత్తెములు
పద్మా పద్మా యను పద్మాక్షుడు - వెంటబడి వెనుక ఆహ్వానించిన
2. ఘల్లు ఘల్లుమని కాలి అందెలును - మధురధ్వనులను పలుకుచుండగా
హంసయానమున దిగిదిగి వచ్చెను - మేఘ మార్గమున తారలు చెదరగ
3. విడివడిన కురుల విదలింపులతో - వడి వడి నడకల వేడి వేడిగను
నిశ్వాసములకు వాడిపోవగా - అధర పల్లవము పన్నుల నొక్కుచు
4. ముఖమున ఎర్రని తళతళకాంతుల - స్వేద బిందువులు జాలువారగా
బాల భాస్కరుని కిరణములొప్పగ - సంధ్య కాంతివలె శోభిల్లె పద్మ
5. బంగారుగాజులెగురగ గలగల - చేతుల నూపుచు బంగారుబొమ్మ
ఆ పద్మ నడవ అరవిందాక్షుడు - అల్లాడె వెనుక పరుగుల నెత్తుచు
6. కనక హారములు కులుకుల నడకల - గలగలలాడుచు గంతులేయగా
కమలా దేవత కదలి వచ్చెగా - కమలలోచనుడు కమిలి పోయెనే
7. ఆగు ఆగు మని అర్ధించుచున్న - అంతకంతకును వేగము హెచ్చగ
పద్మ నడచెనే పురుషోత్తముడదె - పరుగునవచ్చును వనమాల యెగుర
8. సాత్త్విక గుణవతి శాంతరూపిణివి - ఇంత ఆగ్రహము నీకేల దేవి !
నీ తండ్రి భృగువు నా తండ్రి సముడె - చరణ స్పర్శయు ఆశీర్వచనమె
9. ఇట్లు మాధవుడు వచించుచున్నను - పద్మకు దుఃఖము పొంగుచు పొరలెను
భర్తమాత్రమే కాదు హరితనకు - భగవంతుండును పాద దాసిగా
10. మణిపూర చక్ర మతిక్రమించిన - శ్రీ మహాలక్ష్మి తండ్రి బంధమును
లెక్కసేయకే పరమాత్ముడినే - సర్వాధికునిగ తలచిన ధన్యయె
11. వినదాయె పద్మ వేయి చెప్పినను - పరమాత్మ పరాభవమును సహింప
ఓర్వగ లేకయె ఏడుపు కోపము - మిశ్రమమై మది కల్లోలమయ్యె
12. అదిగోవచ్చును అరవిందాసన - అందాల రాశి ఆవేశముతో
అంబర వీధిని సప్త మహర్షులు - ప్రణమిల్లుచున్న అవలోకించదు
13. హరిపద సంభవ ఆకాశగంగ - హరి పదముల బడి సవ్వడి పొందుచు
అలలతో జెప్పు ఆగుమమ్మయని - అలివేణి పద్మ ఆగదు క్షణమును
14. తెల్లని గంగా జలముల నడచెడి - ఎర్రని పద్మా సతి ఖేచరులకు
ముత్యాలసరము మధ్యమాణిక్య - మొకటి చలించెడి రీతి జూపట్టె
15. వడివడి హరిపద వేగముతనలో - నవనవ వీచికలుప్పతిలఁజేయ
పద్మాపదముల తాకుచు పలికెను - హరి అభ్యర్ధన నందించు గంగ
16. కానీ పద్మా పదముల వేగము - తాకిడితో తన అలలు వెనుదిరిగి
పద్మ నిశ్చయము నందించ హరికి - మధ్యదూతివలె మందాకినియగు
17. భూలోక జనుల దరిద్రమంతము - చేయగ సమయము ఆసన్నమయ్యె
పద్మా చరణము లవనిని తగిలెను - సకల సౌభాగ్య సంపత్కరములు
18. భూదేవి సవితియైనను పదముల - సవితి తాకినను ఆనందించెను
అష్టైశ్వర్యములవనిని పొందగ - పద్మను నమస్కరించె భక్తితో
19. నడుచుచున్నదే నారాయణియదె - కొల్హాపురమున తపమును చేయగ
దైవావమాన తాపముతనలో - కోపకారణము అరుణ రూపమై
20. మంగళ దేవత చరణమార్గమున - పూలను రాల్చెను వనములతరువులు
తల్లి పాదములు కందిపోవునని - ముందుగ పవనుడు ఊడ్చి వేయగా
21. బంగారురంగు తామ్రాంచలమగు - హరికిష్టమైన చీరను కట్టిన
మంగళ దేవత పసుపు కుంకుమము - మేళవించినటు తోచుచున్నదే
22. మధుసూదనసతి మానవతీమణి - ఆత్మావమాన హేతువు కాదది
తండ్రిపాదమును బిడ్డ ఒప్పదా - స్వామి పరాభవమోర్వలేదాయె
23. ఎంతటి భక్తియొ ఆలోచింపుము - తండ్రికి తనకును మించి దైవమట
పరమ భాగవత భక్తాగ్రేసర - స్వామి పదసేవ నెప్పుడు విడువదు
24. ఆభక్తిమెచ్చి సర్వసృష్టికే - తన సంపదకే అధిదేవతగా
హరియుచేసెనే ఆ సతీమణిని - హృదయ దేవతగ ధరించె పద్మను
25. పద్మ పోవగా నారాయణుడదె - నళిన నేత్రముల భాష్పధారలను
కురియుచు పరుగిడు పద్మనామమును - ఎలుగెత్తి పిలుచు ఏడ్చుచు పెద్దగ
26. తండ్రి కన్నను స్వామియె ఎక్కువ - భక్తులకన్నది దక్షయాగమున
నిరూపించెనే ఆ సతీదేవి - సతియన పద్మయె శివుడన హరియె
27. కొల్హాపురమున పద్మాసనమున - యోగనిష్ఠలో కుర్చుండె పద్మ
అగ్నిగఁదోచును క్రోధ కాంతియదె - యోగాగ్ని మధ్య సతివలె పద్మయు
28. అశ్రుధారలను ఆపగ లేనివి - కన్నుల మూసెను ధ్యానించు హరిని
పద్మను పోలిన భక్తులెవ్వరే - భువనములందున సర్వోత్తమయే
29. మంగళ దేవత ! వందనమమ్మా - నారాయణి ! యివె నమస్కారములు
స్వార్ధ దరిద్రము పోగొట్టుమమ్మా - భక్తి సంపదను మాకిమ్ముతల్లీ !
Download this bhajan sung by Shri Dattaswami here.
Sunday, May 4, 2008
అడుగో | అల్లడుగో | వేంకట దత్తుడు
అడుగో అల్లడుగో వేంకట దత్తుడు (పల్లవి)
1. తియ్య మామిడి చిగురు లేత పెదవులందు - చిందెడి సన్న నవ్వు వాడు
ఉదయాన సరసులో విచ్చుచున్న - కమలాలబోలు నయనములవాడు
2. నీటుగానున్న సంపెంగ సుమము - బోలు నాసంబుతో వెలుగువాడు
పన్నీర పుష్పాల తళుకు లొలుకు - లేత బుగ్గల నెర్రతనము వాడు
3. ఊర్ధ్వ త్రిపుండ్రంబులుజ్జ్వలముగా - భాసించుచుండు నిటలంబువాడు
తప్త కాంచన దీప్తి మెరుపులొప్ప - పీతాంబరోజ్జ్వ లాంచలమువాడు
4. కొండ బండల మీద నర్ధరాత్రి - పద్మ కొరకై పరుగుతోడ
దిగుచున్న వాడతడు పలుగురాళ్ళ - కాలి గాయముల లెక్కింపడెపుడు
5. నిస్వార్ధ భక్తికై ప్రాణమైనను - తృణముగా త్యాగంబు సేయువాడు
కోటి యఙ్ఞములైన జపతపములు - పూజలైనను వాని కట్టలేవు
Download this bhajan sung by Shri Dattaswami here.
ఎర్రని కన్నుల పద్మాల పద్మా
ఎర్రని కన్నుల పద్మాల పద్మా
వెంకట రమణుని వీడ్కోలు చెప్పె (పల్లవి)
1. రాలు రక్తరుచి బాష్ప పగడముల చెదరి చలించెడి అలకనీలముల
ఏడ్వగ కనబడు దంత ముత్తెముల వణకెడి పెదవుల పల్లవ కాంతుల
2. కంపించెడి కుచభర హృదయముతో వడగాలి వేడి నిట్టూర్పులతో
పోవలసినదేనా ? పరమాత్మా గోవిందా ! నా గోవిందా ! యనె
3. ఒకసారి లేచు ఒకసారి తూలు ఒకసారి శయ్యపై బడి పొరలును
అర్ధరాత్రి వరకా ? వేచియుంట ! అని విలపించును గుండెబాదుకొను
4. ముందుకు వెనుకకు అడుగులు వేయుచు వెడలుచు తడబడి కన్నీరొలుకుచు
పద్మా పద్మా అని రోదించెడి గోవిందుని తానవలోకించెను
5. పది అడుగులు గిరినెక్కియు నిలబడె వెనుకకు చూచెను విలపించెను హరి
క్రింద పద్మ నిలబడి పైకి విసరు బాష్ప తోరణములాకర్షింపగ
6. హనుమయు గరుడుడు ప్రక్కల చేరిరి భుజములనెత్తుక బలవంతముగా
కొండపైకి ఎగిరిరి బ్రహ్మర్షులు నిరీక్షణములను చేయుచుండిరని
Download this bhajan sung by Shri Dattaswami here.
అదిగో తిరుపతి - అదిగో తిరుమల
అదిగో తిరుపతి - అదిగో తిరుమల
వెంకట దత్తుని మందిరమదిగో (పల్లవి)
1. సప్త మహర్షులు సంభ్రమ దృష్టులు కరముల మానస పద్మములొప్పగ
వేచియుండిరట పద్మామానసు డగు హరి విప్పడు పద్మ నేత్రముల
2. మహతీ వీణను మీటుచు పాడును నారదుడచ్చట నారాయణయని
కాని వనమాలి కర్ణమునీయడు పద్మాగళ మాధుర్యము తలచుచు
3. కిన్నర కృతములు మంగళ తూర్యము లవిగో మిన్నును ముట్టుచుండెనట
కలకల నవ్వెడి పద్మావతినే స్మరించు ఈశుడు మేల్కొనడాయెను
4. దేవతలిచ్చెడి కర్పూరగంధ మేఘములచ్చట ఘుమ ఘుమలాడును
అయినా హరిమది పద్మాప్రణయము దివ్యగంధముల మత్తున మునిగెను
5. అప్సరసలు సరసాంగ నృత్యముల ఆడుచుండిరట ఆలోకింపడు
కృష్ణదత్తుడదె అంతరంగమున పద్మ నడకలను కులుకుల చూచును
6. నిన్ను కట్టుటకు భక్తియె మార్గము కిటుకును తెలిసితి చిక్కితివిదిగో
గోవింద దత్త ! గోవిందా హరి ! గోవింద కృష్ణ ! గోవింద పద్మ !
(ఇదే భక్తి లేని పూజయని స్వామి చెప్పినారు.)
Download this bhajan sung by Shri Dattaswami here.
కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !
కొండెక్కిరానా ! - నీ కొండకు రానా !
నా ప్రాణదీపం - కొండెక్కముందె
కొండలరాయ! నీ - కోనేటి లోన
ఒకసారి మునకేతునా ?
నా ప్రాణనాథా ! శ్రీ వెంకటేశా ! (పల్లవి)
జీవించినా లేక మరణించినా స్వామి !
మరల జన్మించినా లేక - ఏ లోకమందున్నను
చింతాకు చింతయును నా మదిని లేదెపుడు
నీ నామగానమ్ము నాకిమ్ము అదిచాలు.
నీ ప్రేమ కోసమే - నా జీవితంబంత
కర్పూర నీరాజనంబుగా కాలనీ
గోవింద గోవింద పిలుపుతో తపనతో
నా చిట్టచివరి నిశ్వాస మాగిపోనీ!
నిన్నెంత తలచినా - సంతృప్తి రాదయ్యె
తీరమన్నది లేని - ప్రణయసాగరమీవు
నా జీవితేశ్వరా ! నీ తరంగాలలో
తేలియాడుచు తుదకు నను మునిగిపోనీ
నవకోటి మన్మధా ! - నీ పొందు లేకున్న
ఈ జగముతో పొందు - ఇపుడె ఆగిపోనీ
నీ కౌగిలింతయే - లేకున్న గోపాల !
విరహాగ్నిలో నన్నిక - భస్మమైపోనీ
నీ పెదవి ముద్దాడలేకున్న నా పెదవి
నీ విరహ శిఖలలో - కమిలి మాడిపోనీ
నీ దర్శనంబింక నాకు లేకున్నచో
నీకొండ నుండి దూకి ముక్కలై పోనీ
సప్త శైలన్యస్త - పాద పద్మాయతే
వామహస్తాలోల - కేళి పద్మాయతే
పద్మ నేత్రాయ తే పద్మవక్త్రాయ తే
పద్మావతీ ప్రాణనాధాయ వందనమ్
Saturday, May 3, 2008
భవతి భిక్షాందేహి పద్మే
భవతి భిక్షాందేహి పద్మే - అని పిలచెను యతి దత్తాత్రేయుడు (పల్లవి)
1. కొల్హాపురిని మధ్యాహ్న భిక్షకు - పద్మ ముంగిట నిలచెను దత్తుడు
పద్మా పద్మా అని మొత్తుకున్న - తలుపులు తెరవదు మంగళ దేవత
2. పద్మాయనగా పద్మావతియే - మంగాపురికే పొమ్మని పలికె
పద్మాయనగా నీదేనామము - మొదట నుండియు ననెను దత్తుడు
3. మొదటినుండియు పత్నిగనున్నను - వెడలి పోతిగద నాపేరుకూడ
వెడలి పోయెనిది సత్యము నాధా ! - అనె గద్గదగళ పలికె శ్రీ లక్ష్మి
4. భిక్షుకునిటు పొమ్మనగన్యాయమె - అని వెంకటపతి పలికెను దత్తుడు
నీప్రేమ భిక్షువు నేను నీకెమి - దానము చేయదు ననె మహాలక్ష్మి
5. సాగరతనయా ఎంత విశాలము - నీహృదయప్రేమ సాగరమనెపతి
ఆకాశరాజు కూతురి హృదయము - ఆకాశమంత విశాలమనె సతి
6. అర్ధరాత్రియట మధ్యాహ్నమిట - ఒక పూటనుందు సమకాలముగా
ఉదయాననచట సాయమునిచట - వెడలుచుంటిననె వెంకట దత్తుడు
7. మిగిలిన సమయము లందుననెందరో - గోపికలుందురు నీ ప్రేమ భిక్షులు
నేను చూతునా పద్మ చూచునా - పద్మకు చెప్పితి నిదియనె భార్గవి
8. ఈ రీతి నైన ఇరువురు కలిసిరి - సంతోషమదియే నాకనె శ్రీ హరి
అర్ధరాత్రి యిది పద్మ చెప్పునట - నా చెల్లెలనెను నారాయణసతి
9. ఇరువురు పొమ్మన్న నాకేదిదిక్కు - అని వాపోయెను మధుసూదనుడు
గోదయు మీరయు నాంచారియును - కులమతములైన లేవనె కమలయు
10. చేసెడి దేమియు లేకింక విభుడు - వెనుదిరిగెను పాదుకల శబ్దముల
తటాలున తలుపు తెరిచి పద్మ చూచె - అశ్రుధారా ప్రేక్షణములతో
11. ఆగెను వెనుకకు తిరిగెను దత్తుడు - నిలబడె పరుగున వచ్చెను పద్మయు
కౌగిలించె ముఖమంతయు ముద్దాడె - మన్నించు మనుచు పదముల బడెను
12. మంగళదేవత నెత్తెను కరముల - కౌగలించె హరి గృహమునకేగిరి
విందొనరించెను శ్రీ మహాలక్ష్మి - కమలావయవములను భోజ్యముల
13. కులమత రహిత జీవులందరును - గోపికలేగద అందరివాడవు
నీఅందమందరి సొత్తు సొంతమె - అని నుతించెను లక్ష్మి మురారిని
Download this bhajan sung by Shri Dattaswami here.
Friday, May 2, 2008
గోవింద గోవింద నామమేచాలు
అన్నపానములేల ? సంసారమేల ? (పల్లవి)
ఏడు కొండలనెక్కి ఈక్షించియుంటినే ఏడేడు లోకాల అందగాడే వాడు
బ్రహ్మర్షులైనట్టి పురుషులే మోహించి కౌగిలింతల వాని ముద్దాడ మనసాయె
ఆ కన్నులాకర్ణ సువిశాలములు జూడ మెరిసేటి మీనముల తలపింపచేసెనే
కనురెప్పలాతామ్ర పద్మముల మురిపించు పద్మలోచనుడన్న నిజముగా వాడేనే
ఆ ముద్దు పెదవులను చుంబించ పిచ్చెక్కె తియ్యమామిడి లేత చిగురులె కనిపించె
ఆ బుగ్గలరుణాలు కొరకంగ వెర్రెక్కె పన్నీర పుష్పాల తళుకులను చిందించు
ముత్యాల పలువరస సన్న నవ్వుల వెలుగు హిమబిందువుల చిందుసూర్యాంశువులబోలు
అందాలమెక్కినది ముచ్చటైనది ముక్కు సంపెంగ తలవంచె నూగుపూవును మించె
ఆజానుబాహువులు అరవింద చరణాలు సువిశాల వక్షమున వైజయంతీ మాల
శంఖచక్రములొప్ప వరదాభయకరాల వాసుదేవుడె వాడు శ్రీ వెంకటేశ్వరుడు
వజ్రవైడూర్యాది కనకాభరణములను అంగాంగముల కప్పి ముంచివేశారె
పెద్దపెద్దవి పట్టె నామాల నుదుటిపై అందాల దాచారె దిష్టి తగ్గించగా
ధీరుడె శృంగార సార్వభౌముడె వాడు లోకాల నేలేటి ఠీవితో నిలిచాడె
లావణ్య చందిరుడు తారుణ్య భాస్కరుడు కారుణ్య సాగరుడు వాడొక్కడేనే
పాదాల వేదాలు కుక్కలై పడియుండు పరమ పావనుడతడు పరమాత్మ దత్తుండు
విశ్వకర్తయు భర్త హర్తయును వాడేను అడుగడుగు దండాల మ్రొక్కేరు సురమునులె
Download this bhajan sung by Shri Dattaswami here.
Thursday, May 1, 2008
అదిగో శేషాద్రి ! మందిరమదిగో చూడండీ
అరవిందాక్షుడు పద్మా లోలుడు అతడే నండీ (పల్లవి)
1. మానవ జన్మము నెత్తినందులకు సార్ధకమయ్యెను వెంకన్నా
నీ పై పాటల వ్రాసితినందురు - వ్రాసిన వాడవు నీ వన్నా
పద్మగ నీవె పుట్టితివిచ్చట తియ్యగ పాడితి ఓరన్నా
పద్మారమణా ! ఆనందముతో కీర్తినిచ్చితివి నాకన్నా
2. మేడలు రూకలు బంధము లేవియు నా వెంట రావు వెంకన్నా
ఈ పాటలనెడి దివ్య సంపదయె మము రక్షించును కొండన్నా
నర జన్మమునిటు నీ గానమునిటు దయసేయుమెపుడు దత్తన్నా
ఇంతకన్న వరమేమియు అడుగను కాదన బోకుము హరియన్నా
3. స్వర్గాధిపతియు వీటిని వినగా పరుగెత్తు చుండు నోరన్నా
వీటిని పాడెడి నారదుడయ్యెను త్రిభువన పూజ్యుడు ఓ కన్నా
గీతామృతమును త్రాగెడివానికి బ్రహ్మానందము చాలన్నా
యమకింకరులను పొమ్మని వత్తురు విష్ణుదూతలు చివరోయన్నా
4. నీ పాట పాడ బాష్పలోచనము లొప్పగ విందురు వారన్నా
భక్తి లేక వృధ పూజలు జపములు ప్రేమయె మార్గము ఓరన్నా
అహంకారమున పాపాత్ముడనై పతితుడనైతిని వెంకన్నా
పండిత వేషము పామరాధముడ ఉద్ధరించుమిక దత్తన్నా
5. వేద శాస్త్రముల చదివితి నేనని గర్వమెక్కెనిల నాకన్నా
పద్మను గురువుగ చూపితి విచ్చట భక్తి మార్గమున హరియన్నా
ఙ్ఞానమె దీపము భక్తియె మార్గము నీ దయ నడవగ ఊపన్నా
దీప హీనుడును మార్గమునందున లక్ష్యము చేరును వెంకన్నా
6. నీ అందాలను పొందు పరచినవి పాటల విందులు చాలన్నా
ఆకలి దప్పిక నిద్రయు లేవిట అమరుడ నైతిని వెంకన్నా
అన్నమయ్య ఇటు పద్మయు అన్నా చెల్లెళ్ళ కివియె నతులన్నా
నీ కర ఖడ్గము నీ కర పద్మము వారిరివురు గద వెంకన్నా
Download this bhajan sung by Shri Dattaswami here.
Tuesday, April 29, 2008
మూడునామాల మెరిసేటి మొనగాడా
మూడుమూర్తులకు మూలమైనట్టి వాడా ! (పల్లవి)
1. భక్తి మద్యము త్రాగు ఉన్మత్తుడా! - ధర్మాల తన్నేటి శ్రీ దత్తుడా!
గోపికలతో గూడు శ్రీ కృష్ణుడా ! - నీ లీలలె శ్రీ వెంకటేశుడా !
2. పద్మకై ప్రతి రాత్రి దిగివచ్చేవు - భక్తి ప్రభావమదియని చాటేవు
స్వార్ధములఁ దీర్చుకొన గిరినెక్కేరు - వారికి శిలా మూర్తి కనిపించేను
3. భక్తులకు చేతనగ, మాటలాడేవు - స్వార్ధులకు శిలగానె గోచరించేవు
పాషాణ విగ్రహమె స్వార్ధ జీవులకు - కరుణా రసార్ణవము భక్త జీవులకు
4. కోరికలు దీర్చుకొనవచ్చు లుబ్ధులకు - మాటలాడిన గాని మౌనమిచ్చేవు
మాటలాడగ నీవె స్వయముగా కొండ - దిగి వత్తువా ! స్వార్ధ రహిత భక్తులకు
5. పద్మావతీ ప్రేమ ఎంత గాఢమో - తెలియంగ తరమౌనె దేవతలకైన
కాలినడకనె వచ్చు కొండరాళ్ళలో - ప్రతి రాత్రి పాదముల బొబ్బలెక్కగా
6. లుబ్ధులకు పగలంత రాతి పాదములు - కఠినంబులైయుండు మార్పులేకయె
అర్ధరాత్రులవియే మారు పద్మకై - చరణ పద్మములుగా కోమలంబులై
Download this bhajan sung by Shri Dattaswami here.
వెంకటేశ్వరుడు - ఎంగిలి చేసిన
తిరుపతి లడ్డును - తిందాము రారె (పల్లవి)
1. భక్తియె చక్కెర - ఙ్ఞానమె బూందియు - శ్రద్ధయె ఏలా ఫలముల పలుకులు
ప్రపత్తి తలపులె ఎండిన ద్రాక్షలు - శరణాగతియే పచ్చకప్పురము
2. పద్మావతియే స్వయముగ చేసిన - పెద్ద పెద్దవవి లడ్డులు చూడరె
మధ్య మధ్యలో సత్సంగములను - చర్చల వడలను నంచుక తినుచును
3. భక్తి రసామృత మాధుర్యమయము - ఎన్ని తిన్ననూ రోగము కానిది
స్వామి ప్రేమలను లడ్డుల తినవే - ఆ లడ్డులన్ని వ్యాపారములే
4. ఙ్ఞానవహ్నితో వండిన వంటలు - ఎప్పటి కప్పుడు వేడి వేడివవి
భక్తి గీతములె జీడిపప్పులే - రుచికరములవియె తినవే పద్మా
5. అంతరార్ధమును తెలియని వారలు - శాశ్వత నష్టము పొందెదరవనిని
దిగి దిగి వచ్చిన అవతారములే - తిరుపతి లడ్డులు ప్రసాదములవియె
Download this bhajan sung by Shri Dattaswami here.
Sunday, April 27, 2008
బ్రహ్మోత్సవాల ఊరేగు పరబ్రహ్మమును చూడగ రారండి
చతుర్దశ భువన వాసులారా ! (పల్లవి)
1. ఏడు కొండలవె ఎంతో ఎత్తుగ - నీల గగనమును చుంబించునెపుడు
నీలమేఘరుచి సంభ్రమ మతులై - నీలవర్ణుడగు స్వామియనిఁ దలచి
2. కనక తోరణములుజ్జ్వల దీపము - లుత్తుంగ రధము భక్తార్ణవమదె
అడుగో రధమున గరుడుడు మూపున - అడుగో అడుగో అరవిందాక్షుడు
3. రాజాధిరాజ పదవులున్నను - కోట్ల కోట్లకును పడగ లెత్తినను
పగ్గముల బట్టి రధమును లాగుచు - స్వామి బండి పశు పదవికి పరుగులు
4. అదృశ్య రూపులు ఇంద్రాది సురలె - రధమును లాగుచు స్వామి సేవలకు
తోసుకతోసుక పరుగులెత్తుదురు - ఈ నర చీమలు స్వామి ముందెంత?
5. సప్తమహర్షులు కనక కమలముల - పదములనుంచుచు అర్చించుచుండ
అర్చకులారా ! ఓ నరులారా ! - మీరెంత తెలిసి వినయమునుండుడు
6. కసరబోకుడీ భక్తుల నెవరో - ప్రహ్లాదుడో మరి తిన్నడో ఉండును
స్వామి మనమునకు ఖేదము కలుగును - తనకన్న భక్తులెక్కువ స్వామికి
Download this bhajan sung by Shri Dattaswami here.
వెంకట రమణా !
నీ కళ్యాణ గుణ విలువల ముందు (పల్లవి)
1. నీ కారుణ్యమునకు కనకాభరణాలు - ఎన్నియైన తుల తూగునా ! దేవదేవ !
నీ వాత్సల్యమునకు వరహాల పతకాలు - లక్షలైనను సరియౌనె ? వాసుదేవ !
2. నీ అందమునకు ముందు రూకలును -బిందెలైనను బిందు మాత్రమెస్వామి !
నీ త్యాగమునకెదురు తక్కెడలో నిలుచునె-ధనమెంత యైనను పద్మా హృదయకామి!
3. నీ జ్ఞానమునకు ముందు నిలువగలవా ? - వజ్ర కిరీటాలు వజ్రాభరణాలు !
నీ సౌందర్యకళకు సరివచ్చునె దేవ ! - నీ భూషణ ఖచిత రత్నాల కాంతులు !
4. నీ ప్రేమసుధకు సమ ఉజ్జియగునే - పంచామృత చందన గంధరసధారలు !
నీ ఔదార్యమునకు తలవంచును - హేమాభరణములు మణి మాణిక్యములు !
5. నీ సౌజన్యము ముందు వెలవెల పోయెడి - బంగారు హారాలు బంగారు కడియాలు!
నీ శాంతికి ముందు ఓడి చింతించుచున్నవి-చింతాకు పతకాలు చిత్తు చిత్తయినవిట !
6. నీ కళ్యాణ గుణములు నిత్యములైయుండు -ఈ సొమ్ములన్నియు నాశమొందునుదేవ!
షోడశ కళలైన షోడశ గుణపూర్ణ ! - పూర్ణ చంద్ర ప్రకటిత శ్రీ దత్తా త్రేయ దేవ !
Download this bhajan sung by Shri Dattaswami here.
పట్టె నామాల పరమాత్ముడా
కళ్యాణ తిలక కమలాక్షిరో ! (పల్లవి)
1. తెలవారవచ్చె తెల్లనగునభము - తెల్ల కాగితము రీతిచూపట్టె
మీమీద కవిత నేవ్రాయ ప్రకృతి - సిద్ధముగఁజేయు విధముగ తోచు
సంధ్య రేఖలవె రాగరంజితము - లక్షర పంక్తులు వ్రాయబడె వరుస
అనురాగ కలిత గీతల కవితల - పాడవలె వీటినే రాగముతో
2. నానా పక్షులు నానారాగము - లందున పాడగ కలకలమదియే
సంగీత విదుషి పద్మావతిసతి - లేవనిమ్ము హరి ! రాగాల దిద్ద
గోవిందనామ నిత్య జప పద్మ - పద్మాయని హరి నిత్యము జపించు
విడువదు పద్మయు విడువడు హరియును - పైన దర్శనము గోవింద నేడు
ఎత్తుక పోవగ వచ్చియున్నారు - హనుమయు గరుడుడు బయటకు వచ్చిన
బయటకె రానీయదు పద్మ నేడు - బాహు బంధమున బంధించెహరిని
Download this bhajan sung by Shri Dattaswami here.
Saturday, April 26, 2008
ఏడు కొండలనున్న ఏకైక దేవరా
ఏడేడు లోకాల నేలేటి రాయడా ! (పల్లవి)
1. నీ సాటి ఎవరు? నీరజలోచన! - నీ ధాటి ఎవరికున్నది ? నిత్యుడ !
నీపోటి ఎవరు? పరమబ్రహ్మమ ! - నీ చేటి ఎవరు ఆ పద్మ తప్ప !
ఐహికమ్ములమ్ము పెను దుకాణంబు - తిరుపతి యనగా తలచుచున్నారు
భక్తి సుధలనుచితంబుగా నిచ్చు - ధర్మ సత్రమిది తెలియకున్నారు !
2. సతుల తగవుతో శిలయగుట కల్ల - మంగ పద్మలకు కలహమే లేదు
మంగ పద్మయను ఒక్కరె అనఘ - మా స్వార్ధముగని రాయివైనావు
లంచాలనిచ్చి పనుల జేసుకొను - ప్రభుత్వ కార్యాలయముగ తిరుమల
మారిపోయెనిల ! నిశ్చేష్టుడగుచు - రాతి బొమ్మగా మారిపోతివా
3. అన్నమయ్యకును పద్మావతికిని - అందాలరూప మందించినావు
లంచగొండులగు భక్తులకు నీవు - కొండబండగా చూపట్టినావు
ప్రేమయు కరుణయు బ్రహ్మానందము - గడ్డకట్టెనిట పురుషరూపమా !
నీ అందమెవరు చెప్పగలరిలను- పాలమ్ముకొను ఆ గోపి తప్ప
Download this bhajan sung by Shri Dattaswami here.
సర్వ జీవులకు మొగుడైన మొనగాడా
పదనారు వేల రాజ కన్యలకు ప్రియుడైన వాడా ! (పల్లవి)
శ్రీ వేంకటేశుడా ! నీ అందాలు ఎన్నెన్నో - చిందులేసెడి స్మరశత సుందరాంగుడా !
నీ కమలనయనాల సొగసులవె నర్తించు- పద్మావతీ హృదయ రంగమున యువతులవలె
బ్రహ్మోత్సవంబుల గరుడ వాహన ! నీవు - తిరుమల వీధులలో ఊరేగింపులలో
లలితంబుగా నూగుచు వయ్యారమొప్పుగ - అలరారు చుండేవు అరవిందలోచన !
నీ అందమె అందమురా నీ కులుకె కులుకురా -నీ పలుకె పలుకురా నీ తళుకె తళుకురా
మోహిని రూపధరుడ ! నవమోహనాకారా - నీ కమల కన్నులు చాలురా నాచూపు నిలుపంగ
అలివేలు మంగయును అలుక బెట్టును వీడి - అంతఃపురమున నిలిచి ఆలోకించునదిగో
గరుడ హనుమదాదుల నధిరోహించి నీవు - ఊరేగింపులలో వెడలు వయ్యారమును
బ్రహ్మరధము పైన బ్రహ్మోత్సవాలలో - బ్రహ్మాండవాసులగ బ్రహ్మాదులె నిరీక్షించ
నీ శయ్యయగు శేషుని నేరుగఁజూచేవు - వాలు చూపుల పద్మను కన్నుగీటేవుగా !
పట్టెనామాలతో పట్టు పీతాంబరమ్ముతో - మెరయు వజ్రాభరణాల జనసాగరమ్ములో
గాంభీర్యముగ నూరేగింపుచుండ - నిను జూచు భక్తులే నిత్యముక్తులు బ్రహ్మానందమదియె
Download this bhajan sung by Shri Dattaswami here
Monday, April 21, 2008
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో !
నామమునందున ఈశ్వర శబ్దము నాభి కమలమున బ్రహ్మయదే
వెరసి త్రిమూర్తులుగా నెలకొంటివి దేదీప్యమాన వైభవమై
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో !
2. తమ తమ పనులకు లంచములిచ్చెడి భక్త వేశ్యలకు మౌనముతో
వజ్ర కిరీటము కనకాభరణములే కనిపించును నీ శిలలో
స్వార్ధ విముక్తులు భక్తులు చూతురు నీ కరుణారస బాష్పములన్
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో !
3. అన్నమయ్య యిట పాడుచు నెక్కుచు మెట్టు మెట్టునకు చూచెనుగా
నవనవ సుందర రూపములెత్తుచు నెదురుగ కులికెడి నీ కళలన్
స్వార్ధ పూరితులు భక్తులు చూతురు కొండల బండల వృక్షములన్
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో !
4. దిగి దిగి వత్తువు పద్మావతికై కొండరాళ్ళబడి గాయములై
పదములు నిజముగ కమలములయ్యెను రక్త సిక్తములు ఎర్రనివై
పద్మా ప్రణయము స్వార్ధ రహితమది నిర్మల గంగా వాహినియే
జయ జయ సప్త గిరీశ్వర! వేంకటనాయక ! దత్తాత్రేయ విభో !
5. హే మధుసూదన ! హేమురమర్దన ! హే కంసాంతక ! దాశరధే !
హే పీతాంబర ! హే తులసీసర ! హే మురళీధర ! శాంతినిధే !
మంగా వల్లభ ! గోదా మోహన ! నాంచారీప్రియ ! వెంకపతే !
హే శ్రుతి శాస్త్ర పురాణ సమన్వయ తత్త్వ సుబోధక దత్త గురో !
శ్రీ నరసింహ స్తుతి
జటాపావకజ్వాలికా దీప్యమానా నమో నారసింహా విధూతాస్మదంహా
2. మహాక్రోధ వహ్నిచ్ఛటా విస్ఫులింగా నఖైర్దంష్ట్రికాభి ర్మహాఘోరరూపా
మహాగర్జనోగ్ర ధ్వనిధ్వస్తలోకా నమో నారసింహా విధూతాస్మదంహా
3. హిరణ్యాసుర ప్రాణ నైవేద్యలోలా రమాదైవత ప్రార్ధనా క్షేప కోపా
మహాభక్త బాలస్తుతి ప్రీయమాణా నమో నారసింహా విధూతాస్మదంహా
4. పురోమంగళాద్రీశమధ్యోజ్జ్వలాస్యా ప్రపన్నార్తి సద్యోవిమోక్ష ప్రదాతా
పరాభక్తి మార్గైకసం సేవ్యమానా నమో నారసింహా విధూతాస్మదంహా
Download this bhajan sung by Shri Dattaswami here
Friday, April 18, 2008
శ్రీ రామ కీర్తన
రామం శార్ఙ్గ ధనుర్ధర మేతమ్ (పల్లవి)
నిష్కామ భక్తి తపసాక్రీతం జ్ఞానాగ్ని వచన తేజశ్శాతమ్
ధర్మస్ధాపనలోక విభాతం సాక్షాన్నారాయణ మాయాతమ్
వాల్మీకి సుకవి కవితాగీతం స్వాదర్శ కధా గంగాపూతమ్
హనుమద్భుజ పీఠాసననీతం కేవలసాయక దశముఖ పాతమ్
పట్టభిషేక సుర సమవేతం వామాంకాసన సీతాప్రీతమ్
స్వచరిత గాయక కుశలవతాతం సకల చరాచర సూత్ర ప్రోతమ్
Download this bhajan sung by Shri Dattaswami here
కృష్ణ కీర్తన
1. ఋషివరాణాం మానసాలోలహంసాయ - మకుటాన్తమయూర పింఛావతంసాయ
ఏకప్రహారేణ విధ్వస్తకంసాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
2. వ్యత్యస్త విన్యస్త పాదారవిన్దాయ - మధురామృతాసార మురళీనినాదాయ
జాజ్వల్యమానాంశు పీతామ్బరాఙ్గాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
3. ఆకర్ణ తేజస్వి మీనాయతాక్షాయ - ప్రత్యూష పద్మాంశు నేత్రచ్ఛద యుగాయ
కమల లోచన కాంతి సమ్మోహనాస్త్రాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
4. ఆముక్త ముక్తావళీ జాల హారాయ - గోపీ దధి క్షీర నవనీతచోరాయ
బృందావనే వల్లవీ బృంద జారాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
5. సాయంతనే ధేను బృన్దాను గమనాయ - మార్గమధ్యే వల్లవీ కుంచితాక్షాయ
రాధాజగన్మోహినీ మోహనాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
6. కాళీయ ఫణి ఫణా సంక్షోభ నటనాయ - కాంచీక్వణ త్కింకిణీ నిస్వనాయ
గోవర్ధనోద్ధరణ లీలాస్మితాస్యాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
7. కస్తూరికాతిలక రేఖాలలాటాయ - తులసీ స్రగామోద వక్షః కవాటాయ
పార్ధాయ విశ్వరూపాలోలఖేటాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
8. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతాయ - గోపీ సహస్రేణ సంవేష్టితాఙ్గాయ
రాసే రసే సర్వదా సద్వినోదాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్
Download this bhajan sung by Shri Dattaswami here
శ్రీదత్త హనుమదీశ్వరం
శ్రీదత్త హనుమదీశ్వరం ధ్యాయామి రఘుపతి ప్రియమ్
ప్రజ్ఞాని భక్త యోగినం పావనిం పరమ పావనమ్ (పల్లవి)
1. అన్నా ! అన్నా ! ఓ హనుమన్నా ! పాపములెన్నో చేసితినన్నా !
దయతో నీవె క్షమించకున్న దిక్కులేదు నా సాధన సున్న !
2. ఇంద్రియ నిగ్రహమసలే లేదు నీకు తమ్ముడని చెప్పుట సిగ్గు !
నిష్కామ సేవ కలలో మాట అదియే గద నిత్యము నీబాట
3. పరమవావనా ! పవన కుమారా ! రుద్రావతారా ! నిర్జిత మారా !
వీరాధివీర ! వేదార్ధసారా ! ఖల సంహారా! గిరి సంచారా !
Download this bhajan sung by Shri Dattaswami here
సంకట మోచన హనుమత్ స్త్రోత్రము
(సముద్రమును దాటు విషయములో వ్యాకులమై తనను స్తుతించుటలో మునిగి యున్న వానర కులమును చూచి జలధరములను చుంబించు మహాకారముతో కేవలము ఒకఅడుగుతో జలధిని లంఘించి, సీత క్షేమముగా ఉన్నదను వార్తను నివేదించి ఘనమైన శోకమును పోగొట్టి రఘుపతిని ఆనందింపచేయుచున్నవు ఓ కపీశ్వరా! మహాసంకట మోచనుడవను పేరు నీకున్నదని ఈ జగత్తులో ఎవరికి తెలియదు).
అహికుల బంధన మోహిత దాశరధీ ద్వయ మాలోక్య మనో వికలం
ఖగపతి మానయసిస్మ వికుంఠా పురగతమస్త్ర విమోచనదక్షమ్
పునరాయోధన బలినం వహసిచ భుజయుగరూఢం సోదరయుగ్మం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(నాగముల పాశముతో మూర్ఛిల్లి నిశ్చేష్టులైన రామలక్ష్మణులను చూచి ఆ నాగాస్త్రమునుండి మోచనము కలిగించుటలో సమర్ధుడైన గరుత్మంతుని వైకుంఠమునుండి తీసుకువచ్చి నాగపాశ విమోచనము గావించి మరల యుద్ధమునకు సన్నద్ధులైన రామలక్ష్మణుల సోదరుల జంటను, నీ భుజస్కందములపైమోయుచున్నావు ఓ కపీశ్వరా!...)
ఉత్పతసి క్షణ మద్రిముపానయసిస్మ కరేణ తమివ సుమగుచ్ఛమ్
ఉత్థిత లక్ష్మణ కరయుగ వందన మాలింగసి విహసంశ్చ సరాగం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(యుద్ధములో మూర్ఛిల్లిన లక్ష్మణుని మూర్ఛను పోగొట్టుటకు సమర్ధమైన మహౌషధి యగు సంజీవి లతను తీసుకొని వచ్చుటకు ఒక్క క్షణకాలములో ఎగిరి ఆ సంజీవి పర్వతమునే పూలగుత్తివలె చేతిలో ధరించి తీసుకొని వచ్చినావు. సంజీవి లతతో మూర్ఛ నుండి లేచిన లక్ష్మణుడు రెండు చేతులెత్తి చేసిన నమస్కారమును పెద్దగా నవ్వుచూ ప్రేమతో గ్రహించినావు ఓ కపీశ్వరా!...)
శతముఖ రావణ హృత రఘునాయక మంబా బలిపశుముపగత మోహం
పునరానయసిచ తమసురముపగత జీవం విధాయపాతళేశమ్
రాఘవశరమూర్ధ్వముఖంకృత్వా నమ్రం హరసిచ యుధి దశకంఠం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(కాళికాదేవికి బలినిచ్చుటకై శతముఖ రావణుడు మాయచే మోహింపచేసి రఘునాయకుని పాతాళమునకు తీసుకొనిపోగా, ఆ పాతాళ రాజగు శతముఖ రావణుడగు రాక్షసుని విగతజీవుని చేసి శ్రీరాముని మరల కొనితెచ్చినావు. రావణునితో రాముడు యుద్ధము చేయునప్పుడు యుద్ధనీతి ననుసరించి ఊర్ధ్వముఖముగా బాణమును వేయగా నీతండ్రియగు వాయుదేవుని అర్ధించి ఆ బాణము అధోముఖముగా చేసి రావణుని నాభిలోయున్న అమృత కలశమును ఛేదించి సంహరించినావు ఓ కపీశ్వరా! ...)
శృంఖలయా నియత శనైశ్చరమపి మోచయసిస్మ శుచ స్సహసాతం
కోమే సంకట ఇహ హనుమన్గురు సోదర మామవ దయయా దీనమ్
కధమపి యోగ్యో నాహమకారణ కరుణైవ తవహి కారణమేకం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(సర్వసంకట కారకుడగు శనైశ్చరుడే లంకానగరమున ఇనుప సంకెళ్ళతో బంధించబడి దుఃఖసంకటములో పడగా వెంటనే ఆ శనైశ్చరుని బంధవిముక్తిని గావించితివి. అట్టి నీకు ఇచ్చట నా సంకటమొక లెక్కయా? ఓ హనుమంతా! అన్నా! గురుదేవా! దయతో దీనుడైన నన్ను రక్షించుము. ఏ విధముగా చూచినను నాకు యోగ్యత లేదు. కాని అకారణమైన నీకు గల కరుణయే ఒకే ఒక కారణముగా నన్ను రక్షించుము ఓ కపీశ్వరా!...)
వానరసింహ ఖగేశ వరాహ హయానన పంచానన శివరూపం
వైష్ణవ తిలకం భవిష్య జగతాం ధాతారంత్వాం నమామిదేవమ్
త్రిమూర్తి తత్వం సాక్షాద్దత్తం పరమబ్రహ్మహి లీలాదాసం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(వానర - సింహ - గరుడ - వరాహ -హయ - ముఖములతో పంచానన శివ రూపుడును విష్ణు తిలకము గలవాడును ఈ జగత్తుకు భవిష్యద్బ్రహ్మయు త్రిమూర్తి తత్త్వముతో సాక్షాద్దత్తుడవయ్యును లీలా వినోదముకు దాసుడుగా గోచరించు ఓ హనుమద్దేవా! నిన్ను నమస్కరించుచున్నాను ఓ కపీశ్వరా!...)
హే కనకాంశుక ! కాంచన కుండల వందేత్వాం హనుమంతమనంతం
హేపింగళాక్ష ! సద్గుణ సాగర ! మామవ సతతం మాయామూఢమ్
హే మేరుగిరి సముజ్వల విగ్రహ ! పాలయమాం తవ పదయుగలోలం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(బంగారు వస్త్రములు ధరించినవాడా! బంగారు కుండలములు కలవాడా! అనంతా! హనుమంతా! నీకు వందనములు. ఓ పింగళాక్షా! ఓ సద్గుణ సాగరా! మాయచేమూఢుడైన నన్ను సదా రక్షించుము. మేరు పర్వతమువలె ప్రకాశించు శరీరము కలవాడా! నీ చరణ ద్వయమునందు ఆసక్తుడైన నన్ను పాలించుము ఓ కపీశ్వరా!...)
యోమనుజస్స సమేతి శతాయు ర్బల మారోగ్యం తేజోధైర్యమ్
శతశత సంకట జాల మపిక్షణ మేవ వినశ్యతి యాతి సతోషం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్
(ఈ సంకటమోచన హనుమద్దేవతా మహాస్తోత్రమును ఏ మానవులు నిత్యము పాడుదురో వారికి శతాయుర్దాయము, బలము, ఆరోగ్యము, తేజస్సు, ధైర్యము లభించును. వందల కొలది సంకటములు వలగా చుట్టినను ఒక్క క్షణ కాలములో నశించి ఆ మానవులు ఆనందమును పొందుదురు ఓ కపీశ్వరా!...)
Download this bhajan sung by Shri Dattaswami here
అల్లాడెనమ్మా శివుడు - ఇక సతి లేదని
అల్లాడెనమ్మా శివుడు - ఇక సతి లేదని అల్లాడెనమ్మా శివుడు
అల్లాడెనమ్మా తాండవమాడెను శివుడు (పల్లవి)
1. త్రిపధగామిని శిరసుగంగయు - మూడు నేత్రములశ్రుధారలు
చిందించుచుండ చిందులేసెను - హృదయతాపము నోర్వగలేక
2. శాంతి దేవరా ! శాంతి దేవరా ! - అనుచునందియు ప్రమధులు చెప్ప
ఆలకించడు ఆదిదేవుడు - అలమటించుచు అరచి ఏడ్చెను
3. అంగములన్ని అదురుచుండగ - కైలాసమున కాలకంఠుడు
ఏది నా సతి నాసతియనుచు - అందరినడిగి ఎగిరి ఏడ్చెను
4. రాక్షసులైన అడిగిన వెంట - నిచ్చెవరముల కరుణార్ణవుడు
సతినిమ్మనుచు యాచించునదె - కింకరులనట నాట్యమాడుచు
5. నా నిందవిని ప్రాణము విడచె - కలరేయిట్టి భక్తులు జగతి?
నాప్రాణములు పోవవేలనో - అని విలపించె తాండవమందున
6. తూలును ఎగురు మెలికలు దిరుగు - గంతులు వేయు చేతులు ద్రిప్పు
హాహాయనును హాలాహలమె - మింగినవాడె విలవిలలాడె
7. వర్తమానము భావిభూతము - కాలమునందు నిట్టి ప్రేయసి
ఉండబోదని ఘోషించెనట - వేదనాగ్నికి వేగిపోయెను
8. ప్రళయమందున సర్వదహనుడు - ఫాలనేత్రుడే వలవలయేడ్చె
సతీ విరహము తాపమునందు - తాళజాలక తాండవించెను
9. నా నిందకే దహనమైతివి - నేనింకనూ బ్రతికి యుంటిని
నన్నుమించిన కఠినుడుండునె - అనుచు శంకరు డరచియాడెను
10. పింగళ జటల విదిలించునదె - విపరీతముగ గంగ చిందగ
సతీ దహనము నూహించగ - వక్కలై తలపడుట తోచెను
11. నాసతియనుచు కౌగిలించును - శూన్యమందున సతి భావమున
కంపముతోడ నృత్యము జేసె - మంటలబడిన నాగుపాముగ
12. భక్తుల పైన భగవత్ప్రేమ - అపారమగును అందున సతియు
భక్తరత్నము స్వామి హృదయము - తల్లడిల్లెను కల్లోలమై
13. ఉమగా సతియె అవతరించియు - మరల చేరినగాని ముఖమున
మందహాసము పుట్టలేదుగ - శివునికప్పుడె శాంతి వచ్చెను
Monday, April 14, 2008
సతీ దేవి కీర్తన
(దక్ష ప్రజాపతి కుమార్తె శ్రీ శివ దేవుని రాణి సతీదేవి. తండ్రియగు దక్ష ప్రజాపతి శివుని ఆహ్వానించక శివ రహితమైన యఙ్ఞము తలపెట్టి కుమార్తె సతిని అల్లుడు శివుని ఆహ్వానించలేదు. తన చెల్లెళ్ళు ఆ యఙ్ఞమునకు వెళ్ళుచుండగా జూచిన సతి, భర్తను బ్రతిమాలి శివుడు వద్దన్ననూ వినక స్వామీ అనుఙ్ఞ ఇవ్వండి అని బ్రతిమలి ఆ యజ్ఞమునకు వెళ్ళింది. అక్కడ తండ్రి దక్షుడు శివనిందచేసి ఆమెను అవమానించాడు. భగవంతుడైన శివుని అవమానమును భరించలేక సతీదేవి సతీత్వమును చెందు ఘట్టము.)
సతీ దేవి కీర్తన
1. దక్షాయనుచును ఏకవచనమున - సంబోధించెను తండ్రిని శివసతి
దాక్షాయణియె మొట్టమొదటిగా - స్వామి దూషణము నోర్వగలేకయె
2. ఓరీ! దక్షా ! నోరుమూయుమిక - నా తండ్రిగాన బ్రతికి పోతివిట
వేరొకరైతే నా శాపాగ్నికి - భస్మమయ్యెదరు శివదూషణకై
3. నీకు పుత్రికగ జన్మించుటయే - నేను చేసినది మహాపాపమే
తత్ఫలమిప్పుడు శివదూషణమును - వినవలసెను నేనేల బ్రతుక?
4. స్వామి దూషణము నాకర్ణించియు - బ్రతికి యుంటినే పాపిష్ఠిదాన
కావున పాపికి నీకు పుట్టితిని - మరణించుటయే ప్రాయశ్చిత్తము
5. శివుడన నెవరని తలచుచుంటివో - మూఢాగ్రేసర రాజాధిరాజ !
శివుడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన వేషములేగద
6. జగదుత్పత్తిని జగత్పాలనను - జగదంతమునే చేసెడి వాడే
పరమేష్ఠియనగ పురుషోత్తముడన - పరమేశ్వరుడన నతడే దత్తుడు
7. ఓరీ దక్షా ! ఙ్ఞానాంధుండవు - నీ కేమి తెలియు శివమహాత్మ్యము
కరుణరూపుడా పరమేశ్వరుడే - కావున తిట్టియు బ్రతికి యున్నావు
8. శివదూషణమే మహాపాపము - దానిని మించిన పాపము లేదట
దానికి ప్రాయశ్చిత్తము లేదుర - సర్వ పాపహరమగు శివనామము
9. అర్ధము తెలుయునే ? సర్వమంగళుడు - అని శివశబ్దము తాత్పర్యంబని
శివరహితంబగు కర్మయేదైన - అమంగళంబగు నశుభము తుచ్ఛము
10. శ్మశానవాసిని శివునర్చించిన - శ్మశానగమనము తప్పును దక్షా!
అపమృత్యుహరము మృత్యుంజయుడని - తలచుటయని మునిగణములు చెప్పవె
11. దిగంబరుండే కృత్తివాసుడే - పట్టు వస్త్రముల దాల్చనివాడే
కానీతత్పద నతుడు ప్రతిదినము - స్వర్గసంపదల రక్షకునింద్రుడు
12. శివపద ధూళిని శిరమునఁదాల్చును - ప్రతి సూర్యోదయమందున సురపతి
ఆరోజు వరకు అతడికి స్వర్గము - సురక్షితంబగు దక్షా! వినరా !
13. సర్వసంపదల నతడే యిచ్చును - సృష్టి యంతయును అతడి సొత్తే
బిడ్డలు దీనిని భోగించచూచి - సంతుష్టుండగు ఆ మహేశ్వరుడు
14. ఓ పిచ్చి వెధవ ! దరిద్రుడనగా - అమంగళుండన నోరెట్ల వచ్చె
నేత్ర పద్మమును అతడికర్పించి - సర్వ లోకపతి పదవిఁ బొందె హరి
15. శిశుపాలుతిట్లు విని గోపాలుడు - సభలో వక్కల లెక్కించినట్లు
నీ దూషణములు లెక్కపెట్టబడు - మహాకాలుడగు పరమేశునిచే
16. బ్రహ్మయు హరియును యత్నింపలేదె ? కనుగొననీశ్వరు మొదలును తుదినట
హంసవరాహము రూపము లెత్తియు - చేతగాక శివ శరణముఁ జొచ్చిరి
17. వారికె తెలియనసాధ్యుడు శివుడు - నీకేమి తెలియు వాగబోకురా
హరివిధులముందు నీవొక చీమవు - ఆతత్త్వ మెరుగ నీతరమగునే !
18. నీ బోడి యఙ్ఞమెంతర దక్షా ! - యఙ్ఞపురుషుడగు నారాయణుడే
మేరు శైలమున ప్రతి దినమాయనను - పూజించె కమల సహస్రార్చనల
19. నారాయణునే పరీక్షఁ జేసెను - మాయజేసెనొక కమలము నొకపరి
నేత్ర కమలమును పెరికి అర్పించె - ప్రసన్నుడై శివుడెదురుగ నిలచెను
20. కౌగలించె శివుడబ్జలోచనుని - మోహిని భావము నందుచు హరియును
పతిగా తలచెను పరమేశ్వరునే - పురుషోత్తముడే స్త్రీ భావమందె
21. నాటినుండియును సర్వ జగత్పతి - పదవిని మురారి కిచ్చెను భార్యకు
మోహినిరూపము దాల్చి భార్యగా - పురుషోత్తముడే మారెను దక్షా!
22. నీవొక పురుషుడ వైతివీనాడు - పురుషోత్తమునకు పురుషుడగువాని
అల్పుడిగఁ దలచి నాడవు మూర్ఖా ! - నీ అజ్ఞానపు జలధి అపారము
23. శివ నామమును ఉచ్చరింపగనె - శాంతించుమనము పవిత్రతఁ గలుగు
ఒక్కసారి శివ నామము పలుకుచు - అనుభవమందుము మూర్ఖత్వమేల ?
24. మహాప్రళయమున సర్వ జగత్తును - భస్మముఁ జేయును కాలాంతకుడై
సర్వమీశ్వరుని వశముననుండును - విభూతికర్ధము ఇదె భస్మమునకు
25. తాండవగళితము భస్మమును సురలు - సంగ్రహించి తిలకంబు ధరింతురు
శివతనువునుండి రాలినదానిని - చూచి దరిఁజేర భీతుడగు యముడు
26. హాలహలమట జగములదహింప - మగవాడెవడు ముందుకు వచ్చెను ?
పురుషుడొక్కడే పరమేశ్వరుడే - దానిని మింగెను నీలకంఠుడై
27. భస్మమైతిరే నీకు తెలియదా - అట్టహాసమున త్రిపురాసురులే
శరభావతారమెత్తి రుద్రుడే - నరసింహుని శాంతింప చేసెనే
28. ఆదిదేవుడా ! దేవ దేవుడా ! మహాదేవుడా ! నా ప్రాణనాధ !
నా ప్రాణ దీపమారిపోనిమ్ము - నీ నిందవిన్న బ్రతుకు నాకేల ?
29. నా ప్రాణనాధ ! నీ చరణమందు - నా ప్రాణ దీప మారిపోవగా
నాకాభాగ్యము లేదాయెనాధ ! - వీడి కడుపునకు పుట్టినందులకు
30. నీ ప్రేమలోన జీవించియున్న - నిజమైన భక్తురాలనైనచో
నా పాదాంగుళి నిదిగోరుద్దితి - భూమిపై అగ్ని పుట్టిననుగాల్చు
31. అపుడు యోగాగ్ని పుట్టెను దహించె - సతీదేవినే హాహారవములు
మిన్నుముట్టెనే మునిసుర కృతములు - ఎంత భక్తియని అచ్చెరువొందిరి
32. స్వామి దూషణము విన్నమాత్రమున - ప్రాణత్యాగము చేసిన సతినే
మూడుచూపులును ఏకముకాగా - చూచెవిస్మితుడు పరమేశ్వరుడును
33. మూడు నేత్రముల బాష్పధారలే - త్రిమార్గగంగా వాహినిఁ బోలుచు
కురియగ పల్కెను స్వామి 'ఓ ప్రియా-నీ ప్రేమ నెరుగ నాకునసాధ్యము'
భగవద్దూషణ శ్రవణమాత్రమున - ప్రాణము విడచిన సతీమాతరో
సాష్టాంగమిదియె ప్రణతులు తల్లీ ! - మాకిమ్ము నీదు భక్తి లేశమును
Saturday, April 12, 2008
జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్
జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్ (పల్లవి)
1. ఉగ్రుని ఉగ్రమె వీరభద్రునిగ ఆకృతి దాల్చగ నృత్యములో
రంకెలు వేయుచు గంతుల నెగురుచు ఖడ్గము త్రిప్పుచు హస్తముతో
బయటకు వచ్చెను పింగళజటలవె ప్రళయాగ్ని శిఖలు తోచెడిగా
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
2. ప్రళయపయోధర కులములు నొకపరిచేరుచు నురిమిన శబ్దముతో
పటుతర గర్జనలోప్పగ 'దక్ష పిపీలికమా! ఎటనుంటివిరా ' ?
అనుచుచు కేకల వేయుచు గగన పధంబున ప్రస్థితుడైతివిగా
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
3. పదపద ఘాతమునందున మేఘము లెగురగ నక్షత్రంబులవే
ధూళి కణంబులుగా పైకెగురుచు తారాథూమములుప్పతిలన్
భగ భగ మండెడి విస్ఫులింగములు కన్నుల వర్షముగా కురియన్
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
4. నిను తిలకించిన దేవగణంబులు మునులును పరుగులు తీసిరిగా
అదియె మహా ప్రళయంబదె వచ్చె నటంచుచు కేకలతో దిశలన్
మెలిదిరిగిన మీసములె కత్తులుగా ముఖమందున భీకరముల్
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
5. ఋషులను సురలను పాదఘాతములఁ దన్నుచు వచ్చిన పాపముకై
శివరహితంబగు క్రతువును చేయగ ఎంత పొగరనుచు గర్జనతో
క్రతువున వెలిగెడి అగ్ని గుండమున ఉమ్మి వేసియట నార్పితివే
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
6. దక్షుని శిరమును తెంచితివచ్చట ఖడ్గముతో నావేశముతో
ఛీ ఛీ తుచ్ఛాయని గాండ్రించుచు వ్యాఘ్రమురీతిగ దూకులతో
ఉగ్ర విహారము చేయగ బ్రహ్మయు, హరియు నుతింప నిలచితివే
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
7. హే! కరుణార్ణవ ! దక్షుని జీవము నిచ్చితివప్పుడు శాంతుడవై
విధి హరి యాచన మన్నించితివే దయతో నీ పదమందు పడన్
మేషముఖుండగు దక్షుడు నిన్ను నుతించగ వీరేశ్వర శరభా !
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్
8. హే! కరిమర్దన ! హే క్రతుఖండన ! హే విషకంధర! నందిపతే
హే! శశిశేఖర! హే ఫణిభూషణ ! హే కాలాంతక! స్కందగురో
హే ! వీరేశ్వర ! హే పరమేశ్వర ! హే లయ తాండవ ! ప్రమధపతే!
త్వాం ప్రణమామి మహేశ్వర ! శంకర ! పాలయ కింకర మీశ్వరమామ్
9. వీరంభజే - వీరభద్రం భజే - రౌద్ర వికటాట్టహాసంభజే
కాళీపతే - భద్రకాళీపతే - రౌద్ర వికటాట్టహసంభజే
శ్రీ భద్రకాళీ సహితం వీరభద్రం నమామ్యహమ్
కులదేవం ప్రసూతాత రూపాన్తర మివస్ధితమ్
శివ కీర్తనలు - 2
కదలి వచ్చినాడె కళ్యాణమునకు
సుందరేశ్వరుడు సొగసుల రాయుడు కదలి వచ్చినాడె (పల్లవి)
1. జటాజూటమే కనక కిరీటము - చంద్రరేఖయే ముత్యాలసరము
ఫాలనేత్రమే అరుణతిలకమై - సంకల్పించగ వేషము మారెను
2. ఉరగములయ్యెను స్వర్ణహారములు - పడగల మణులవి మార్పును చెందక
తనువున తెల్లని భస్మము మారెను - సుగంధ కరమౌ అంగరాగముగ
3. గజాజినమయ్యె పట్టు వస్త్రముగ - గంగాధారయె మల్లెలమాలగ
చరణోరగములు మణినూపురములు - కంఠ నైల్యమే కలువపూవుగ
4. ప్రమధగణంబులు రాజవేషముల - మేళములూదుచు వాద్యనాదముల
బయలుదేరగా బయలుదేరెనే - పెండ్లి కొడుకై పరమేశ్వరుడు
5. మదవృషభంబదె నందీశ్వరుడు - సాలంకృతుడై చిరుమువ్వలతో
స్వామిని మోయుచు సుందరగతితో- ఝలఝల ఝలఝల రవముల నడచెను
6. వేదమంత్రముల చదువుచుముందుగ - వాణితో నడచె బ్రహ్మ దేవుడట
పద్మ గోవిందులిరుపక్కలలో - నడచిరి నవ్వుల కళకళలాడుచు
7. వాణి రచించిన మంగళ గీతుల - మధుర కంఠమున పద్మ పాడినది
మురహరుడంతట మురళినూదెను - తలనాడించెను స్మితముఖుడీశుడు
8. ముక్కోటి సురలు ముందుగ పక్కల - వెనుకను నడచిరి శంఖములూదుచు
స్వస్తి వాచనము లొప్పగ చెప్పుచు - సప్త మహర్షులు సరసనె నడచిరి
9. గంధర్వగణము గళమెత్తిపాడె - జయజయ శంభో జయశంభో! యని
కిన్నరు లందరు వీణల మీటిరి - అప్సరసలంత నృత్యమునాడిరి
Download this bhajan sung by Shri Dattaswami here
-------------
(త్రిపుర సుందరి యైన పార్వతిని వాణి, పద్మలు దేవకాంతలే సువాసినులుగా అలంకరిచిన ఘట్టము).
గౌరీ కళ్యాణ వైభవమే దేవ కాంతలే సువాసినులే (పల్లవి)
1. ఉత్తర తారను చంద్రుడుండగ - సింహలగ్నమున పార్వతి పెండ్లి
బంగారు బొమ్మ గౌరిని వధువుగ - చేయుచుండిరదె సువాసినులార!
2. గంగయె స్వయముగ తరలివచ్చెనే - మంగళస్నాన విధినొనరించగ
ఆస్నాన నెపముతోడ గంగక్క - కౌగలించెనే ముద్దుల చెల్లిని
3. పసుపును కలిపిన సున్నిపిండినే - నలుగును పెట్టగ వచ్చిరి స్వయముగ
వాణియు లక్ష్మియు విసిరివేసిరే - దానిని గౌరీ తను కాంతిఁజూచి
4. పన్నీరుఁజల్ల పరుగున వచ్చిరి - దేవకాంతలట పార్వతి మీదను
గౌరితనువున పద్మగంధమదె - సహజముగరాగ విరమించిరదియు
5. బంగారురంగు ఎర్రని అంచుల- పట్టు చీరెనే శివుని కిష్టమని
ధరింపఁజేసిరి బంగారు కాంతి - దేహమందునది కలిసిపోయెనే
6. బంగారు సొమ్ములన్నియు పెట్టిరి - గౌరికితనువున వెలవెల బోయెను
అగ్నిలో కాలి మరింత మెరుపున - వచ్చిన తనువది పూర్వజన్మఁ బడి
7. పూలహారములు నంగములందున - శోభిల్లు చుండ వనదేవతలా
పద్మవేసినది పద్మహారమును - కోత్త శోభతో వెలుగుచుండెనది
8. మొగలి పూవులే రేకుల ముడిచి - గులాబిపూవుల తురుముచు కట్టిన
పూలమాలతో మేళవించిరే - పెండ్లి కూతురికి జడనువేసిరే
9. కళ్యాణతిలకమప్పుడు దిద్దిరి - గౌరి ఫాలమున పద్మయు వాణియు
అరుంధతి పెట్టె కన్నులకాటుక - కాటుక చుక్కను బుగ్గపై చివర
10. హంసయానమున బయలుదేరెనే - మేళతాళములు మిన్నుముట్టగా
బంగారు గాజులవె కదులుచుండ - పదములనందెలు ఘల్లు ఘల్లుమన
11. పారాణి పాద పద్మములవియే - జగదంబవియట కదులుచున్నవే
అడుగు అడుగునకు కొత్త అందములు - అప్సరసలెమరి మురిసిపోయిరే
12. వాణియు పద్మయు కౌగిలించిరే - మోహభావమున తాళజాలకే
త్రిపురసుందరియె పెండ్లి కూతురై - సొగసుల దేవత నడుచుచున్నదే
13. కండ్లుమూసుకొని తపమును చేయును - శివుడెందులకో ఇపుడర్ధమాయె
అందాలరాశి నీ గౌరమ్మను - పొందుటకేలే అన హరి నవ్విరి
14. తత్తరలాడెను శివుని నేత్రములు - గౌరినిఁ జూడగ బ్రహ్మ మంత్రముల
నాలుగు ముఖముల నొకసారిచదువ - వేరువేరుగా బాగుండుననుకొనె
15. ముక్కోటి దేవత లొక్క దృష్టితో - చూచుచుండిరే కన్నులు చెమరింప
మంగళ సూత్రము కట్టునమ్మా - గౌరికి మెడలో శంకరుడు
16. భగవంతుడే వరుండనగా - భక్త జీవుడె పెండ్లి కూతురు
మంగళసూత్రమె భక్తి బంధము - అంతరార్ధమును తెలియండీ
17. భరించువాడే భర్తయగును - సర్వ భర్తయె పరమాత్మ
భరింపబడె జీవుడు భార్య - సహస్రార బంధమె కళ్యాణము
18. శివాయ మంగళం - సర్వ మంగళం - సర్వ మంగళా ధవాయ మంగళం
భవాయ మంగళం - దత్త మంగళం - అనఘా ప్రియాయ నిత్య మంగళం
Download this bhajan sung by Shri Dattaswami here
-----------------------
(సతీదేవి హిమవంతునకు పార్వతి నామధేయముతో జన్మించి, శివుని వరించి తపము చేయుచున్నప్పుడు శివదేవుడు కుహనావటువు రూపంలో వచ్చి ఆమె దీక్షను పరీక్షించుట).
గౌరి పరీక్షకు బ్రహ్మచారిగా వచ్చుచున్నా డు వామదేవుడు (పల్లవి)
సుందర తాపస తరుణ వేషమున - బ్రహ్మతేజమే ప్రజ్వరిల్లగా
కరముల దండ కమండలు ధారిగ- పండితోత్తముడు హుటాహుటి నడచి
చరణ పాదుకలు ధ్వనులను చేయగ - బ్రహ్మ వర్చస్సు ముఖమున చిందగ
తేజోమయ ననయంబుల చూచుచు - సన్న నవ్వు అధరంబున వెలయగ
విభూతి రేఖలు మధ్య కుంకుమము - ఎర్ర కాశ్మీర శాలువ భుజముల
వేదమంత్రముల తియ్యగ పలుకుచు - బ్రాహ్మణ నైష్ఠిక గాంభీర్యముతో
Tuesday, April 8, 2008
శివ కీర్తనలు - 1
చంద్రశేఖరా దయాసాగరా
వామదేవా! నిను వర్ణించగలనా ? (పల్లవి)
1. ఉపమన్యువనెడి తాపసబాలుడు - పాలు లేక విలపించె నాశ్రమమున
దిక్కుతోచని తల్లి పలికెను - సర్వేశ్వరునే అడుగు పొమ్మని
2. అంతట బాలుడు బయలుదేరెను - దుర్గమారణ్య మార్గమందున
నాన్నా! శంకర! పాలనీయవా! - అన్న వాక్యమే మంత్రమాయెను
3. ప్రళయ భయంకరుడైనను నీవు - కరిగిపోతివి కరుణార్ణవమా
యుగయుగ తపముల కందనివాడవు - క్షణమున ఎదురుగ నిలిచినావు
4. ఫాలనేత్రము నుండియు కురిసెను - వేడి వేడి కన్నీటి ధారలు
పాలబుగ్గల పసివానిఁ జూసి - నాన్నా రమ్మని కౌగలించితివి
5. తొడను కూర్చుండ పెట్టుకొంటివి - చేతిలోనికే పరుగున వచ్చెను
పాలసముద్రమె బాలున కీయగ - నీ కరుణఁ జూచి అసురులె ఏడ్చిరి
Download this bhajan sung by Shri Dattaswami here
--------------------
(పార్ధునికి పాశు పతాస్త్రము అనుగ్రహించిన కీర్తన.)
బయలుదేరినాడే - బోయవేషముల
పార్ధునితోడ యుద్ధముచేయగా
పార్వతితో పరమేశ్వరుడు (పల్లవి)
1. కైలాసము వీడి కదలివచ్చినాడే - కలకలనవ్వెడి కలికి వెంటరాగ
మందాకిని తట మందగమనమున - మందహాసమున భక్త మందారుడు
2. అడుగులు వేయుచు గంభీరముగా - ఎర్రని జటలవె ఎగురుచుండగా
చేతుల నూపుచు వీరాధి వీరుడు - మృగములరాజగు సింహము రీతిగ
3. శిరసు చంద్రకళ పక్షి యీకెగను - ఫాలనయనమె కుంకుమ బొట్టుగ
ఉరగ భూషణములు పూసలదండలు - మారిపోవ శివ కోయరాజతడు
4. ఆదిదేవుని అడుగుల బాటను - హిమగిరి వనమదె అప్పటికప్పుడె
పుష్పములరాల్చి పూలబాటగా - అర్చించెనట అనఘా ప్రియుని
5. అతిధీరముగా అతి విలాసముగా - వామదేవుని నడకల సొగసులు
తనివితీరగా ఆలోకించిరి - ఆకాశమందు అప్సరసలట
6. అనవసరముగా రెచ్చగొట్టియు - ఓడించిమరల గెలిపించి నరుని
అనుగ్రహించెనదె పాశుపతమిచ్చి - అపార కరుణా సాగరుడతడే
Download this bhajan sung by Shri Dattaswami here
--------------------
కింకరోஉస్మి తవ శంకర ! నూనం
భక్తవ శంకర ! పాహి పాహి శివ ! (పల్లవి)
1. హిమాంశురేఖా ముక్తావళీవ - జాటజూట మకుటోపరి భాతి
ఉష్ణీవస్త్ర శేషవదేషా - ధవళా తరళా గంగాధారా
2. మణి దీధితి మత్కాల సర్పకుల - మిన్ద్ర నీలమణి హారచయఃకిమ్ ?
లలాటనయనం వహ్నిభిరరుణం - విభూతి రేఖా కుంకుమబింబమ్
3. పినాక పాణే! పాశుపతాస్త్రం - పార్ధాయ దిశసి పరమోదార !
మునిశిశవేత్వం క్షీరాబ్ధిమేవ - గౌరీమేవచ దశకణ్ఠాయ
Download this bhajan sung by Shri Dattaswami here
------------------
అన్నపూర్ణతో ఆసినుడైన - ఆదిదేవుడా! ఆలకించవా
నన్నేలుమింక నారాయణ ప్రియ! - నాకెవరు దిక్కు నాగేంద్ర హార! (పల్లవి)
1. వారణాసిలో విశాలాక్షితో - వేదపీఠమున వెలిగేటి దేవ!
జీవ భక్తులకు మాయలముడులను - తలి విప్పగా మోక్షమిచ్చేవు
2. గంగలో మునుగ ముక్తులయ్యేరు - బ్రహ్మ ఙ్ఞానమె గంగానది యన
జలములమునిగెడి పశువులఁజూచెడి - మందస్మితముఖ ! పశుపతినాధ !
3. ఙ్ఞానమె తేజము కాశి అర్ధమదె - ఙ్ఞానప్రాప్తియె కాశీగమనము
భక్త్యావేశమె గంగా స్నానము - పరమార్ధ దత్త ! పరమేశ వేష !
4. సర్వపాపహర ఈ భక్తి గంగ - నీ కరుణ హిమమై ప్రవహించెనదిగ
అంతరార్ధమున పశుపతిని పొందు - బాహ్యార్ధమైన పశుజన్మ పొందు
Download this bhajan sung by Shri Dattaswami here
Thursday, April 3, 2008
శఙ్కరాయతే - లోక - శఙ్కరాయతే
శఙ్కరాయతే - లోక - శఙ్కరాయతే
వన్దనానిమే - దేవ - వాసుదేవస్య (పల్లవి)
ఫాలలోచనం - తవహి - మే సుదర్శనం
శూలమేవ తే - తిలక - మూర్ధ్వ పుండ్రకం
నీల కంఠ ! తే - భాతి - కంఠ నీలిమ
విస్తరాన్మహో - మమహి - దేహ నీలిమ
ఫాల చక్షుషా - దగ్ధ - పద్మసాయకం
సాదరాక్షిణా - దృష్ట - పద్మ సంభవం
ప్రేమ వీక్షణా - లోల - పద్మలోచనం
త్వాం త్రిలోచనం - దేవ - సంస్మరామ్యహమ్
నటన పణ్డిత ! - స్ఫురతి రమ్యతాణ్డవమ్
చిత్రమణ్డలం - భ్రమణ లోల కుణ్డలమ్
ఉరగ మణ్డన ! - స్ఖలిత ధర్మదణ్డనమ్
దనుజ ఖణ్డనం - విజిత భారతీ భణ్డనమ్
Download this bhajan sung by Shri Dattaswami here
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
పంచాక్షరి యిది పరమ పావనము (పల్లవి)
1. పంచభూతములపై ఆధిపత్యమును - ప్రసాదించగల మహామంత్రము
సుందర కవితా చాతుర్యరీతి - ననుగ్రహించెడి మహా మంత్రము
2. వేదాంత జలధి మధనామృతమగు - ఙ్ఞానమునిచ్చెడి మహామంత్రము
సర్వ విక్షోభ ప్రశమన కరమై - మనశ్శాంతినిడు మహామంత్రము
3. అష్టసిద్ధులను అవలీలగాజేయు - శక్తినిచ్చెడి మహామంత్రము
చక్రాలదాటి సహస్రారమున - శివునిఁ జేర్చెడి మహామంత్రము
4. ఆదిదేవుని అంఘ్రి పద్మముల - భక్తి నొసగెడి మహామంత్రము
నిష్టానిశ్చల యమనియమాసన - ధ్యానయోగకర మహామంత్రము
5. సంసారవాసనా విషయధ్వంసక - కామదహనమీ మహామంత్రము
అనన్యమద్భుత వైరాగ్యమిచ్చు - సర్వ పాపహర మహామంత్రము
Download this bhajan sung by Shri Dattaswami here
శివుని లింగము - భవుని లింగము
హరుని లింగము - ఆత్మలింగము
అదిగో చూడుడు - అనుభవించుడు
అమర దుర్లభా - నంద ముక్తిని (పల్లవి)
1. సృష్టిపాలన ప్రళయమూలము - ఆదిదేవుని ఆత్మలింగము
అద్భుతంబగు శుద్ధతేజము - దేవదేవుని ఆత్మలింగము
2. ఆ మృకండుజ ప్రాణదానము - అమరనాధుని ఆత్మలింగము
మృత్యుదేవుని ప్రాణఘాతము - కాలకాలుని ఆత్మలింగము
3. చంద్రరేఖను కల్గినట్టిది - పార్వతీపతి ఆత్మలింగము
మూడు అడ్డపు భస్మరేఖల - నీలకంఠుని ఆత్మలింగము
4. గంగ జలముల సదభిషిక్తము - గరళ కంఠుని ఆత్మలింగము
మధ్య కుంకుమ భ్రాజమానము - వామదేవుని ఆత్మలింగము
5. సృష్టి చేయగ ప్రధమకామము - సుందరేశ్వరు ఆత్మలింగము
శక్తి రూపము సత్తరంగము - సంగమేశ్వరు ఆత్మలింగము
6. వేద జలధుల మధన దక్షము- కాశికాపతి ఆత్మలింగము
ఖలులఁ ద్రుంచును సురల బ్రోచును - కాల భైరవు ఆత్మలింగము
7. కామదేవుని కాల్చివేసిన - సోమనాధుని ఆత్మలింగము
ఆ గజాసురు కుక్షిజీల్చిన - భీమశంకరు ఆత్మలింగము
8. కాలపాశము నడ్డుపెట్టిన - మహాకాలుని ఆత్మలింగము
సాయమందున నాట్యమాడెడి - నాగేశ్వరుని ఆత్మలింగము
9. అర్ధరాత్రిని ఉద్భవించెడి - శ్రీ గిరీశ్వరు ఆత్మలింగము
అన్ని అఘముల కాల్చివేసెడి - రామేశ్వరుని ఆత్మలింగము
10. భ్రాంతినంతయు రూపుమాపెడి - వైద్యనాధుని ఆత్మలింగము
త్రికరణార్పణ సేవ్యమానము - త్రియంబకేశు ఆత్మలింగము
11. కేళితాండవా నంద లోలము - కేదారపతి ఆత్మలింగము
కృష్ణుడెప్పుడు పూజఁ జేసెడి - ఘృష్ణీశ్వరుని ఆత్మలింగము
12. పాశుపతమును పార్ధునకొసగు - పరమేశ్వరుని ఆత్మలింగము
తిన్నడొసగిన కన్ను గలిగిన - వ్యోమకేశుని ఆత్మలింగము
13. పాలధారల స్నానమాడెడి - పశుపతీశుని ఆత్మలింగము
పెరుగు ముద్దలు జాలువారెడి - శర్వదేవుని ఆత్మలింగము
14. గోఘృతంబుల తడిసినట్టిది - గోకర్ణపతి ఆత్మలింగము
ఫలరసంబుల తీర్ధమాడిన - చంద్రశేఖరు ఆత్మలింగము
15. మహిషవాహుని మట్టుఁబెట్టిన - కాళికాపతి ఆత్మలింగము
నారసింహుని నిలువరించిన - శరభేశ్వరుని ఆత్మలింగము
16. దక్షశిరమును తుంచివేసిన - వీరేశ్వరుని ఆత్మలింగము
త్రిపురాసురుల మట్టి కలిపిన - త్రిలోక శాసి ఆత్మలింగము
17. ఆంజనేయుడు మోసితెచ్చిన - కైలాసపతి ఆత్మలింగము
గణేశుడెత్తి జార విడిచిన - నందివాహుని ఆత్మలింగము
18. క్షీరజలధిని శిసువుకొసగిన - స్కందజనకుని ఆత్మలింగము
హాలహలమునె ఆరగించిన - కాలకంఠుని ఆత్మలింగము
19. గౌరి తపమును పరీక్షఁ జేయు - హాటకేశ్వరు ఆత్మలింగము
ప్రమధ గణముల నృత్యలోలము - వృషభేశ్వరుని ఆత్మలింగము
20. నాదసాగర గాన మోదము - వేదవేద్యుని ఆత్మలింగము
తాండవంబున చిందులేసెడి - చిన్మయేశుని ఆత్మలింగము
21. స్వప్రాకాశము స్ఫటిక విమలము - తారకేశుని ఆత్మలింగము
మెరుపుచుక్కల రసోజ్వలమగు - పావకాక్షుని ఆత్మలింగము
22. ఙ్ఞాన నేత్రపు కంటి పాపయె - పరాత్పరుని ఆత్మలింగము
పంచాక్షరిని పలుకఁ జేసెడి - పంచాననుని ఆత్మలింగము
23. గొల్లభామకు వెనుక నడచిన - కోటీశ్వరుని ఆత్మలింగము
భక్తుల కర్మ ముడులు విప్పెడి - విశ్వేశ్వరుని ఆత్మలింగము
24. విశ్వమంతయు నాక్రమించిన - స్వయంభు విభుని ఆత్మలింగము
అష్టసిద్ధుల నతిశయించెడి - ఓంకార శివు 'ఆత్మలింగము'
25. అష్టదరిద్ర మంతము జేయు - అగ్నిలోచను ఆత్మలింగము
అష్టసిరులను అందించెడిది - హిరణ్యేశ్వరుని ఆత్మలింగము
26. ఆరోగ్యకర మాయుష్కరము - అమరేశ్వరుని ఆత్మలింగము
భయమును బాపి ధైర్యమునిచ్చు - వజ్రేశ్వరుని ఆత్మలింగము
27. పాండిత్యమును ప్రసాదించెడి - నాసికేశ్వరు ఆత్మలింగము
కవితాశక్తి ధారనిచ్చెడి - కాలాంతకుని ఆత్మలింగము
28. సంతానమును సుఖమునిచ్చెడి - గణేశ గురుని ఆత్మలింగము
అపమృత్యువును ఆపివేసెడి - కాలాంతకుని ఆత్మలింగము
29. అర్జున రధము ముందు నడచెడి - విజయేశ్వరుని ఆత్మలింగము
శిబి పరీక్షను చేసినట్టిది - కపోతేశ్వరు ఆత్మలింగము
30. వ్యాఘ్రమునెక్కి మహిషిఁజంపిన - మణికంఠ గురు ఆత్మలింగము
విషయవిషమును విరుగుడుఁజేయు - శేషహారుని ఆత్మలింగము
31. అద్వైతమత భాష్య వాదము - ఆది శంకరు ఆత్మలింగము
మండనమిశ్రు నోడించినది - వ్యుప్తకేశుని ఆత్మలింగము
32. సర్వఙ్ఞ పీఠమెక్కి వెలిగిన - శృంగ గిరీశు ఆత్మలింగము
దత్తగురువే కౌగిలించిన - కేరళ శివుని ఆత్మలింగము
33. దత్త శివునికి హృదయమందున - సృష్టి చేయగ మొదట పుట్టిన
సంకల్పమగు శక్తి వీచియె - అనఘాకృతియే ఆత్మలింగము
Download this bhajan sung by Shri Dattaswami here
Monday, March 31, 2008
కాలకంధరా ! ఇదె కార్తీక దీపం
నాగాభరణా ! ఇది నా ప్రాణదీపం
భక్తి తైలమై ఙ్ఞానమె వత్తిగ
వెలిగింది దేవ ! నీ కోసమేను (పల్లవి)
నా బాష్పధార - గంగా జలమై గద్గద గళమే - డమరు నాదమై
తనువున కంపమె - శివతాండవమై (నను) నీ పాదధూళి - కణమై పోనీ !
అహంకారినై - పాపాత్ముడినై పతితుడనైతిని - పరమేశా
నీవె కాదన్న - నేనేమి చేతు నీ పదముల పడి ఏడ్చెదను
నాధ! నీవుండ - అనాధుడనైతి కరుణార్ణవమా - కదలి రావేల ?
(నీ) ఙ్ఞానాగ్ని నేత్ర - శిఖలో కాలెద (నను) నీ దయా గంగలో-కలిసిపోనీ !
ఏనాటికైన - నీవాడ నేను నిను వీడి బ్రతుక - లేనీ కలిని
నా ప్రాణనాధ - నీ చరణమందు నా ప్రాణదీపం - ఆరిపోనీ
Download this bhajan sung by Shri Dattaswami here
---------------------
కాశీవాసా ! కాలభైరవా !
కరుణించవేల? కాలకంధరా (పల్లవి)
విషయవాసనలు విషసర్పములై - కాటువేయగా నేనేమి చేతు
హాలాహలమునె మధురామృతముగ - త్రాగిన దేవా ! కాపాడరావా?
కామాది గుణములు కలి రాక్షసులు - క్రమ్ముకొనిరి నను నేనేమి చేతు
కాముని త్రిపురుల చూచి బూడిదగ - చేసిన దేవా ! చేదుకొనరావా
చింతల పలుగుల పోటుల చిత్తము - చూర్ణమయ్యెనుగ నేనేమి చేతు
అట్టహాసమున జగముల చూర్ణము - కావించుదేవా ! కరుణించలేవా
ఏకాగ్రతతో ఏక దృష్టితో - నినుఁ జూడలేను నేనేమి సేతు
ఏకాద్వితీయ హేదత్త దేవ ! - మదన దాహక! మాంపాహి పాహి
Download this bhajan sung by Shri Dattaswami here
శివ తాండవ కీర్తన
శివ దత్తుని సుందర నృత్యమదే మధ్య మధ్య నదె రుద్ర తాండవము
విష్ణుదత్తుడగు నాతో నృత్యము - చూడ వచ్చెనదె బ్రహ్మ దత్తుడును
ప్రళయ కాలమున ఇరువురమగుదుము - శివదత్తునిలో ఐక్యము చివరకు
ఒకడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన త్రిగుణ వేషములు
ఊహవిశ్వ రచనా వ్యూహమీవు - ఊహసుందరివి అనఘవు పద్మా !
మధుమతి ! లలితవు ! దుర్గవు ! కాళివి - రాజరాజేశ్వరివి ప్రధమోహవు
వాణియు లక్ష్మియు గౌరియు నీదగు - ముచ్చట గొలిపెడి ముద్దువేషములు
అనసూయాత్రులు ఆనందముతో - ఆలోకింపగ ఆసినులైరి
ఋక్ష పర్వతము నందున వారికి - దత్తపుత్రునిగ దత్తుడు నిలచెను
తకధిమి తకధిమి నంది మృదంగము - ప్రమధ గణంబుల వాద్యనాదములు
నర్తనలోలుడు నటరాజు శివిడు - తాండవమాడెను దత్తాత్రేయుడు
పదములకదనము వడివడిగాబడ - బహువిధ భంగిమ లంగములొప్పగ
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున
గంతులువేయగ కాలికి చుట్టిన - కాల సర్పమదె కస్సుబుస్సుమన
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున
శ్రీశైలరాయుని శివతాండవమున - చిందుల అందము లేమందునె చెలి
అప్సరసలె తమ నాట్యమేలయని - సిగ్గుతో తలల వంచిరి చూచుచు
కాశీపురపతి కాలిగంతులవె - కంపించె శేషుడల్లాడెను ధర
అదిరి దిక్కరులు కుంభస్థలముల - తొండములెత్తుచు ఘీంకరించినవి
కాలభైరవుని కరాళ వక్త్రము - ఫాలాక్షి వహ్ని దీధితి మెరుపుల
అట్టహాసముల చేయగ ప్రాణులు - గడగడ వణుకుచు పరుగులెత్తిరే
శివశివ భవ భవ శంభో ! హరహర ! - అనుచు మహర్షుల ఆర్తనాదములు
మిన్నుముట్టినవి శరణాగతితో - శాంతింప జేయ ఆ తాండవమును
కాలకంఠుడదె రుద్రతాండవము - చేసెను త్రిప్పుచు ఢమఢమ ఢక్కను
కైలాసాచల శిలా స్ఫటికములు - విస్ఫోటనముల బీటలు వారెను
విశ్వేశ్వరతను విభూతి చిందెను - వెచ్చ వెచ్చనిది పరమపావనము
నుదుట ధరింపగ ఇంద్రాదులంత - నక్కి నక్కి అట సంగ్రహించిరే
నందీశ్వరుడదె రంకెలు వేయును - గర్జింతురగో ! ప్రమధగణంబులు
చిందులు తొక్కెను చిరుత గణేశుడు - మయూర వాహనుడాడె మైమరిచి
ద్వాదశ లింగము లుజ్జ్వలమయ్యెను - గంగ పరవళ్ళు తొక్కుచు పారెను
నాగాభరణములాడె నాట్యమును - కంపించె చంద్ర కళయును సొగసుగ
గంగాధారల చినుకుల జల్లుల - చంద్ర రేఖ హిమ బిందువులెగురగ
రెండు కన్నులను చల్లని చూపుల - ఆనంద మొకసారి వెలయు
ఫాలాగ్ని చక్షు రుగ్రాగ్ని శిఖలు - ఎర్రని కాంతులు చిమ్ముచుండగను
అహి భూషల పుత్కారములందున - రుద్ర తాండవము చెలగునొకసారి
ఎర్రని జటలెగురగ పంచాస్యుడు - అట్టహాసముల తాండవమందున
ఎర్రజూలు ఎగురగ పంచాస్యుడు - దూకి గర్జించు రీతిగఁ దోచెను
శేషుని సహస్ర ఫణములదొర్లుచు - భూగోళమాడె బంతిని పోలుచు
దానిని నిలుప వేయి పడగలను - రొప్పుచు తిరిగెను పాదఘాతముల
భంభం నాదము లంబరమంటగ - శంఖ ధ్వనులను ప్రమధులు చేసిరి
అప్సరసలాడిరీక్షించి నాట్య - నవ్య భంగిమల నేర్చుకొనగ దివి
చుక్కల రాలెను ముక్కంటి చూపు - వర్షించు విస్ఫులింగములంటగ
సూర్యదేవుడును చిటపట లాడెను- ఏడు గుర్రములు సకిలించి నిలచె
శాంత నృత్యముల వీణలు మీటుచు - నారదతుంబురు లెగురుచు పాడిరి
రుద్రతాండవము లందున భయపడి - కల్ప వృక్షముల చాటున దాగిరి
అదురుచు బెదురుచు పరుగులెత్తుచును - ఆక్రందించిరి అసురేశ్వరులే
హరహర శంభో పాహి పాహియని - ప్రణతులఁ జేయుచు సాష్టాంగముగా
నటనములందున పదముల మృదుమృదు-నూపుర ఝలఝల రవములు చిందగ
సుందరేశ్వరుని శిరసున గంగా - లహరీ ధ్వనులవె తాళములాయెను
ఎగురుచు దూకుచు వంగుచు లేచుచు - మెలికలు దిరుగుచు వక్రభంగిమల
చంద్రశేఖరుడు తాండవమాడెను - తళతళ మెరిసెడి తెల్ల నాగువలె
హిమాలయాచల మందున దూకెడి - తెల్ల మంచుపులి విద్యుద్రయముగ
వామదేవుడదె తాండవ ధాటిని - అంగ భంగిమల చకచక మార్చెను
ఒకసారి మంద మధుర స్మితుడగు - ఒకసారి అట్టహాస గర్జనుదు
మాధుర్యమొకచో రౌద్రంబొకచో - అమృత హాలహల పారవారముగ
గౌరిముఖ పూర్ణేందు బింబమును - చూచిన వెంటనె హరుడుప్పొంగెను
అంగములాడగ నృత్యము చేసెను - పున్నమి రాతిరి పొంగిన జలధిగ
గౌరమ్మ కూడ నృత్యము చేసెను - కొంతకాలమట శివునితో గూడి
తాండవధాటికి అలసి కూర్చుండె - స్విన్నావయవము లదురుచు నుండగ
నీలలోహితుని నిరుపమ తాండవ - మానందార్ణవ మవధులు లేనిది
నా విశ్వరూప దర్శన సమమది - చూడువారలకు జన్మ ధన్యమగు
రుద్రాక్ష హార వలయము లురమున - గలగల రవములు చేయుచునుండగ
వాసుకి గళమున నర్తించె పడగ - మణిదీధితులవె నృత్యము చేయును
ఒకచో ఢక్కను కొట్టును తిప్పుచు - ఒకచో శూలము తిప్పుచు తిరుగును
ఒకచో చూపును రిక్త హస్తముల - నాట్య ముద్రలను నటరాజు శివుడు
నారాయణ ప్రియుడతడె పద్మా ! నంది వాహనము గంతులు వేయగ
మెడలో పదముల గల గజ్జెలతో - గల గలశబ్దము కర్ణ ప్రియమదె
నటన మనోహరుడెంత సుందరుడు - దిష్టి తగులునని పుర్రెల మాలల
సర్ప భూషలను ధరించునీశుడు - కామున కీర్ష్యను పరిహరింపగా
కాముని దగ్ధము చేసెనందురిల - వట్టి మాటయది సుందరేశ్వరుని
అందము చూసిన స్మరుడె చేసుకొనె -ఆత్మ హత్యనే తగుల బెట్టుకొని
అతడే కనకా భరణములఁ దాల్చు - పురుష మోహనుడ నేనె మోహినిగ
మారిమోహమును పొందితి కలిసితి - మణికంఠునికే జన్మ నిచ్చితిని
నన్నుజూచి మునులెత్తిరి జన్మల - గోపికలుగ పురుషులకె మోహము
నా అందము కలిగించె నాకె అది - శివునిఁ జూడగా కలిగెను పద్మా
ఋషుల హృదయముల వికార హేతువు - నేనైతిని గద నా పాపమునకు
శిక్షగ నాకే ఆ వికారమే - కలిగెను కర్మ ఫలంబులు తప్పవు
ఆది దేవునిది అద్భుత తాండవ - మవలోకించిన భరత మహర్షియు
నాట్య శాస్త్రమును వ్రాసె శంకరుడు - నాట్యాధి దేవుడనగ దత్తుడే
హావ భావముల నభినయించుచును - ఆడుచున్నాడు ఆది దేవుడదె
చూడుము పద్మా! ఎంతో పుణ్యము - చేసిన వారికె లభ్య మీ ఫలము
నీలకంఠుడదె నిర్మల హృదయుడు - నిష్ఠానియతుదు నిశ్చల చిత్తుడు
కరుణా సాగరు డత్యుదారమతి - ఆత్మ సౌందర్య మపారమతడిది
రావణుడడిగిన పార్వతి నిచ్చెను - ఉపమన్యువడుగ క్షీరాబ్ధినిచ్చె
భస్మాసురునకు తననే భస్మము - చేయు వరమిచ్చె ప్రేమ సముద్రుడు
శివుని కళ్యాణ గుణ రూపములను - ఆదిశేషుడును వర్ణించలేడు
అతడి పొందుకై ఎంత తపించెను - పార్వతి దానిని బట్టియె తెలియును
నీ మొగుడు నేను నిజమే పద్మా - నా మొగుడు శివుడు మోహిని నైతిని
శివుడు తండ్రిగా నేను తల్లిగా - నా సుతుడు బ్రహ్మ గురువుగ నగుదుము
ఒక్కడె దత్తుడు వాని భావములె - గుణత్రయముగా త్రిమూర్తులైతిరి
భావమె రూపము దాల్చె నూహయది - గుణమన భావమె గుణమే రూపము
ఒక్కడె మనుజుడు మూడు భావముల - నున్న రీతిగా ముగ్గుర ముందుము
సృష్టి స్ధితి లయ కర్మ భావముల - త్రిమూర్తులనగా త్రిగుణ భావములె
ఊహించునపుడు బ్రహ్మ దేవుడన - ఊహను నిల్పగ విష్ణుదేవుడన
ఊహనాపగ రుద్ర దేవుడన - ఒక్కడె దత్తుడు మూడు నామముల
ఒకచో నొక్కొక మూర్తి గొప్పయగు - మిగిలిన యిరువురు తగ్గియుందురిట
ఈ భేదమంత క్రీడా వినోదము - పరమార్ధములో ముగ్గురు ఒక్కడె
ఆడేదినేను చూచేది నేను - నా ఆట నేనే ఆనందింతును
ఆనందిచుట కొరకై భేదము - మాయా బలమున కల్పించెదనిట
మూడు భావముల త్రిమూర్తులైతిని - నానా భావము లయ్యెను జగతిగ
దత్తైక్యముతో త్రిమూర్తులుందురు - దత్త భిన్నముగ జగములు వెలుగును
దత్తాధారము జగత్తు భిన్నము - నేతి నేతియని శ్రుతియిదె చెప్పును
పీటపైన ఘటమున్నది కానీ - ఘటమందు పీట లేదని తెలియుము
త్రిమూర్తులందున వ్యాపించియుండు - దత్తుడు తేగెలో విద్యుత్తు బోలి
విద్యుత్తు తీగె తీగె విద్యుత్తు - మేమే దత్తుడు దత్తుడే మేము
తాదాత్మ్యమున్న భావమె త్రిమూర్తి - తాదాత్మ్య హీన భావమె జగత్తు
భావరహితుడె నిర్గుణ దత్తుడు - భావము చీమగ నున్నను లేనిదే
జగత్తులున్నను లేకున్న నొకటె - అద్వితీయుడే దత్తుడు బ్రహ్మము
గుణమన చీమయె నిర్గుణుడెప్పుడు - నిర్గుణ సగుణము లద్వితీయములె
ఆహా ! తాండవమెంత రమ్యమది - బాహ్యాత్మలలో సుందరుడు శివుడు
సుందరేశ్వరుడు వాని తాండవము - కాకుండనెట్లు సుందర మయముగ
పంచ చామరము ఛందస్సు నందు - ఏవిధి పదముల గంతులు వినబడు
ఆ విధి పదముల గంతులు వినబడు - నూపుర రవములు కర్ణ సేయములు
కాళీయ మర్ధన మందున నేనును - శివ తాండవమును చేసి చూపితిని
శివతాండవమును చూసిన పిమ్మట - అట్లు చేయమది కోరిక కల్గెను
లలితా దేవి కీర్తన
శక్తివయ్యు నిరహంకారిణివే ! వాణివి లక్ష్మివి గౌరివి అనగఘవు
దత్తాంకపీఠా విరాజమానా ! (పల్లవి)
దత్తాంకపీఠా విరాజమానా !
నీ కనుబొమలవి కదలగచేయును సృష్టి స్ధితిలయములనే దత్తుడు
పరబ్రహ్మమను సింహాసనమున ఓ అధిష్టాన దేవతా ! ప్రణతి
కాపాడు తల్లి! కరుణించవమ్మ నీ ఆజ్ఞ లేక దత్త మౌనమే
శివుడు దాగుకొనె తరంగ రూపిణి ! లింగాకృతి నిను నర్చించమనుచు
లలిత నాడులను ఆవేశించిన చైతన్య శక్తి లలితయందురిల
ఆదిజీవుడవు ప్రధమోహవుగా తపించు ఊహకు దాసుదు దత్తుడు
Download this bhajan sung by Shri Dattaswami here
Saturday, March 29, 2008
మహిషుని చంపిన కనకదుర్గా కీర్తన
తాండవ మందలి చిందులవే (పల్లవి)
మహిషునిఁ జంపిన రోషము శాంతించని కారణమున గంతులతో
కరముల శూలముఁ దిప్పుచు చుట్టును విద్యుద్దీధితులుప్పతిలన్
కనకాభరణములెగురగ, గాజులు గలగల మోతల వెల్లువలో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే
గిరగిరఁ దిరుగుచు, ముందుకు దూకుచు, పక్కలకెగురుచు నృత్యములో
భగభగ మండెడి నిప్పుల కణికెలు రాలగ త్రిణయన దృష్టులతో
వైశాఖ దివస మధ్యాహ్నపు వడగాలులవడి ఉచ్ఛ్వాసములన్
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే
క్రోధ విలఙ్ఘన తాడిత నాగ కులంబుల మెలికల దూకులతో
అవయవ వీచికలాడగ రక్తము పొంగగ ఎర్రని వెలుగులతో
కుంకుమ తిలకము స్వేదజలంబుల రేఖలుగానగు ఫాలముతో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే
ముడి విదిలింపులు సడలగ, విరబోసిన కేశములవె పాయలుగా
ఎగిరెడి నల్లని త్రాచులు, మహిషుని అసు పవనంబుల మ్రింగెడిగా
ముఖమున రొప్పులు శ్వాసలు కస్సుమటంచును బుసబుసలైచెలగన్
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే
పదములనందెలు వెండివి మెండుగ ఘల్లు ఘల్లుమని శబ్ధములన్
పదపదమందున చేయగ నసురుల బండల గుండెలు ఖండములై
దితిసుత రక్తము ఎగురుచు చిందుచు బిందువులై ముఖమందు పడన్
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే
కులుకుచు శూలము నాడించుచు, కుచపర్వత కంపము లింపులుగా
పరవశమొందిన దత్తుడు చూదగ ప్రణయము పొంగగ సన్నిధిలో
నిలువగ చూచెను మధురస్మితయై శాంతించెను శాంతించెనుగా
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే
Download this bhajan sung by Shri Dattaswami here
మణికంఠ భజన
మణికంఠహారం కేరళకుమారం శార్దూల వాహం వర్జిత వివాహమ్
శబరీ గిరీశం మహిషీ వినాశం - శాస్తార మేవం ధ్యాయమి దేవమ్
శివ విష్ణు తేజ స్సంయోగ భాజం - సంసారపారం శ్రుతి వాక్య సారమ్
సోపానమాలా మధిరుహ్యలీలా - సంకల్ప లోకం కలయంతమేకమ్
ఏకైక వీరం సౌందర్య మారం - యోగీంద్ర ధీరం హృత భూమి భారమ్
పంపా విహారం హృదయైక చోరం - దత్తావతారం మునిచిత్త చారమ్
ఆలీఢ కాంతం నిశ్రేణి కాంతం - వేదాంత శాంతం చిన్ముద్రయాంతమ్
అనాద్యనంతం మకరాంశుమంతం - జోతి స్స్ఫురంతం శిఖివజ్జ్వలంతమ్
Download this bhajan sung by Shri Dattaswami here
స్వామి భజనలు
ముంచ ముంచ కృష్ణం - వంచకం తమేకమ్ (పల్లవి)
1. దత్తాత్రేయం దయావిహీనం - కాశీ స్నానం కామవికారమ్
వేదాధ్యయనం వేశ్యా వశ్యం - బ్రహ్మధ్యానం మదిరాలోలమ్
2. గీతాచార్యం గోపీ జారం - మోహాతీతం రాధా మోహమ్
ధర్మాధారం పరదధి చోరం - యతితతిసేవ్యం రాసక్రీడమ్
3. దిగంబరాఖ్యం పీతదుకూలం - లక్ష్మీనాధం భిక్షుకవృత్తిమ్
వేదాన్తానా ముపదేష్టారం - వేశ్యావాటీ పధి సంచారమ్
Download this bhajan sung by shri Dattaswami here
-------------------
కిమస్తి దత్తే ? కమలే ! విముక్త శీలే, విమలే ! (పల్లవి)
వర్ష సహస్రం మహర్షిలోకే - సరసీకూలే నిరీక్షమాణే
ఆలింగితోஉయం దిగంబరాంగ్యా - సాక్షాద్దదృశే దిగంబరాంగః
(వేయి సంవత్సరములు మహర్షులు సరస్సు తీరమున వేచియుండగా దిగంబరిచే ఆలింగితుడై దిగంబరుడుగ కనిపించెను !)
యస్మిన్ దృష్టే విచ్ఛిద్యన్తే - సర్వే బంధా స్సుతపతిరూపాః
తదేకబంధా త్సర్వ విముక్తిః - స్వార్ధం పశ్య ప్రభుతాహ్యేవమ్
(ఆయనపైనే బంధమునుంచి, పతిపుత్రాదుల బంధములను తెంచుకొన్ననే సర్వ విముక్తి!. ఆయనకు ఎంత స్వార్ధము! అధికారము కలవారిట్లే ఉందురు)
ఏకాంతం న స్సాధక యోగ్యం - సముపదిశన్యో వేదాంతార్ధైః
నృత్యతి సహి నవరాస విలాసీ - బృందావన భువి గోపీ బృందైః
(మన సాధనకు ఏకాంతమును తత్త్వము ద్వారా బోధించి, తాను మాత్రము బృందావనములో రాసలోలుడై గోపీ బృందములతో కూడి గంతులు వేయుచున్నాడు!)
Download this bhajan sung by shri Dattaswami here
---------------------------------------
ఎంత దయ ! ఎంత దయ ! ఓ సాయీ !
ఇంత దయ చూపితివె ! గోసాయీ ! (పల్లవి)
కాలికుక్కనే గురువుగఁ జేసి - వేద గీతలను చెప్పించితివి !
ఉచ్ఛిష్టముఁదిని బ్రతుకు జీవిని - నివేదనార్హుని చేసితివిచట !
అంటగరానిది పిచ్చికుక్కయె - తలపై నుంచియు ఆడించితివి !
ఈ పిచ్చికుక్క కరచిన క్షణమె - బ్రహ్మఙ్ఞానము పిచ్చిపుట్టెనె?
కుక్క వచ్చునెడ శుద్ధి మంత్రములు ! కుక్కయె నాలుగు వేదములఁజెప్పె
శీలుని గృహమున భోక్తగ వచ్చియు - నల్ల కుక్కనట వెంటఁదెచ్చితివి!
బ్రాహ్మణులందరు నిను వెలివేయగ - కృష్ణ శ్వానము వేదముఁబలికెను
శ్వానము నేను కృష్ణుడు నేను - కృష్ణ శ్వానము నేనే దత్త !
Download this bhajan sung by shri Dattaswami here
-------------------
షిరిడీ కుక్కను చూడండీ ! సద్గురువుగ వచ్చాడండీ ! (పల్లవి)
దూరదూరముగ నుండండీ - పిచ్చికుక్క ఇది పోపొండీ !
కరచిన వెంటనె మీకండీ - బ్రహ్మపిచ్చి కలిగేనండీ
ఆపిచ్చి నయము కాదండీ - శాశ్వత మోక్షమె గతియండీ
జీవికి యాతన నిస్తాను - అంత్య కాలమున వస్తాను
కాశీపురమున ఉంటాను - కాలభైరవుడు అంటారు
అట్టహాసమును చేసేను - బ్రహ్మాండములే పగిలేను
కసాయి కఠినుడనేనండీ - దాక్షిణ్యమనుట లేదండీ
కర్మ ఫలములనే ఇస్తాను - ధర్మ రక్షణను చేస్తాను
నాలుగు దిక్కుల నేనుంటా - ధర్మధేనువును రక్షిస్తా
వీరభద్రునిగ ఆనాడు - దక్ష శీర్షమును తుంచాను
పాశుపతాస్త్రము నేనేను - పార్ధుని రక్షణ చేశాను
శూలము చక్రము నేనేను - దత్తుని కరముల వెలిగేను
శంఖము డమరువు నేనేను - నాధ్వని వేదము వింటేను
కుండీ మాలలు జపములు నేను - సాధన మార్గము సూచిస్తాను
బ్రాహ్మణోஉహమపి చండాలోஉహం - సాధుధేనురపి క్రూరశ్వాஉహమ్
శ్రీదత్తోஉహం గురుదత్తోஉహం - ప్రభు దత్తోஉహం తవ దత్తోஉహమ్
Wednesday, March 26, 2008
దీపావళీ జ్ఞాన దీపావళీ
నేడే కృష్ణుని స్మరణం - రేపటి నుండియె కార్తీకం చంద్రశేఖరునికి అభిషేకం (పల్లవి)
1. హృదయమనే మట్టి పాత్రలో - ఙ్ఞానమను వత్తినుంచుమా
భక్తియను తైలము పోయుము - గురుదత్త బోధ జ్వాలతో
వెలిగించుమా స్వామికై - నీ జీవితమె ఈ దీపం
2. సంసారమె నరకాసురుడు - స్వామిపై ప్రేమయె సత్యభామ
సంసారరతియె అమావాస్య - అఙ్ఞానమె గాఢాంధకారము
భక్తి పాటలె మతాబులు - కాల్చుటయన భజన యోగము
3. రేరే జీవా ! మూఢమానవా ! - అంతరార్ధము నాలకించుమా
విషయతృణములనె భక్షించి - నిత్యము పశువైనావు
పశుపతినే మరచినావు - పశువుగ జన్మించేవు
4. అభిషేకమన ప్రేమించుట - గంగాజలమన శుద్ధ ప్రణయము
లింగమనగా సగుణరూపము - త్రిదళ బిల్వమన త్రిమూర్తి భావము
విభూతియన బ్రహ్మ ఙ్ఞానము - విశ్వేశ్వరుడన గురుదత్తుడే
5. సాత్విక భావమె క్షీరాభిషేకం - సత్సంగమె దధ్యభిషేకం
తపించు తనువే ఘృతాభిషేకం - ప్రేమయె మధువుల అభిషేకం
స్వామి పలుకులె చక్కెరల అభిషేకం
6. కొబ్బరికాయె నీ తలకాయ - పగులకొట్టుటయె వేదాంత చర్చ
కొబ్బరి నీళ్ళే నీ తియ్యని తలపులు - అభిషేకంబన అర్పణము
ద్రవ్య యఙ్ఞమున సారాంశమే - ఙ్ఞాన యఙ్ఞమని తెలియుమురా
7. నానా ఫలరస అభిషేకంబన - సర్వ ఫల సంగత్యాగము
కర్పూర నీరాజనమే - నీ మనసును స్వామికిచ్చుట
శివరతియే అగరువత్తి గంధం - నైవేద్యమే నీ ఆత్మార్పణము
8. దేవ దేవునికె నీ దేహం - వామ దేవునికె నీ వాక్కు
ఆదిదేవునికె నీ అంతరంగం - అర్పించుటయె ఆరాధన
ప్రతి క్షణము కార్తీకమాసం - ఆనందమె అమృతాభిషేకం
Download this bhajan sung by Shri Dattaswami here